Nara Lokesh Padayatra

1700 కి.మీ. మైలురాయికి చేరిన యువగళం డక్కిలిలో ఆప్కో హ్యాండ్లూమ్ ఫ్యాక్టరీకి శిలాఫలకం రాపూరులో యువగళానికి పోటెత్తిన జనం! సమస్యలు చెప్పుకునేందుకు భారీగా రోడ్లపైకి వచ్చిన ప్రజలు

 వెంకటగిరి:  రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా జనగళమే యువగళమై ప్రభంజనంలా సాగుతున్న యువగళం పాదయాత్ర ఈరోజు తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలిలో 1700 కి.మీ. మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా డక్కిలిలో ఆప్కో హ్యాండ్లూమ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు హామీ ఇస్తూ, యువనేత లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనివల్ల ఈ ప్రాంత చేనేతలకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. 132వరోజు యువగళం పాదయాత్రకు రాపూరులో జనం పోటెత్తారు. లోకేష్ ని కలిసి సమస్యలు చెప్పుకునేందుకు మహిళలు, యువత, వృద్దులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, గ్యాస్ ధర పెంచేశారని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే చాలీచాలని ఆదాయంతో బ్రతకడం కష్టంగా మారిందని లోకేష్ వద్ద వాపోయారు.  శాడిస్టు ముఖ్యమంత్రి జగన్ పేద వారిని హింసించి జగన్ ఆనంద పడతాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తాం, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చెప్పారు. డక్కిలిలో తటస్థ ప్రముఖులతో నిర్వహించిన డిన్నర్ మీట్ లో వివిధ వర్గాల ప్రముఖులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తీసుకువచ్చారు. రాపూరు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర రాపూరు జంక్షన్, మద్దిమడుగు, సిద్ధవరం, మాదవాయపాలెం, వెలికల్లు, మర్లగుంట, డక్కిలి శివారు విడిది కేంద్రానికి చేరుకుంది. 132వరోజు యువనేత లోకేష్ 16.9 కి.మీ దూరం పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1703.7 కి.మీ. పూర్తయింది.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

తాగునీటి కోసం 3కిలోమీటర్లు వెళుతున్నాం! -జడపల్లి చంద్రయ్య, సంగనపల్లి గ్రామం

మా గ్రామంలో తాగునీటి సదుపాయం లేదు. రోజువారీ అవసరానికి చెరువునుండి నీరు వాడుకోవాల్సివస్తోంది. ఫలితంగా చర్మవ్యాధులు ప్రబలుతున్నాయి. గత్యంతరం లేక బోరునీళ్లు తాగాల్సివస్తోంది. భూగర్భజలాలు కలుషితమై నిత్యం అనారోగ్యాలకు గురవుతున్నాం. తాగునీటి సమస్యపై అధికారులు, నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ మా గురించి పట్టించుకోవడం లేదు. 3కిలోమీటర్ల దూరం వెళ్లి 20లీటర్ల మంచినీరు రూ.10లు పెట్టి కొని తెచ్చుకుంటున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించండి.

ఇంటి శ్లాబులు కూలే స్థితిలో ఉన్నాయి! -చిట్టేటి పెంచలయ్య, సంగనపల్లి గ్రామం.

1986-87 సమయంలో మా గ్రామ దళితవాడకు కాలనీ ఇచ్చారు. అప్పట్లో కట్టిన ఇళ్లు నేడు శిథిలావస్థకు చేరుకున్నాయి. శ్లాబులు పగిలిపోవడంతో వర్షాకాలంలో లీకై ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయి. తుపాన్ల సమయంలో ఇళ్లల్లో ఉండాలంటే భయంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మాకు కొత్త ఇళ్లు మంజూరు చేయాలని పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా, మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. మా కాలనీలో సుమారు 70 ఇళ్లు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక మాకు ఇళ్లు నిర్మించి ఇవ్వండి.

మేం చనిపోతే పాతిపెట్టడానికి శ్మశానం లేదు! -సంగనపల్లి.శంకరయ్య, సంగనపల్లి గ్రామం.

అందుబాటులో ఉన్న చెరువులో లేదా చెరువుగట్టు మీద పూడ్చిపెట్టాల్సిన దుస్థితి నెలకొంది. శ్మశానానికి వెళ్లే దారి మధ్యలో ఉన్న పంటకాలువలో  మెడలోతు నీళ్లలో గుండా శవాన్ని మోసుకెళ్తూ అవస్థలు పడుతున్నాం. మా పూర్వీకుల సమాధులు కూడా మేం చూసుకునే అవకాశం లేని దుస్థితిలో బ్రతుకుతున్నాం. మా కష్టాలు ఎవరికీ పట్టడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా ఎటువంటి ప్రయోజనం లేదు.

పాలసీలు తరచూ మారడం అభివృద్ధికి విఘాతం! టిడిపి ప్రభుత్వం వచ్చాక సరళతర లైసెన్సింగ్ విధానం బ్రాండింగ్ ద్వారా వెంకటగిరి చీరలకు మార్కెటింగ్ఉద్యోగాల ప్రాతిపదికన కంపెనీలకు ప్రోత్సాహకాలు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నీ భర్తీచేస్తాం నదుల అనుసంధానంతో సాగు-తాగునీటి సమస్యకు చెక్త టస్థ ప్రముఖులతో డిన్నర్ మీట్ లో యువనేత లోకేష్

వెంకటగిరి: ప్రభుత్వాలు మారినపుడల్లా పరిస్థితులు మారడం వల్ల అభివృద్ధికి అవరోధం కలిగిస్తుందని టిడిపి యువనేత Nara Lokesh పేర్కొన్నారు. డక్కిలి సమీపంలోని రాజన్న దాబాలో యువనేత లోకేష్ తటస్థ ప్రముఖులతో నిర్వహించిన డిన్నర్ విత్ లోకేష్ కార్యక్రమంలో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. లోకేష్ మాట్లాడుతూ… టిడిపి అధికారంలోకి వచ్చాక సరళతరమైన లైసెన్సింగ్ విధానం ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. జగన్ పాలనలో అన్ని రంగాల వారు బాధితులే. జగన్ ఏ వర్గానికి న్యాయం చెయ్యలేదు. జగన్ అరాచక పాలనలో సమాజంలో భయం ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే లోకల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. తద్వారా స్థానికంగా ఐటి ఉద్యోగాలు కల్పిస్తాం. వెంకటగిరికి చిన్న తరహా పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీడి కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో సాగు-తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం.

ఉపాధ్యాయులను అవమానించిన జగన్

జగన్ పాలనలో ఉపాద్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయులను జగన్ లిక్కర్ షాపుల ముందు నిలబెట్టి అవమానించాడు. రకరకాల యాప్ లు పేరు చెప్పి ఉపాధ్యాయులను జగన్ ప్రభుత్వం వేధిస్తుంది. ఉపాధ్యాయుల పని కేవలం విద్యార్థులకు చదువు చెప్పడం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే యాప్ ల భారం, వేధింపులు లేకుండా చేస్తాం. అంగన్వాడీ దగ్గర నుండి ఉన్నత విద్య వరకూ టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే బలోపేతం చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ టీచర్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం.

వెంకటగిరి చేనేతలను ఆదుకుంటాం!

వెంకటగిరి చేనేత కు చరిత్ర ఉంది.  కానీ ప్రస్తుత మార్కెట్ కి తగ్గట్టుగా డిజైన్స్ ఉండాలి. దానికి తగ్గ నైపుణ్య శిక్షణ ఇవ్వడం, మార్కెట్ లింక్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మంగళగిరి లో ఒక పైలట్ ప్రాజెక్టు చేస్తున్నాను. టాటా కంపెనీ తో ఒప్పందం కుదుర్చుకొని చేనేత కార్మికులకు సాయం చేస్తున్నాను. అది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. వెంకటగిరి చేనేత వస్త్రాలకు బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరుస్తాం. పట్టు రైతులకు కూడా జగన్ ప్రభుత్వం బకాయి పడింది. నూలు, రంగులు, ఇతర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నేను పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి పట్టు రైతులను ఆదుకున్నాం. చేనేత మగ్గాల్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. వాటిని చేనేత కార్మికులు అందించాలి. వెంకటగిరి చీరలు అమ్మ, బ్రహ్మణి కట్టుకుంటారు. వెంకటగిరి చేనేత కార్మికులను ఆదుకునే బాధ్యత నాది. టెక్స్ టైల్ పార్క్ తో వీవర్స్ శాల అనే కొత్త కాన్సెప్ట్ తీసుకురావాలి అనే ఆలోచన లో ఉన్నాం.

వైసీపీ పాలనతో కంపెనీలు రావు!

వైసీపీ పాలన లో రాష్ట్రానికి ఏ కంపెనీ రాదు. జగన్ అమర్ రాజా లాంటి ఫ్యాక్టరీ ని తెలంగాణ కి తరిమేశాడు. అక్కడ 20 వేల మందికి ఉద్యోగాలు ఏపి యువత కోల్పోయారు. యూపి లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఏపికి రావడానికి జగన్ ని చూసి భయపడుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కల్పించాలి. జగన్ పాలనలో వ్యాపారస్తుల పై బాదుడే బాదుడు. కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను , బోర్డు పన్ను అంటూ అనేక పన్నులు వేసి ఇబ్బంది పెట్టడం వలన చిరు వ్యాపారులు ఎవ్వరూ సంతోషంగా లేరు. గత ముఖ్యమంత్రులు ఎవరూ రాష్ట్రం పరువు తియ్యలేదు. వైసీపీ రాష్ట్ర పరువు తీశాడు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే పీపిఏ లు రద్దు చేసి దేశ వ్యాప్తంగా రాష్ట్రం పరువు తీశాడు. ఉద్యోగాలు ప్రాతిపదికన కంపెనీలకు రాయితీలు, సబ్సిడీలు ఇవ్వాలి అని నేను బలంగా నమ్ముతున్నాను.

హార్టికల్చర్ ను ప్రోత్సహిస్తాం!

రైతులను ఆదుకోవడానికి హార్టి కల్చర్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేసి మామిడి, అరటి, బొప్పాయి, దానిమ్మ, ఖర్జూరం, అంజుర్ లాంటి పంటల్లో వివిధ రకాల మొక్కలు అందుబాటులోకి తీసుకొస్తాం. వైసీపీ పాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం.అప్కోస్ తీసుకురావడం తప్ప జగన్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని ఉద్దరించింది ఏమి లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత మీ న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తాం.

యుపిఎస్సీ తరహాలో ఎపిపిఎస్సీ బలోపేతం

ఏపిపిఎస్సి ని యూపిపిఎస్సి తరహాలో బలోపేతం చేస్తాం. ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇచ్చి పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని భర్తీ చేస్తాం. జగన్ పాలనలో నాడు – నేడు అంటూ ప్రచార ఆర్భాటం తప్ప చిత్తశుద్ది లేదు. నూతన విద్యా విధానం అంటూ జగన్ స్కూల్స్ మూసేస్తున్నాడు. దీని వలన పిల్లలు విద్యకు దూరం అవుతున్నాడు. ఎక్కువ మంది ఐఏఎస్, ఐపిఎస్ లు ప్రభుత్వ పాటశాలల్లో చదివిన వారే. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కేజీ నుండి పీజీ వరకూ పాఠ్యాంశాలు ప్రక్షాళన చెయ్యాలి. ఫౌండేషన్ బాగుంటే స్కిల్ డెవలప్మెంట్ అవసరం పెద్దగా ఉండదు. జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రిల్లో దుర్భరమైన పరిస్థితి ఉంది. కనీస సౌకర్యాలు లేవు, డాక్టర్లు లేరు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తాం.

సమావేశంలో వివిధ వర్గాల ఆవేదన

జగన్ పాలనలో వేధింపులు తట్టుకోలేక పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలకు దేని మీదా హక్కు లేకుండా పోతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అన్నా భయపడుతున్నారు. వెంకటగిరి నియోజకవర్గం లో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. ఉపాధి దొరక్క ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. బీడి కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబం మొత్తం కష్టపడితే రోజుకి రూ.500 కూడా రావడం లేదు. వెంకటగిరి లో చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదు. సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందడం లేదు. రకరకాల కండిషన్స్ పెట్టి సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తున్నారు.

స్టార్టప్ లకు ప్రభుత్వ సహకారం లేదు!

స్టార్ట్ అప్ కంపెనీలకు జగన్ ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం అందడం లేదు. జగన్ పాలనలో ఇసుక రేటు ఆకాశాన్ని అంటుతుంది. జగన్ లిక్కర్ పాలసీ వలన తాగుబోతులు రోడ్ల పై వీరంగం సృష్టిస్తున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కాంట్రాక్ట్, అది రాకపోగా ఉన్న సంక్షేమ కార్యక్రమాలు కూడా రావడం లేదు. వస్తున్న ఆదాయంతో పిల్లల్ని చదివించలేని పరిస్థితి ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా, వైద్య వ్యవస్థ లో మార్పులు తీసుకురావాలి. జగన్ పాలనలో రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోతున్నారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి భారీగా చేరికలు  జిల్లా అంతటా తిరిగి టిడిపిని గెలిపిస్తా: ఆనం వెంకటగిరి: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దెబ్బకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసిపి ఖాళీ అవుతోంది. వెంకటగిరి నియోజకవర్గంలో కొనసాగుతున్న యువగళం పాదయాత్రలో వైసిపి రెబల్ ఎమ్మ్యేల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆనంతో పాటు ఆయన వారసులు కైవల్యా,శుభకర్ లు కూడా యువగళంతో కలిసి అడుగులు వేస్తున్నారు. మంగళవారం మాజీ మంత్రి ఆనం ఆధ్వర్యంలో రాపూరు యువగళం క్యాంప్ వద్ద డక్కిలి మండలానికి చెందిన 22 మంది వైసిపి నాయకులు టిడిపిలో చేరారు. మరో నెలల్లో అత్మకూరులో 70 శాతం, వెంకటగిరిలో 80 శాతం వైసిపి ఖాళీ అవుతుందని ఆనం రామనారాయణ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజకీయ పరిపక్వత లేని అత్మకూరు వైసిపి ఎమ్మ్యేల్ల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అవగాహన లేకుండ విమర్సలు చేస్తున్నాడు, మేకపాటి విక్రమ్ రెడ్డి నా పుట్టు మచ్చల గురించి విమర్సలు చేశాడా, లేక ఏ మచ్చల గురించి మాట్లాడాడో అర్థం కావడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. N Chandrababu Naidu ఉమ్మడి నెల్లూరు జనరల్ సీట్స్ లో ఎక్కడ పోటీ చేయమన్నాపోటీ చేసి గెలిచే సత్తా నాకుందని అంటూ 2024 ఎన్నికల్లో టిడిపి గెలిచి, N Chandrababu Naidu సిఎం అయ్యేవరకు నెల్లూరు జిల్లా అంతా తిరుగుతానని ఆనం ప్రకటించారు.

యువ‌గ‌ళం పాద‌యాత్రలో లోకేష్‌కి హార‌తిచ్చార‌ని చిరువ్యాపారిపై వైకాపా క‌క్ష‌ క‌ర్నూలులో రాము కూర‌గాయ‌ల షాపు ధ్వంసం చేసిన వైకాపా కాల‌కేయులు రాము కొత్త షాపు నిర్మాణానికి, పెట్టుబ‌డికి సాయం అందించాల‌ని లోకేష్ నిర్ణయం

సీబీఎన్ అభివృద్ధికి చిహ్నమైన భ‌వ‌నాలు క‌డ‌తారు, జ‌గ‌న్ రెడ్డి విధ్వంస‌పు ఆలోచ‌న‌ల‌తో వాటిని కూల‌గొడ‌తాడు. లోకేష్ అవే దుకాణాల్ని తిరిగి నిర్మించి, చేయూత‌నందించి వారి బ‌తుకుల‌ని నిల‌బెడ‌తాడు. ఇవి వైసీపీ డిస్ట్రక్షన్‌.. టిడిపి క‌న‌స్ట్రక్షన్ విధానాలకు నిదర్శనం. ఇటీవ‌ల కర్నూలులో నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర సంద‌ర్భంగా కర్నూలు ప్రకాష్ నగర్ 49 వ వార్డుకి చెందిన రాము కుటుంబంతో క‌లిసి లోకేష్ కి హారతి ఇచ్చి స్వాగతం పలికారు. లోకేష్‌కి స్వాగ‌తం ప‌లికార‌ని  క‌క్షగట్టిన వైసీపీ కార్పొరేటర్ కృష్ణ కాంత్..40 ఏళ్లుగా రాము ఉపాధి పొందుతోన్న కూర‌గాయ‌ల దుకాణాన్ని నిర్దాక్షిణ్యంగా కూలగొట్టించాడు. క‌నీసం నోటీసు కూడా ఇవ్వకుండా, ప‌క్కషాపులేవీ ముట్టుకోకుండా త‌న షాపు ఒక్కటే ఎందుకు కూల్చుతున్నార‌ని రాము మున్సిపల్ అధికారులను నిల‌దీస్తే.వైసీపీ కార్పొరేట‌ర్ కృష్ణకాంత్ ఆదేశాలతో కూల్చేశామ‌ని చెప్పారు. న‌ల‌భై ఏళ్లుగా త‌న కుటుంబానికి తిండిపెట్టే కూర‌గాయ‌ల దుకాణం క‌ళ్ల ముందే వైసీపీ నేత‌లు కూల‌గొట్టడంతో రాము గుండెలవిసేలా రోదించాడు. పార్టీనేతల ద్వారా స‌మాచారం తెలుసుకున్న టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌..  వైకాపా కాల‌కేయులు కూల్చలేని విధంగా సొంత స్థలంలో రాముకి శాశ్వతంగా ఉండేలా కూర‌గాయ‌ల దుకాణం నిర్మిస్తానని ప్రకటించారు. అంతేగాక రాము వ్యాపారం చేసేందుకు పెట్టుబ‌డి సాయం అందించాల‌ని నిర్ణయించారు. రాముకి అండ‌గా తెలుగుదేశం ఉంద‌ని భ‌రోసా ఇచ్చారు.

నారా లోకేష్ ను కలిసిన జోరేపల్లి గ్రామస్తులు

వెంకటగిరి నియోజకవర్గం జోరేపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామం నుండి వెంకటగిరి-సిద్ధవరం క్రాస్ రోడ్డు వరకు రెండు కిలోమీటర్లు ఫారెస్టు ఏరియాలో ఉంది. మేం వెంకటగిరి, తిరుపతికి వెళ్లాలంటే మేం అదనంగా 17 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఫారెస్టులో 2 కి.మీ. రోడ్డు వేసినట్లయితే 10 గ్రామాల ప్రజలకు అదనంగా వెళ్లాల్సిన దూరం తగ్గుతుంది. దీనివల్ల జోరేపల్లి, చెర్లోపల్లి, చీకవోలు, వరికుంటపల్లి, లింగనపాలెం, దగ్గోలు, అన్నమరాజుపల్లె, అక్కమాంబపురం, ఆర్జివి పాలెం వంటి 10 గ్రామాల ప్రజలకు చుట్టూ తిరిగే వెళ్లే ఇబ్బందులు తప్పుతాయి. మీరు అధికారంలోకి వచ్చాక ఫారెస్టు నుండి రోడ్డు వేసేందుకు చర్యలు తీసుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలను గాలికొదిలేసింది. టిడిపి అధికారంలోకి వచ్చాక వెంకటగిరి-సిద్ధవరం మధ్య ఫారెస్టులో రోడ్డును నిర్మిస్తాం. 10 గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉండేలా అటవీ అనుమతులు తీసుకొని రహదారి నిర్మిస్తాం.

యువనేతను కలిసిన రాపూరు గ్రామ దళితులు

వెంకటగిరి నియోజకవర్గం రాపూరు గ్రామ దళితులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వంలో మా సంక్షేమం కోసం అమలుచేసిన 27 సంక్షేమ పథకాలను వైసిపి ప్రభుత్వం రద్దుచేసింది, దీనివల్ల మేం తీవ్రంగా నష్టపోతున్నాము. గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ ఎస్సీ యువత స్వయం ఉపాధికి కార్లు ఇచ్చేవారు. అంబేద్కర్ విదేశీవిద్య పథకం ద్వారా పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లే చదువుకునే అవకాశం ఉండేది. దేశంలో డప్పు కళాకారులకు గత టిడిపి ప్రభుత్వం తొలిసారిగా పెన్షన్ సౌకర్యం కల్పించింది. జనాభా దామాషా ప్రకారం నెల్లూరు జిల్లాలో మాదిగలకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి. ఎస్సీ వర్గీకరణ చేసి మాకు న్యాయం చేయండి.

నారా లోకేష్ మాట్లాడుతూ

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దళిత ద్రోహి జగన్ రెడ్డి. సంక్షేమ పథకాల మాటున ఎస్సీ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి రద్దుచేసిన 27 ఎస్సీ సంక్షేమపథకాలను పునరుద్దరిస్తాం. జనాభా దామాషా ప్రకారం మాదిగలకు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తాం. ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగల సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం.

నారా లోకేష్ ను కలిసిన సిద్ధవరం గ్రామప్రజలు

వెంకటగిరి నియోజకవర్గం సిద్ధవరం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.  మా గ్రామంలో సుమారు 300కుటుంబాలు ఉన్నాయి. కాటూరుపాడు నుండి 3కిలోమీటర్లు రోడ్డు అధ్వాన్నంగా ఉంది. అదే మార్గంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ మార్గం నుండే విద్యార్థులు పాఠశాలకు వెళ్లిరావాల్సి ఉండటంతో ఇబ్బంది పడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మా కాలనీకి ఒక్క ఇల్లు ఇవ్వలేదు. నాలుగేళ్లలో మా గ్రామంలో ఒక్క సీసీ రోడ్డు కూడా వేయలేదు. మా గ్రామానికి శ్మశానం లేదు, వాటర్ ట్యాంకు లేనందున తాగునీటికి చాలా ఇబ్బందిగా ఉంది. మా గ్రామంలోని కాలువపై బ్రిడ్జి నిర్మించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ.

ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదు, తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నిండాలన్నది సిద్ధాంతం. జె-బ్రాండ్స్ అమ్మకాలపై ఉన్న శ్రద్ధ గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై లేకపోవడం దురదృష్టకరం. వైసిపి అధికారంలోకి వచ్చాక రూ.8,660 కోట్ల పంచాయితీల నిధులను దారిమళ్లించి తీరని ద్రోహం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజి వంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం. అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం, ప్రతిఇంటికి తాగునీటి కుళాయి అందజేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన మాధవాయపాలెం గ్రామస్తులు

వెంకటగిరి నియోజకవర్గం మాధవాయపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో సుమారు 150మంది రైతులు సీజేఎఫ్ఎస్ భూములను సాగుచేస్తున్నారు. 1976లో అప్పటి ప్రభుత్వం మనిషికి 2ఎకరాలు చొప్పున 325ఎకరాలు కేటాయించారు. ఈ భూములన్నీ ఆర్డీఓ పేరుమీద ఉన్నాయి. వాటిని మా పేరు మీదకు మార్చాలని అడిగితే పట్టించుకోవడం లేదు. మా గ్రామంలోని దళితులకు పట్టాలు కేటాయించలేదు. మా గ్రామం భూములను పూర్తిగా రెడ్ మార్క్ పెట్టి ఉంది. మీరు అధికారంలోకి వచ్చాక మాకు పట్టాలు ఇప్పించాలి. మా గ్రామంలో కరెంటు స్థంబాలు దెబ్బతిన్నాయి, ఎవరూ పట్టించుకోవడం లేదు. లైబ్రరీ, డ్రైనేజీ, శ్మశానం, సీసీ రోడ్లు లేవు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలు పరిష్కరించండి.

నారా లోకేష్ స్పందిస్తూ.

. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఎస్సీలకు భూమి కొనుగోలు పథకం కింద 5వేల ఎకరాల భూమిని అదజేశాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాస్తవ అనుభవదారులను గుర్తించి, మాధవాయపాలెం దళితులకు పట్టాలు అందజేస్తాం. మాధవాయపాలెం గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన వెలికల్లు గ్రామస్తులు

వెంకటగిరి నియోజకవర్గం వెలికల్లు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామ దళితవాడ సమీపంలో కేపీ కెనాల్ 3వ బ్రాంచ్ నుండి తెలుగుగంగ కాలువ వెళుతోంది. ఆ కాలువ సీజేఎఫ్ఎస్ స్కీమ్ పొలాల మధ్య ఉంది. సీజేఎఫ్ఎస్ భూములు 120 ఎకరాలను 80మంది పేదలు సాగుచేస్తున్నారు. TDP పాలనలో ఈ భూములకు చంద్రబాబు పట్టాలు ఇప్పించారు. 3వ బ్రాంచ్ కెనాల్ సుమారు 15మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఈ కాలువ దాటి పొలాలు వెళ్లడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక ఈ కాలువ మీద బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నాం.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసిపి ప్రభుత్వానికి దళితఓట్లపై తప్ప వారి సంక్షేమంపై శ్రద్ధలేదు. గ్రామాల్లో చిన్నచిన్న పనులు కూడా చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. అధికారంలోకి వచ్చాక కెపి కెనాల్ 3వబ్రాంచ్ పై వెలికల్లు వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపడతాం. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పొలాలకు వెళ్లే పుంతరోడ్ల నిర్మాణాన్ని చేపట్టి రైతుల కష్టాలు తీరుస్తాం.

Also, Read This Blog: Yuvagalam Padayatra: Step by Step Towards Youth Empowerment

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *