Nara lokesh padayatra,Yuvagalam
Nara lokesh padayatra,Yuvagalam

వెంకటగిరి నియోజకవర్గంలో దుమ్ములేపిన యువగళం! జనసంద్రంగా మారిన లింగసముద్రం… రోడ్లపైకి భారీగా జనం అడుగడుగునా జన నీరాజనాల నడుమ యువనేత పాదయాత్ర

వెంకటగిరి: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో దుమ్మురేపింది. భారీ గజమాలలతో యువనేతను సత్కరించి, అడుగడుగునా ప్రజలు యువనేతకు నీరాజనాలు పలికారు. 133వరోజు యువగళం పాదయాత్ర డక్కిలి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభం కాగా తొలుత లింగసముద్రం చేరుకుంది. యువనేత రాకతో లింగసముద్రం జనసంద్రంగా మారింది. లోకేష్ ని చూసేందుకు మహిళలు, యువత, వృద్దులు భారీగా రోడ్లపైకి వచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టిడిపి రూపొందించిన మ్యానిఫెసో కరపత్రాలను పంచుతూ హామీలను ప్రజలకు వివరించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని యువనేత లోకేష్ భరోసా ఇచ్చారు. డక్కిలి శివార్లలోని ఎన్టీఆర్ కాలనీని సందర్శించిన లోకేష్ అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఎన్టీఆర్ బొమ్మ ఉన్నందుకు తమ కాలనీకి సౌకర్యాలు నిలిపివేశారని స్థానికులు వాపోయారు. రాబోయే టిడిపి ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కాలనీలో ఇళ్లు నిర్మిస్తుందని భరోసా ఇచ్చారు. డక్కిలి నుంచి ప్రారంభమైన పాదయాత్ర మాపూరు, నాగవోలు, మిట్టపాలెం మీదుగా వెంకటగిరి శివారు కమ్మపాలెం విడిది కేంద్రానికి చేరుకుంది. 133వరోజు యువనేత లోకేష్ 16.8 కి.మీ. దూరం పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1720.5 కి.మీ. పూర్తయింది. యువగళం పాదయాత్ర గురువారం వెంకటగిరి పట్టణంలో కొనసాగనుంది. వెంకటగిరి పాతబస్టాండులో నిర్వహించే బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగించనున్నారు.

యువనేత లోకేష్ ఎదుట వ్యక్తమైన సమస్యలు:

సర్పంచ్ అయినందుకు అప్పులపాలయ్యాను!-సీహెచ్.నాగమణి, పాతనూళ్లపాడు సర్పంచ్

సర్పంచ్ గా గెలిచాక పంచాయతీ ఖాతాలో పడిన రూ.5 లక్షలు ప్రభుత్వం లాగేసుకుంది. రూ.4 లక్షలు సొంత డబ్బులు ఖర్చు చేసి ఊర్లో బోర్లతో పాటు లైట్లు, పారిశుధ్యం పనులు చేశా. ప్రభుత్వం నుండి గ్రామాభివృద్ధికి ఎటువంటి నిధులు రాలేదు. సర్పంచ్ గా ఎన్నికైన పాపానికి అప్పులపాలయ్యాను. ఇప్పటికీ గ్రామంలో నీటి పారిశుద్ధ్యం, నీటి సమస్య తీవ్రంగా ఉన్నాయి. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామా అని బాధపడుతున్నా.

స్కూలుకెళ్లాలంటే 2 కి.మీ. నడవాల్సివస్తోంది!-రామయ్య, దందోలు గ్రామం, డక్కిలి మండలం.

మా గ్రామంలో దళిత కాలనీని పాలకులు, అధికారులు గాలికొదిలేశారు. కాలనీలో 50 కుటుంబాలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాల, హైస్కూల్ మాకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అంతదూరం నడవలేక పిల్లలు స్కూలుకి వెళ్లడం లేదు. మా కాలనీలో 30 ఇందిరమ్మ ఇళ్ళుఉన్నాయి. అవి పాడైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం. వైసీపీ ప్రభుత్వం మాకు రోడ్లు, తాగునీరు, డ్రైనేజిలు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించడం లేదు. 1990 లో వేసిన రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి. మాకు ఉపాధి అవకాశాలు లేక రొయ్యలు, చేపల చెరువులపై కాపలా పనులకు వలస వెళ్తున్నాం.

పొలం ఉందని పెన్షన్ తీసేశారు-ఎనగనూరు రత్నయ్య, పాటుమడుగు

నాకు పెన్షన్ రాజశేఖర్ రెడ్డి హయాం నుండి వస్తోంది. కానీ వైసీపీ అధికారంలోకి రాగానే పెన్షన్ తొలగించారు. ఎందుకు తొలగించారని అడిగితే 5 ఎకరాల పొలం ఉంది అన్నారు. 5 ఎకరాలకు మించి ఉంటే పెన్షన్ తీయాలి..కానీ 5 ఎకరాలే ఉన్నా తొలగించారు. పెన్షన్ వచ్చేలా చేస్తానని విఆర్ ఓ వెయ్యి తీసుకున్నాడు… అయినా రాలేదు. అప్లికేషన్ ఫారం మీద ఎమ్మార్వో, ఆర్ఐ సంతకాలు చేయలేదు. వాలంటీర్ సిద్ధార్థను అడిగితే నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అంటూ దురుసుగా మాట్లాడాడు. ఇలాంటి అరాచక ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు.

చేనేత‌ల బంగారు భ‌విష్యత్తు కోసం నారా లోకేష్ తొలి అడుగు

– వెంక‌ట‌గిరిలో నేడు www.weaversdirect.in వెబ్ సైట్ ఆవిష్కర‌ణ‌

– ద‌ళారీలు లేకుండా మంచి ధ‌రకి చేనేత‌లే త‌మ ఉత్పత్తులు అమ్ముకునేలా ఏర్పాట్లు

చేనేత కార్మికుల వెత‌లు ద‌గ్గర నుంచి చూశారు టిడిపి జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్‌. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో 30 వేల మందికిపైగా ఉన్న చేనేత వృత్తి క‌ళాకారుల క‌ష్టాలు గ‌మ‌నించారు. క్షేత్రస్థాయిలో వారి స‌మ‌స్యలు ప‌రిశీలించారు. చేనేత‌ల బంగారు భ‌విష్యత్తు కోసం చేనేత‌రంగ నిపుణుల‌తో క‌లిసి చ‌క్కనైన ప్రాజెక్ట్ రూపొందించి అమ‌లు చేయ‌నారంభించారు. అందులో లోటుపాట్లు స‌రిచేసుకుంటూ చేనేత‌ల‌కి చేయూత అందించే మార్గానికి తొలి అడుగులు వేస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా జ‌రీ చీర‌ల‌కి ప్రసిద్ధి చెందిన వెంక‌ట‌గిరిలో యువ‌గ‌ళం పాద‌యాత్ర కొన‌సాగుతున్న సంద‌ర్భంలో త‌న‌ క‌ల‌ల ప్రాజెక్ట్ ఆరంభానికి వేదిక‌గా చేసుకున్నారు. చేనేత‌కి టెక్నాల‌జీ అనుసంధానం, క‌ళాకారుల‌కి భ‌ద్రమైన ప‌ని ప‌రిస్థితులు, ద‌ళారీలు లేకుండా త‌మ ఉత్పత్తులు తామే అమ్ముకునే వెసులుబాటు, యంత్రాలు స‌మ‌కూర్చడం, ఆధునిక‌కాలం అవ‌స‌రాల‌కు అనుగుణ‌మైన మోడ‌ళ్లు నేసేలా శిక్షణ వంటి అంశాల‌లో సాయం చేయ‌నున్నారు. వెంక‌ట‌గిరిలో గురువారం www.weaversdirect.in వెబ్ సైటుని నారా లోకేష్ ఆవిష్కరించ‌నున్నారు.

వెంకటగిరిలో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుచేస్తాం! చేనేతలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తాం

చేనేత వస్త్రాలపై జిఎస్టీ భారం పడుకుండా చూస్తాం హ్యండ్లూమ్ వస్త్రాలకు బ్రాండింగ్ కల్పిస్తాం

ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబాలను ఆదుకుంటాం చేనేతలతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్

వెంకటగిరి: టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వెంకటగిరి లో మెరుగైన మోడల్ తో టెక్స్ టైల్ పార్క్ తీసుకొస్తాం, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. వెంకటగిరి నియోజకవర్గం డక్కిలిలో చేనేతలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ…  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికులను నేను దత్తత తీసుకుంటాను. చేనేత రంగాన్ని ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. జనతా వస్త్రాల పథకం తీసుకొచ్చి చేనేత కార్మికులను ఆదుకుంది టిడిపి.  మంగళగిరిలో వీవర్స్ శాల అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. గత టిడిపి ప్రభుత్వంలో ఒకే సంతకంతో రూ.110 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేసింది టిడిపి. చేనేత కార్మికుల సమస్యల పై నాకు పూర్తి అవగాహన ఉంది. యార్న్ సబ్సిడీ, కలర్ సబ్సిడీ, పట్టు సబ్సిడీ అందజేసింది టిడిపి. ఆదరణ పథకంలో భాగంగా 50 శాతం సబ్సిడీ తో మగ్గాలు అందజేసింది టిడిపి. చేనేత కార్మికులకు పెన్షన్ ఇచ్చింది టిడిపి. కానీ మీరు పాలిచ్చే ఆవుని వద్దని తన్నే దున్నపోతు తెచ్చుకున్నారు.

వెంకటగిరి చేనేతలను ఆదుకుంటాం!

వెంకటగిరి చేనేత కు బ్రాండ్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. వెంకటగిరి చీరలు అమ్మ, బ్రహ్మణి కట్టుకుంటారు. వెంకటగిరి చేనేత కార్మికులను ఆదుకొనే బాధ్యత నాది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులను టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను ఆదుకుంటాను. నూతన డిజైన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. జగన్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం తో కేంద్ర సంక్షేమ కార్యక్రమాలు కూడా చేనేత కార్మికులకు అందడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే యార్న్, కలర్, పట్టు సబ్సిడీ లు తిరిగి అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టు రైతులను ఆదుకుంటాం. సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ప్రతి నెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం. చేనేత కార్మికులకు టిడ్కో ఇళ్లు అందజేస్తాం. చేనేత లో పెట్టుబడి తగ్గేలా చర్యలు తీసుకుంటాం. పవర్ లూమ్, హ్యాండ్ లూమ్ కి మధ్య తెలిసేలా ప్రత్యేక ట్యాగ్ రూపొందిస్తాం. ప్రత్యేక జోన్లు ప్రకటిస్తాం. చేనేత పై జీఎస్టీ భారం పడకుండా చూస్తాం. ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబాలను ఆదుకుంటాం.

జగన్ వచ్చాక చేనేతల సబ్సిడీలన్నీ రద్దు!

జగన్ వచ్చిన తరువాత చేనేత కు ఇచ్చే అన్ని సబ్సిడీలు రద్దు చేశారు. యార్న్, కలర్, పట్టు సబ్సిడీ జగన్ ఎత్తేశారు. జగన్ పాలనలో 60 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేదు. నేతన్న నేస్తం అంటూ జగన్ మోసం చేసాడు. సొంత మగ్గం ఉంటేనే నేతన్న నేస్తం అంటూ కండిషన్స్ పెట్టాడు. జగన్ పాలనలో ఆప్కో ని భ్రష్టు పట్టించాడు. ఆప్కో భారీగా బకాయిలు పడింది.  మార్కెట్ తో లింక్ చేసినప్పుడు మాత్రమే చేనేత కార్మికులకు మేలు జరుగుతుంది. చేనేత ను కాపాడటమే టిడిపి లక్ష్యం. హ్యాండ్ లూమ్ లో కూడా అధునాతన టెక్నాలజీ వచ్చింది. చేనేత కార్మికుల శ్రమ తగ్గే అవకాశం ఉంది.

హ్యాండ్లూమ్ వస్త్రాలకు బ్రాండింగ్ కల్పిస్తాం

హ్యాండ్ లూమ్, పవర్ లూమ్ కి మధ్య తేడా తెలిసేలా ప్రత్యేక బ్రాండింగ్ తీసుకురావడం కోసం  కార్యాచరణ రూపొందిస్తాం. హ్యాండ్ లూమ్ ఉన్న చోట పవర్ లూమ్ పెట్టకుండా నిబంధనలు రూపొందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజకీయాలకు అతీతంగా చేనేత గుర్తింపు కార్డులు అందజేస్తాం. పట్టు రైతుల దగ్గర నుండి చేనేత లో రంగుల అద్దే కార్మికుల వరకూ అందరినీ ఆదుకుంటాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదరణ పథకం తిరిగి ప్రారంభించి సబ్సిడీ లో పనిముట్లు అందజేస్తాం. మంగళగిరి లో టాటా కంపెనీ తో ఒప్పందం చేసుకొని ఒక పైలట్ ప్రాజెక్టు చేస్తున్నాం. మెరుగైన వసతులతో షెడ్లు నిర్మాణం చేసి చేనేత కార్మికులు అక్కడికి వచ్చి చీరలు నేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. తయారైన చీరలు టాటా ద్వారా విక్రయిస్తున్నాం. ఒక వేళ ఆ ప్రాజెక్టు సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి చేనేత ఉత్పత్తుల ను మార్కెట్ కి లింక్ చేసి కార్మికులకు లబ్ధి చేకూరేలా చేస్తాం.

చేనేత కార్మికులు మాట్లాడుతూ…

హ్యాండ్ లూమ్ టెక్నాలజీ చదువుకున్న విద్యార్థులకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదు. మగ్గం నేసే వారిని మాత్రమే చేనేత కార్మికులుగా గుర్తిస్తున్నారు. నేత లో ఉన్న ఇతర కార్మికులను కూడా గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చెయ్యాలి. జగన్ పాలనలో చేనేత కు వచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. చేనేత కార్మికుల కుటుంబం మొత్తం రోజంతా కష్టపడితే రూ.500 కూడా రాని పరిస్థితి. చేనేత కు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చెయ్యాలి. జగన్ పాలనలో రుణాలు అందడం లేదు. జగన్ పాలనలో చేనేత ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వెంకటగిరి చేనేత ఉత్పత్తులను అమ్మడానికి ఒక కాంప్లెక్స్ కావాలి. చేనేత కార్మికులకు పెన్షన్ తో పాటు ఆరోగ్య భద్రత కల్పించాలి. పవర్ లూమ్, హ్యాండ్ లూమ్ ఉత్పత్తుల మధ్య తేడా తెలిసేలా ప్రత్యేక బ్రాండింగ్ ఉండేలా చూడాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు కూడా మాకు రావడం లేదు.

క్రైస్తవులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేస్తాం!రాష్ట్రాభివృద్ధికి మీ వంతు సహకారం అందించండి

ఎపిని నెం.1 చేయడమే చంద్రబాబునాయుడు లక్ష్యంక్రైస్తవులతో ముఖాముఖిలో యువనేత లోకేష్

వెంకటగిరి: మైనారిటీ కార్పొరేషన్ నుంచి రెండుగా విభజించి, క్రిస్టియన్లకు ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటుచేయడం ద్వారా క్రైస్తవ సోదరులకు న్యాయం చేస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. వెంకటగిరి నియోజకవర్గం డక్కిలిలో క్రైస్తవ మతపెద్దలతో యువనేత ముఖాముఖిలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ… మైనారిటీ కార్పొరేషన్ ను విభజించాలని మేము ప్రధానంగా ఆలోచిస్తున్నాం. దీని ద్వారా ముస్లిములు, క్రైస్తవులకు వేర్వేరు కార్పొరేషన్ ఉంటుంది. ఈ కార్పొరేషన్ ద్వారా శ్మశానాలు, చర్చిలకు స్థలాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కార్పొరేషన్ ద్వారా పాస్టర్లకు గౌరవవేతనం ఇవ్వడానికి అవకాశం లభిస్తుంది. ఏపీని అన్ని విధాలుగా నంబర్ వన్ చేసే మా ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని కోరుతున్నా. ఎపిని నెం.1 చేయడమే చంద్రబాబు లక్ష్యం. అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు కల్పించడంలో చంద్రబాబు బ్రాండ్ ను నిరూపిస్తాం.

పాస్టర్లకు అండగా నిలుస్తాం!

స్థానికంగా సమస్య వస్తే స్పందించే వారు కరువయ్యారు. పాస్టర్లకు అండగా ఉండేందుకు పార్టీ అనుబంధ విభాగాలను బలోపేతం చేస్తాం. ఈ బాధ్యతను చంద్రబాబు నాకు అప్పగించారు. పాస్టర్లకు అన్నివేళలా నేను అందుబాటులో ఉంటాను, ఏ సమస్య ఉన్నా నాతో చెప్పుకోవచ్చు. సంఘాల ఆస్తులను పరిరక్షించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. పాస్టర్లకు పెన్షన్లు ఇవ్వడం, తీసేయడంలో రాజకీయ జోక్యం అధికమైంది. ఓ పాస్టర్ రూ.30వేలు పెట్టి కారు కొంటే, దాన్ని ఆధారంగా చేసుకుని పెన్షన్ రద్దు చేశారు. వెంకటగిరి ప్రాంతంలో పరిశ్రమలు తీసుకురావాలనే బలమైన ఆలోచనతో ఉన్నాం. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను తెచ్చి క్రిస్టియన్ మైనారిటీలకు కూడా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఏపీపీఎస్సీ ని యూపీఎస్సీలా బలోపేతం చేసి, క్రమశిక్షణ మార్గంలో నడిపిస్తాం, క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తాం.స్వయం ఉపాధి అవకాశాలు కూడా పెద్దఎత్తున ప్రోత్సహించి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం.

20లక్షల ఉద్యోగాలిస్తాం!

చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో సీఎం అయ్యాక 20లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. క్రిస్టియన్ మైనారిటీలతో మూడు నెలలకు ఒకసారి మీటింగ్ నిర్వహించి, సంబంధిత మంత్రి, అధికారులతో చర్చించి పాస్టర్ల సమస్యలను పరిష్కరిస్తాం. సమాజ అభివృద్ధిలో పాస్టర్లు కూడా భాగస్వామ్యం కావాలి. పెళ్లి రిజిస్ట్రేషన్ విధానంలోనూ కొత్త విధానాలను తెచ్చి పాస్టర్లకు సహకరిస్తాం. పాస్టర్లు అడిగిన విధంగా ఐడీకార్డులు ఇస్తాం, గౌరవవేతనం ఇచ్చి క్రైస్తవుల పట్ల మా చిత్తశుద్ధిని నిరూపించుకుంటాం. సమాజం కలిసికట్టుగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండేందుకు అవసరమైన కార్యక్రమాలు మేం చేపడతాం. క్రైస్తవుల ప్రధాన సమస్య శ్మశానవాటిక. దీనిపై రాష్ట్రమంతా అధ్యయనం చేసి ఎంత భూమి ఎక్కడ కొనుగోలు చేయాలి/ సేకరించాలో నివేదిక తీసుకుని శ్మశానాలు ఏర్పాటు చేస్తాం. పాస్టర్లు స్వతంత్రంగా తమ సమస్యలను తామే పరిష్కరించుకునే వేదికను ఏర్పాటు చేస్తాం.

క్రైస్తవ మత పెద్దలు మాట్లాడుతూ…

లూథరన్ చర్చికి చెందిన వేలకోట్ల ఆస్తులను వైసిపి నాయకులు కబ్జా చేసి, అన్యాక్రాంతం చేసి అమ్మేశారు. క్రిస్టియన్ మైనారిటీల ఆస్తుల పరిరక్షణ, సంక్షేమంపై దృష్టిపెట్టాలి.మా ప్రాంతంలో క్రైస్తవులకు శ్మశానం, కమ్యూనిటీహాలు లేదు. స్థానిక నాయకులు పక్షపాతంగా వ్యవహరించి పాస్టర్లను అవమానిస్తున్నారు, సమస్యలు సృష్టించి వేధిస్తున్నారు. వెంకటగిరిలో మేము గతంలో మగ్గాల పని చేసుకునే వాళ్లం. గిట్టుబాటు కాకపోవడంతో మగ్గాల పనికూడా నిలిపేసి, కూలి పనులకు వెళ్లాల్సి వస్తోంది, పెన్షన్ పునరుద్ధరించి ఆదుకోవాలని కోరారు.

*ఎన్టీఆర్ బొమ్మ ఉందని ఇళ్లపనులు నిలిపివేశారు!*

*లోకేష్ ఎదుట డక్కిలి ఎన్టీఆర్ కాలనీ వాసుల ఆవేదన*

వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి ఎన్టీఆర్ కాలనీని యువనేత నారా లోకేష్ సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ… 2015-16లో 60మందికి ఇక్కడ ఇళ్లు మంజూరు చేశారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాకు బిల్లులు ఇవ్వకుండా పనులను అర్థంతరంగా నిలిపేశారు. మాకు బిల్లులు ఇప్పించి రోడ్లు, నీళ్లు, కరెంటు సౌకర్యం కల్పించాలని వైసిపి నాయకులను అడిగితే, ఇక్కడ ఉన్న ఎన్టీఆర్ బొమ్మ కూల్చేస్తే సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మేం అభిమానంతో ఏర్పాటుచేసుకున్న విగ్రహాన్ని కూల్చబోమని ఖరాకండీగా చెప్పాం. దీంతో గత నాలుగేళ్లుగా మాకు ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బంది పెడుతున్నారు.

నారా లోకేష్ స్పందిస్తూ

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకానికి డక్కిలి ఎన్టీఆర్ కాలనీ పరాకాష్ట. ఎన్టీఆర్ బొమ్మ కూల్చేస్తే సౌకర్యాలు కల్పిస్తామనడం శాడిస్టు లక్షణాలు కాదా? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్థంతరంగా నిలిచిపోయిన 2లక్షల ఇందిరమ్మ ఇళ్లకు మేం అదనంగా ఆర్థిక సాయం అందించి పూర్తిచేశాం. పేదలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సైకో ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డక్కిలి ఎన్టీఆర్ కాలనీ ప్రజలకు సకలసౌకర్యాలతో ఇళ్లు పూర్తిచేసి అందిస్తుంది.

నారా లోకేష్ ను కలిసిన లింగసముద్రం ప్రజలు

వెంకటగిరి నియోజకవర్గం లింగసముద్రం పంచాయతీ నాయుడుపాళెం, చాకలపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. చాకలపల్లి అరుంధతీవాడలో తాగునీటి స్కీము ప్రతి 10రోజులకు ఒకసారి రిపేరు వచ్చి, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. తెలుగుగంగ మెయిన్ కాలువ 34.290 కిలోమీటరు వద్ద ఓటీ స్లూయస్ ను గత ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక స్లూయిజ్ పనులను పట్టించుకోలేదు. నాయుడుపాళెం, చాకలపల్లి, పాతనాలపాడు, కొత్తనాలపాడు, మోపూరు కెబిపల్లి, యల్లావజ్జులపల్లి గ్రామాల రైతులం బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం. ఓటీ స్లూయస్ మరియు కాలువ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నాం. తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దోచుకోవడంతప్ప రైతుల సంక్షేమంపై శ్రద్ధ లేదు. గత TDP ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.68,294కోట్లు ఖర్చు చేశాం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్లూయస్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. రక్షతనీటి పథకానికి రిపేర్లు పూర్తిచేసి, తాగునీటి సమస్యలేకుండా చేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన మిట్టపాళెం గ్రామస్తులు

వెంకటగిరి నియోజకవర్గం మిట్టపాళెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు మా గ్రామంలో చాలా సంవత్సరాలుగా వీధిరోడ్లు లేవు. తాగునీటికి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. మా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. మా గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే తాగునీటి సమస్య తొలగిపోతుంది. కరెంటు కోతలతో సతమతమవుతున్నాం.

*నారా లోకేష్ స్పందిస్తూ…*

గత టిడిపి ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 25వేల కి.మీ. సిసి రోడ్లు వేశాం. 30లక్షల ఎల్ ఈ డి వీధిలైట్లు ఏర్పాటుచేశాం. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. ఎన్టీఆర్ సుజల ద్వారా మిట్టపాళెంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేస్తా.

Also, Read This Blog :Step towards great future by the significance of Yuvagalam

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *