జననీరాజనాల నడుమ సాగుతున్న యువగళం! సమస్యలు వింటూ… భరోసా ఇస్తూ యువనేత ముందుకు
వెంకటగిరి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనను అంతమొందించడమే లక్ష్యంగా ప్రారంభమైన యువగళం పాదయాత్ర జననీరాజనాల నడుమ ముందుకు సాగుతోంది. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 130వరోజు యువనేత Nara Lokesh పాదయాత్రకు ప్రజలనుంచి వినతులు వెల్లువెత్తాయి. దారిపొడవునా వివిధవర్గాల సమస్యలను సావధానంగా వింటున్న యువనేత… మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. పాదయాత్ర ప్రారంభికి ముందుకు తెగచర్ల క్యాంప్ సైట్ లో యువనేత లోకేష్ రైతులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం తెగచర్ల నుంచి ప్రారంభమైన పాదయాత్ర… గరిమెనపెంట, రామకూరు, గొనుపల్లి మీదుగా పెనుబర్తి క్యాంప్ సైట్ కు చేరుకుంది. పాదయాత్ర దారిలో దళితులు, ముస్లింలు, కండలేరు ప్రాజెక్టు నిర్వాసితులు, వివిధ గ్రామాల ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. యువనేతకు అందుతున్న సమస్యల్లో అత్యధికం వైసిపి నేతల అరాచకాలకు సంబంధించినవే ఉంటున్నాయి. గరిమినపెంట ఎస్టీ కాలనీవాసులు తమ గోడు విన్పిస్తూ తమ భూముల ఫెన్సింగ్ దౌర్జన్యాంగా తొలగించి, ఆక్రమించేందుకు వైసిపి నేతలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ధైర్యంగా ఉండాలని, రాబోయే టిడిపి ప్రభుత్వం వైసిపి భూబకాసురులపై ఉక్కుపాదం మోపుతుందని యువనేత పేర్కొన్నారు. 130వరోజు యువనేత లోకేష్ 16 కి.మీ. పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1670.4 కి.మీ. పూర్తయింది.
యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:
విద్యుత్ తీగల ఎత్తు పెంచమంటే రూ.4 లక్షలు అడిగారు! కదిరి వెంకటేశ్వర్లు, ఎస్సీ కాలనీ, గరిమెనపెంట.
మా ఎస్సీ కాలనీలో విద్యుత్ తీగలు ఇళ్లను తాకుతున్నాయి. పిల్లలు మిద్దెల పైకి ఎక్కితే చేతులకు అందేఎత్తులో ఉండటంతో ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్ స్తంబాలు కూడా విరిగాయి. కొత్త స్తంబాలు వేసి, తీగలు ఎత్తులో ఏర్పాటుచేయాలని అధికారులను అడిగితే రూ.4 లక్షలు ఖర్చవుతుంది, మీరు భరిస్తే ఏర్పాటు చేస్తామని చెప్పారు. కూలీనాలి చేసుకుని బతికే వాళ్ళం, అన్ని డబ్బులు ఎక్కడి నుండి తెచ్చి కట్టాలి? ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన పనులకు కూడా మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు. ఈ సమస్యపై కలెక్టర్ ను కలిశాం, ఎస్సీ కమిషన్ చైర్మన్ కు లేఖ కూడా రాసినా ఫలితం లేదు.
గొర్రెలు, మేకలను వైసీపీ నేతలు అపహరించారు!-చింతల నరసయ్య, రామకూరు కాలనీ
మేము TDP కి చెందిన వారమని ఆర్ధికంగా దెబ్బతీసేందుకు ఏడాది క్రితం వైసీపీకి చెందిన దుగ్గిరెడ్డి వెంకటరమణారెడ్డితో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలు అర్ధరాత్రి మా కొట్టాల వద్దకు వచ్చి 40 గొర్రెలు, 20 మేకలు అపహరించి అమ్ముకున్నారు. కేసు పెడితే అరెస్ట్ చేసి, రెండు రోజుల తర్వాత వదిలిపెట్టారు. కనీసం మాకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఏడాది నుండి న్యాయం కోసం తిరుగుతున్నాం. మాకు గొర్రెలే జీవనాదారం. మళ్ళీ రూ.4 లక్షలు ఖర్చు పెట్టి గొర్రెలు కొని మేపుకుంటున్నాం.
పెడింగ్ ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాం! ప్రతిఎకరాకి సాగునీరు – ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తాం జగన్ పాలనలో అత్యధికంగా నష్టపోయింది రైతులే అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రిప్ సబ్సిడీని పునరుద్దరిస్తాం కల్తీవిత్తనాల విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుంటాం రైతులతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్
వెంకటగిరి: ప్రతి ఎకరానికి సాగు నీరు… ప్రతి ఇంటికి తాగునీరు టిడిపి లక్ష్యం… అధికారంలోకి వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. తెగచర్ల క్యాంప్ సైట్ వద్ద రైతులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… రైతుల ఆత్మహత్యల్లో ఏపి దేశంలోనే నంబర్ 3 లో , కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2 లో ఉంది. జగన్ పాలనలో భూసార పరీక్షా కేంద్రాలకు కరెంట్ బిల్లులు కట్టక మూతపడ్డాయి. రైతు రథాలు లేవు, డ్రిప్ ఇరిగేషన్ లేదు, గిట్టుబాటు ధర లేదు. నెల్లూరు కి చెందిన వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కోర్టు దొంగ. ఆయన జైలుకి పోవడం ఖాయం. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే కనీసం పంట నష్టం అంచనా వేసే దిక్కు లేదు. ప్రతి నియోజకవర్గం లో ఏడాదికి 500 బోర్లు వేస్తాం అని జగన్ హామీ ఇచ్చాడు. ఒక్క బోరు కూడా వెయ్యడం లేదు. రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని చెప్పి రూ. 7,500 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేసి మెట్ట ప్రాంతం రైతుల్ని దెబ్బతీశాడు.ఒకే సంతకంతో రూ.50 వేల లోపు ఉన్న రుణాలు అన్ని మాఫీ చేసింది టిడిపి. ఇన్పుట్ సబ్సిడీ, భూసార పరీక్షలు, సూక్ష్మ పోషకాలు అందించాం, రైతు రథాలు అందించాం, 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇచ్చాం. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చాం. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గా ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి పంట కుంటలు ఏర్పాటు చేశాం. ఎన్టీఆర్ జలసిరి ద్వారా బోర్లు వేసి, సోలార్ మోటార్లు ఏర్పాటు చేశాం.
జగన్ చేతిలో ఎక్కువ నష్టపోయింది రైతులే!
జగన్ వచ్చిన తరువాత రైతులు లేని రాజ్యం గా మారిపోతుంది. జగన్ చేతిలో ఎక్కువ నష్టపోయింది రైతులే. జగన్ పాలనలో పాడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. టిడిపి హయాంలో గొర్రెల పెంపకం, పాడి పరిశ్రమ రైతులకి అనేక ప్రోత్సాహకాలు ఇచ్చాం. సబ్సిడీలో పశువులు, దాణా, మందులు, మేత అందించాం. జగన్ ప్రభుత్వం పాడి పరిశ్రమ కు ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఆపేసాడు. రైతుల్ని ఆదుకోకపోగా మోటార్ల కు మీటర్లు పెడుతున్నాడు. గ్యాస్ సబ్సిడీ ఎత్తేసినట్టే ఉచిత విద్యుత్ కూడా జగన్ ఎత్తేసాడు. రైతులు మీటర్లు పగలగొట్టండి. మీకు అండగా టిడిపి ఉంటుంది. జగన్ పాలనలో విత్తనం, ఎరువులు, పురుగుల మందుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేస్తాం!
జగన్ పాలనలో వ్యవసాయం చెయ్యలేని పరిస్థితి వచ్చింది. నిమ్మ రైతుల కష్టాలు నాకు తెలుసు. రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. మెరుగైన రకాల మొక్కలు తీసుకొస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి మార్కెట్ తో లింక్ చేసి మంచి రేటు వచ్చేలా చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పంటకు జబ్బులు వచ్చినప్పుడు ఏ మందు కొట్టాలో ప్రభుత్వమే చెప్పి అవగాహన సద్దస్సు లు నిర్వహిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ అందజేస్తాం. ఎస్సీ, ఎస్టీలకు అయితే 100 శాతం సబ్సిడీ తో డ్రిప్ అందజేస్తాం. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సరఫరా చేస్తుంది వైసిపి నాయకులే. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సరఫరా చేసే వారి పై చర్యలు తీసుకుంటాం. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కోపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న 70 వేల ఎకరాలు బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చాం. చుక్కల భూముల పేరుతో వైసిపి ప్రభుత్వం డ్రామా చేస్తుంది. వైసిపి ప్రజాప్రతినిధులు వద్ద ఉండే అనుచరులకు తప్ప చుక్కల భూముల పట్టాలు ఎవరికీ ఇవ్వడం లేదు.
సోమశిల హైలెవల్ కెనాల్ పనులు పూర్తిచేస్తాం!
సోమశిల హై లెవల్ కెనాల్ టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తాం. తోపుగుంట, కండాపురం, చౌటుపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను టిడిపి వచ్చిన వెంటనే పూర్తి చేస్తాం. ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులు టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేస్తాం. వెంకటగిరి నియోజకవర్గం రైతులకు సాగు నీరు అందించే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి వ్యయం తగ్గించి, గిట్టుబాటు ధర కల్పిస్తాం. హార్టి కల్చర్ ని ఉపాధి హామీకి అనుసంధానం చేసి ఆదుకుంటాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పల్పింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజిలు ఏర్పాటు చేస్తాం. మామిడి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి ఎగుమతి కి కావాల్సిన రకాలు ఇక్కడ పెంచే విధంగా ప్రోత్సహిస్తాం. అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కారం కోసం కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న నిబంధనలు పాటించాలని నిర్ణయం తీసుకున్నాం.
ధాన్యం కొనుగోళ్లలో భారీ స్కామ్!
జగన్ పాలనలో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నెల్లూరు జిల్లా లో ధాన్యం కొనుగోళ్ల లో భారీ స్కాం కి పాల్పడ్డారు. కొన్న ధాన్యానికి డబ్బులు వెయ్యడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరల్లో జగన్ ఏపిని నంబర్ 1 చేశాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. చంద్రన్న భీమా పథకాన్ని తిరిగి ప్రారంభిస్తాం. అమెరికా, యూకే లాంటి దేశాల్లో కూడా రైతులకు సబ్సిడీలు ఇస్తారు. గత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. ఏ పంట వెయ్యాలో చెప్పడం దగ్గర నుండి గిట్టుబాటు కల్పించే వరకూ ప్రభుత్వం రైతులకి అండగా నిలబడిన రోజే రైతు నిలబడతాడు. రైతు లేనిదే దేశం లేదు, రైతుకి అండగా నిలబడటం మా బాధ్యత.
ముఖాముఖి సమావేశంలో రైతుల ఆవేదన
జగన్ పాలనలో నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నకిలీ మొక్కల తో ఇబ్బంది పడుతున్నాం. తెగుళ్లు పెరిగిపోయాయి. మమ్మల్ని పట్టించుకున్నవారు లేరు. అసలు ఏం మందు కొనాలో చెప్పే నాధుడు లేడు. పురుగుల మందులు, విత్తనం, ఎరువులు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. జగన్ ప్రభుత్వం చుక్కల భూముల సమస్య తీర్చామని చెబుతుంది కానీ మాకు పట్టాలు ఇవ్వలేదు. మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయాం. వైసిపి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు. జగన్ ప్రభుత్వం ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులు ఆపేసింది. దీని వలన రైతులు సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నాం. ఆర్బికే ల్లో ముందు డబ్బు కడతేనే విత్తనాలు ఇస్తున్నారు. అవి కూడా నాణ్యత ఉండటం లేదు. సన్ ఫ్లవర్ రైతులకి ప్రభుత్వం నుండి సాయం అందడం లేదు. టిడిపి హయాంలో 75 శాతం పూర్తి చేసిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను వైసిపి ప్రభుత్వం ఆపేసింది. వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గిట్టుబాటు ధర ఉండటం లేదు. ప్రభుత్వం కొన్నా డబ్బులు ఇవ్వడం లేదు. దళారుల చేతిలో మోసపోతున్నాం. టిడిపి హయాంలో వేరుశనగ పెట్టుబడి రూ.25 వేలు ఉంటే జగన్ పాలనలో రూ.50 వేలు అయ్యింది. పెట్టిన పెట్టుబడి లో సగం కూడా ఆదాయం రావడం లేదు.
లోకేష్ ను కలిసిన గరిమెనపెంట ఎస్టీ కాలనీ వాసులు
వెంకటగిరి నియోజకవర్గం గరిమెనపెంట ఎస్టీకాలనీ వాసులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామానికి చెందిన గంగినేని పద్మమ్మ, మరో ముగ్గురికి సర్వే నంబర్ 75/3, 75/4, 75/5, 75/6లలో 17.20 ఎకరాలు డి.ఫారం భూమి ఉంది. ఈ భూమిని వైసీపీ నాయకులు బొడ్డు మధుసూదన్ రెడ్డి, మరో 9మంది ఫెన్సింగ్ రాళ్లు పగులగొట్టి కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. వ్యవసాయం చేసుకోకుండా అడ్డుపడి బెదిరిస్తున్నారు. గతంలో సర్వే నంబర్ 66/2లో 5.30సెంట్లు, మరో 1.50సెంట్లు భూమిని వైసీపీ నేతలు ఆక్రమించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. మీరు అధికారంలోకి వచ్చాక కబ్జాదారుల నుంచి మా పొలాలకు రక్షణ కల్పించండి.
నారా లోకేష్ స్పందిస్తూ
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. టిడిపి హయాంలో భూమి కొనుగోలు పథకం ద్వారా పేదలకు భూములు ఇవ్వడం తప్ప ఇటువంటి అరాచకాలు లేవు. మేం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములను తిరిగి ఎస్సీ, ఎస్టీలకు అప్పగిస్తాం. భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
నారా లోకేష్ ను కలిసిన రామకూరు గ్రామస్తులు
వెంకటగిరి నియోజకవర్గం రామకూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 1983లో తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా కండలేరు డ్యామ్ ను నిర్మించారు. ఆ డ్యామ్ నిమిత్తం మా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించారు. మా ఇళ్లు, పొలాలకు గతంలోనే పరిహారం అందించారు కానీ మాకు పునరావాసం కల్పించలేదు. ముంపు గ్రామం కావడతో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. గ్రామంలో 100 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
వివిధ ప్రాజెక్టుల పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. సుదీర్ఘకాలంగా రామకూరు గ్రామప్రజలకు పునరావాసం కల్పించకపోవడం దురదృష్టకరం. రామకూరు ప్రజలకు పునరావాసంపై ప్రభుత్వానికి లేఖరాస్తాం. జగన్ ప్రభుత్వం పట్టించుకోకపోతే రాబోయే టిడిపి ప్రభుత్వం రామకూరు ప్రజలకు పునరావాస కాలనీ ఏర్పాటుచేసి సమస్య పరిష్కరిస్తాం.
లోకేష్ కలిసిన రామకూరు ముస్లిం సామాజికవర్గీయులు
రామకూరు గ్రామానికి చెందిన ఎస్సీ, ముస్లిం సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా గ్రామం కండలేరు డ్యామ్ నిర్మాణంలో ముంపునకు గురయ్యాక మాకు ఇళ్లు నిర్మించి ఇవ్వకపోవడంతో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నాం. మా గ్రామంలో 30 ముస్లిం కుటుంబాలు నివాసం ఉంటున్నాం. గత 30ఏళ్లుగా మా గ్రామంలో మాకు ఖబరస్తాన్, నమాజ్ చేసుకునేందుకు మసీదు లేదు. నాయకులు, అధికారులను కలిసి మా సమస్యలు చెప్పినా పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ….
ముంపుప్రాంతాల్లో ప్రజలకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రామకూరు ముంపుబాధితులకు కాలనీ ఏర్పాటుచేసి ఇళ్లు నిర్మిస్తాం. అక్కడ ముస్లింసోదరులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తాం.
యువనేతను కలిసిన గోనుపల్లి గ్రామస్తులు
వెంకటగిరి నియోజకవర్గం గోనుపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామానికి చెందిన 200 కుటుంబాలు వెయ్యిఎకరాల బంజరు భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. మాకు ఎటువంటి పట్టాలు లేవు, ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకోలేదు. పట్టాలు లేకపోవడంతో మాకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు రావడం లేదు. మా గ్రామ పరిధిలో 5 చెరువులు ఉన్నాయి కానీ వీటికి నీరు సరఫరా చేసే చానళ్లు లేవు. నీటిసౌకర్యం లేకపోవడంతో వర్షాధార పంటలను మాత్రమే పండించాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో కండలేరు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరివ్వాలని నిర్ణయించినా ప్రభుత్వం మారాక పట్టించుకోలేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించండి.
నారా లోకేష్ మాట్లాడుతూ.
వైసీపీ ప్రభుత్వానికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజాసమస్యల పరిష్కారంపై శ్రద్ధలేదు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాస్తవ లబ్ధిదారులను గుర్తించి పట్టాలు అందజేస్తాం. గోనుపల్లి రైతులకు ప్రభుత్వం అందించే రైతు సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేస్తాం. గోనుపల్లి పరిధిలోని చెరువులకు కండలేరు నుంచి నీరందించి రైతులకు సాగునీటి సౌకర్యం కల్పిస్తాం.
Also Read This Blog:Empowering Tomorrow’s Leaders: Yuvagalam Padayatra and Youth Development
Tagged: #LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh