NaraLokesh padayatra,Yuvagalam

153రోజులకే సగభాగం పూర్తయిన యువగళం!

వడివడిగా లక్ష్యంగా దిశగా యువనేత లోకేష్ అడుగులు

ప్రజల కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగుతున్న యువనేత

రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందిచడమే లక్ష్యంగా యువకెరటం Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. 5కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో జనగళమే యువగళమై సాగుతున్న చారిత్రాత్మక యువగళం నిర్దేశిత లక్ష్యానికంటే ముందుగానే 2000 కి.మీ. మైలురాయిని చేరుకుంది. రోజుకు సగటున 10కిలోమీటర్ల మేర చొప్పున నడవాలని తొలుత లక్ష్యంగా నిర్ణయించుకున్న లోకేష్… 153రోజుల్లో సగటున 13.15 కి.మీ.ల చొప్పున పాదయాత్ర చేశారు.  400 రోజుల్లో 4వేల కిలోమీటర్లు చేరుకోవాలని పాదయాత్ర ప్రారంభించిన యువనేత… వడివడిగా అడుగులు వేస్తూ 153రోజుల్లోనే 50శాతం లక్ష్యాన్ని అధిగమించారు.కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంతనుంచి జనవరి 27న యువనేత లోకేష్ ప్రారంభించిన చారిత్మాత్మక యువగళం పాదయాత్ర153వరోజున కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కి.మీ.ల మైలురాయిని చేరుకోనుంది. జన ప్రభంజనాన్ని తలపిస్తూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. యువగళానికి ప్రజలనుంచి రోజురోజుకు పెరుగుతున్న మద్దతు అధికారపార్టీ పెద్దలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. లక్షలాది ప్రజలను నేరుగా కలుస్తూ,  అనుక్షణం ప్రజల్లో మమేకమవుతూ, కన్నీళ్లు తుడుస్తూ యువనేత చేస్తున్న పాదయాత్రకు ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు అధికార పార్టీ సకల ప్రయత్నాలు చేసినప్పటికీ ఉక్కుసంకల్పంతో సాగుతున్న యువగళం జైత్రయాత్రను అడ్డుకోవడం వారి తరం కాలేదు.

153రోజుల యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్ సుమారు 30లక్షలమంది ప్రజలను నేరుగా కలుసుకున్నారు. 53 అసెంబ్లీ నియోజకవర్గాలు, 135 మండలాలు, 1297 గ్రామాలను స్పృశిస్తూ పాదయాత్ర కొనసాగగా, 49చోట్ల బహిరంగసభలో యువనేత ప్రసంగించారు. వివిధవర్గాలతో 118 ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. 6 ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మహిళలు, యువత, ముస్లింలు, సర్పంచులు, తదితరులతో సమావేశమై వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. యువనేత పాదయాత్రలో వివిధవర్గాల ప్రజలనుంచి 2,895 రాతపూర్వక వినతిపత్రాలు అందాయి. 5చోట్ల నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాలకు పల్లెప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.

యువగళం పాదయాత్ర రాయలసీమలో చరిత్ర సృష్టించింది.గతంలో మరే నాయకుడు చేయని విధంగా రాయలసీమలో 124రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకర్గాల మీదుగా 1587 కి.మీ. పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో 45రోజులు – 577 కి.మీ.లు,  ఉమ్మడి అనంతపురం జిల్లాలో 23రోజులు – 303 కి.మీ, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 40రోజులు – 507 కి.మీ, ఉమ్మడి కడప జిల్లాలో 16రోజులు – 200 కి.మీ మేర పాదయాత్ర చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లోఇప్పటివరకు 29రోజులు –425 కి.మీ. మేరపాదయాత్ర పూర్తయింది. తారకరత్న మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, ఉగాది, మహానాడు వంటి అనివార్యమైన సందర్భాల్లో మినహా విరామం లేకుండా యువగళం కొనసాగింది.

యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా దాటకముందే రాష్ట్రంలో 108 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుపార్టీ విజయదుందుభి మోగించడంతో అధికారపార్టీలో ప్రకంపనలు పుట్టాయి. ప్రజల కష్టాలను తెలుసుకోవడమేగాక కార్యకర్తల్లో అక్కడక్కడా నెలకొన్న అసంతృప్తి జ్వాలలను సైతం పాదయాత్ర ద్వారా పసిగట్టిన లోకేష్ మీవెంట నేనున్నానంటూ భరోసా ఇస్తూ వారిలో ఆత్మస్థయిర్యాన్ని నింపుతున్నారు. ప్రతి వందకిలోమీటర్లకు ఓ వరాన్ని ప్రకటిస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించడం, ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న బహిరంగసభల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేల అవినీతిని క్షేత్రస్థాయిలో ఎండగట్టడం, టిడిపి హయాంలో చేసిన అభివృద్ధి, వైసిపి ప్రభుత్వంలోని వైఫల్యాలపై సెల్ఫీ ఛాలెంజ్ లు విసరడం వంటివి జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోయాయి.

ప్రతిరోజూ వందలాదిమంది ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పడాన్ని పరిశీలిస్తే నాలుగేళ్ల రాక్షసపాలనలో జనం ఎంతలా బాధలుపడుతున్నారో అర్థమవుతోంది. ప్రజల కన్నీళ్లు తుడిచి రుణం తీర్చుకుంటానంటున్న యువనేత లోకేష్ నిజాయితీని గుర్తించిన ప్రజలు యువనేతకు జేజేలు పలుకుతున్నారు.

యువగళం గొంతునొక్కేందుకు విఫలయత్నాలు!

యువగళం పాదయాత్రకు ప్రజలనుంచి వస్తున్న అనూహ్య స్పందనతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు మొదలైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యువనేత ప్రచారరథం మొదలు నిలబడే స్టూల్ వరకు అన్నీ లాగేసి గొంతునొక్కే ప్రయత్నం చేశారు. యువనేత లోకేష్ ఏ మాత్రం వెన్నుచూపకుండా కోట్లాదిమంది ప్రజల గొంతుకనే తనగళంగా వినిపిస్తూ రెట్టింపు  ఉత్సాహంతో ముందుకుసాగారు. కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభం మొదలు తంబళ్లనియోజకవర్గం వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తంగా 25పోలీసు కేసులు నమోదయ్యాయి. సగటున రెండురోజులకు ఒక కేసు చొప్పున బనాయించారంటే యువగళం గొంతునొక్కేందుకు ప్రభుత్వం ఎంత తీవ్రంగా ప్రయత్నించిందో అర్థం చేసుకోవచ్చుప్రచార రథం, సౌండ్ సిస్టమ్, మైక్, స్టూల్ తో సహా అన్నింటినీ పోలీసులు సీజ్ చేశారు. చివరకు వైసిపి పెద్దలు ఏస్థాయికి దిగజారారంటే పీలేరులో బాణాసంచా కాల్చారని కూడా అక్కడి ఇన్ చార్జి నల్లారికిషోర్ కుమార్ రెడ్డి, మరికొందరిపై పోలీసులు 3కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనకు ఇది పరాకాష్ట. యువనేత లోకేష్ తో పాటు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కుప్పం పీఎస్ మనోహర్, పలమనేరు ఇన్ చార్జి అమర్ నాథ్ రెడ్డి, చంద్రగిరి ఇన్ చార్జి పులివర్తి నాని, పీలేరు ఇన్ చార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలతో సహా పలువురు టిడిపి నేతలపై పోలీసులు తప్పుడు కేసులు నమోదుచేశారు. ఎంతలా వేధించినా, ఎన్ని తప్పుడు కేసులు బనాయించినా క్రమశిక్షణకు మారుపేరైనా లోకేష్ నేతృత్వంలో యువగళం బృందాలు మొక్కవోని పట్టుదలతో ముందుకు సాగుతున్నాయి. పాదయాత్ర దారిలో ప్రొద్దుటూరులో కోడిగుడ్లు వేయించడం, పత్తికొండ, కర్నూలు వంటి ప్రాంతాల్లో వైసిపి పేటిఎం బ్యాచ్ యువనేతను అడ్డుకునేందుకు నల్లజెండాలతో విఫలయత్నం చేయగా, లోకేష్ దీటుగా సమాధానమిచ్చి తిప్పికొట్టారు.

పదునైన ప్రసంగాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు

యువనేత లోకేష్ తాను పాదయాత్ర నిర్వహించే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకచోట బహిరంగసభ నిర్వహిస్తూ  మాటల తూటాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర సాగిన 53 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50 చోట్ల యువనేత లోకేష్ బహిరంగసభల్లో ప్రసంగించారు. ప్రతి బహిరంగసభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బట్టబయలు చేస్తుండటంతో అధికారపార్టీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. తాజాగా 4-7-2023న నెల్లూరులో జరిగిన బహిరంగసభలో మాజీమంత్రి పి.అనిల్ కుమార్ కు చెందిన అక్రమాలను ఎండగట్టడమేగాక, మరుసటిరోజు ఆయన అక్రమాస్తుల తాలూకు డాక్యుమెంట్లను సైతం విడుదలచేసి సంచలనం సృష్టించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయా నియోజకవర్గాల్లో తాము ఏంచేస్తామని స్పష్టంగా చెబుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్న తీరు ప్రజలను ఆకట్టుకుంటోంది. మరోవైపు లోకేష్ చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పలేని వైసిపి ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత విమర్శలతో ఎదురుదాడికి దిగుతున్నారు.

ముఖాముఖి సమావేశాలతో లోతైన అధ్యయనం

పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ వారి సమస్యలపై యువనేత లోకేష్ లోతైన అధ్యయనం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆయావర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని అధికారంలోకి వచ్చాక తాము ఏం చేయబోతున్నారో స్పష్టం చేస్తున్నారు. రైతులు, యువత, మహిళలు, ముస్లింలు, బిసిలు, ఎస్సీలు, ఎస్టీలు, వ్యాపారులు, ఐటి ప్రొఫెషనల్స్ తదితర వర్గాలతో యువనేత సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు.  ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లించకపోవడంతో వివిధ కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న విషయాన్ని గమనించిన లోకేష్… అధికారంలోకి వచ్చిన వెంటనే వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా సర్టిఫికెట్లు అందజేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలతో జాబ్ నోటిఫికేషన్, ప్రతిఏటా జాబ్ క్యాలెండర్, పరిశ్రమల ఏర్పాటుద్వారా యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీలతో యువతకు భరోసా ఇస్తున్నారు.  క్యాస్ట్ సర్టిఫికెట్లు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మొబైల్ ఫోన్లకే శాశ్వత కులధృవీకరణ పత్రాలు పంపిస్తామని హామీ ఇచ్చారు. బిసిల రక్షణకు ఎస్సీ, ఎస్టీ తరహా చట్టం, ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంక్, వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు, చేనేతలు, రజక వృత్తి పనివారికి ఉచిత విద్యుత్ వంటి హామీలు ఆయా వర్గాలు ఆనందం వ్యక్తంచేస్తున్నాయి.

ఆకట్టుకుంటున్న ప్రత్యేక కార్యక్రమాలు

పాదయాత్ర నిర్వహించేటప్పుడు ప్రతిజిల్లాలో ఒకచోట నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు వివిధ వర్గాల నుంచి అనూహ్య స్పందన లభించింది.

నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో 3-7-2023న “మహాశక్తితో లోకేష్” పేరుతో మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి జిల్లానలుమూలలనుంచి మహిళలు పెద్దఎత్తున హాజరయ్యారు. మహిళల వంక కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తామని, తన తల్లికి జరిగిన అవమానాన్ని మరో చెల్లికి జరగనీయబోనని, నిర్భయ చట్టాన్ని కఠినంగా అమలుచేసి రక్షణ కల్పిస్తామని యువనేత ప్రకటించారు.

రాయలసీమలో చివరిగా కడపలో 7-6-2023న మిషన్ రాయలసీమ పేరుతో రాయలసీమ మేధావులు, ప్రముఖులతో నిర్వహించిన కార్యక్రమంలో సీమ అభివృద్ధి విషయంలో టిడిపి విధానాన్ని యువనేత సాక్షాత్కరించారు.

తిరుపతిలో ఫిబ్రవరి 2న యువతతో నిర్వహించిన హలో లోకేష్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున యువతీయువకులు తరలివచ్చారు. యువత భవిష్యత్ కోసమే తాను యువగళం ప్రారంభించినట్లు చెప్పారు. యువత విషయంలో తెలుగుదేశం పార్టీ విధానాన్ని యువనేత వ్యక్తీకరించారు.

ఏప్రిల్ 8న అనంతపురం జిల్లా శింగనమలలో నిర్వహించిన రైతన్నతో లోకేష్ కార్యక్రమానికి భారీఎత్తున రైతులు తరలివచ్చి తమ అభిప్రాయాలను యువనేతకు తెలియజేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని పూర్తిచేసి, గోదావరి మిగులుజలాలను రాయలసీమకు తెస్తామని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. రైతులమోములో ఆనందం చూసినపుడే తన యాత్ర విజయవంతమైనట్లు అని లోకేష్ తెలిపారు.

ఏప్రిల్ 24న పంచాయితీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆదోని నియోజకవర్గం తుంబళం క్రాస్ వద్ద పల్లెప్రగతి కోసం మీ లోకేష్ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీరహితంగా సర్పంచులు తరలివచ్చారు. టిడిపి అధికారంలోకి రాగానే పంచాయితీలకు నిధులు, విధులు కల్పిస్తామని, వాటర్ గ్రిడ్ ఏర్పాటుతో గ్రామాల్లో 24/7 సురక్షితమైన తాగునీరు అందిస్తామని, సర్పంచ్ లకు గౌరవవేతనంతోపాటు గౌరవం పెంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సచివాలయ వ్యవస్థను పంచాయితీలకు అనుసంధానిస్తామని తెలిపారు.

మే 7వతేదీన కర్నూలులో ముస్లిం మైనారిటీలతో నిర్వహించిన లోకేష్ తో గుఫ్తగు కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ముస్లిం సోదరులు తరలివచ్చి  ప్రభుత్వం వచ్చాక తాము పడుతున్న కష్టాలు చెప్పుకున్నారు. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, మైనారిటీల ఆస్తుల పరిరక్షణకు వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పిస్తామని చెప్పారు.

సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమానికి అనూహ్య స్పందన

ప్రతిరోజూ తనను కలవడానికి వచ్చే కార్యకర్తలు, అభిమానులతో సెల్ఫీ విత్ లోకేష్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు యువనేత లోకేష్ 2.25 లక్షలమంది అభిమానులతో ఫోటోలు దిగారు. నెల్లూరులో అత్యధికంగా ఒకేరోజు 2,500మంది యువనేతతో సెల్ఫీ దిగారు. ఈ కార్యక్రమం కారణంగా ఒకానొక సమయంలో లోకేష్ కు తీవ్రమైన రెక్కనొప్పి వచ్చింది. ఈ సమయంలో సెల్ఫీలు వద్దని వ్యక్తిగత వైద్యులు వారించిన యువనేత వినలేదు. అభిమానులను నిరాశపర్చకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. యువనేతతో సెల్ఫీ దిగిన వారి ఫోటోలను స్కానింగ్ చేయించి, ఫేస్ రికగ్నషన్ టెక్నాలజీ ద్వారా వారి ఫోన్లకే చేరేవిధంగా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు ఫోటోలను అప్ లోడ్ చేస్తున్నారు. సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంతోపాటు దారిపొడవునా తనను కలిసేందుకు వచ్చిన ఏ ఒక్కరినీ నిరాశపర్చకుండా ఓపికగా ఫోటోలు దిగుతున్నారు.

సెల్ఫీ ఛాలెంజ్ తో అధికారపార్టీ ఉక్కిరిబిక్కిరి!

యువగళం పాదయాత్ర దారిలో టిడిపి హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల తాలుకూ విజయగాథలు, వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ లోకేష్ విసురుతున్న సెల్ఫీ ఛాలెంజ్ లు అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. టిడిపి హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధి ప‌నులు – వైసీపీ పాల‌న‌లో సాగుతున్న విధ్వంసం, అవినీతిని సెల్ఫీల‌తో వివ‌రిస్తూ ప్రజ‌ల్ని చైత‌న్యప‌రుస్తున్నారు.

వెంకటగిరి నియోజకర్గం ఆకిలవలసలో ఎన్టీఆర్ జలసిరి పథకం కింద గత టిడిపి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సోలార్ పంపు సెట్. బీళ్లుగా మారిన పేదల భూముల్లో సాగునీటి వసతిని కల్పించేందుకు సోలార్ పంపుసెట్లను ఏర్పాటుచేసే ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రూ.55వేల విలువైన సోలార్ పంపు సెట్ ను సాధారణ రైతులకైతే రూ.25వేలకు, ఎస్సీ,ఎస్టీలకు రూ.6వేలకే అందించాం. ఏడాదికి నియోజకవర్గానికి 500 బోర్లు వేయిస్తానని చెప్పి, 50నెలల్లో ఒక్క బోరు వేసిన దాఖలాలు కూడా లేవు. ముఖ్యమంత్రి జగన్ కు పబ్లిసిటీ పీక్… మ్యాటర్ వీక్ అనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి?

పెనుగొండ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో పాలసముద్రం కియా ఫ్యాక్టరీ వద్ద యువనేత విసిరిన సెల్ఫీ చాలెంజ్ ఇప్పటివరకు యాత్రలో హైలైట్ గా నిలచింది.  క‌ళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు..థిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు. చంద్రబాబు దునియా మొత్తం చూసేశారు. ఆ దూర‌దృష్టి నుంచి వ‌చ్చే ఆలోచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెడ‌తారు కాబ‌ట్టే ఆయ‌న‌ని దార్శనికుడు అని అంటారు. చంద్రబాబు ఎన్నో ప్రయస‌ల‌కోర్చి  కియాని తీసుకొచ్చిన‌ప్పుడు, క‌మీష‌న్ల కోసం తెచ్చార‌ని అన్నారు. ఈరోజు కరువుసీమలో వేలమంది యువతకు కియా ఉపాధి చూపిందంటూ చేసిన వ్యాఖ్యలు యువతను కదిలించాయి.

టిసిఎల్, జోహో, డిక్సన్ వంటి కంపెనీల వద్ద లోకేష్ విసిరిన సెల్ఫీ చాలెంజ్ లు యువతను ఆకట్టుకున్నాయి.  అందులో ఉద్యోగాలు చేస్తున్న అక్కాచెల్లెళ్లు వీరు..నువ్వు ఒక్క కంపెనీ అయినా తెచ్చాన‌ని చెప్పుకోగ‌లవా!?, ప్రతి వంద కిలోమీటర్లకు ఓ వరం

యువగళం పాదయాత్ర సందర్భంగా యువనేత నారా లోకేష్ సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.

ప్రతి వందకిలోమీటర్ల మజిలీలో ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ… తాము అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో సంబంధిత అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటిస్తున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా

యువనేత పాదయాత్ర 8వరోజు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో 100కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా బంగారుపాళ్యంలో కిడ్నీవ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు శిలఫలకాన్ని ఆవిష్కరించారు.

16వరోజు  జిడినెల్లూరు నియోజకవర్గం కత్తెరపల్లిలో 200 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో జిడి నెల్లూరులో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుచేస్తామని ప్రకటించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

23వరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండమానుపురం వద్ద యాత్ర 300 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా అక్కడ 13 గ్రామాలకు తాగునీరందించే రక్షిత మంచినీటి పథకాన్ని అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో చేపడతామని ప్రకటించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

యువ‌గ‌ళం పాదయాత్ర 31వరోజు 400 కి.మీ చేరుకున్నసంద‌ర్భంగా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండ‌లం న‌రేంద్రకుంట మ‌జిలీలో ఆధునిక వ‌స‌తుల‌తో 10 ప‌డ‌క‌ల ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసేందుకు శిలాఫ‌ల‌కం వేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వ‌చ్చిన వంద రోజుల్లో న‌రేంద్రకుంటలో పీహెచ్ సీ ఏర్పాటు చేస్తామ‌ని ప్రక‌టించారు.

39వరోజు మదనపల్లి శివారు చినతిప్పసముద్రంలో పాదయాత్ర 500వరోజుకు చేరుకున్న సందర్భంగా మదనపల్లిలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజి ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.

ఉమ్మడి అనంతపురం జిల్లా

47వరోజు కదిరి నియోజకవర్గం చిన్నయ్యగారిపల్లి వద్ద పాదయాత్ర 600 కి.మీ. చేరుకున్న సందర్భంగా ఆ ప్రాంతంలో టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.

55వరోజు పెనుగొండ నియోజకవర్గం గుట్టూరు వద్ద 700 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా గోరంట్ల, మడకశిర ప్రాంతాల తాగు,సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి హంద్రీనీవా కాల్వ నుంచి ఎత్తపోతల పథకం నిర్మిస్తామని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

యువగళం పాదయాత్ర 63వరోజు 800 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం మార్తాడు వద్ద చీనీ ప్రాసెసింగ్ యూనిట్ కు యువనేత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఉమ్మడి కర్నూలుజిల్లా

యువగళం పాదయాత్ర 70వరోజు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలిలో ఈరోజు 900 కి.మీ. మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా ఆలూరు, ప‌త్తికొండ‌, డోన్, బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గాల ప్రజ‌ల‌కు తాగు, సాగు నీరందించే గుండాల ప్రాజెక్టు నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరించారు.

ఆదోని సిరిగుప్ప క్రాస్ వద్ద 77వరోజు యువగళం పాదయాత్ర చారిత్రాత్మక 1000 కి.మీ. మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా ఆదోని టౌన్ వార్డ్ 21 ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 21వ వార్డులో త్రాగునీరు, డ్రైనేజ్, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించారు.

ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగుడ్లలో 86వరోజు యువగళం పాదయాత్ర 1100 కి.మీ. మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 10వేలమందికి ఉపాధి కల్పించే టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుచేస్తామని హామీ ఇస్తూ, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

జనగళమే యువగళమై మహోజ్వలంగా సాగుతున్న యువగళం పాదయాత్ర 10-5-2023న  నందికొట్కూరు నియోజకవర్గం అల్లూరులో 1200 కి.మీ మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా హంద్రీనీవా నుంచి మిడుతూరు ఎత్తిపోతల పథకానికి హామీ ఇచ్చి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా మిడుతూరు, కలమండలపాడు, మాదిగుండం, పారమంచాల చెరువులకు నీరు చేరుతుంది. తద్వారా 22వేల ఎకరాల్లో సాగునీరు, మిడుతూరు, జూపాడుబంగ్లా మండలాల్లో 60వేలమంది ప్రజలకు సాగునీరు అందుతుంది.

యువగళం పాదయాత్ర 103వరోజు (18-5-2023) 1300 కి.మీ. మైలురాయి చేరుకున్న సందర్భంగా నంద్యాల యాతం ఫంక్షన్ హాలు వద్ద శిలాఫలకం ఆవిష్కరించారు. నంద్యాల రూరల్ కానాలలో టిడిపి అధికారంలోకి వచ్చాక పసుపు మార్కెట్, కోల్డ్ స్టోరేజి ఏర్పాటుకు హామీ ఇచ్చారు.

ఉమ్మడి కడప జిల్లా

యువగళం పాదయాత్ర109వరోజు (24-5-2023) జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె వద్ద యువగళం పాదయాత్ర 1400 కి.మీ. మజిలీని చేరుకుంది. ఈ సందర్భంగా గండికోట నిర్వాసితులకు ఉపాధి కల్పించే చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు లోకేష్ శిలాఫలకం ఆవిష్కరించారు. అధికారంలోకి వచ్చాక పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఇక్కడి రైతులు, యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు.

యువగళం పాదయాత్ర 117వరోజు (5-6-2023) కడప అసెంబ్లీ నియోజకవర్గం ఆలంఖాన్ పల్లె వద్ద 1500 కి.మీ. మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా కడప నగరానికి మెరుగైన డ్రైనేజి వ్యవస్థ నిర్మాణానికి యువనేత లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనిద్వారా కడప నగరంలో మురుగునీటి తీరుతుందని చెప్పారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లా

126వరోజు (14-6-2023) యువగళం పాదయాత్ర ఎస్ పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం మ‌ర్రిపాడు మండ‌లం చుంచులూరు వ‌ద్ద‌ 1600 కి.మీ మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా చుంచులూరులో హార్టిక‌ల్చర్ కోఆప‌రేటివ్ సొసైటీ ఏర్పాటుకి యువనేత శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్కరించారు. దీనిద్వారా ఉద్యాన‌వ‌న పంట‌లు సాగుచేసే రైతుల‌కి అన్నివిధాలా మేలు జరుగుతుంది.

యువగళం పాదయాత్ర 132వరోజు (20-6-2023) యువగళం పాదయాత్ర తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలిలో 1700 కి.మీ. మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా డక్కిలిలో ఆప్కో హ్యాండ్లూమ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు హామీ ఇస్తూ, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనివల్ల ఈ ప్రాంత చేనేతలకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

యువగళం పాదయాత్ర 138వరోజు (26-6-2023) గూడురు నియోజకవర్గం గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం అరవపాలెం వద్ద 1800 కి.మీ. మజిలీకి చేరుకుంది. ఈ సందర్భంగా లోకేష్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతంలో ఆక్వారైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇస్తూ, శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. వైసిపి పాలనలో కుదేలైన ఆక్వారంగానికి మేము అందించబోయే ప్రోత్సాహకాలు ఊతమిస్తాయని తెలిపారు.

యువగళం పాదయాత్ర 147వరోజు (5-7-2023) కోవూరు నియోజకవర్గం సాలుచింతలలో 1900 కి.మీ. మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చాక రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి కోవూరు నియోజకవర్గవ్యాప్తంగా ప్లాట్ ఫారాలు నిర్మిస్తానని హామీ ఇస్తూ, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనివల్ల ఈ ప్రాంత వరి రైతాంగం పండించిన ధాన్యం నాణ్యత మెరుగుపడి మార్కెట్ లో మంచి ధరకు విక్రయించుకోవడానికి అవకాశం కలుగుతుంది.

యువగళం పాదయాత్ర 153వరోజు (11-7-2023) కావలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కి.మీ. మైలురాయి చేరుకోనుంది. పాదయాత్ర 2వేల కి.మీ. అధిగమించిన సందర్భంగా కావలి నియోజకవర్గం కొత్తూరులో పైలాన్ ను ఆవిష్కరిస్తారు.

యువగళంలో ఆ కమిటీలే కీలకం!

యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను ముందుకు నడిపించడంలో 13కమిటీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. యువగళం ప్రధాన సమన్వయకర్త కిలారి రాజేష్ నేతృత్వంలో ఈ కమిటీలు అనుక్షణం  యువనేతను వెన్నంటి ఉండి యాత్ర సజావుగా సాగేందుకు సహకారం అందిస్తున్నాయి. వీరితోపాటు 200మంది పసుపు సైనికులు వాలంటీర్లుగా వ్యవహరిస్తూ యువనేతను రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.

1.యువగళం పాదయాత్ర మెయిన్ కోఆర్డినేటర్ – కిలారు రాజేష్.

2.యువగళం అధికార ప్రతినిధులు – ముఖ్య అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి, అధికార ప్రతినిధి ఎం ఎస్ రాజు.

3. మీడియా కమిటీ – మెయిన్ కోఆర్డినేటర్ బి.వి. వెంకట రాముడు, సభ్యుడు జస్వంత్.

4.భోజన వసతుల కమిటీ – మద్దిపట్ల సూర్యప్రకాష్,  లక్ష్మీపతి.

5. వాలంటీర్ కోఆర్డినేషన్ కమిటీ – రవి నాయుడు, ప్రణవ్ గోపాల్.

6. యువగళం మెయిన్ పిఆర్ఓ – చైతన్య, పిఆర్ టీమ్ – కృష్ణా రావు, మునీంద్ర, కిషోర్,ఫోటో గ్రాఫర్స్ – సంతోష్, శ్రీనివాస్, కాశిప్రసాద్.

7.యువగళం సోషల్ మీడియా కోఆర్డినేషన్ – కౌశిక్, అర్జున్.

8.రూట్ కోఆర్డినేషన్ కమిటీ – రవి యాదవ్.

9.అడ్వాన్స్ టీమ్ కమిటీ – డూండీ రాకేష్, నిమ్మగడ్డ చైతన్య, శ్రీరంగం నవీన్ కుమార్, ప్రత్తిపాటి శ్రీనివాస్.

10.రూట్ వెరిఫికేషన్ కమిటీ – కస్తూరి కోటేశ్వరరావు చౌదరి (కె.కె) అమర్నాథ్ రెడ్డి.

11. వసతి ఏర్పాట్ల కమిటీ – జంగాల వెంకటేష్, నారా ప్రశాంత్, లీలా, శ్రీధర్, రమేష్.

12.తాగునీటి సదుపాయం – భాస్కర్

13.అలంకరణ కమిటీ – మలిశెట్టి వెంకటేశ్వర్లు, బ్రహ్మం చౌదరి.

వివిధ వర్గాలకు లోకేష్ ఇచ్చిన హామీలు:

యువనేత లోకేష్ పాదయాత్ర సందర్భంగా వివిధ వర్గాలకు పలు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక హామీలను అమలుచేసే బాధ్యత తమదని చెప్పారు.హామీలు నెరవేర్చకపోతే నన్ను నిలదీయండని చెబుతున్న దమ్మున్న నేత లోకేష్.

యువతకు హామీలు

యువగళం నిధికింద నిరుద్యోగులకు ప్రతినెల రూ.3వేల భృతి

పరిశ్రమల ఏర్పాటుద్వారా 20లక్షల ఉద్యోగాల కల్పన

ఏటా జనవరిలో జాబ్ కేలండర్, పోస్టుల భర్తీ.

ప్రతియేటా డీఎస్సీ నిర్వహణ

కేజీ టూ పీజీ ఉచిత బస్ పాస్ సౌకర్యం.

జాబ్ మేళాలు నిర్వహించి ప్రైవేటు ఉద్యోగాలు

యువతకు ప్రత్యేక మ్యానిఫెస్టో.

జిఓ నెం.77 రద్దు, పాత ఫీ రీఎంబర్స్ మెంట్ విధానం.

ఓటిఎస్ ద్వారా విద్యార్థులకు సర్టిఫికెట్ల అందజేత.

చంద్రన్న బీమా రూ.10లక్షలకు పెంపు.

టిడిపి అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు రప్పించి, యువతకు ఉద్యోగాలు.

స్వయం ఉపాధి కోసం నియోజకవర్గం స్థాయిలో ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు. సబ్సిడీ రుణాల అందజేత.

మైనార్టీ బాలికలకు ప్రత్యేక కళాశాలలు.

మహిళలకు హామీలు

ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం.

మహాశక్తిపథకంలో భాగంగా ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఆడబిడ్డ నిధి

ప్రతిఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలండలర్లు

తల్లికి వందనం కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు ఉన్నా15వేల చొప్పన ఆర్థికసాయ,

మహిళలను గౌరవించేలా ప్రత్యేక పాఠ్యాంశాలు.

మహిళల రక్షణకు ఈశాన్య రాష్ట్రాల తరహాలో ప్రత్యేక విధానాలు.

మహిళలను పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దేలా ప్రోత్సాహకాలు.

అభయ హస్తం పథకం పునరుద్దరణ.

రైతులకు ఇచ్చిన హామీలు

అన్నదాత పథకం కింద ప్రతిఏటా రైతుకు రూ.20వేల ఆర్థిక సాయం.

అధికారంలోకి రాగానే పోలవరం నిర్మాణం పూర్తి.

నదుల అనుసంధానంతో గోదావరి మిగులుజలాలను రాయలసీమకు తెస్తాం

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమకు సాగు, తాగునీరు.

టెక్నాలజీతో వ్యవసాయం అనుసంధానం.

రైతాంగానికి సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్, బోర్లు.

కల్తీ విత్తనాల విక్రేతలపై ఉక్కుపాదం

ఎపి సీడ్స్ కార్పొరేషన్ ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు.

డీకేటీ పట్టాల విషయంలో కర్ణాటక విధానాలు అమలు.

గతంలో రైతులకు అమలుచేసిన పథకాలు పునరుద్దరణ

పాదయాత్రలో కార్మికులకు ఇచ్చిన హామీలు

కార్పెంటర్లకు అవసరమైన విధంగా షెడ్ల నిర్మాణం

ఆటో యూనియన్ బోర్డు ఏర్పాటు

సౌకర్యాలతో ఆటో స్టాండ్ల ఏర్పాటు

చంద్రన్న బీమా పున:రుద్ధరణ, బీమా మొత్తం రూ.10లక్షలకు పెంపు.

అన్న క్యాంటీన్ పునరుద్ధరణ

పెట్రోల్, డీజల్ ధరలు తగ్గించి నిత్యవసర సరుకుల ధరలు తగ్గింపు

అర్హులైనవారికి ఫించన్లు, రేషన్ కార్డులు మంజూరు.

మొబైల్ ఫోన్లకే శాశ్వత కులధృవీకరణ పత్రాలు.

దళితులకు హామీలు

•              అధికారంలోకి వచ్చాక ఎస్సీలకు భూమి కొనుగోలు పథకం

•              ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వంలో అమలుచేసిన 27 సంక్షేమ పథకాల పునరుద్దరణ

•              ఎస్సీలపై పెట్టిన అక్రమ కేసుల మాఫీ.

•              కార్పొరేషన్ ద్వారా గతంలో అమలైన పథకాలు పునరుద్ధరణ.

•              నియోజకవర్గ కేంద్రాల్లో కమ్యూనిటీ హాళ్లు.

•              అంబేద్కర్ విదేశీవిద్య, స్టడీ సర్కిళ్ల పునరుద్దరణ.

•              వర్గీకరణ విషయంలో మాదిగలకు సామాజిక న్యాయం.

•              అమరావతిలో బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహం, విజ్ఞాన కేంద్రం.

ఎస్టీ/లంబాడీలకు

•              తాండాలకు సురక్షిత నీరు, రోడ్ల నిర్మాణం

•              ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్ నెట్ సదుపాయం

•              బడ్జెట్ లో నిధులు కేటాయించి తాండాలలో దేవాలయాల నిర్మాణం.

•              కదిరి నియోజకవర్గం కొక్కింటి క్రాస్ పరిధిలో వద్ద ఎస్టీ భవనం నిర్మాణం.

•              పార్టీ పెద్దలతో చర్చించిన అనంతరం ఎస్టీలకు భూ పంపిణీపై నిర్ణయం.

ముస్లింలకు ఇచ్చిన హామీలు

•              ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు

•              ముస్లింలకు ప్రత్యేక మ్యానిఫెస్టో

•              వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియరీ ఆధికారం

•              ముస్లిం కార్పొరేషన్ కు నిధులు కేటాయింపు.

•              ముస్లింలపై పెట్టిన అక్రమ కేసులు మాఫీ

•              రంజాన్ తోఫా, దుల్హన్, దుకాన్, మకాన్ పునరుద్దరణ

•              విజయవాడ, కడపల్లో హజ్ హౌస్ ల నిర్మాణాల పూర్తి .

•              పేదముస్లింలకు ప్రభుత్వ ఖర్చుతో హజ్ యాత్రకు ఏర్పాట్లు

వెనుకబడిన తరగతులకు హామీలు

•              బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టం

•              బిసిలకు శాశ్వత కులధృవీకరణ పత్రాలు

•              బిసి కార్పొరేషన్లకు దామాషా ప్రకారం నిధులు

చేనేతలు

•              మగ్గం ఉన్న చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్.

•              మరమగ్గాలున్న వారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ .

•              ముడిసరుకు కొనుగోలుకు రాయితీలతోపాటు రుణాలు మంజూరు.

•              చేనేత వస్త్రాలపై జిఎస్టీ రద్దు.

•              జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కామన్ వర్కింగ్ షెడ్ల నిర్మాణం

•              ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం.

రజకులు

•              రజకుల దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్

•              ఆదరణ ద్వారా వాషింగ్ మెషీన్లు, 500 యూనిట్లు ఉచిత విద్యుత్

•              తిరుపతిలో రజక భవన్ ఏర్పాటుకు కృషి

•              దేవుడి వస్త్రాలు ఉతికేందుకు రజకులకే కేటాయించేలా చర్యలు

•              అవసరమైన చోట బోర్లు వేయించి దోబీ ఘాట్ల నిర్మాణం

వడ్డెరలు

•              వైసీపీ నేతలు లాక్కున్న క్వారీలు స్వాధీనం చేసుకుని తిరిగి వడ్డెర్లకు అప్పగింత.

•              ప్రమాదాల్లో మరణించిన వడ్డెర్లకు చంద్రన్న బీమా.

యాదవులు

•              యాదవ కార్పొరేషన్ నిధులు కేటాయింపు

•              గోశాలలో యాదవులకు రిజర్వేషన్లపై చర్చించి… నిర్ణయం

•              గోపాలమిత్రల పునరుద్ధరణ

•              గోకులాలు పున:ప్రారంభం

•              సబ్సిడీపై గొర్రెలు, ఆవులు అందజేసి, ఇన్సూరెన్స్ సౌకర్యం.

•              22 గొర్రెలు యూనిట్ గా తీసుకుని సబ్సీడీలో అందిస్తాం.

•              ఖాళీగా ఉన్న బంజరు భూములను గొర్రెలు మేపుకునేందుకు అప్పగిస్తాం.

•              సబ్సిడీపై మేత పంపిణీ చేస్తాం.

•              జీవాలను ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడేందుకు సబ్సిడీపై షెడ్ల నిర్మాణం.

గౌడ

•              మద్యం షాపుల్లో 20 శాతం రిజర్వేషన్

•              ఉపాధిహామీ అనుసంధానంతో కల్లుచెట్ల పెంపకానికి ప్రోత్సాహం

•              నీరా కేఫ్ ఏర్పాటు

•              ఆదరణ ద్వారా పనిముట్లు

•              ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.10 లక్షల బీమా

కురుబ/మాదాసి కురబ

•              రాష్ట్ర పండుగలా కనకదాసు జయంతి

•              సబ్సిడీపై గొర్రెలు, ఆవులు అందజేసి, ఇన్సూరెన్స్ సౌకర్యం.

•              22 గొర్రెలు యూనిట్ గా తీసుకుని సబ్సీడీలో అందిస్తాం.

•              ఖాళీగా ఉన్న బంజరు భూములను గొర్రెలు మేపుకునేందుకు అప్పగిస్తాం.

•              మాదాసి కురుబలకు ఎస్సీ సర్టిఫికేట్ మంజూరు చేసేలా చర్యలు

•              ప్రభుత్వ నిధులతో బీరప్ప దేవాలయ నిర్మాణం

•              బీరప్ప దేవాలయంలో అర్చకులకు జీతాలు అందిస్తాం.

బుడగ/బేడ జంగాలు

•              అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లో ఎస్సీ సర్టిఫికేట్

•              అన్ని రకాల సంక్షేమ పథకాల అందజేత

•              దామాషా ప్రకారం నిధుల కేటాయింపు

షట్ర కులస్తులు

•              షట్ర కులస్థులకు దామాషా ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటుతో నిధుల కేటాయింపు(కదిరి)

•              కదిరిలో షట్ర కులస్థులకు యేడాదిలో భవన నిర్మాణం.

•              దామాషా ప్రకారం నిధులు కేటాయింపు

ఉప్పర/సగర

•              దామాషా ప్రకారం నిధుల కేటాయింపు

•              ఉప్పరసోది, ఉప్పర మీటింగ్ అనే మాటలు నిషేధం

వక్కలిగ

•              వక్కలిగలను ఓబీసీలో చేర్చే అంశంపై నిర్ణయం

•              దామాషా ప్రకారం నిధులు కేటాయింపు

వాల్మీకి/బోయ

•              సత్యపాల్ కమిటీ నివేదిక ఆధారంగా ఎస్టీల్లో చేర్చే అంశంపై న్యాయః

•              దామాషా ప్రకారం నిధుల కేటాయింపు

•              పెండింగులో ఉన్న కమ్యూనిటీ భవనాల నిర్మాణం

మత్య్సకారులు

•              వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 217 జీవో రద్దు

•              ఆదరణ ద్వారా వలల అందజేత

•              బోట్లకు మళ్లీ డీజల్ రాయితీ

ఆర్యవైశ్యులు

•              రోశయ్య చేసిన సేవలకు గుర్తుగా మ్యూజియం ఏర్పాటు

•              ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ కు నిధులు, చిరువ్యాపారులకు రుణాలు.

•              ఆర్యవైశ్య మహాసభను ప్రక్షాళన

•              స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారాలు చేసుకునేలా చర్యలు

•              ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం రూపకల్పన

•              కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గింపు

•              జీఎస్టీ పోర్టల్ సమస్య పరిష్కారం

•              ప్రొఫెషనల్ ట్యాక్స్ రద్దు

•              రైస్ మిల్లర్లు చెల్లించే సర్ ఛార్జీల్లో పాత విధానాన్ని తీసుకొస్తాం.

బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలు:

•              దామాషా ప్రకారం బ్రాహ్మణ కార్పొరేషన్ కు నిధులు కేటాయింపు

•              బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అపరకర్మల భవనాల నిర్మాణం.

•              బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా గ్రామాల్లోని అర్చకులకు వేతనాలు

•              వేదపాఠశాలల్లో విద్యనభ్యసించి సర్టిఫికేట్లు ఉన్నవారికి నిరుద్యోగ భృతి

•              దీపదూప నైవేద్యాలకు, గుడి నిర్వహణ ఖర్చులకు రాష్ట్ర బడ్జెట్ నుండి నిధులు కేటాయింపు

•              పురోహితులకు ప్రభుత్వం నుండి గౌరవవేతనం ఇచ్చే క్రమంలో ఐడీ కార్డులు జారీ.

•              ఐడీ కార్డులు ఉన్న ప్రతి పురోహితుడికి, వారి కుటుంబానికి తిరుమలలో దర్శనం ఏర్పాటు.

•              దేవాలయాల నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్ నుండి నిధులు కేటాయింపు

Also, Read This Blog:Revolution on the Move: Yuvagalam Padayatra Paves the Way for Change

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *