NaraLokesh padayatra,Yuvagalam
NaraLokesh padayatra,Yuvagalam

కావలిలో దుమ్మురేపిన యువగళం పాదయాత్ర యువగళం రాకతో జనసంద్రంగా మారిన పట్టణం వీధులు

కావలి బహిరంగసభకు భారీగా హాజరైన జనసందోహం

నేడు 2వేల కి.మీ.లకు చేరుకోనున్న యువగళం పాదయాత్ర

కావలి: లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర కావలి పట్టణంలో దుమ్మురేపింది. 153వరోజు పాదయాత్ర కావలి పట్టణంలో జన ప్రభంజనాన్ని తలపించింది. యువగళం పాదయాత్రకు కావలిలో జనం పోటెత్తారు. భారీగా తరలివచ్చిన ప్రజలతో పట్టణ వీధులన్నీ జనప్రవాహంగా మారి కిటకిటలాడాయి. యువనేతను చూసేందుకు రోడ్లవెంట ఖాళీలేకపోవడంతో జనం డాబాలపైకి ఎక్కారు.  యువనేత లోకేష్ రాకతో తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో ఆనందం పొంగిపొర్లింది. భారీ గజమాలలు, పూలవర్షంతో లోకేష్ ను ముంచెత్తారు. అడుగడుగునా మహిళలు, యువకులు యువనేతకు నీరాజనాలు పలికారు. దారిపొడవునా డప్పుల చప్పుడు, బాణాసంచా మోతలతో హోరెత్తించారు. లోకేష్ తో సెల్ఫీల కోసం యువతీయువకులు పోటీపడ్డారు. పట్టణంలోని వివిధ వర్గాల ప్రజలు లోకేష్ ను కలసి సమస్యలను విన్నవించుకున్నారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని యువనేత భరోసా ఇచ్చారు. కావలి బిపిఎస్ సెంటర్ లో నిర్వహించిన బహిరంగసభకు జనం పోటెత్తారు. నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. తుమ్మలపెంట క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర మన్నంగిదిన్నె, కొనదిన్నె, ఆములదిన్నె మీదగా కావలి పట్టణానికి చేరుకుంది. భోజన విరామానంతరం ఆములదిన్నె నుంచి ప్రారంభమైన పాదయాత్ర కావలి అంబేద్కర్ సెంటర్, పోలేరమ్మగుడి, బిపిఎస్ సెంటర్, వైకుంఠపురం సర్కిల్, చెల్లంచర్ల క్రాస్ మీదుగా శ్రీపురం క్రాస్ వద్ద విడిది కేంద్రానికి చేరుకుంది. 152వరోజు యువనేత లోకేష్ 16.0 కి.మీ. పాదయాత్రచేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1999.5 కి.మీ. పూర్తయింది. కావలి నియోజకవర్గం కొత్తపల్లిలో మంగళవారం ఉదయం యువగళం పాదయాత్ర చారిత్రాత్మక 2వేల కి.మీ. మైలురాయి చేరుకోనుంది. ఈ సందర్భంగా కొత్తపల్లిలో యువనేత లోకేష్ పైలాన్ ను ఆవిష్కరించనున్నారు. నిర్ణీత లక్ష్యానికంటే ముందుగానే యువగళం పాదయాత్ర సగభాగం పూర్తికావడంతో యువగళం క్యాంప్ లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. 2వేల కి.మీ.లకు చేరుకోనున్న సందర్భంగా యువనేత లోకేష్ ను కలిసి అభినందించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కావలి పట్టణానికి చేరుకున్నారు.

నా భూమిని సర్పంచ్ కబ్జా చేసి అమ్మేశాడు-ఉప్పాల మాలకొండయ్య, ఆముదాలదిన్నె

నా భూమిని సర్పంచ్ వాళ్ల నాన్న పేరుతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. మా గ్రామ వైసీపీ సర్పంచ్ ఓడ బ్రహ్మానందం నాకున్న 50 సెంట్ల భూమిని కబ్జా చేసి లే అవుట్లు వేసి రూ.25 లక్షలకు అమ్ముకున్నాడు. దీనికి ఎమ్మార్వో, పోలీసులు వత్తాసు పలికి, నేను కేసు పెట్టినా తీసుకోలేదు. లాయర్ నోటీసులు ఇస్తే నువ్వు ఊర్లో ఎలా తిరుగుతావో చూస్తా బెదిరిస్తున్నారు.

స్మార్ట్ మీటరుతో కొంపముంచారు-ప్రమీల, కావలి.

ఇళ్లలో పాచిపని చేసి నా కొడుకు బి.ఇడి చదివించాను. నాలుగేళ్లుగా డిఎస్సీ విడుదల చేయకపోవడంతో రూ.8 వేలకు ఓ మిల్లులో పనికి వెళ్తున్నాడు. రెక్కల కష్టంతో బిడ్డను చదివించుకుంటే నిరాశే మిగిలింది. ఉచిత కరెంట్ ఇస్తషమని నా పేరు మీద స్మార్ట్ మీటర్ తీసుకోమన్నారు.. మీటరు తీసుకున్నాక బిల్లు ఎక్కువగా వస్తోందని ఇంటి స్థలం నిరాకరించారు. పాతమీటరు స్థానంలో కొత్తమీటరు పెట్టి నా కొంప ముంచారు.

రూ.15వేలు ఇస్తే ఇంటిపట్టా ఇస్తామన్నారు-మస్తానమ్మ, అరుంధతిపాలెం కాలనీ, కావలి

ముసునూరు దగ్గర నాకు ప్రభుత్వం సెంటు పట్టా మంజూరైంది. అది కూడా అడవుల్లో నివాసయోగ్యంగా లేదు. ఇంటి పట్టా ఇవ్వాలంటే రూ.15 వేలు అడిగారు, అంత స్థోమత లేదన్నంటుకు పట్టా నిలిపివేశారు. ప్రస్తుతం గుడిసెలో ఉంటున్నా. కట్నం ఇవ్వలేక నా కూతురుకి వివాహం కూడా చేయలేదు. నాలాంటి వాడిని లంచం కోసం పీడించడం ఎంతవరకు న్యాయం?

డ్రెయిన్లను కూడా వదలని వైకాపా బకాసురులు!

కావలి నియోజకవర్గం ఆమలదిన్నె వద్ద వైసిపినేతలు డ్రెయిన్ ను ఆక్రమించి లేఅవుట్ వేసిన ప్రాంతంలో యువనేత లోకేష్ సెల్ఫీ దిగారు కొండలు, గుట్టలు, శ్మశానాలు, డ్రెయిన్లను సైతం వదలకుండా మింగేస్తున్నారు. ఇది కావలి నియోజకవర్గం ఆములదిన్నె బిట్-2 పరిధిలో రోడ్డు వెంట ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుడు కాటా శ్రీనివాసరెడ్డి కొండపి డ్రెయిన్ ను పూడ్చేసి వేసిన లే అవుట్. రోడ్డును ఆనుకొని 15ఎకరాల డ్రెయిన్ ను ఆక్రమించడమేగాక 5 తూములను కూడా పూడ్చేశారు. ఫలితంగా రైతుల పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఎవరు ఏమైపోయినా ఫర్వాలేదు,. తమకు లైవ్ లో నరకం చూపిస్తున్న జె-గ్యాంగ్ కు చుక్కలు చూపించేందుకు జనం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారంటూ లోకేష్ విరుచుకుపడ్డారు.

నెల్లూరు జిల్లాలో యువగళం ప్రభంజనం

యువగళం..మనగళం..ప్రజాబలం. నెల్లూరు జిల్లాలో యువగళం ఒక ప్రభంజనం. కావలి లో మాస్ జాతర అదిరిపోయింది.  పోరాటాల గడ్డ కావలి. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు నివసించిన నేల కావలి.  బిట్రగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్య భూమి కావలి.  ఎంతో ఘన చరిత్ర ఉన్న కావలి నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

కష్టాలు చూశాను, కన్నీళ్లు తుడుస్తాను!

2వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. 

యువత భవితను దెబ్బకొట్టాడు!

 జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

మోటార్లకు మీటర్లు – రైతు మెడకు ఉరితాళ్లు

వైసీపీ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2.  రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.  వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది.

మైనారిటీలకూ చిత్రహింసలు

అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పధకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం.  రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో మీరు ఎంతో డబ్బు ఖర్చు చేసి కష్టపడి జగన్ ని గెలిపించుకున్నారు.

కావలిని అరాచకాలకు అడ్డాగా మార్చిన ఎమ్మెల్యే

కావలి కనకపట్నంగా మారుతుందని బ్రహ్మం గారు చెప్పారు. కావలిని కనకపట్నంగా మార్చేస్తారని మీరు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ని రెండు సార్లు గెలిపించారు. ఆయన కావలిని కష్టాలపట్నంగా మార్చేసాడు. ఆయనకి పేరులో మాత్రమే ప్రతాపం ఉంది మనిషిలో ప్రతాపం లేదు.  ప్రశాంతంగా ఉండే కావలి అరాచకాలకు అడ్డాగా మార్చేసాడు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా కు కావలి ని కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేసాడు.  ఆయన చేసిన అవినీతి గురించి, అరాచకాల గురించి తెలుసుకున్న తరువాత ఆయనకి ముద్దుగా అనకొండ అని పేరు పెట్టాను. దోచుకోవడం, దాచుకోవడం కావలి అనకొండ స్పెషాలిటీ. ఆఖరికి సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలను కూడా వదలడం లేదు ఈ అనకొండ. కప్పరాల తిప్పలో బిసి గురుకుల పాఠశాల కు చెందిన 4 ఎకరాల భూమిని అనకొండ, ఆయన బినామీ బాల మురళీ రెడ్డి కబ్జా చేసాడు.

సెంటు పట్టాల పేరుతో భారీ స్కామ్

సెంటు స్థలాల పేరుతో భారీ స్కాం కి పాల్పడ్డాడు అనకొండ. 15 లక్షలు కూడా విలువ చేయని భూములను తన బినామీల యాదగిరి, సుబ్బారావు, ప్రభాకర్ రెడ్డి, రవికుమార్ రెడ్డి, వెంకట రామిరెడ్డి, రాణమ్మ, శివ కుమార్ రెడ్డి, జగదీష్ రెడ్డి ద్వారా కొని ఎకరం 50 లక్షలకు ప్రభుత్వానికి అమ్మేసాడు ఈ అనకొండ. సెంటు భూముల్లో అనకొండ అవినీతి ఎంతో తెలుసా? అక్షరాలా రూ.100 కోట్లు. అవినీతి కి సహకరించలేదని ఏకంగా కలెక్టర్ నే ట్రాన్స్ ఫర్ చేయించాడు అనకొండ.  అనకొండ అనుచరులు వివేక్ రెడ్డి, ప్రసాద్, మహేష్ నాయుడు, రఘు, వెంకట్ తో కలిసి కావలి రూరల్, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాలో విచ్చలవిడిగా గ్రావెల్ ను తవ్వి కోట్లు సంపాదించారు. ప్రతి రోజూ 300 లారీల గ్రావెల్ లేపేస్తున్నాడు అనకొండ.

పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా

ఇసుక అక్రమ రవాణాకు కావలిని అడ్డాగా మార్చేసాడు. సముద్రపు ఇసుక మిక్స్ చేసి మరీ ఇతర రాష్ట్రాలకు అమ్మేస్తున్నాడు ఈ అనకొండ.  రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కలక్షన్ పాయింట్ గా మార్చుకున్నాడు అనకొండ. ప్రతి రిజిస్ట్రేషన్ కి కప్పం కట్టాల్సిందే. రిజిస్ట్రేషన్ కార్యాలయం ద్వారా అనకొండ ఒక రోజు కలక్షన్ ఎంతో తెలుసా? రూ.15 లక్షలు.  కావలిని అక్రమ లే అవుట్లకు కేంద్రంగా మార్చేసాడు. అక్రమ లే అవుట్లు వేసే వారి దగ్గర ఎకరాకు 5 నుండి 10 లక్షలు వసూలు చేస్తున్నాడు ఈ అనకొండ.

టిడిపి హయాంలోనే కావలి అభివృద్ధి!

టిడిపి హయాంలో కావలి అభివృద్ధి లో నంబర్ 1. రోడ్లు, సిసి రోడ్లు, పేదలకు ఇళ్లు, సాగు, తాగు నీటి ప్రాజెక్టులు నిర్మించింది టిడిపి. ఆక్వా ఎగుమతుల్లో కావలిని నంబర్1 చేసాం. నీరు చెట్టు పధకం కింద చెరువులను అభివృద్ధి చేసాం. మత్స్యకారులకు వలలు, సైకిళ్లు, మోటారు బోట్లు, ఆటోలు, ట్రక్కులు, ఐస్ బాక్స్‌లు ఇచ్చాం. ఫిషింగ్ హార్బర్ తెచ్చింది టిడిపి. కానీ మీరు ఏం చేసారు.. పాలిచ్చే ఆవుని వద్దనుకోని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. అనకొండ ఎంత చేతగాని వాడో నేను చెప్పడం కాదు, నియోజకవర్గం లో వైసిపి నేతలు, కార్యకర్తలే ఒక పాంప్లెట్ వేసి పంచుతున్నారు. ఇదిగో నాకు కూడా ఇచ్చారు.

దోచుకోవడం తప్ప చేసిందేమిటి?

అనకొండ కావలిని దోచుకోవడమే తప్ప చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తూ పాంప్లెట్ వేసారు. అనకొండే కాదు, జగన్ కూడా కావలి ప్రజల్ని మోసం చేసాడు.  బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కోసం రూ.35 కోట్లు, బైపాస్ కెనాల్ కు రూ.20 కోట్లు, ట్రంక్ రోడ్డు విస్తరణకు రూ.15 కోట్లు, ఇందిరమ్మ కాలనీలో మౌలిక సదుపాయాల కోసం రూ.80 కోట్లు కేటాయించాడు. కావలికి సీఎం కేటాయించిన రూ.150 కోట్లు ఎక్కడ? ఒక్క రూపాయి వచ్చిందా? ఒక్క పని పూర్తి అయ్యిందా? అనకొండ వేసిన శిలాఫలకాలు తప్ప అభివృద్ధి అడ్రస్ లేదు. ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు బబుల్ గమ్ లా సాగుతూనే ఉన్నాయి. పనులు పూర్తి చెయ్యడు. తుమ్మలపెంట రోడ్డు ఘోరంగా ఉంది. ప్రతి రోజూ ప్రమాదాలు జరుగుతున్నా అనకొండ రోడ్డు వెయ్యడు. కావలి టౌన్ ని 100 గ్రామాలతో అనుసంధానం చేసే పెద్దపవని ఫ్లైఓవర్ పనులు పూర్తి చెయ్యలేని వేస్ట్ ఎమ్మెల్యే ఈ అనకొండ.

కావలిలో డ్రైనేజి వ్యవస్థ దారుణం

కావలి లో డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా ఉంది. చిన్న వర్షం వస్తే డ్రైనేజ్ పొంగి ప్రజలు నరకం చూస్తున్నారు. కావలి పట్టణ ప్రజలు దాహంతో అల్లాడిపోతుంటే, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించి నీటిని అందించింది టిడిపి. మిగిలిన పనులు పూర్తి చెయ్యలేని చెత్త ఎమ్మెల్యే ఈ అనకొండ. కావలి టౌన్ లో కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. అది అనకొండ పనితనం.  రకరకాల పన్నుల పేరుతో ప్రజల్ని, వ్యాపారస్తులను వేధించి మున్సిపాలిటీ పరిధిలో పన్నులు వసూలు చేస్తున్నారు. కానీ ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడం లేదు. మున్సిపాలిటీ నిధులు మాత్రం స్వాహా చేస్తున్నాడు అనకొండ.

శిలాఫలకాలు ఏమయ్యాయి?

అనకొండ వేసిన శిలాఫలకాల లిస్ట్ చదువుతాను అవన్నీ అయ్యాయో లేదో మీరే చెప్పాలి. పార్కులు, రోడ్లు, బ్రిడ్జ్ లు, శ్మశానాలు, ఇండోర్ స్టేడియం, కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్, ఇందిరమ్మ కాలనీ వద్ద రైల్వే అండర్ పాస్… వీటిలో ఒక్క పని అయినా పూర్తి అయ్యిందా? ఎలాగో అనకొండ ఇంటికి పోయే టైం దగ్గర పడింది. ఆయన వేసిన శిలాఫలకాలు అన్ని ఆయన ఇంటికే పంపుదాం. అతని చేతగాని తనానికి గుర్తుగా ఇంట్లో పెట్టుకుంటాడు.

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం

మేం అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి పిల్ల కాలువల ద్వారా సాగు నీరు అందిస్తాం. తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తాం. పెండింగ్ లో ఉన్న రోడ్లు, బ్రిడ్జ్ పనులు పూర్తి చేస్తాం. దగదర్తి విమానాశ్రయం నిర్మాణం పూర్తి చేస్తాం. మత్స్యకారులు వైసీపీ పాలనలో పడుతున్న భాదలు నాకు తెలుసు. గతంలో ఎలా అయితే వలలు, బొట్లు, డీజిల్ సబ్సిడీలు ఇచ్చామో, టిడిపి అధికారంలోకి వచ్చిన వాటన్నింటినీ మీకు అందజేస్తాం.

భూఅక్రమాలపై సిట్ వేస్తాం!

వరి రైతులు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు టిడిపి హయాంలో ఎకరాకు రూ.20 వేల పెట్టుబడి అయితే జగన్ పాలనలో రూ.40 వేలు అవుతుంది. ఒక్క నెల్లూరు జిల్లా లోనే నాలుగేళ్లలో రైతులు రూ.3,400 కోట్లు నష్టపోయారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వరి రైతులకు పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం. అనకొండ భూ అక్రమాల పై సిట్ వేస్తాం. మింగిన డబ్బు మొత్తం కక్కిస్తాం. టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని అనకొండ వేధించాడు. టిడిపి కార్యకర్తల జోలికి వచ్చిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టను. కావలిలోనే కాదు, భూమ్మీద ఏ కలుగులో దాక్కున్నా పట్టుకొచ్చి లోపలేస్తా.

లోకేష్ ను కలిసిన తుమ్మలపెంట పట్టపుపాలెం గ్రామస్తులు

కావలి అసెంబ్లీ నియోజకవర్గం తుమ్మలపెంట పట్టపుపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.  మా గ్రామం సముద్ర తీరానికి సమీపంలో ఉంది. గ్రామంలో నివసించేవాళ్లు మొత్తం మత్స్యకారులే. మాకు ఇళ్ల పట్టాలు లేవు. అటవీ భూమిని మార్పిడి చేసి బీసీలకు గృహ నిర్మాణ పథకం చేయాలి. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీ మత్స్యకారుల ఓట్లపై తప్ప వారి సంక్షేమంపై శ్రద్ధ లేదు. సముద్రతీర ప్రాంతాల్లో మత్స్యకారుల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తుమ్మలపెంట పట్టపుపాలెం గ్రామస్తులకు ఇళ్లస్థలాలతో ఇళ్లు నిర్మించి ఇస్తాం. మత్స్యకారుల సంక్షేమానికి గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన కొనదిన్నె గ్రామస్తులు

కావలి నియోజకవర్గం కొనదిన్నె గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 200కుటుంబాలు నివసిస్తున్నాయి. మా గ్రామంలో తాగునీటి పైపులైన్లు నిత్యం రిపేర్లు వస్తున్నాయి, కొత్త లైన్లు వేయాలి. గ్రామంలో డ్రైనేజీలు లేకపోవడంతో మురికినీరు రోడ్లపైకి వచ్చి దోమల బెడద అత్యధికంగా ఉంది. గౌడ కులస్తులకు శ్మశానవాటిక చుట్టూ ప్రహరీగోడ, గేటు నిర్మించాలి. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు అప్పు చేసి కట్టాం. కానీ బిల్లులు ఇవ్వడం లేదు.

నారా లోకేష్ స్పందిస్తూ

జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామాలను పూర్తిగా నిర్లక్ష్యంచేశారు. గ్రామపంచాయితీలకు చెందిన 9వేలకోట్లను సర్పంచ్ లకు తెలియకుండా జగన్ ప్రభుత్వం దొంగిలించింది. ప్రస్తుతం పంచాయితీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధుల్లేని దుస్థితి నెలకొంది. శ్మశానాలను సైతం వైసిపి పిశాచాలు వదలకుండా కబ్జా చేస్తున్నాయి. పేదల ఇళ్లకు కేంద్రం ఇచ్చిన డబ్బును  కూడా జగన్ పక్కదారిపట్టించారు. టిడిపి అధికారంలోకి రాగానే గ్రామసీమలకు గతవైభవం తెస్తాం. పేదల ఇళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన మాల మహానాడు ప్రతినిధులు

కావలి అంబేద్కర్ సెంటర్ లో కావలి డివిజన్ మాలమహానాడు ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కావలి రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ అయినా నేటికీ అంబేద్కర్ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. TDP పాలనలో భవనం కోసం నిధులు మంజూరు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రికి దరఖాస్తులు ఇచ్చినా ఫలితం లేదు. దళితులు ఎక్కువగా ఉన్న కావలి, ఉదయగిరి ప్రాంత ప్రజలకు అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలి.

యువనేతను కలిసిన కావలి పట్టణ ప్రజలు

కావలి వైకుంఠపురం సర్కిల్ లో పట్టణ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. వైకుంఠపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయాయి. దీంతో కావలి ట్రంక్ రోడ్డుకు వెళ్లాలంటే జనతాపేట వైపు మెయిన్ రోడ్డుకు వెళ్లాల్సివస్తోంది. చుట్టూ తిరిగి వెళ్లాలంటే 6కిలోమీటర్లు అదనంగా తిరగాల్సి వస్తోంది. సంవత్సరాల తరబడి మేం ఈ విధంగా సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనిని పూర్తిచేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

రకరకాలపేర్లతో పన్నుల బాదుడు తప్ప పట్టణాల్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలేదు. పట్టణాల్లో రోడ్లన్నీ గోతులమయమైన తట్టమట్టి పోసే దిక్కులేకుండా పోయింది. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం 1.30లక్షల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టింది. దివాలాకోరు ప్రభుత్వాన్ని చూసి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వైకుంఠపురం రైల్వే బ్రిడ్జి పనులను పూర్తిచేస్తాం. కావలిలో మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాం.

Also, Read This Blog: Revolution on the Move: Yuvagalam Padayatra Paves the Way for Change

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *