Nara Lokesh padayatra,Yuvagalam
Nara Lokesh padayatra,Yuvagalam

వెంకటగిరి నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం! గ్రామగ్రామాన వినతుల వెల్లువ…అకిలవలసలో రచ్చబండ! దారిపొడవునా యువనేతకు ఆత్మీయ స్వాగతం

వెంకటగిరి: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 131వరోజు వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో హోరెత్తింది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు అడుగడుగునా యువనేతకు ఆత్మీయస్వాగతం పలుకుతూ తమ సమస్యలు చెప్పుకున్నారు. యువనేత మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని చెప్పి ముందుకు సాగారు. మహిళలు, యువకులు, వృద్దులు, రైతులు యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. అకిలవలస గ్రామంలో ఆకిలవలస గ్రామంలోని మాతమ్మ గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్, అనంతరం గ్రామ దళితవాడలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నారు. అకిలవలస గ్రామంలో తాగునీటి కొరత కారణంగా కిడ్నీవ్యాధుల పాలవుతున్నామని స్థానికులు చెప్పగా, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. అకిలవలసలో ఒక రైతు పొలంలో గత ప్రభుత్వం ఎన్టీఆర్ జలసిరి పథకం కింద ఏర్పాటుచేసిన సోలార్ పంప్ సెట్ వద్ద సెల్ దిగిన లోకేష్, పథకం కొనసాగింపులో వైసీపీ ప్రభుత్వ వైఫల్యంపై విరుచుకుపడ్డారు. పెనుబర్తి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఓబులాయపల్లి, అకిలవలస, గుండువోలు, ఏపూరు, వెలుగోను జంక్షన్ మీదుగా రాపూరు క్యాంప్ సైట్ కు చేరుకుంది. 131వరోజు యువనేత లోకేష్ 16.4 కి.మీ దూరం పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1686.7 కి.మీ. మేర పూర్తయింది.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

ఇంటి స్థలాలివ్వకుండా మంత్రి అడ్డుకుంటున్నారు! -పంతగిరి సుబ్రహ్మణ్యం, రేగడపల్లి.

కండలేరు జలాశయంలో భాగంగా మా గ్రామం ముంపు ప్రాంతంలో ఉంది. గ్రామంలో సరైన వసతులు కూడా లేవు. గ్రామంలో 300 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. TDP హయాంలో చాటగొట్లలో భూమి కొని లే అవుట్లు వేశారు. కానీ ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రభుత్వం మాకు ఇవ్వలేదు. కనీసం వైసీపీ ప్రభుత్వం వచ్చాకైనా ఇస్తుందనుకుంటే మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పట్టాలివ్వకుండా అడ్డుకుంటున్నారు. పట్టాలిస్తే గ్రామాన్ని వదిలివెళ్తాం, మాకు ఇంటి స్థలాలు ఇవ్వకుండా చేస్తే మంత్రికి ఏమొస్తుందో అర్థం కావడం లేదు.

నిమ్మచెట్ల మునకతో రూ.50 లక్షల నష్టం -ఉద్దినేని పెంచలనాయుడు, రేగడపల్లి.

కండలేరు జలాశయం ముంపు కింద మా గ్రామం ఉంది. నాకు 10 ఎకరాల నిమ్మతోట ఉంది. యేటా రూ.4 లక్షల ఆదాయం వచ్చేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులో నీరు పూర్తి స్థాయిలో నింపడం వల్ల 10 ఎకరాల నిమ్మపొలం మునిగిపోయింది. నెలల తరబడి చెట్లు నీళ్లలో ఉండటంతో చెట్లన్నీ చనిపోయాయి.  నీళ్లు పూర్తి స్థాయిలో నింపుతామని కనీసం అధికారులు కూడా సమాచారం ఇవ్వలేదు. ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే నిమ్మకాయలు కోసుకునే వాళ్లం. చెట్లు చనిపోవడం, కాపు నీటి పాలు అవ్వడం వల్ల రూ.50 లక్షల నష్టం వాటిల్లింది.

పబ్లిసిటీపై తప్ప పనులపై శ్రద్ధ ఏది జగన్?!*

అకిలవలసలో గత ప్రభుత్వంలో ఏర్పాటుచేసిన సోలార్ పంప్ సెట్ వద్ద సెల్ఫీ దిగిన లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది వెంకటగిరి నియోజకర్గం అకిలవలసలో ఎన్టీఆర్ జలసిరి పథకం కింద గత టిడిపి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సోలార్ పంపు సెట్. బీళ్లుగా మారిన పేదల భూముల్లో సాగునీటి వసతిని కల్పించేందుకు సోలార్ పంపుసెట్లను ఏర్పాటుచేసే ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రూ.55వేల విలువైన సోలార్ పంపు సెట్ ను సాధారణ రైతులకైతే రూ.25వేలకు, ఎస్సీ,ఎస్టీలకు రూ.6వేలకే అందించాం. దీనిని స్టిక్కర్ సిఎం జగన్…వైఎస్సార్ జలకళగా మార్చాడు. నియోజకవర్గానికి 500 బోర్లు వేయిస్తానని చెప్పి, 50నెలల్లో ఒక్క బోరు వేసిన దాఖలాలు కూడా లేవు. ముఖ్యమంత్రి జగన్ కు పబ్లిసిటీ పీక్… మ్యాటర్ వీక్ అనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని లోకేష్ దుయ్యబట్టారు.

బాధలు పోవాలి అంటే బాబు రావాలి! మహిళల కష్టాలు తీర్చేందుకే మహాశక్తి పథకం

పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని పునరుద్దరిస్తాం అధునాతన టెక్నాలజీతో ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తాం

అకిలవలస రచ్చబండ కార్యక్రమంలో నారా లోకేష్

వెంకటగిరి: వెంకటగిరి నియోజకవర్గం ఆకిలవలస గ్రామంలో మాతమ్మ  గుడిలో ప్రత్యేక పూజలు చేసిన యువనేత అనంతరం దళితవాడలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ… ఒక్క ఛాన్స్ మాయలో పడి పాలిచ్చే ఆవుని వద్దని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. రూ.200 పెన్షన్ ని రూ.2000 వేలు చేసిన ఘనత చంద్రబాబు గారిది. ఇప్పుడు జగన్ రూ.750 పెంచడానికి నాలుగేళ్లు పట్టింది.  రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల పెన్షన్లు కట్ చేసాడు. మరో 6 లక్షల పెన్షన్లు కట్ చెయ్యడానికి జగన్ ప్లాన్ చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తీసేసిన 6 లక్షల పెన్షన్లు మళ్ళీ ఇస్తాం. పేదల ఇళ్లల్లో ఒక బిడ్డే చదవాలి అని జగన్ అనడం దుర్మార్గం. అందుకే టిడిపి తల్లికి వందనం పేరుతో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాం. ముగ్గురు బిడ్డలు ఉంటే రూ.45 వేలు అందిస్తాం. విద్యా దీవెన, వసతి దీవెన చెత్త కార్యక్రమాలు. దీని వలన తల్లిదండ్రులు, విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు వేసి డైరెక్ట్ గా ఫీజులు కాలేజీకి చెల్లిస్తాం.

పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తాం!

పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపి నంబర్ 1. పెట్రోల్, డీజిల్ పై విపరీతంగా పన్ను వేసి ప్రజల్ని భాదేస్తున్నాడు. జగన్ పాలనలో ఆటో డ్రైవర్లను విపరీతంగా వేధిస్తున్నారు. పన్నులు విపరీతంగా పెంచేశారు. ఫైన్లు వేసి వేధిస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గిస్తాం. ఆటో డ్రైవర్లపై వేధింపులు లేకుండా  చేస్తాం. మీ పై వేసిన పన్నులు తగ్గిస్తాం. ఓటిఎస్ పెద్ద మోసం. ప్రజల దగ్గర డబ్బులు కొట్టేసి పనికిరాని పట్టాలు చేతిలో పెట్టాడు. ఆ పట్టాలు తీసుకెళ్తే బ్యాంకులు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావడం లేదు. మీరు ఎవ్వరూ ఓటిఎస్ లో డబ్బులు కట్టోద్దు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా ఇళ్ళ పట్టాలు ఇస్తాం. జాబ్ క్యాలెండర్ ద్వారా 2.30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని జగన్ హామీ ఇచ్చి మోసం చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ భృతి రూ.3 వేలు అందిస్తాం.

ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందిస్తాం!

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం. ప్రస్తుతానికి గ్రామంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. గ్రామంలో స్కూల్ భవనం పరిస్థితి అధ్వానంగా ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల్లోనే స్కూల్ కి కొత్త భవనం కట్టిస్తాం. ఇప్పుడు మాట మార్చి ఇళ్లు కట్టకపోతే పట్టాలు వెనక్కి తీసుకుంటున్నాడు.  మూడు లక్షల పట్టాలు వెనక్కి తీసుకున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా పక్కా ఇల్లు కట్టించి ఇస్తాం. గ్రామంలో పెండింగ్ లో ఉన్న సిసి రోడ్లు, డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. అన్న క్యాంటీన్, చంద్రన్న భీమా, పండుగ కానుకలు, పసుపు కుంకుమ ఇచ్చింది టిడిపి. అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది జగన్.

మహిళలను ఆదుకునేందుకే మహిళాశక్తి!

నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కరెంట్ బిల్లులు విపరీతంగా పెరిగిపోయాయి, ఆర్టీసి ఛార్జీలు మూడు సార్లు పెంచారు, గ్యాస్ ధర విపరీతంగా పెరిగిపోయింది. అందుకే మహిళల కోసం మహిళా శక్తి పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. ఆడ బిడ్డ నిధి కింద 18 ఏళ్లు దాటిన అందరికీ నెలకి రూ.1500 ఇస్తాం. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలకు ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నులు తగ్గించి నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. జగన్ గడప గడప కు డాక్టర్ అంటూ డ్రామా చేసాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో కావాల్సిన సిబ్బంది లేరు, కనీసం దూది, మందులు కొనే దిక్కు లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తాం.

సీనియర్ నేత కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ…

టిడిపి హయంలోనే ఎస్సీలకు న్యాయం జరిగింది. ఎస్సీల కోసం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను జగన్ రద్దు చేసాడు. వైసిపి పాలనలో సంక్షేమ హాస్టళ్ల లో పరిస్థితి దారుణంగా తయారైంది. అందరి సమస్యలు పరిష్కారం కావాలంటే చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.

అకిలవలస గ్రామస్తులు మాట్లాడుతూ…

ఆకిలవలస గ్రామ దళితవాడలో  నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పలువురు తమ బాధలను తెలియజేస్తూ… జగన్ పాలనలో ఎస్సీ కాలనీలో పెన్షన్లు కట్ చేస్తున్నారు. జగన్ ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి ఇస్తానని చేశాడు. జగన్ ప్రభుత్వం పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసింది. జగన్ పాలనలో ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రూ.10 వేలు వేసి మా దగ్గర రూ.50 వేలు దోచేస్తున్నాడు.. జాబ్ క్యాలెండర్ ఇస్తానని జగన్ మోసం చేసాడు. గ్రామంలో స్కూల్ పడిపోయే స్థితిలో ఉంది. నాడు – నేడు అనడం తప్ప మా ఊర్లో స్కూల్ బాగుచెయ్యలేదు.  గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య ఉంది. మాకు సురక్షిత తాగునీరు అందించాలి. గ్రామంలో సి సి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ బాలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేవు, కనీసం ఎమర్జెన్సీ లో అంబులెన్స్ కూడా రావడం లేదు.

నారా లోకేష్ ను కలిసినఓబులాయపల్లి గ్రామస్తులు

వెంకటగిరి నియోజకవర్గం ఓబులాయపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కండలేరు జలాశయం క్రింద సుమారు 19 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. 1985 నుండి 1989 వరకు నష్టపరిహారం కల్పించారు. 1990-1993 సంవత్సరాల్లో ఇంటి నివేశన స్థలాలకు నష్టపరిహారం కల్పించారు. ముంపులో ఇళ్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని జీఓ ఇచ్చారు. కానీ 10 కుటుంబాలకు కూడా ఉద్యోగాలు కల్పించలేదు. మీరు అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నాం. మా గ్రామంలో ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సివస్తోంది. మరికొంత మంది ప్రభుత్వ భూమిని చదును చేసుకుని వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్నాం. ఈ భూములకు పట్టాలు ఇప్పించాలి. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టే సమయంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అధికారంలోకి వచ్చాక కండలేరు జలాశయాన్ని భూములిచ్చిన రైతులు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలిచ్చాం. స్వయం ఉపాధి రుణాలు అందజేసి ఇక్కడ ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా నివారిస్తాం. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వ నిబంధనలు, గత ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన పంగిలి గ్రామస్తులు

వెంకటగిరి నియోజకవర్గం పంగిలి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి, డ్రైనేజీలు లేవు. కరెంటు ఛార్జీలు చాలా భారంగా ఉన్నాయి. నిత్యవసరాలు, ఆర్టీసీ, గ్యాస్ ధరలతో సతమతమవుతున్నాం. వైసీపీ ఎన్నికల ముందు మా గ్రామానికి ఇచ్చిన హామీలు విస్మరించింది. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

జగన్మోహన్ రెడ్డి పాలన గ్రామాలకు శాపంగా మారింది. పన్నులు, ధరలు, ఛార్జీల భారంతో సామాన్యుల నడ్డివిరుస్తున్నారు. పేదవాళ్లను మరింత పేదవాళ్లుగా చేసేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. పంచాయతీ నిధులు రూ.8,600కోట్లను దారిమళ్లించి పంచాయతీలను నిర్వీర్యం చేశారు. టిడిపి హయాంలో గ్రామాల్లో 25వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 30లక్షల ఎల్.ఈ.డీ వీధి దీపాలు ఏర్పాటు చేశాం. మేం అధికారంలోకి వచ్చాక పన్నులను తగ్గించి పెట్రోల్,డీజిల్, నిత్యావసరాల ధరలు తగ్గిస్తాం. పన్నుల విధానాన్ని ప్రక్షాళన చేసి ప్రజలకు ఉపశమనం కలిగిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన ఏపూరు గ్రామస్తులు

వెంకటగిరి నియోజకవర్గం ఏపూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తెలుగుగంగ కాలువ మా గ్రామం దిగువ ప్రాంతం నుండి వెళుతోంది. ఈ కాలువ పనులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. కాలువ ఆధునీకరణ పనులు, అభివృద్ధి చర్యలు ఏమీ తీసుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలు పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రాజెక్టులను పూర్తిచేయడంపై శ్రద్ధలేదు. గత టిడిపి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై రూ.68,294 కోట్లు ఖర్చుచేస్తే, వైసిపి సర్కారు నాలుగేళ్లలో ప్రాజెక్టులపై వెచ్చించింది కేవలం రూ.25,165 కోట్లు మాత్రమే. మళ్లీ మేం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి, కాల్వల ఆధునీకరణ పనులు పూర్తిచేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన గుండవోలు గ్రామస్తులు

వెంకటగిరి నియోజకవర్గం గుండవోలు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామం కండలేరు జలాశయం క్రింద ముంపుకు గురైన సమయంలో ఇంటికొక ఉద్యోగం ఇస్తామని పాలకులు చెప్పారు. నేటికి మా గ్రామంలో కేవలం నలుగురికే ఉద్యోగాలిచ్చారు. పునరావాస కేంద్రంలో ఇళ్లు, మౌలిక సదుపాయాలు లేవు. ముఖ్యంగా తాగునీరు, పాఠశాల, దేవాలయం, నిత్యావసరాలు ఏర్పాటు చేయాలి. పునరావాస కేంద్రం సమీపంలో  సర్వే నంబర్ 334లో 250ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని స్థలం లేని పేదలకు పంపిణీ చేయాలి. ముంపుకు గురైన డీకేటీ భూముల్లో 100ఎకరాలకు నేటికీ నష్టపరిహారం చెల్లించలేదు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.

నారా లోకేష్ స్పందిస్తూ.

కండలేరు జలాశయం నిర్వాసితుల సమస్యలు ఇప్పటికీ పరిష్కరించకపోవడం దురదృష్టకరం. అధికారంలోకి వచ్చాక పునరావాస కేంద్రంలో మౌలిక సదుపాయాలు  కల్పిస్తాం. భూమిలేని పేదలకు ఖాళీగా ఉన్న భూమిని కేటాయిస్తాం. పెండింగ్ పరిహారాన్ని వెంటనే అందించేలా చర్యలు తీసుకుంటాం. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం ఉత్తర్వులు, నిబంధనలకు లోబడి చర్యలు తీసుకుంటాం.

Also Read This Blog:Marching for Equality: Yuvagalam Padayatra Championing Youth Rights

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *