Nara Lokesh padayatra,Yuvagalam
Nara Lokesh padayatra,Yuvagalam

చిప్పలేరు వాగు వంతెనపై యువనేతకు అపూర్వస్వాగతం బోట్లపై యువగళం జెండాలను ప్రదర్శించిన మత్స్యకారులు

నేడు కావలిలో యువగళం బహిరంగసభ, లోకేష్ ప్రసంగం

కావలి:  లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. 151వరోజు యువగళం పాదయాత్ర కావలి నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. మత్స్యకార గ్రామాల్లో యువనేత లోకేష్ కు అపూర్వ స్వాగతం లభించించి. కావలి నియోజకవర్గం జువ్వలదిన్నె వద్ద చిప్పలేరు బ్రిడ్జిపై యువనేతకు అక్కడి ప్రజలు వినూత్నరీతిలో స్వాగతం పలికారు. ఈ గ్రామంలోని మత్స్యకారులు లోకేష్ కు స్వాగతం పలుకుతూ బోట్లపై యువగళం జెండాలను ప్రదర్శించారు. బ్రిడ్జి యువనేతను గజమాలలతో సత్కారించి, మేళతాళాలు, బాణా సంచామోతలతో హోరెత్తించారు. సైకోపోవాలి.. సైకిల్ రావాలి నినాదాలు, డిజె సౌండ్లతో యువగళం పాదయాత్ర దద్దరిల్లింది. అంతకుముందు జువ్వలదిన్నెలో  అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మారక భవనాన్ని యువనేత లోకేష్ సందర్శించారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులను కలిసి ముచ్చటించారు. టిడిపి హయాంలో గ్రామాభివృద్ది కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించినందుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. బంగారుపాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర వడ్డిపాలెం, జువ్వలదిన్నె, చిప్పలేరు బ్రిడ్జి, ఆదినారాయణపురం, అన్నగారిపాలెం, ఒట్టూరు, నడింపల్లి క్రాస్, మామిళ్లదొరువు, పువ్వుల దొరువు, చిననట్టు, పెదనట్టు మీదుగా తుమ్మలపెంట విడిది కేంద్రానికి చేరుకుంది. 151వరోజు యువనేత లోకేష్ 14.6 కి.మీ. లు పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1983.5 కి.మీ. మేర పూర్తయింది. సోమవారం సాయంత్రం కావలి బిపిఎస్ సెంటర్ లో నిర్వహించే బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగించనున్నారు.

*ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేశావా

చిప్పలేరు వంతెన వద్ద సెల్ఫీ దిగిన లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది మద్రాసు-కలకత్తా రహదారి నుంచి కావలి నియోజకవర్గం ఎస్ వి పాలెం మీదుగా జువ్వలదిన్నె వెళ్లే రహదారిలో చిప్పలేరు వాగుపై నిర్మించిన వంతెన. గత టిడిపి ప్రభుత్వం హయాంలో 25.30 కోట్లతో నిర్మించిన ఈ బ్రిడ్జిని 11-1-2019న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా ప్రారంభించారు.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

పంచాయతీ కోసం రూ.18 లక్షలు సొంత డబ్బు ఖర్చు చేశా -ఆట తిరుమల, సర్పంచ్ పడమరగోగులపల్లి.

మా గ్రామం తప్ప మండలంలో అన్ని పంచాయతీల్లో వైసీపీ మద్ధతుదారులే గెలిచారు. గెలిచాక పంచాయతీ అకౌంట్లో పడ్డ రూ.23 లక్షలను విద్యుత్ బకాయిల కింద ప్రభుత్వం లాక్కుంది. ఊర్లో నీటి సమస్య ఉండటంతో 4 బోర్లు వేయించి, కిలో మీటరు మేర పైపులైన్లు వేయించాను. 8 గేటు వాల్వ్ లు మార్చాను..దాని ఖరీదు ఒక్కోటి రూ.25 వేలు. పారిశుధ్య కార్మికులు, పంపురేటర్లు కలిపి ఏడుగురు ఉన్నారు. వారికి నెలకు రూ.8 వేలు చొప్పున సొంత డబ్బులు జీతంగా ఇస్తున్నా. వ్యవసాయంలో వచ్చిన డబ్బులను గ్రామానికి ఖర్చు చేస్తున్నా. ఇప్పటివరకు రూ.18లక్షలు సొంత డబ్బు ఖర్చుచేశా. ప్రభుత్వం నుంచి రూపాయి ఎకౌంట్ లో పడనీయడం లేదు.

మా అమ్మకు పెన్షన్ తొలగించారు -బుచ్చిబాబు, ఆటో డ్రైవర్, కావలి, అంబేద్కర్ కాలనీ.

కానీ మా అమ్మకు రాజశేఖర్ రెడ్డి హయాం నుండి వస్తున్న పెన్షన్ తొలగించారు. కారణం నాకు ఆటో ఉండటంతో ఫోర్ వీలర్ ఉందని పెన్షన్ తీసేశారు. నాకు వాహన మిత్ర ఇవ్వకపోయినా పర్వాలేదు..మా అమ్మకు పెన్షన్ వస్తే చాలు. చాలీచాలని ఆదాయంతో బతికే మాలాంటి వారికి ఇలా కుంటిసాకులతో పెన్షన్ తీసేస్తే ఎలా బతకాలి?

విద్యుత్ బిల్లులు దారుణంగా వస్తున్నాయి -జయలక్ష్మి, జువ్వలదిన్నె.

విద్యుత్ బిల్లులు రానురాను ఎక్కువగా వసూలు చేస్తున్నారు. నాకు పిండిమిల్లు ఉంది. దానికి గతంలో నెలంతా ఆడితే రూ.600 వచ్చేది, ఇప్పుడు రూ.1700దాకా వస్తోంది. రేటు పెంచితే జనాలు పెద్దగా రావడం లేదు. పెద్దమిల్లులకు వెళ్తే తక్కువ ఉంటుందని టౌన్ కు వెళ్తున్నారు.

కాంట్రాక్టు లెక్చరర్ గా తప్పుకున్నా -శివకుమార్, కావలి

నేను చిత్తూరు జూనియర్ కాలేజీలో ఇటీవల వరకు కాంట్రాక్టు లెక్చరర్ గా చేశాను. 2011 నుండి కాంట్రాక్ట్ లెక్చరర్ గా చేస్తున్నా. రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి, ఇటీవల రెగ్యులరైజ్ చేసిన వారిలో మమ్మల్ని తీసుకోలేదు. దీంతో లెక్చరర్ గా తప్పుకున్నా. ప్రస్తుతం ప్రైవేట్ కాలేజీలో రెట్టింపు జీతంతో పని చేస్తున్నా.

అధికారంలోకి వచ్చాక బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం

బిసిలపై పెట్టిన తప్పుడు కేసులన్నీ ఎత్తివేస్తాం!

100రోజుల్లో 217 జిఓ రద్దుచేస్తాం

బిసిలతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్

కావలి: బిసిలను జగన్ ప్రభుత్వం పెట్రోల్ పోసి తగలబెడుతోంది, 15 ఏళ్ల అమర్నాథ్ గౌడ్ ని కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు వైసిపి నేతలు. బిసి కుర్రాడిని పాశవికంగా చంపేసి లక్ష రూపాయిలు రేటు కట్టారని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. కావలి నియోజకవర్గం బంగారుపాలెంలో బిసిలతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ

టిడిపి పాలనలోనే బిసిలకు నిజమైన స్వాతంత్ర్యం

బిసిలకు నిజమైన స్వాతంత్ర్యం ఇచ్చింది టిడిపి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించింది టిడిపి. ఆదరణ పథకం ప్రవేశ పెట్టింది టిడిపి. బిసి సబ్ ప్లాన్, కార్పొరేషన్ ద్వారా బిసిలకు రుణాలు ఇచ్చింది టిడిపి. రాజకీయంగా, ఆర్థికంగా బిసిలను ఆదుకుంది టిడిపి. టిడిపి హయాంలో కీలక పోస్టులు అన్ని బిసిలకే ఇచ్చాం. కానీ మీరు పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతు ని తెచ్చుకున్నారు. బిసి సంక్షేమ శాఖ మంత్రి ని చూస్తే జాలేస్తుంది. సిబ్బందికి జీతాలు ఇవ్వక మంత్రి కార్యాలయానికి సిబ్బంది తాళం వేశారు.

ఆక్వారైతులకు అండగా నిలుస్తాం

ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు. ఎకరం కంటే తక్కువ ఉన్న చెరువు కి రూ.27 వేల బిల్లు వచ్చింది. టిడిపి హయాంలో కేవలం రూ.5 వేలు బిల్లు వచ్చేది అని నిన్న నన్ను కలిసిన ఆక్వా రైతు చెప్పాడు. జగన్ పాలనలో ఆక్వా రంగం సంక్షోభంలో పడింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సబ్సిడీ లో విద్యుత్ తక్కువ ధరకి అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా ప్రకారం నిధులు కేటాయించి కార్పొరేషన్లు బలోపేతం చేస్తాం. ఉప కులాల వారీగా నిధులు కేటాయిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే  ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీరు అందిస్తాం.

నాణ్యమైన ఇళ్లు నిర్మించి ఇస్తాం!

ఎన్నికల ముందు అందరికీ ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ మోసం చేసాడు. ఇప్పుడు ఇళ్లు కట్టకపోతే పట్టాలు వెనక్కి తీసుకుంటున్నారు. పేదలు 9 లక్షలు అప్పు చేసి ఇళ్లు కడితే వాళ్ళు ఎప్పటికీ శాశ్వతంగా పేదరికం లో ఉండిపోతారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఉచితంగా నాణ్యమైన ఇళ్లు కట్టించి ఇస్తాం. గొర్రెల పెంపకానికి ఎటువంటి సాయం జగన్ ఇవ్వడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గొర్రెలు కొనడానికి రుణాలు ఇస్తాం. సబ్సిడీ లో మందులు అందజేస్తాం. మేపుకోవడానికి బంజరు భూములు కేటాయిస్తాం.

రజకులకు ఉచిత విద్యుత్ అందజేస్తాం!

రజక సామాజిక వర్గం కి చెందిన వ్యక్తి ని శాసన మండలి కి పంపింది టిడిపి. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు రజక సామాజిక వర్గానికి ఐరెన్ బాక్సులు, వాషింగ్ మెషిన్లు ఇచ్చాం, ధోబి ఘాట్స్ ఏర్పాటు చేశాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రజకులకి ఉచితంగా విద్యుత్ అందజేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారులను ఆదుకుంటాం. మత్స్యకారులకు 50 ఏళ్లకే పెన్షన్ కూడా అందించాం. వలలు, బోట్లు సబ్సిడీ లో అందించాం. వేట విరామ సాయం అందించాం. డీజిల్ సబ్సిడీ లో అందించాం. టిడిపి అధికారంలోకి వచ్చిన గతంలో ఇచ్చిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు మత్స్యకారులకు అందజేస్తాం.

బీద రవిచంద్ర యాదవ్ మాట్లాడుతూ…

కానీ ఒక్క రూపాయి ఆర్ధిక సాయం చెయ్యలేదు. జగన్ పాలనలో బిసిల పై దాడులు, అక్రమ కేసులు పెరిగిపోయాయి. రూ.120 కోట్ల తో కావలి లో గ్రామాల్లో సిసి రోడ్లు వేసింది, తాగునీరు అందించింది నారా లోకేష్. జువ్వలదిన్నే ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసింది టిడిపి.

*లోకేష్ ను కలిసిన ఎన్టీఆర్ స్కూల్ పూర్వ విద్యార్థులు*

*పాదయాత్రకు సంఘీభావం తెలిపి యువనేతకు కృతజ్ఞతలు*

ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో విద్యనభ్యసించి వివిధ రంగాల్లో స్థిరపడిన 35 మంది పూర్వ విద్యార్థులు యువనేత నారా లోకేష్ ను కలిశారు. 151వ రోజు యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేష్ ను నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బంగారుపాలెం క్యాంప్ సైట్ లో ఆదివారం కలిసి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు, సాఫ్ట్ వేర్, వివిధ రంగాల్లో స్థిరపడిన వారిని లోకేష్ అభినందనలు తెలిపారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ… తల్లిదండ్రులను కోల్పోయిన తమను ఎన్టీఆర్ మోడల్ స్కూలు అమ్మలా అక్కున చేర్చుకుందని తెలిపారు. మంచి హాస్టల్ తో పాటు, కార్పొరేట్ స్థాయి విద్యను ఎన్టీఆర్ మోడల్ స్కూల్ తమకు అందించడంతో ఇప్పుడు జీవితంలో సెటిలయ్యామని అన్నారు. ఈరోజు మెరుగైన జీతాలు అందుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివే వారిలో 80 శాతం మంది ఐఐటీ, నీట్ లో ప్రవేశాలు పొందుతున్నారని  చెప్పారు. మరికొందరు క్యాంపస్ సెలక్షన్లలో ఎంపికై విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని  తెలిపారు. భవిష్యత్ లో మరింత ఉన్నత స్థానానికి చేరుకొని, మీలాంటి మరికొందరికి చేయూత నందించాలని లోకేష్ పేర్కొన్నారు.

నారా లోకేష్ ను కలిసిన సిద్ధనపాలెం గ్రామస్తులు

కావలి నియోజకవర్గం సిద్దనపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో దాదాపు 65ఏళ్లుగా మంచినీటి సమస్య ఉంది. ప్రతిరోజు 2కిలోమీటర్ల దూరం వెళ్లి నీరు తెచ్చుకోవాల్సివస్తోంది. మా గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించాలి. మా గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించాలి. గ్రామంలో విద్యుత్ స్థంభాలు శిథిలావస్థకు చేరాయి, కొత్తవి ఏర్పాటు చేయాలి. గ్రామంలో పశు వైద్యశాల లేక పశువుల కాపరులకు ఇబ్బంది ఉంది. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామంలో పశువుల వైద్యశాల నిర్మించాలి. విద్యుత్ ఛార్జీలు భారంగా మారాయి, తగ్గించే చర్యలు తీసుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

సంక్షేమంపై లక్షల కోట్లు ఖర్చుచేస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటున్న ముఖ్యమంత్రి గ్రామాల్లో గుక్కెడు నీళ్లివ్వలేకపోవడం దారుణం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేసి, 24/7 స్వచ్చమైన తాగునీరు అందిస్తాం. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజి, ఇతర మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం. గోపాలమిత్ర వ్యవస్థను పునరుద్దరించి, పశుపోషకులకు ఇబ్బంది లేకుండా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి పెంచిన విద్యుత్ ఛార్జీలతోపాటు అడ్డగోలు పన్నులన్నింటినీ సమీక్షించి, ప్రజలకు ఉపశమనం కలిగిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన అన్నగారిపాలెం గ్రామస్తులు

కావలి నియోజకవర్గం అన్నగారిపాలె గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామం సముద్ర తీరానికి అతి సమీపంలో ఉంది. అన్నగారిపాలెం, బలిజపాలెంకు చెందిన శ్మశానవాటిక స్థలం ఆక్రమణకు గురైంది. శ్మశానవాటిక లేక చాలా ఇబ్బందిపడుతున్నాం. ఆక్రమణలపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక శ్మశానవాటిక సమస్యను పరిష్కరించాలి. శ్మశానం భవిష్యత్తులో ఆక్రమణలకు గురి కాకుండా ప్రహరీ నిర్మించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

 ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన అధికారులకు అక్రమార్కులకు తొత్తులుగా వ్యవహరించడం విచారకరం. టిడిపి అధికారంలోకి రాగానే కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతాం. రాష్ట్రవ్యాప్తంగా శ్మశాన వాటికలకు ప్రహరీగోడలు నిర్మించి రక్షణ కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన ఒట్టూరు గ్రామస్తులు

కావలి నియోజకవర్గం ఒట్టూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో సిమెంట్ రోడ్ల పనులు జరగడం లేదు. నడింపల్లి వద్ద ఆర్ అండ్ బి రోడ్డు నుండి ఒట్టూరు కు వెళ్లే అప్రోచ్ రోడ్డు నిర్మించాలి. ఒట్టూరుకు ఆనుకుని ఉన్న భూములు సాగుచేసుకునే రైతులకు పట్టాలు మంజూరు చేయాలి. గ్రామంలో 550కుటుంబాలు ఉండగా, కానీ 350 కుటుంబాలకు ఇళ్లు లేవు. మా గ్రామం శ్మశానానికి వెళ్లే దారి ఆక్రమణకు గురై రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

పంచాయితీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధుల్లేని దుస్థితి నెలకొంది. సెంటుపట్టా పథకం వైసిపినేతలు దోచుకోవడానికే తప్ప పేదల కోసం కాదు. టిడిపి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కి.మీ.ల సిసి రోడ్లు నిర్మించాం. టిడిపి అధికారంలోకి వచ్చాక గ్రామసీమలకు గత వైభవం తెస్తాం. ఇల్లులేని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం. దీర్ఘకాలంగా భూములను సాగుచేసుకుంటున్న రైతులకు పట్టాలను అందజేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన నడింపల్లి గ్రామస్తులు

కావలి నియోజకవర్గం నడింపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో సిమెంటు రోడ్లు లేవు. నాలుగేళ్లుగా రోడ్లు లేక అవస్థలు పడుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. గ్రామంలో మౌలిక సదుపాయాలు సరిగా లేవు. అభివృద్ధి కార్యక్రమాలేవీ జరగడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలు పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

పంచాయితీల అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చిన నిధులను వచ్చినట్లే లాగేస్తుంటే గ్రామాల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణానివృద్ధికి పెద్దపీట వేస్తాం. కేంద్రం ఇచ్చే నిధులతోపాటు రాష్ట్రప్రభుత్వం తరపున కూడా నిధులు అందజేసి గ్రామపంచాయితీలను తీర్చిదిద్దుతాం.

నారా లోకేష్ ను కలిసిన మామిళ్లదొరువు గ్రామస్తులు

కావలి నియోజకవర్గం మామిళ్ల దొరువు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు. మాకు ప్రభుత్వ స్థలాలు కూడా అందుబాటులో లేవు. గ్రామానికి ఆనుకుని ఉన్నఅటవీ భూమిని మార్పిడి చేసి ఇళ్ల పట్టాలు ఇప్పించాలి. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

పేదవాళ్లకు ఇచ్చే సెంటు పట్టాల పేరుతో జగన్ అండ్ కో రూ.7వేల కోట్లు దోచుకున్నారు. ఇచ్చిన పనికిరాని స్థలాలను కూడా నిజమైన లబ్ధిదారులకు కాకుండా వైసిపి కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. తెలుగుదేశం హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 12.73లక్షల ఇళ్లు నిర్మించాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మామిళ్లదొరువు గ్రామస్తులకు ఇళ్లస్థలాలతోపాటు ఇళ్లు నిర్మించి ఇస్తాం.

నారా లోకేష్ ను కలిసిన చిననట్టు- పెదనట్టు గ్రామస్తులు

కావలి నియోజకవర్గం చిననట్టు, పెదనట్టు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామాల్లో మొత్తం మత్స్యకారులమే ఉన్నాం, చేపలవేటే మా జీవనాధారం. మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. సీసీ రోడ్ల నిర్మాణం జరగడం లేదు. చిననట్టు, పెదనట్టు నుండి సముద్ర తీరం వరకు రోడ్డు నిర్మించాలి. మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు, ప్రభుత్వ స్థలాలు కూడా లేవు. అందుబాటులో ఉన్న అటవీ భూమిని మార్పిడి చేయించి ఇళ్ల పట్టాలు ఇప్పించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీ ప్రభుత్వానికి మత్స్యకారుల ఓట్లపై ఉన్న శ్రద్ధ, వారి సంక్షేమంపై లేదు. మత్స్యకార గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిననట్టు-పెదనట్టు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఇళ్లు లేని వారందరికీ పక్కాగృహాలు నిర్మించి ఇస్తాం.

Also, Read This Blog:Unleashing the Power of the Young: Yuvagalam Padayatra Sweeps Across Andhra Pradesh

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *