Nara lokesh padayatra,Yuvagalam
Nara lokesh padayatra,Yuvagalam

వెంకటగిరి నియోజకవర్గంలో ఉత్సాహంగా యువగళం భారీ గజమాలలు, హారతులతో యువనేతకు నీరాజనాలు దారిపొడవునా ఆత్మీయ స్వాగతం, వినతుల వెల్లువ

వెంకటగిరి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనను అంతమొందించడమే  యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహం సాగుతోంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు నీరాజనాల నడుమ 129వరోజు పాదయాత్ర కుల్లూరు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా యువనేతకు భారీ గజమాలలు, హారతులతో ప్రజలు నీరాజనాలు పట్టారు. మహిళలు, యువకులు, వృద్ధులు గ్రామాల్లోకి ఆత్మీయ స్వాగతం పలుకుతూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. మరో ఏడాదిలో రాబోయే టిడిపి ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని, మీకోసం పనిచేసే చంద్రన్నను సిఎం చేసేందుకు సహకరించాలని కోరారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు యానాది సామాజికవర్గీయులతో సమావేశమై వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు, వివిధ గ్రామాల ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. కుల్లూరు, మాదన్నగారిపల్లి, వెంకట్రామరాజుపేట, చింతలపాలెం, ఉయ్యాలపాలెం, ఉయ్యాలపల్లి, కొత్తూరుపల్లి క్రాస్ మీదుగా పాదయాత్ర తెగచర్ల క్యాంప్ సైట్ కు చేరుకుంది. 129వరోజు యువనేత లోకేష్ 16.1 కి.మీ. దూరం నడిచారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1654.4 కి.మీ. పూర్తయింది.

యానాదులకు అటవీభూములు  కేటాయిస్తాం! సోలార్ మోటార్లతో నీటిసౌకర్యం కల్పిస్తాం

అధికారంలోకి వచ్చిన వెంటనే పక్కా ఇళ్లు నిర్మిస్తాం యానాది యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది

ముఖాముఖి సమావేశంలో యువనేత నారా లోకేష్

వెంకటగిరి: టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అటవీ భూములు డినోటిఫై చేసి యానాదులకు కేటాయిస్తాం, యానాదుల వ్యవసాయ భూముల్లో బోర్లు వేసి సోలార్ మోటార్లు ఏర్పాటు చేస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. వెంకటగిరి నియోజకవర్గం కుల్లూరు క్యాంప్ సైట్ లో యానాది సామాజికవర్గీయులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… యానాదులు కూడా జగన్ బాధితులే, ఒక్క ఛాన్స్ అన్న జగన్ అందరినీ ముంచేసాడు, యానాదులు కష్ట జీవులు.. కష్టాన్ని నమ్ముకున్నారని మత్స్యకారులుగా, కూలీలు గా, కౌలు రైతులుగా జీవనం సాగిస్తున్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తాండాలను అభివృద్ది చేసాను. తాండాల్లో మౌలిక వసతులు, రోడ్లు, త్రాగునీరు సౌకర్యం కల్పించాను. ఐటిడిఏ లు ఏర్పాటు చేసిన ఘనత టిడిపి ది. 500 జనాభా ఉన్న తాండాలను పంచాయతీలుగా గుర్తించింది టిడిపి. ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టిడిపి. ఎస్టీలకు వ్యవసాయ భూములు కేటాయించాం. పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే యానాదులకు పక్కా ఇళ్లు కట్టిస్తాం.

యానాదులకు దామాషా ప్రకారం నిధులు

దామాషా ప్రకారం నిధులు కేటాయించి, కమ్యూనిటీ భవనాలు, స్మశానాలు ఏర్పాటు చేస్తాం. యానాదుల కాలనీల్లో టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సిసి రోడ్లు మంజూరు చేస్తాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. మహిళల్ని ఆదుకోవడం కోసం మహాశక్తి పథకాన్ని ప్రకటించాం. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఇస్తాం. 5 ఏళ్లలో 90 వేలు. ప్రతి ఏడాది మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఆర్టీసి బస్సు ప్రయాణం ఉచితం, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు ఇస్తాం.

యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది!

టిడిపి పాలనలో 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయి అని వైసిపి ప్రభుత్వం మండలి సాక్షిగా అధికారికంగా ప్రకటించింది. యానాది యువతకి ఉద్యోగాలు , ఉపాధి కల్పించే బాధ్యత నాది. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. నిరుద్యోగ యువతకు రూ.3 వేల ఆర్ధిక సాయం అందిస్తాం. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎస్టీలకి వచ్చే అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది. నిధులు, విధులు లేని కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. జగన్ ప్రభుత్వం ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించింది. జిఓ.217 తీసుకొచ్చి మత్స్యకారులుగా జీవిస్తున్న యానాదుల పొట్టకొట్టాడు జగన్. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చెత్త జీఓ ని రద్దు చేసి చెరువుల్లో చేపలు పట్టుకోవడానికి యానాదులకు అవకాశం కల్పిస్తాం. TDP హయాంలో యానాదులకు ఇచ్చిన భూముల్లో పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చాం. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత అటవీ భూములు అంటూ కొన్ని చోట్ల భూములు వెనక్కి లాక్కున్నారు.

లోకేష్ ఎదుట యానాదుల ఆవేదన!

ముఖాముఖి సమావేశంలో లోకేష్ ఎదుట యానాది సామాజికవర్గీయులు తమ సమస్యలను తెలియేస్తూ… జగన్ పాలనలో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి రుణం ఇవ్వలేదు. యానాదుల గ్రామాల్లో కనీసం రోడ్లు, త్రాగునీరు సౌకర్యం కూడా లేదు. కరెంట్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నాం. కమ్యూనిటీ భవనాలు, స్మశానాలు లేక ఇబ్బంది పడుతున్నాం. 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని జగన్ ఎస్టీ మహిళల్ని మోసం చేసాడు. యానాది యువతకి ఉద్యోగాలు రావడం లేదు. జగన్ ప్రభుత్వం వచ్చిన గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను స్వాధీనం చేసుకున్నారు. గెలిస్తే బోర్లు వేసి సాగు కి నీరు అందిస్తాం అని జగన్ చేసాడని ఆవేదన చెందారు. టిడిపి ఇంఛార్జ్ కురుగోండ్ల రామకృష్ణ మాట్లాడుతూ… యానాదుల సమస్యలు తెలుసుకోవడానికి లోకేష్ సమావేశం ఏర్పాటు చేసారు. టిడిపి హయాంలోనే ఎస్టీలను ఆదుకున్నాం. ఇళ్లు, మౌలిక సదుపాయాలు కల్పించింది టిడిపియేనని అన్నారు.

యువనేతను కలిసిన కుల్లూరు గ్రామ ముస్లింలు

వెంకటగిరి నియోజకవర్గం కుల్లూరు గ్రామానికి చెందిన ముస్లింలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ముస్లింలకు గతప్రభుత్వం రంజాన్ తోఫా అందజేసేది, వైసిపి వచ్చాక రద్దుచేశారు. గతంలో పెళ్లికానుక కింద 50వేలు ఇచ్చేవారు, ఈ ప్రభుత్వం వచ్చాక లక్ష చేస్తానని చెప్పి మోసగించారు. మా గ్రామ ముస్లింలు నమాజ్ చేసుకోవాలంటే 7కి.మీ వెళ్లాల్సి వస్తోంది, మసీదు నిర్మించాలి. కుల్లూరు గ్రామంలో శ్రీకృష్ణదేవరాయలు కాలంనాడు తవ్వించిన చెరువు చుట్టూ ముళ్లపొదలతో నిండిపోయింది, శుభ్రపర్చాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

ముస్లింలకోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రద్దుచేసిన ముస్లిం జగన్ రెడ్డి. జగన్ కు ముస్లిం మైనారిటీల ఆస్తులపై ఉన్న శ్రద్ధ వారి సంక్షేమంపై లేదు. ముస్లింల కోసం ఖర్చుచేయాల్సిన 5,400 కోట్ల సబ్ ప్లాన్ నిధులను వైసిపి ప్రభుత్వం దారిమళ్లించింది. మసీదు ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడిన ఇబ్రహీంను నర్సరావుపేటలో వైసిపి నేతలు దారుణంగా నరికి చంపారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో అమలుచేసిన రంజాన్, దుల్హాన్, విదేశీవిద్య వంటి పథకాలను ఎటువంటి కొర్రీలు లేకుండా అమలుచేస్తుంది. కుల్లూరులో మసీదు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.

*యువనేతను కలిసిన మాదన్నగారిపల్లి రైతులు

వెంకటగిరి నియోజకవర్గం మాదన్నగారిపల్లి, చింతలపాలెం, వెంకట్రామరాజుపేట, సీతారాంపల్లి గ్రామాలకు చెందిన రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 1990లో కలువాయి చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసే క్రమంలో మా గ్రామాలకు చెందిన 542ఎకరాలు నీటమునిగాయి. అప్పటినుంచి ఇప్పటివరకు పరిహారం కోసం కోర్టుల్లో పోరాడి అలసిపోయాం, ఇప్పటివరకు ఒక్కపైసా ఇవ్వలేదు. తిరుపతి ఉపఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మా గ్రామాల రైతులకు హామీ ఇచ్చి ముఖం చాటేశారు. మీరు అధికారంలోకి వచ్చాక మమ్మల్ని ఆదుకోండి.

నారా లోకేష్ మాట్లాడుతూ..

రాజకీయ లబ్ధికోసం ఇన్ స్టంట్ గా హామీలిచ్చా అవసరం తీరాక పట్టించుకోకపోవడం ముఖ్యమంత్రి జగన్ కు అలవాటుగా మారింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్క ప్రాజెక్టు నిర్మించకపోగా, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టడం దారుణం. కలువాయి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితుల పరిహారం విషయమై అసెంబ్లీలో ప్రస్తావిస్తాం. ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోతే మేం అధికారంలోకి వచ్చాక పరిహారం అందిస్తాం.

యువనేతను కలిసిన చింతలపాలెం గ్రామ ఎస్సీ, ఎస్టీలు

వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం చింతలపాలెం గ్రామ ఎస్సీ, ఎస్టీలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పంచాయితీ పరిధిలో ఎస్సీ, ఎస్టీ కాలనీవాసులకు ఇళ్లు ఇరుకుగా ఉన్నాయి. అన్నదమ్ములు పెళ్లిళ్లు చేసుకుని వేరుకాపురం పెట్టేటప్పుడు నివాసస్థలాలులేక ఇబ్బంది పడుతున్నాం. ప్రస్తుతం ఉన్న నివాస స్థలాలు ఆవాస యోగ్యంగా  లేవు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ ఎస్సీ, ఎస్టీలకు నివాసస్థలాలు అందజేసి, మా సమస్యను పరిష్కరించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పేదల గూడుపై ఎటువంటి శ్రద్ధ లేదు. సెంటుపట్టా పేరుతో ఆవాసయోగ్యం కాని స్థలాలను అంటగట్టి రూ.7వేల కోట్లు దోచుకున్నారు. నిజమైన పేదలకుగాకుండా తమ పార్టీవారికి మాత్రమే ఆ స్థలాలు కూడా ఇచ్చుకున్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చింతలపాలెం ఎస్సీ, ఎస్టీలకు ఇళ్లస్థలాలతో పాటు ఇళ్లు నిర్మించి ఇస్తాం.

నారా లోకేష్ ను కలిసిన ఉయ్యాలపల్లి గ్రామస్తులు

వెంకటగిరి నియోజకవర్గం ఉయ్యాలపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా పంచాయతీలో 10వేల మంది జనాభా ఉండగా, 500 ఎకరాల పొలం ఉంది. కానీ పొలాలకు సాగునీరు లేదు, వర్షాలపై ఆధారపడాల్సివస్తోంది. వర్షాలు లేకపోతే గ్రామమంతా వేరే ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సివస్తోంది. సోమశిల నుండి తెలుగుగంగ కాలువ మా గ్రామం నుండి కండలేరు డ్యామ్ కు వెళుతుంది. తెలుగుగంగ కాలువ నుండి కిలోమీటర్ దూరంలో మా గ్రామంలో చెరువుకు లిఫ్ట్ ద్వారా నీరు అందించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ..

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేశారు. రూ.3వేల విలువైన వైరు కొనలేక లిఫ్టు ను మూలపెట్టిన దివాలాకోరు సిఎం జగన్. గత టిడిపి ప్రభుత్వం రైతులకు సాగునీరందరిందించేకు వేలకోట్లరూపాయల వెచ్చించి రాష్ట్రవ్యాప్తంగా లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుచేస్తే, వాటికి కరెంటుబిల్లులు, నిర్వహణ ఖర్చులు చెల్లించలేక పాడుబెట్టారు. తెలుగుగంగ పక్కనే ఉన్నా ఉయ్యాలపల్లి రైతులకు నీరందించకపోవడం దారుణం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉయ్యాలపల్లి రైతుల సాగునీటి కష్టాలు తీరుస్తాం.

యువనేతను కలిసిన కోటూరుపల్లి దళితులు

వెంకటగిరి నియోజకవర్గం కోటూరుపల్లి గ్రామ దళితులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలోని 200 మంది దళితులు, 200మంది ముస్లింలు గత 40సంవత్సరాలుగా నివసిస్తున్నాం. గ్రామశివార్లలో పోరంబోకు భూమిని సాగుచేసుకుని జీవిస్తున్నాం. అయితే మాకు ఈ భూమిపై ఎటువంటి హక్కులు గానీ, పట్టాలు గానీ లేవు. మీరు అధికారంలోకి వచ్చాక మేం సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

ముఖ్యమంత్రి జగన్ కు దళితుల ఓట్లపై తప్ప దళితులపై ప్రేమలేదు. రాష్ట్రలో 12వేల ఎకరాల టిడిపి ప్రభుత్వ హయాంలో భూమి కొనుగోలు పథకం కింద దళితులకు 5వేలఎకరాలు కొనుగోలు చేసి పేద దళితులకు అందజేశాం. టిడిపి అధికారంలోకి వచ్చాక కోటూరుపల్లిలో వాస్తవ అనుభవదారులను గుర్తించి పట్టాలు అందజేస్తాం.

యువనేత లోకేష్ ను కలిసిన తెగచర్ల గ్రామస్తులు

వెంకటగిరి నియోజకవర్గం తెగచర్ల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామ పొలాల్లో వర్షాధారంపై ఆధారపడి పంటలు పండిస్తున్నాం. తీవ్ర అనావృష్టి పరిస్థితుల నేపథ్యంలో మా గ్రామస్తులు సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. మా గ్రామం సమీపం నుండి వెళ్లే సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ ను ఆనుకొని వందలాది ఎకరాల భూమి ఉంది. ఎస్ఎస్ఎల్ సి ని పూర్తిచేసి లిఫ్ట్ ల ద్వారా మా పంచాయితీలోని చెరువులకు నీళ్లందించినట్లయితే మా ప్రాంతం సస్యశ్యామలమై వలసల నివారణ సాధ్యమవుతుంది. మా గ్రామ ఎస్సీ కాలనీలోని ఎంపిపిఎస్ పాఠశాలను పక్కనున్న పాఠశాలలో విలీనం చేయడం వల్ల, డ్రాపౌట్స్ పెరిగి విద్యకు దూరమవుతున్నారు. భూమిలేని పేదలకు భూమి కొనుగోలు పథకం కింద భూమి ఇవ్వాలి. గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటుచేసి నీరందించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ..

 జగన్ నిర్వాకం కారణంగా గత నాలుగేళ్లుగా లక్షలాది రాయలసీమ ప్రజలు పొట్టచేతబట్టుకొని పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ రాయలసీమను అమలుచేసి సీమ ప్రజల కష్టాలను తీరుస్తాం. అధికారంలోకి వచ్చాక సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ పూర్తిచేసి, సమీప గ్రామాల ప్రజలకు నీరందిస్తాం. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం.

Also Read This Blog: A Walk Towards Social Impact: Yuvagalam Padayatra and the Power of Youth

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *