Nara lokesh padayatra,Yuvagalam
Nara lokesh padayatra,Yuvagalam

నాయుడుపేటలో నాయుడు గారి అబ్బాయ్ కి ఘన స్వాగతం అడుగడుగునా జనప్రభంజనం… హారతులతో మహిళల నీరాజనం నాయుడుపేటలో బహిరంగసభకు కిక్కిరిసిన జనసందోహం

సూళ్లూరుపేట: రాష్ట్రంలో అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్రకు నాయుడుపేటలో అనూహ్యస్పందన లభించింది. యువగళం పాదయాత్ర నాయుడుపేటకు చేరుకోగానే వీధులన్నీ జనసంద్రంగా మారాయి. నాయుడుపేటలో టిడిపి నాయకులు, కార్యకర్తలు లోకేష్ కు ఘనస్వాగతం పలికారు. యువనేతని చూసేందుకు మహిళలు, యువత, వృద్ధులు భారీగా రోడ్లపైకి తరలివచ్చారు. నాయుడుపేట గాందీమందిరం సెంటర్ లో నిర్వహించిన బహిరంగసభకు జనం కిక్కిరిసిపోయారు. రోడ్లకు ఇరువైపులా భవనాలపై నిలబడిన జనం లోకేష్ కు అభివాదం చేశారు. 137వరోజు యువగళం పాదయాత్ర మేనకూరు శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా తనను కలిసేందుకు వచ్చి వివిధ వర్గాల ప్రజలను యువనేత ఓపికగా కలుస్తూ, ఆప్యాయంగా పలకరించి జగన్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు, నిత్యావసర సరుకుల ధరలు, పన్నులు భారం తగ్గించాలని మహిళలు యువనేతను కలిశారు. నాయుడుపేటలో స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ దృష్టికి తెచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తామని భరోసా ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక విద్యుత్ బిల్లులు జగన్ 9 సార్లు పెంచాడు, అర్దం లేని పేర్లు పెట్టి ప్రజల్ని దోచేస్తున్నాడు. దేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపి నంబర్ 1 గా ఉంది. అన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గించినా జగన్ మనస్సు కరగలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గిస్తామని తెలిపారు. తాగునీరు, డ్రైనేజ్, రోడ్లు వంటి సమస్యలను నాయుడుపేట ప్రజలు లోకేష్ దృష్టికి తేగా, అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నాయుడుపేటలో యువనేత లోకేష్ పాదయాత్ర చేస్తున్న మార్గమధ్యలో వైసిపినాయకులు రెచ్చగొట్టే నినాదాలతో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడంపై టిడిపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. నాయుడుపేట గడియారం వీధి పోలీస్ స్టేషన్ సమీపంలో జగన్ ను పేదవాడిగా చూపుతూ చంద్రబాబుపై యుద్దం ప్రకటిస్తున్నట్లుగా వైసిపి నేతల ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. జగనన్నే మా భవిష్యత్తు పేరుతో మున్సిపల్ చైర్మన్ కటకం దీపిక అనుచరుల ఆధ్వర్యంలో మరోచోట ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు.  ఫ్లెక్సీల వద్ద భారీసంఖ్యలో పోలీసు అధికారుల కాపలాగా నిలచారు, టిడిపి కార్యకర్తలపై సిఐ కృష్ణారెడ్డి ఓవరాక్షన్ చేశారు. చంద్రబాబునాయుడును విమర్శిస్తూ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని కార్యకర్తలు చించివేయడంతో  టిడిపి కార్యకర్తలపై పోలీసులు లాఠీలతో ఎగబడ్డారు. అనంతరం పార్టీ పెద్దలు సర్దిచెప్పి కార్యకర్తలను అక్కడనుంచి పక్కకు తీసుకెళ్లారు. 137వరోజు యువనేత లోకేష్ 16.1 కి.మీ దూరం పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1786.8 కి.మీ. మేర పూర్తయింది. సోమవారం యువగళం పాదయాత్ర గునపాటిపాలెం వద్ద గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.

పుణ్యభూమి సూళ్లూరుపేట

సూళ్లూరుపేట యూత్ పవర్ సూపర్. చెంగాళమ్మ దేవాలయం ఉన్న పుణ్య భూమి సూళ్లూరుపేట స్పేస్ రీసెర్చ్ లో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఇక్కడ ఉంది. నేలపట్టు లో పక్షులు, పులికాట్ సరస్సు లాంటి ప్రకృతి అందాలు సూళ్లూరుపేట సొంతం. పవిత్ర నేల సూళ్లూరుపేట గడ్డపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

పిల్లాడిని పెట్రోలు పోసి తగులబెడతారా?

వైసీపీ ఏపీని పాత బీహార్ లా మార్చేసాడు. గంటకో మర్డర్..పూటకో రేప్.  15 ఏళ్ల పిల్లాడిని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తే సీఎం స్పందించలేదు. అమర్నాధ్ గౌడ్ చేసిన తప్పేంటి? తన అక్కని వేధిస్తున్న వైసిపి కార్యకర్త వెంకటేశ్వర రెడ్డి ని అడ్డుకున్నాడు. వైసిపి సైకో గ్యాంగ్ అమర్నాధ్ పై దాడి చేసి కాళ్ళు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేసారు. అమర్నాధ్ గౌడ్ బీసీ కాబట్టే జగన్ కుటుంబాన్ని పరామర్శించాడనికి కూడా వెళ్లలేదు. బీసీలు అంటే జగన్ కి చిన్నచూపు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం.  అమర్నాధ్ గౌడ్ ని చంపిన వారిని కఠినంగా శిక్షిస్తాం.

మహిళలను నమ్మించి మోసం చేసారు!

సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ లాంటి జే బ్రాండ్లు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు.

కష్టాలు తీర్చేందుకే భవిష్యత్తుకు గ్యారంటీ!

మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ముగ్గురు పిల్లలు ఉంటే రూ.45 వేలు.3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. జగన్ యువత కు అనేక హామీలు ఇచ్చి చీట్ చేసాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

అన్నదాతలను ఆదుకుంటాం!

జగన్  పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. మీటర్లు రైతులకు ఉరితాళ్లు.రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. సబ్సిడీ లో డ్రిప్ ఇరిగేషన్ అందిస్తాం. జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. జీతం ఒకటో తారీఖున వచ్చే దిక్కు లేదు.  పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది.

బిసిల రక్షణకు చట్టం తెస్తాం!

బీసీలు పడుతున్న కష్టాలు నేను చూసాను. 26 వేల అక్రమ కేసులు, నిధులు, విధుల్, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డ్రైవర్ సుబ్రమణ్యం వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం.

మైనారిటీలనూ ముంచేశాడు!

అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హాజిరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. బిజెపి తో పొత్తులో ఉన్నా మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీట వేసింది టిడిపి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పధకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో మీరు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నారు. ఇప్పుడు మీకు కనీస గౌరవం అయినా ఉందా. నాడు-నేడు అన్ని సామాజిక వర్గాలకు సమాన గౌరవం ఇచ్చింది ఒక్క టిడిపి మాత్రమే.

నెల్లూరుజిల్లాలో గత ప్రభుత్వంలోనే అభివృద్ధి

2014 లో మాకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టిడిపి కి మూడు సీట్లే ఇచ్చారు. అయినా నెల్లూరు జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసాం. సాగు, తాగునీటి ప్రాజెక్టులు, టిడ్కో ఇళ్లు నిర్మించాం.  ఒక్క నెల్లూరు సిటీ ని అభివృద్ధి చెయ్యడానికే 4,500 కోట్లు ఖర్చు చేసాం. ఇది నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్.  నెల్లూరు సిటీ లో వెయ్యి కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తే. నాలుగేళ్లలో 100 కోట్లు ఖర్చు చేసి పూర్తి చెయ్యలేని వేస్ట్ ప్రభుత్వం మీది. ఒక్క నెల్లూరు టౌన్ లోనే 17 వేల టిడ్కో ఇళ్లు కట్టాం. నెల్లూరు బ్యారేజ్ 90 శాతం, సంగం బ్యారేజ్ 70 శాతం, ఎస్ఎస్ కెనాల్ పనులు ప్రారంభించాం. కోపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న 70 వేల ఎకరాల్లో రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చాం. తెలుగుగంగ ప్రాజెక్టు కింద 2.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే అటవీ అనుమతులు లేక కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేది.  టిడిపి హయాంలో కేంద్ర ప్రభుత్వం తో పోరాడి అటవీ అనుమతులు తీసుకోని అదనంగా జిల్లాలో మరో 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం.

టిడిపి హయాంలోనే నెల్లూరుకు పరిశ్రమలు

టిడిపి హయాంలో నెల్లూరు జిల్లాకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. 73 పరిశ్రమలు వాటి ద్వారా 18 వేల కోట్ల పెట్టుబడి, 32 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. గమేషా విండ్ టర్బైన్స్, ధర్మల్ పవర్ టెక్, సీపీ ఆక్వాకల్చర్, ఫెడోరా సీ ఫుడ్స్, అంజని టైల్స్, ఇండస్ కాఫీ ప్రై.లి, సౌత్ ఇండియా కృష్ణా ఆయిల్ అండ్ ఫాట్స్ ప్రై.లి, జెల్ కాప్స్ ఇండస్ట్రీస్, యూపీఐ పాలిమర్స్, పిన్నే ఫీడ్స్, బాస్ఫ్ ఇండియా లి., దొడ్ల డెయిరీ, పెన్వేర్ ప్రొడక్ట్స్ ప్రై.లి, అమరావతి టెక్స్ టైల్స్,అరబిందో ఫార్మా, ఓరెన్ హైడ్రోకార్బోన్స్ లాంటి ఎన్నో కంపెనీలు వచ్చాయి. నెల్లూరు జిల్లా కి చంద్రబాబు గారు చేసింది జగన్ చెయ్యాలంటే నాలుగు జన్మలెత్తాలి.  2019 లో ప్రజలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 కి 10 సీట్లు వైసిపి కి ఇచ్చారు. ఈ పది మంది ఎమ్మెల్యేలకు ఛాలెంజ్ చేస్తున్నా మీరు చేసిన అభివృద్ది, తెచ్చిన కంపెనీ ఒక్కటి ఉంటే చెప్పండి. నెల్లూరు జిల్లా ని వైసిపి నేతలు నాశనం చేసారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేసారు.

బహిరంగచర్చకు సిద్ధం…రా తేల్చుకుందాం!

జగన్ పాలనలో మూడు కీలక పోస్టులు నెల్లూరు జిల్లాకి వచ్చాయి. హాఫ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఇరిగేషన్ మంత్రి అయ్యాడు. ఆయనకి పని తక్కువ తక్కువ…డైలాగులు ఎక్కువ. జిల్లాలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేసాడా?  ఈ సిల్లీ బచ్చా నాకు ఛాలంజ్ చేస్తాడట. నీ సీటు జగన్ ఆల్రెడీ చింపేసాడు బ్రదర్.  చర్చ అంటూ సరదా పడుతున్నాడు అంట. రా..రా..రా వచ్చేయ్. నాయుడుపేటలోనే తిరుగుతున్నా. ఇక్కడే నువ్వు దోపిడీ సొమ్ము, బినామీల పేరుతో వేసిన రూ.100 కోట్ల అక్రమ లే అవుట్ ఉంది కదా. షుగర్ ఫ్యాక్టరీ పక్కన ఉన్న నీ వంద కోట్ల లే అవుట్ లో చర్చించుకుందాం.

కోర్టు దొంగకు రైతుల సమస్యలు పట్టవు!

కోర్టు దొంగ వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాడు. ఆయన 8 కేసుల్లో నిందితుడు. రైతుల సమస్యలు పట్టించుకోడు. కల్తీ మద్యం మీద ఆయనకి ఫుల్లు అవగాహన ఉంది. కల్తీ విత్తనాల మీద అవగాహన లేదు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే ఈయన కల్తీ లిక్కర్ తయారీ లో బిజీగా ఉంటాడు. ఈయన వలన జిల్లాలో ఒక్క రైతుకి న్యాయం జరగలేదు. ఇక మరో కీలక శాఖ పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతమ్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. ఆయన మన మధ్య లేరు. పాపం ఆయన కంపెనీలు తేవాలి అని ప్రయత్నం చేసినా జగన్ పరిపాలన చూసి ఎవరూ రాలేదు. నెల్లూరు జిల్లా కి ఒక్క పరిశ్రమ రాలేదు. మూడు కీలక శాఖలు నెల్లూరు జిల్లాకి వచ్చింది గుండు సున్నా. 2019 లో వైసిపి ఇచ్చిన పది సీట్లు మాకు ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో మేము చూపిస్తాం.

అక్రమాలకు అడ్డాగా మార్చేసిన సంజీవయ్య

అక్రమ ఇసుక రవాణా, గ్రావెల్ దందా, అక్రమ బియ్యం రవాణా, లిక్కర్ దందా, గంజాయి, క్రికెట్ బెట్టింగ్ కి సూళ్లూరుపేట ని అడ్డాగా మార్చేసారు ఎమ్మెల్యే సంజీవయ్య.  ఆయన్ని నియోజకవర్గం లో ముద్దుగా కమల్ హాసన్ అని పిలుస్తారట. బయట నటన అంత బాగుంటుంది అంట. కానీ ఇంట్లోకి వెళ్లగానే అపరిచితుడు లా మారిపోయి ఇచ్చిన హామీలు అన్ని మర్చిపోతారట. సూళ్లూరుపేట కమల్ హాసన్ గారి నటనకి పడిపోయి అప్పులు చేసి మరీ 2 సార్లు గెలిపించుకున్న కార్యకర్తలు, నాయకులు గెలిపించుకున్నారు. ఇప్పుడు ఆయన నిజస్వరూపం తెలుసుకొని అందరూ జంప్ అవుతున్నారు. సంజీవయ్య గారి అనుచరుడు అనిల్ కుమార్ రెడ్డి క్రికెట్ బెట్టింగ్, గంజాయి మాఫియాని నడుపుతున్నాడు. ఇతను గతంలోనే క్రికెట్ బెట్టింగ్ లో 6 నెలలు జైల్లో ఉన్నాడు. సూళ్లూరుపేట కమల్ హాసన్ గారు అనుచరులతో కలిసి శ్రీ సిటీ బార్డర్ లో పేకాట క్లబ్బులు కూడా నిర్వహిస్తున్నారు.  సూళ్లూరుపేట కమల్ హాసన్ కరోనా ని కూడా క్యాష్ చేసుకున్నారు. శ్రీసిటీ, మేనకూరు సెజ్ ల్లో ఉన్న కంపెనీల దగ్గర డబ్బులు వసూలు చేసి మింగేసారు.

తమిళనాడుకు అక్రమ ఇసుక రవాణా

సూళ్లూరుపేట కమల్ హాసన్ సొంత రైస్ మిల్లు నుండే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తమిళనాడుకి తరలిస్తున్నారు. స్వర్ణముఖి, కాళింగనది ని ఏటిఎస్ లా ఎనీ టైం శాండ్ గా మార్చుకున్నారు. ఇసుక ను అక్రమంగా తమిళనాడుకి తరలిస్తున్నారు. శిరసనంభేడు కొండ కి గుండు కొట్టారు. కోట్ల రూపాయల గ్రావెల్ దోచేసారు.. కర్ణాటక మద్యం తెచ్చి అనుచరులు అమ్మేస్తున్నారు. అనుచరుడి బార్ కోసం ఏకంగా జగన్ లిక్కర్ షాపులనే మూయించేసాడు సూళ్లూరుపేట కమల హాసన్ నియోజకవర్గం లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలి అన్నా సూళ్లూరుపేట కమల హాసన్ కి కప్పం కట్టాల్సిందే. కాంట్రాక్టర్లు పర్శంటేజి ఇవ్వాల్సిందే.

నాయుడుపేటలో రూ.100 కోట్ల అక్రమ లేఅవుట్లు

నాయుడుపేట లో హాఫ్ నాలెడ్జ్ మాజీ మంత్రి, బెట్టింగ్ రాజు రూప్ కుమార్ తో కలిసి 100 కోట్లు విలువ చేసే అక్రమ లే అవుట్లు వేసారు. సూళ్లూరుపేట ముంపు ప్రాంతాల్లో కరెంట్ పోల్స్ సైతం మునిగిపోయే ప్రాంతాల్లో అక్రమ లే అవుట్లు వేస్తున్నారు. పులికాట్ సరస్సులో తెలుగు జాలర్ల పై దాడులు చేస్తుంటే కనీసం పట్టించుకోలేదు. పైగా న్యాయం చెయ్యమని అడిగిన మత్స్యకారులను కుక్కలతో పోల్చి అవమానించాడు సూళ్లూరుపేట కమలహాసన్. కాళంగి, స్వర్ణముఖి నదులు ఉన్నా నియోజకవర్గం ప్రజల దాహం తీర్చడం వీళ్లకి చేతకాలేదు.

సూళ్లూరుపేటలో అభివృద్ధి గుండుసున్నా!

సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల్లో అభివృద్ధి గుండుసున్నా. టిడిపి హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా పేదవారిని వేధించారు. సూళ్లురూపేటలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మిస్తామని మోసం చేసారు. కాళంగి నదిలోకి సముద్రపు బ్యాక్ వాటర్ వచ్చి నీరు ఉప్పుగా మారడంతో ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. తెలుగుగంగ కాలువలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చాడు. పులికాట్ సరస్సు లో పూడిక తీస్తామని హామీ ఇచ్చాడు. చెంగాళమ్మ దేవాలయం వద్ద కాళంగి నది పై బ్రిడ్జ్ నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చాడు. ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. ఈ సమస్యలు అన్ని టిడిపి ప్రభుత్వం వచ్చిన పరిష్కరిస్తాంపులికాట్ ముఖద్వారం వద్ద పూడిక తియ్యాలని మత్స్యకారులు కోరుతున్నారు,  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పూడిక తీస్తాం.

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం!

టిడిపి అధికారంలోకి వచ్చాక పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. టిడిపి కార్యకర్తల్ని, నాయకుల్ని వేధించిన ఏ ఒక్కరిని వదిలి పెట్టను. సూళ్లూరుపేటలో ఉన్నా సింగపూర్ పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా. సాగనిస్తే పాదయాత్ర…అడ్డుకుంటే దండయాత్ర.  తగ్గేదే లేదు…అడ్డుకోవడానికి వచ్చిన వారిని నాలుగు తన్ని పంపించాం. వెధవ పనులు చేస్తున్న వైసిపి నాయకుల్ని వదిలి పెట్టను. వడ్డీ తో సహా చెల్లిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన వడ్డికుంట కండ్రిగ గ్రామస్తులు

సూళ్లూరుపేట నియోజకవర్గం వడ్డికుంట కండ్రిగ గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. TDP పాలనలో కట్టుకున్న ప్రభుత్వ ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు నిలిపేసింది. ప్రస్తుతం ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి కొత్త ఇల్లు మంజూరు చేయడం లేదు. పేద, మధ్య తరగతి ప్రజలు నేటి పరిస్థితుల్లో ఇల్లు కట్టుకోలేని ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు. అత్తివరం-నాయుడపేట మెయిన్ రోడ్డు ఏపీఐఐసీ జోన్ లో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక ఏపీఐఐసీ జోన్ లో 4లైన్ల రోడ్డు నిర్మించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అడ్డగోలు దోపిడీపై ఉన్న శ్రద్ధ పేదల గూడుపై లేదు. సెంటుపట్టా పేరుతో ఆవాసానికి పనికిరాని ఇంటిస్థలాలను అంటగట్టి రూ.7వేల కోట్లు దోచుకున్నారు. గత ప్రభుత్వంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు మంజూరు చేయకపోవడం దారుణం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్థంతరంగా నిలచిపోయిన 2లక్షల ఇందిరమ్మ ఇళ్లకు గత టిడిపి ప్రభుత్వంలో అదనపు ఆర్థికసాయం అందించి పూర్తిచేశాం. టిడిపి అధికారంలోకి వచ్చాక ఇల్లులేని ప్రతి పేదవాడికి ఇళ్లు నిర్మించి ఇస్తాం. ఎపిఐఐసి జోన్ లో ప్రమాదాలు జరగకుండా ప్రత్యామ్నాయంగా రోడ్డునిర్మిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన తిమ్మాజి కండ్రిగ గ్రామస్తులు

సూళ్లూరుపేట నియోజకవర్గం తిమ్మాజీ కండ్రిగ గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలోని స్వర్ణముఖి నదిపై చెక్ డ్యామ్ నిర్మించాలి. మా పొలాలు సాగుచేసుకునేందుకు మోటార్లు, పైపులైన్లు ఏర్పాటు చేయాలి. మా గ్రామంలో కమ్యూనిటీ హాలు నిర్మించాలి. మా గ్రామం నుండి నాయుడుపేట వెళ్లే దారిని బాగుచేయించాలి. గత పాలనలో వేసిన వీధి దీపాలు కొన్ని చెడిపోయాయి, వాటిని రిపేరు చేయించాలి. గ్రామంలోని ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి.

*నారా లోకేష్ స్పందిస్తూ…*

జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. టిడిపి హయాంలో చెరువుల్లో పూడికతీత, గొలుసుకట్టు చెరువుల అభివృద్ది, చెక్ డ్యామ్ ల నిర్మాణానికి రూ.18,265 కోట్ల రూపాయల ఖర్చుచేశాం. తిమ్మాజీ కండ్రిగ గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు చెక్ డ్యామ్ నిర్మించి, సాగునీరు అందజేస్తాం. గ్రామంలో కమ్యూనిటీ హాలు, వీధిలైట్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ఎస్సీ, ఎస్టీలకు ఇళ్లస్థలాలతో పాటు, పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం.

లోకేష్ ను కలిసిన నాయుడుపేట నక్కల సామాజికవర్గీయులు

సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట నక్కల సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మేము ఎస్టీ నక్కల సామాజికవర్గానికి చెందిన వాళ్లం. మేం నాయుడుపేట పట్టణ ప్రభుత్వ స్థలంలో 40ఏళ్లుగా ఉంటున్నాం. వైసీపీ పాలనలో మాపై దాడులు చేసి, రోడ్డమీదకు ఈడ్చారు. గిరిజనులమైన మాకు బ్రతకడమే కష్టతరంగా మారింది. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. మాకు రాజకీయ పదవుల్లో ప్రాధాన్యతనివ్వాలని కోరుతున్నాం.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీకి ఓట్లేసి గెలిపించినందుకు ఎస్సీ, ఎస్టీలపైనే ఈ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నక్కల సామాజికవర్గీయులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం. నక్కల సామాజికవర్గీయులు చిరువ్యాపారులు చేసుకునేందుకు సబ్సిడీ రుణాలు అందజేస్తాం. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

*నారా లోకేష్ ను కలిసిన మార్లపల్లి మిట్ట గ్రామస్తులు

సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం మార్లపల్లిమిట్ట గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 800కుటుంబాలు నివాసముంటున్నాం. 150 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు లేవు, స్థలాలు ఇప్పించాలి. గ్రామంలో తాగునీరు వారానికి ఒకసారి మాత్రమే వస్తున్నాయి, రెండుసార్లు అయినా ఇచ్చి నీటి సమస్యను పరిష్కరించాలి. టీడీపీ పాలనలో మా గ్రామంలో కరెంటు లైన్లు వేశారు. వైసీపీ ప్రభుత్వం వాటికి మరమ్మతులు కూడా చేయించడం లేదు. మా గ్రామంలో వైసీపీ నేతలు అమాయకులపై దాడులకు పాల్పడుతున్నారు, అరికట్టాలి. మా గ్రామానికి సాగు, తాగు నీటి కోసం కొత్త పైపులైన్లు నిర్మించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

ఇళ్లుకాదు, ఊళ్లు నిర్మిస్తున్నామని చెబుతున్న జగన్… నిజమైన నిరుపేదలను గాలికొదిలేశారు. ఇచ్చిన పనికిరాని స్థలాలను కూడా వైసిపి వారికే ఇచ్చుకున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక గ్రామీణాభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారు. పంచాయతీలకు చెందిన రూ.8,600కోట్లను జగన్ దారిమళ్లించాడు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఇళ్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం. ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేసి, 24/7 తాగునీరు అందిస్తాం. అమాయకులపై తప్పుడుకేసులు పెట్టి వేధించే అరాచకశక్తులపై ఉక్కుపాదం మోపుతాం.

Also, Read This Blog :Revolution on the Move: Yuvagalam Padayatra Shaping Youth Activism

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *