Nara lokesh padayatra,Yuvagalam
Nara lokesh padayatra,Yuvagalam

ఆత్మకూరు నియోజకవర్గంలో దుమ్ములేపిన యువగళం అనంతసాగరం బహిరంగసభకు భారీగా తరలివచ్చిన జనం వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించిన పాదయాత్ర

ఆత్మకూరు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దుమ్ములేపింది. 128వరోజు పాదయాత్ర అనంతసాగరం శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. యువనేతకు చూసేందుకు దారిపొడవునా జనం పెద్దఎత్తున తరలిరావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అనంతసాగరం జంక్షన్ లో నిర్వహించిన బహిరంగసభకు జనం కిటకిటలాడారు. సభలో యువనేత మాట్లాడుతున్నంతసేపు కార్యకర్తల స్పందనతో సభ హోరెత్తింది. యువనేతను వివిధ వర్గాల ప్రజలకు హారతులు పట్టి గ్రామాల్లోకి ఆహ్వానించారు. మహిళలు, వృద్ధులు, యువకులు లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. మరో ఏడాది ఓపిక పట్టాలని, రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి ముందుకు సాగారు. అనంతసాగరంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర మంచాలపల్లి, ఉప్పరపాడు మీదుగా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. వెంకటగిరి ఇన్ చార్జి కురుగుండ్ల రామకృష్ణ నేతృత్వంలో యువనేతకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. యువకులు భారీఎత్తున బాణాసంచా కాలుస్తూ నినాదాలు చేస్తూ యువనేతను స్వాగతించారు. 128వరోజు యువనేత లోకేష్ 14.4 కి.మీ. దూరం పాదయత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1638.3 కి.మీ. మేర పూర్తయింది. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వారంరోజులపాటు యువనేత లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

దళారుల కారణంగా ఖర్చులు కూడా మిగల్లేదు-రామసుబ్బయ్య, మహిమలూరు, ఆత్మకూరు మండలం

పది ఎకరాలు వరి సాగు చేశాను. ఏడు వందల బస్తాల ధాన్యం పండింది. కొనడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు.. అడిగితే కొంటాము..నమోదు చేసుకున్నాం అన్నారు. 17 రోజుల పాటు చూసి వ్యాపారులకు అమ్ముకున్నా. 45 కేజీల బస్తాకు 5 కేజీల తరుగు తీశారు. 700 బస్తాలకు 350 కేజీలు దళారులకు వెళ్లాయి. 40 కేజీల బస్తా ధర కూడా రూ.750కి కొన్నారు. ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి అయింది. తరుగు తీసివేయకుండా ఉంటే మరికొంత లాభం వచ్చేది. వచ్చిన ఆదాయం పెట్టుబడికి, చేసిన చాకిరీకి సరిపోయింది.

వైసీపీ అంత‌మొందిస్తే…టిడిపి ఆదుకుంది!- వైసీపీ చేతిలో హ‌త్యకి గురైన టిడిపి కార్యక‌ర్త  -బాధిత కుటుంబానికి రూ.5లక్షల సాయం అందజేసిన లోకేష్

వైసిపి నేతల చేతిలో హత్యగావించబడిన కార్యకర్త కుటుంబానికి టిడిపి యువనేత నారా లోకేష్ అనంతసాగరంలో జరిగిన బహిరంగసభ వేదికపై రూ.5లక్షల సాయం అందించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజ‌క‌వ‌ర్గం అనంత‌సాగ‌రం మండ‌లం మిన‌గ‌ల్లు గ్రామానికి చెందిన సీనియ‌ర్ టిడిపి కార్యక‌ర్త చిట్టిబోయిన పెద్ద వెంగ‌య్యని వైసీపీ నేత‌లు అత్యంత దారుణంగా హ‌త‌మార్చారు. వైసీపీ ఇంటి పెద్దని చంపడంతో వారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం తీసుకుంది. అనంత‌సాగ‌రంలో శుక్రవారం నిర్వ‌హించిన బ‌హిరంగ‌స‌భ‌లో మృతుడు భార్య ధన లక్ష్మమ్మకి లోకేష్ రూ.5ల‌క్షలు ఆర్థిక సాయాన్ని అంద‌జేశారు. తెలుగుదేశం కార్యక‌ర్తలంతా ఒక కుటుంబ‌మ‌ని, ఎవ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చినా ఆదుకునే బాధ్యత త‌మ‌దేన‌ని లోకేష్ పేర్కొన్నారు.

*వైసిపి నేతలు అక్రమ కేసులతో వేధిస్తున్నారు!*

*లోకేష్ ఎదుట పడమటి కమ్మంపాడుదళిత సర్పంచ్కత్తి లావణ్యఆవేదన*

నేను గ్రామ సర్పంచ్ గా గెలిచిన నాటి నుండి వైసీపీ నేతలు వేధిస్తున్నారని ఆత్మకూరు నియోజకవర్గం పడమటి కమ్మంపాడు సర్పంచ్ కత్తి లావణ్య ఆవేదన వ్యక్తంచేశారు. అనంతసాగరం శివారు క్యాంప్ లో యువనేత లోకేష్ ను కలిసిన లావణ్య వైసిపి నేతలనుంచి ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు.. మా గ్రామంలో 7లక్షలు ఖర్చుపెట్టివాటర్ ట్యాంకర్ ఏర్పాటుచేశాను.  ఆ బిల్లులు రాకుండా అధికారుల వద్దకు వెళ్లి అడ్డుకుంటున్నారు. నాకు మద్దతుగా నిలిచిన వారికి సంక్షేమ పథకాలు తొలగించడం, ఉపాధి హామీకి వెళ్లినా మస్టరు వేయకుండా వారిని కూడా ఇబ్బందులు పెడుతున్నారు. మా గ్రామంలో ఇసుక రీచ్ ఉంది. అనుమతి ఇచ్చిన దానికంటే అధికంగా జేసీబీలతో తోడేస్తున్నారు. ఇష్టారీతిన గ్రావెల్ కూడా తోలుతున్నారు. దీంతో గ్రామాల్లో ప్రమాదాలు జరగడంతో పాటు, రోడ్లు కూడా పాడైపోయాయి. దీన్ని ప్రశ్నించినందుకు నా భర్తపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని వాపోయింది. తెలుగుదేశం పార్టీ మీకు అండగా నిలుస్తుంది, ధైర్యంగా ఉండాలని లోకేష్ భరోసా ఇచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చాక దళిత సర్పంచ్ ను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నెల్లూరులో అడుగుపెట్టకముందే ప్యాంట్లు తడుపుకుంటున్నారు!

సింహపురితో మార్పు మొదలైంది. మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో అని చెప్పా. యువగళానికి వస్తున్న జనాన్ని చూసి జగన్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చింది

ఆత్మకూరు నేలపై పాదయాత్ర నా అదృష్టం

ఆత్మకూరు లో ఎంట్రీ అదుర్స్. సింహపురి లో యువగళం గర్జన మొదలైంది. ఆత్మకూరు ప్రజలకు ఆత్మాభిమానం ఎక్కువ. ధర్మం వైపు నిలబడతారు. దానం చేసే గుణం ఇక్కడి ప్రజలకు ఉంది.  రాజులు ఏలిన నేల ఆత్మకూరు. నెల్లూరు జిల్లా కు జీవనాడి ఆత్మకూరు. జిల్లా మొత్తానికి సాగు, తాగు నీరు అందించే సోమశిల జలాశయం ఉంది ఇక్కడే. అలఘనాథుని దేవాలయం, ఏఎస్ పేట దర్గా ఉన్న పుణ్య భూమి ఆత్మకూరు. స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు సోమశిల, కండలేరు ప్రాజెక్టులను నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. ఘన చరిత్ర ఉన్న ఆత్మకూరు నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

విద్యార్థులు పెరిగింది ఎక్కడ?

డిజిటల్ బోర్డు మీద చేత్తో చెరిపే మేధావి జగన్ ప్రభుత్వ స్కూళ్ల లో విద్యార్థులు పెరిగారు అని చెబుతున్నాడు. ఇంగ్లిష్ అనడం కూడా రాక వింగ్లిష్ అంటున్నాడు. 2022-23 లో 47,40,421విద్యార్థుల‌కి విద్యాకానుక కిట్లు పంపిణీ చేశారు. 2023-24 లో 43,10,165 కిట్లు విద్యార్థుల‌కి ఇచ్చారు. 4 ల‌క్ష‌ల 30 వేల మంది విద్యార్థులు త‌గ్గారు.మ‌రి కన్నింగ్ జగన్ చెప్పిన పెరిగిన విద్యార్థులు ఎక్క‌డ వున్నారో?. మే కరెంట్ బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టిందా? ఒక్క మే నెలలో జగన్ బాదుడు ఎంతో తెలుసా? రూ.11,300 కోట్లు. ఒక సారి ట్రూ అప్ ఛార్జీలు, రెండు సార్లు అడ్జెస్ట్మెంట్ ఛార్జీలు పెంచాడు. సీఎం గా ప్రమాణస్వీకారం చేస్తూ విద్యుత్ బిల్లులు తగ్గించేస్తా అన్నాడు. ఇప్పుడు వందల్లో బిల్లు వచ్చే వారికి వేలల్లో వస్తుంది. వైసిపి ఫ్యాన్ పర్మినెంట్ గా స్విచ్ ఆఫ్ చెయ్యండి మీపై పడిన భారం తగ్గుతుంది.

మహాశక్తితో మహిళల కష్టాలు తీరుస్తాం!

మహిళల్ని నమ్మించి ముంచేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఎం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసారు. కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం.

అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి

జగన్ యువత ఎప్పటికీ పేదరికంలో ఉండాలని కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

మోటార్లకు మీటర్లతో రైతులకు ఉరితాళ్లు

జగన్  రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్  పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2.  రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. మీటర్లు రైతులకు ఉరితాళ్లు. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. కన్నింగ్ జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. జీతం ఒకటో తారీఖున వచ్చే దిక్కు లేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది.

బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం!

బీసీలు పడుతున్న కష్టాలు నేను చూసాను. 26 వేల అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం.

మైనారిటీలకు తీరని ద్రోహం

జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హాజిరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పధకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం.  రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో మీరు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నారు. ఇప్పుడు మీకు కనీస గౌరవం అయినా ఉందా. నాడు-నేడు అన్ని సామాజిక వర్గాలకు సమాన గౌరవం ఇచ్చింది ఒక్క టిడిపి మాత్రమే.

ఆత్మకూరులో అవినీతి ఫుల్లు… అభివృద్ధి నిల్లు!

ఆత్మకూరు ని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని మీరు వైసిపి ని భారీ మెజారిటీ తో గెలిపించారు. మీరు నమ్మి గెలిపించిన వైసిపి ఆత్మకూరు కి చేసింది గుండుసున్నా. ఆత్మకూరు లో అభివృద్ధి నిల్లు…వైసిపి నేతల అవినీతి ఫుల్లు. పెన్నా నదిని ఏటిఎస్ (ఎనీ టైం స్యాండ్) లా మార్చుకున్నారు వైసిపి నేతలు. విపరీతంగా ఇసుక ను దోచేస్తున్నారు. ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది మంటూ కొంత మంది గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్నారు. ఏకంగా నాడు- నేడు పనుల కోసం వచ్చిన మెటీరియల్ తో వైసిపి నాయకులు ఇళ్లు నిర్మించుకుంటున్నారు. చనిపోయిన గౌతమ్ రెడ్డి గారికి, ఆత్మకూరు నియోజకవర్గానికి తీరని అన్యాయం చేసాడు జగన్.

వారివల్లే ప్రమాదంలో సోమశిల డ్యామ్

హాఫ్ నాలెడ్జ్ ఇరిగేషన్ మంత్రి కారణంగా సోమశిల డ్యామ్ ప్రమాదంలో పడింది. పబ్లిసిటీ పిచ్చతో 78 టిఎంసి ఫుల్ కెపాసిటీ నింపి డ్రోన్ షాట్స్ తీసి బిల్డప్ ఇవ్వాలని చూసారు. ఆ దెబ్బకి సోమశిల గేట్లు ప్రమాదంలో పడి పరిస్థితి డేంజర్ గా మారింది. జగన్ ది ఎంత చెత్త పాలనో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. రూ.300 కరెంట్ వైరు కొనలేక. జనరేటర్ లో డీజిల్ అయిపోయి టైం కి గేట్లు ఎత్తలేకపోయారు. ఎమర్జెన్సీ లో రాంగ్ డైరెక్షన్ లో గేట్లు ఎత్తడంతో డ్యామ్ దెబ్బతింది. వంద కోట్లకు పైగా నష్టం జరిగింది. నివార్ తుఫాను టైం లో జగన్ పిచ్చి చేష్టలతో ఒకేసారి 8 లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందకి వదిలారు. దీనితో ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటి ,నెల్లూరు రూరల్ నియోజకవర్గాలు మునిగిపోయాయి. పంటలు, ఇళ్లు మునిగిపోయి 2 వేల కోట్ల నష్టం కలిగింది. ఇప్పటి వరకూ రూపాయి నష్ట పరిహారం ఇవ్వలేదు. సోమశిల డ్యాంకు రిపేర్లు చెయ్యలేదు.

ఆత్మకూరును అనాధగా వదిలేశారు!

ఆత్మకూరు బై ఎలక్షన్ లో మంత్రులంతా ప్రచారం చేసారు. వందల హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆత్మకూరు ని అనాధగా వదిలేసారు. పేరుకే విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యే కానీ రిమోట్ బంధువు వెంకటేశ్వర రెడ్డి దగ్గర ఉంది. కాంట్రాక్టులు, ఇసుక దందా, ఎర్రచందనం స్మగ్లింగ్, అక్రమ లే అవుట్లు, మైనింగ్ డీల్స్ అన్ని నెల్లూరు కేంద్రంగా వెంకటేశ్వర రెడ్డి సిండికేట్ సెటిల్ చేస్తుంది. ఆత్మకూరు కి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు. సరే సీఎం గా ఇచ్చిన హామీ అయినా నిలబెట్టుకున్నాడా అంటే అదీ లేదు. సంఘం బ్యారేజ్ ప్రారంభోత్సవానికి వచ్చిన జగన్ ఆత్మకూరు కి రూ.85 కోట్లు మంజూరు చేసినట్టు ప్రకటించారు. 12 ఇరిగేషన్ పనుల కోసం రూ.40 కోట్లు, 20 గ్రామాల్లో రోడ్లు వెయ్యడానికి రూ.14 కోట్లు, సంఘం బ్యారేజ్ నుండి నేషనల్ హైవే వరకూ రోడ్డు వెయ్యడానికి 15 కోట్లు, సంఘంలో తాగునీటి కోసం 4 కోట్లు. ఇందులో ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. 9 ఎన్నికల్లో కేవలం రెండు సార్లే టిడిపి ని గెలిపించినా ఆత్మకూరు ని అభివృద్ధి చేసాం. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చేసింది టిడిపి. సాగు, తాగునీటి ప్రాజెక్టులు నిర్మించింది టిడిపి. టిడ్కో ఇళ్లు కట్టింది, రోడ్లు వేసింది టిడిపి. కానీ మీరు పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు.

అధికారంలోకి వచ్చాక సోమశిల హైలెవల్ కెనాల్!

టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత సోమశిల హై లెవల్ కెనాల్ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే సిబ్బందిని పెంచి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తాం. ట్రోమా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. పరిశ్రమలు తీసుకొచ్చి మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు ని అభివృద్ధి చేస్తాం. యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. నియోజకవర్గంలో రోడ్లు అద్వానంగా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ బాలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు వేస్తాం. డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం.

టిడిపి కేడర్ ను ఇబ్బంది పెట్టినవారిని వదలను

పత్తి, మిర్చి, పొగాకు, పసుపు, వరి, జామాయిల్,  హార్టీ కల్చర్ రైతులు పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం. టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను పూర్తిచెయ్యలేని చెత్త ప్రభుత్వం ఇది. టిడిపి అధికారంలోకి వచ్చిన టిడ్కో ఇళ్లు పూర్తి చేసి ఇస్తాం. టిడిపి కార్యకర్తల ను కిరాతకంగా హత్య చేసారు, అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఎవ్వరిని వదిలి పెట్టను వడ్డీతో సహా చెల్లిస్తా. టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వారు ఆత్మకూరు లో ఉన్నా, అమెరికా లో ఉన్నా పట్టుకొచ్చి లోపలేస్తా.

సోమశిల ప్రాజెక్టును ధ్వంసం చేశాడు-ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ఫైర్

సోమశిల ప్రాజెక్టు ను సైకో ధ్వంసం చేశాడు, సోమశిల ఉత్తర కాలువను నాశనం చేసాడు, అందుకే సైకో పోవాలి… సైకిల్ రావాలని కోరుకుంటున్నట్లు ఆనం రాంనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం మాఫియా మయమైంది, జగన్ అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే నేను ఈ విషయం చెప్పాను. నారా లోకేష్ ప్రజల ఆశీస్సులతో 1600 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆత్మకూరు లో తట్టెడు మట్టి వెయ్యలేదు. ఇక్కడ ప్రజలకు ఇసుక దొరకకుండా చేసి వైసిపి నేతలు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. సోమశిల ప్రాజెక్టు డ్యామేజ్ అయితే మరమ్మత్తుల కోసం వైసిపి ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు. రైల్వే లైన్, ప్రభుత్వ ఆసుపత్రి అన్ని వైసిపి ప్రభుత్వం లో నిర్లక్ష్యానికి గురయ్యాయి. రాబోయేది టిడిపి ప్రభుత్వమే, సిఎం కాబోయేది చంద్రబాబు, యువతకు భవిష్యత్తు ఇచ్చేది లోకేష్. ఆత్మకూరు ని అభివృద్ది చేయబోయేది టిడిపి. ఆత్మకూరు కి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని కోరుతున్నాను. వైసిపి ది విధ్వంసకర ప్రభుత్వం. కొత్తవి కట్టడం వీళ్ళకి చేతకాదు. అందుకే ఇది సైకో ప్రభుత్వం. ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చేసింది అంటే తన పతనాన్ని తనే కోరుకుంది.

వైసీపీ నుండి టిడిపి లోకి 60 కుటుంబాలు-పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన యువనేత లోకేష్

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం లోని వైసీపీ కి చెందిన 60 కీలక కుటుంబాలు యువనేత లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే ఆనం రామనారాయణారెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం యువగళం క్యాంపు సైట్ లో శుక్రవారం ఈ చేరికలు జరిగాయి. యువనేత లోకేష్ 60 వైసీపీ కుటుంబాల వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికి, అభినందించారు. వైసీపీ ఆరాచక పాలన అంతం చేయడానికి కృషి చేసి, నియోజకవర్గంలో పసుపు జెండాను ఎగరేయాలని కోరారు. TDP లో చేరిన వారిలో అప్పారావుపాలెం సర్పంచ్ సోమకుమారి, ఎంపిటిసి జనార్ధన్, వైసీపీ నాయకులు, క్రియాశీల కార్యకర్తలు రామకృష్ణ, బాషా, మల్లిఖార్జునరెడ్డి, శశిధర్, కొండారెడ్డి, మల్లిఖార్జున, కృష్ణారెడ్డి, రత్నం, జి.ప్రసాద్, ఎన్.పెంచల్ నాయుడు, దినేష్, శ్రీధర్, ఎస్. శ్రీను, కిలారి.వెంకటేశ్వర్లు ఉన్నారు. నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలను అభినందించారు.

Also Read This Blog;Empowering Tomorrow’s Leaders: Yuvagalam Padayatra and Youth Development

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *