Naralokesh padayatra,Yuvagalam
Naralokesh padayatra,Yuvagalam

సూళ్లూరుపేట నియోడజకవర్గంలోకి ప్రవేశించిన యువగళంగజమాలలు, పూలవర్షంతో యువనేతకు ఆత్మీయ స్వాగతం వెంకటగిరిలో వారంరోజులపాటు దుమ్ములేపిన పాదయాత్ర

సూళ్లూరుపేట: వారంరోజులపాటు వెంకటగిరి నియోజకవర్గంలో దుమ్మురేపిన యువగళం పాదయాత్ర శుక్రవారం రాత్రి జననీరాజనాల నడుమ సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. భారీ గజమాలలు, బాణాసంచా మోతలతో కేరింతలు కొడుతూ సూళ్లూరుపేట ప్రజలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు యువనేతకు ఘనస్వాగతం పలికారు. 135వరోజు పాదయాత్ర నిడిగల్లు శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమై ఇనుగుంట వద్ద సూళ్లూరుపేట నియోజకవర్గంలోకి ప్రవేశించింది. మహిళలు, యువకులు యువనేతపై పూలవర్షం కురిపించి, హారతులు పడుతూ ఘనస్వాగతం పలికారు. వెంకటగిరి నియోజకవర్గంలో చివరిరోజు పాదయాత్రకు ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. యువనేత లోకేష్ పాదయాత్రకు ఆయన మేనమామ నందమూరి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. లోకేష్ తో కలిసి కొంతదూరం ఆయన అడుగులు వేశారు. తన మామ రామకృష్ణ రాకతో సంతోషం వ్యక్తం చేసిన యువనేత లోకేష్… కుటుంబసభ్యుల క్షేమసమాచారం తెలుసుకున్నారు. జయంపు గ్రామంలో యువనేత లోకేష్ బ్రాహ్మణులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. నిడిగల్లు నుంచి ప్రారంభమైన పాదయాత్ర పిగిలాం, కామకూరు, హస్తకవేరి, జయంపు మీదుగా ఇనుగుంట వద్ద సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అక్కడనుంచి కొత్తపాలెంపాడు మీదుగా వజ్జావారిపాలెం విడిది కేంద్రానికి చేరుకుంది. 135వరోజు యువనేత లోకేష్ 16.3 కి.మీ. పాదయాత్ర సాగించారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1753.4 కి.మీ. మేర పూర్తయింది. 3రోజులపాటు సూళ్లూరుపేట నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. 

వైసీపీ పాలనలో దేవాలయాల భూములకూ రక్షణ కరువు ఆలయాల నిర్మాణం, నిర్వహణకు రాష్ట్ర బడ్జెట్ నుంచే నిధులిస్తాం వేద విద్యార్థులకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తాం నియోజకవర్గాల్లో కమ్యూనిటీహాళ్లు, అపరకర్మల భవనాలు నిర్మిస్తాం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బ్రాహ్మణులు సహకరించాలి

బ్రాహ్మణులతో రచ్చబండ కార్యక్రమంలో యువనేత నారా లోకేష్

వెంకటగిరి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో దేవాలయాల భూములకు కూడా రక్షణ కరువైందని టిడిపి యువనేత Nara Lokesh పేర్కొన్నారు. వెంకటగిరి నియోజకవర్గం జయంపు గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… వైసిపి నేతలు ఆలయాల భూములనుకూడా యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. దేవాదాయశాఖతో సంబంధం లేకుండా అర్చకులకు గౌరవవేతనం, ఆలయాల నిర్వహణకు అయ్యే ఖర్చులు ప్రభుత్వ ఖజానా నుంచే అందజేస్తాం. బ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటుచేసిన తొలి ప్రభుత్వం తెలుగుదేశమే. వైసిపి ప్రభుత్వం వచ్చాక కార్పొరేషన్లను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. బ్రాహ్మణులకు దామాషా ప్రకారం నిధులు కేటాయించాల్సి ఉంది. పేద బ్రాహ్మణ విద్యార్థుల చదువుకు  ప్రభుత్వం సహాయం చేయడం లేదు. అర్చకులకు ఐడి కార్డులు అందజేసి, తిరుమలలో దర్శనానికి చర్యలు తీసుకుంటాం.

వేదవిద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇస్తాం!

గతంలో విదేశీవిద్య, స్వయం ఉపాధి రుణాలు ఇచ్చాం. దామాషా ప్రకారం కార్పొరేషన్ కు నిధులిచ్చి బ్రాహ్మణులను పేదరికం నుంచి బయటకు తెస్తాం. అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అపరకర్మల భవనాలు నిర్మిస్తాం. అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో  నిరుద్యోగ యువతకు ప్రతినెలా యువగళం పేరుతో 3వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. వేదపాఠశాలల విద్యాభ్యాసం చేసినవారికి కూడా నిరుద్యోగ భృతి వర్తింపజేస్తాం. నియోజకవర్గస్థాయిలో బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తాం. ఆడబిడ్డ నిధి కింద నెలనెలా 1500 ఇస్తాం, పేద ఆడబిడ్డలకు పెళ్లికానుక ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. గుడి స్థాయిని బట్టి రాష్ట్రబడ్జెట్ నుంచే నిర్వహణకు నిధులిస్తాం.

పాతబీహార్ ను తలపిస్తున్న పరిస్థితులు

ఈరోజు పేపరు తెరిస్తే దాడులు, హత్యలు, కిడ్నాప్ లు, మానభంగాలు కనపడుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితులు పాత బీహార్ ను తలపిస్తున్నాయి.  ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నిరుద్యోగిత 3రెట్లు పెరిగింది. ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా. ఈ అరాచక ప్రభుత్వాన్ని సాగనంపి, రాష్ట్రాన్ని నెం.1 చేసేందుకు అందరూ సహకరించాలి. బాబుగారు అంటే బ్రాండ్, ఆయన సిఎంగా ఉన్నపుడు పెద్దఎత్తున ఐటి, పరిశ్రమలను తెచ్చారు. 2014-19 నడుమ రాష్ట్రంలో 6లక్షలమందికి ఉద్యోగాలిచ్చినట్లు అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రభుత్వమే ఒప్పకుంది. రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే బాబు గారి లక్ష్యం. ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి ద్వారా 20లక్షల ఉద్యోగాలు తెస్తాం.

రచ్చబండ కార్యక్రమంలో                బ్రాహ్మణులు మాట్లాడుతూ….

అపర కర్మలు నిర్వహించడానికి భవనాలు లేక ఇబ్బంది పడుతున్నాం. నియోజకవర్గానికి ఒక భవనం కడితే ఉపయోగంగా ఉంటుంది. జగన్ పాలనలో పురోహితులకు గౌరవ వేతనం అందడం లేదు. కొంత మందికి మాత్రమే నామ మాత్రంగా అందుతుంది. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత  కార్పొరేషన్ నుండి బ్రాహ్మణ విద్యార్థుల చదువు కోసం సహాయం అందడం లేదు. వేద పాఠశాలల్లో అభ్యసించిన వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదు. ఉద్యోగాలు కూడా రావడం లేదు. సర్టిఫికేట్లు ఉన్నా ఉపయోగం లేక వేద విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జగన్ పాలనలో పేద బ్రాహ్మణ విద్యార్థుల ఉన్నత విద్య, బ్రాహ్మణ ఆడ పిల్లల పెళ్లిళ్లకు సహాయం అందడం లేదు. బ్రాహ్మణుల పై దాడులు పెరిగాయి. మమ్మల్ని కాపాడటానికి ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చెయ్యాలి. దేవుడు మాన్యం కి పట్టాలు లేక అన్యాక్రాంతం అవుతుంది. గుడి పేరు మీద పట్టా ఇస్తే నిర్వహణ ఖర్చులకి ఉపయోగంగా ఉంటుంది. అర్చకులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. తిరుమల లో దర్శన అవకాశం కల్పించాలి. దాతలు గుడులు కడుతున్నారు. కానీ అర్చకులకు కనీస వేతనం లేక ఇబ్బంది పడుతున్నాం. దూప, దీప, నైవేద్యం కోసం కూడా ఇబ్బంది పడుతున్న అనేక ఆలయాలు ఉన్నాయి.

లోకేష్ ను కలిసిన పిగిలాం గ్రామ ఎస్టీ సామాజికవర్గ ప్రజలు

వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం పిగిలాం గ్రామ ఎస్టీ సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలోని ఎస్టీ కాలనీలో స్థలం కొరత ఉంది, కుటుంబాలు ఎక్కువ ఉండడంతో గుడిసెల్లో నివాసముంటున్నారు. హౌసింగ్ పథకం ద్వారా ఎస్టీలకు 50 ఇళ్లను మంజూరు చేయాలి. మా కాలనీలో తాగునీటి సమస్య అధికంగా ఉంది, ఇంటింటికీ నీటి కుళాయి ఇప్పించాలి. కాలనీలో సీసీ రోడ్లు నిర్మించాలి. మా కాలనీలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల రావడంతో సరిగా విద్యుత్ సరఫరాలేదు, సమస్యను పరిష్కరించాలి. ఎస్టీలకు నామినేటెడ్ పదవులు ఇప్పించి రాజకీయ ప్రాతినిద్యం కల్పించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీ, ఎస్టీలు వివక్షకు గురవుతున్నారు. ఎస్టీలకు రాజ్యాంగబద్దంగా దక్కాల్సిన హక్కులను వైసిపి ప్రభుత్వం హరిస్తోంది. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.5,355కోట్లను దారిమళ్లించి ఎస్టీ సంక్షేమానికి పాతరేశాడు. సెంటుపట్టా పథకం వైసిపి నేతలు దోచుకోవడానికే తప్ప పేదప్రజలకోసం కాదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పిగిలాం ఎస్టీ కాలనీలో అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం. కాలనీలో ప్రతి ఇంటికి కుళాయి అందజేసి, తాగునీటి సమస్య లేకుండా చేస్తాం. సిసి రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన పిగిలాం గ్రామ ప్రజలు

వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం పిగిలాం గ్రామ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంమీదుగా వెళ్లే తెలుగుగంగ బ్రాంచ్ కెనాల్ పెండింగ్ లో ఉంది, పూర్తి చేయాలి. పిగిలాం నుండి జార్లపాడు వెళ్లే రహదారిని తారు రోడ్డుగా మార్చాలి. జార్లపాడు చెరువుకు నీరు ఇచ్చేందుకు TDP ప్రభుత్వం సర్వే చేసింది. ప్రభుత్వం మారడంతో ఈ చెరువుకు నీరు ఇచ్చే అంశం మూలనపడింది. పిగిలాం చెరువు రెండు తూములు పాడైపోయాయి, వాటి స్థానంలో కొత్తవి వేయాలి. గత ప్రభుత్వంలో కొన్నిచోట్ల సీసీ రోడ్లు వేశారు, మిగిలినవి కూడా పూర్తిచేయాలి. విద్యుత్ లైన్లను ఆధునీకరించాలి. పిగిలాం ఆర్ అండ్ బి రోడ్డు నుండి చిన్న చెరువు కట్టమీదుగా తారురోడ్డు నిర్మించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామసీమలను నిర్వీర్యం చేశారు. గ్రామపంచాయితీల అభివృద్ధికి కేంద్రం మంజూరుచేసిన 8,600 కోట్లు దారిమళ్లించారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 25వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 30లక్షల ఎల్.ఈ.డీ వీధిదీపాలు ఏర్పాటు చేశాం. మేం అధికారంలోకి వచ్చాక పిగిళం నుండి జార్లపాడు కు తారురోడ్డు నిర్మిస్తాం. జార్లపాడు చెరువును నీటిసరఫరాకు చర్యలు తీసుకుంటాం. సీసీరోడ్లు, ఎల్ ఈడి వీధిలైట్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన పిగిలాం గ్రామ దళితులు

వెంకటగిరి నియోజకవర్గం పిగిలాం గ్రామ ఎస్సీ సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామం ఎస్సీ కాలనీలో 2వేల మంది జనాభా ఉన్నారు. మాకు ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించి, రక్షిత నీరు అందించాలి. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అంకిశెట్టిగుంట చెరువుకు మరమ్మతులు చేయించాలి. గ్రామంలో దళితులకు 30 పక్కా ఇళ్లు అందించాల్సి ఉంది. మా కాలనీలో సీసీ రోడ్డు నిర్మించాలి. దళితులకు రాజకీయ ప్రాధాన్యతనిచ్చి నామినేటెడ్ పదవులు కేటాయించాలి. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఎస్సీలకు మాత్రమే ఖర్చు పెట్టాలి. గత పాలనలో ఎస్సీలకు సబ్సిడీ లోన్లు వచ్చేవి. నేడు రావడం లేదు.  ఎస్సీలకు సబ్సిడీ లోన్ ద్వారా గొర్రెలు, గేదెలు అందించాలి. చర్మకారులకు మీరు అధికారంలోకి వచ్చాక లోన్లు అందించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీ దళితుల ఓట్లపై తప్ప వారి సంక్షేమంపై శ్రద్ధలేదు . గత ప్రభుత్వంలో ఎస్సీలకోసం అమలుచేసిన 27 దళిత సంక్షేమ పథకాలను రద్దు చేశాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ కార్పొరేషన్ ను బలోపేతం చేసి స్వయం ఉపాధి రుణాలు అందజేస్తాం. అర్హులైన దళితులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం.  ఎస్సీ కాలనీలో సీసీరోడ్లు, వీధిలైట్లు, కరెంటు లైన్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. మీకోసం పనిచేసే చంద్రన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు సహకరించండి.

నారా లోకేష్ ను కలిసిన హస్తకవేరి గ్రామస్తులు

వెంకటగిరి నియోజకవర్గం హస్తకవేరి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామ దళితవాడలో సీసీరోడ్లు కొన్ని పెండింగ్ ఉన్నాయి, వాటిని పూర్తిచేయాలి. మా గ్రామంలో తెలుగుగంగ కాలువకు రూ.1కోటి మంజూరు చేశారు, కానీ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. మా గ్రామంలో దళితవాడ, అరుంధతివాడ, ఎన్.ఎల్.కండ్రిగలకు ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించాలి. ఎన్.ఎల్.కండ్రిగలో నిమ్మతోటలకు వెళ్లే దారి చెరువుకట్టమీద వేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. హస్తకవేరిలో పొలాలకు వెళ్లడానికి సరైన రహదారులు వేయించాలి. రైతులు సాగుచేస్తున్న పొలాలను ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకుంటున్నారు, సమస్యను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధులు లేకుండా చేసి దివాలా తీయించారు. మేం అధికారంలోకి వచ్చాక హస్తకవేరి గ్రామంలో పెండింగ్ పనులన్నీ పునఃప్రారంభిస్తాం. అవసరమైన ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మిస్తాం, ఇంటింటికీ తాగునీటి కుళాయి ద్వారా నీరు అందిస్తాం. రైతులకు ఫారెస్టు అధికారులనుంచి వేధింపులు నిలువరిస్తాం.

లోకేష్ ను కలిసిన కొత్తపాలెంపాడు గ్రామస్తులు

సూళ్లూరు పేట నియోజకవర్గం కొత్తపాలెంపాడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వంలో మా గ్రామంలోని అరుంధతీవాడకు ఇళ్లను మంజూరు చేస్తే, వైసీపీ ప్రభుత్వం వచ్చి వాటిని రద్దు చేసింది. మాకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. చెరువు దగ్గరున్న ఇరిగేషన్ ట్యాంకును సమ్మర్ స్టోరేజి ట్యాంకుగా మార్చాలి. మాతమ్మ అమ్మవారి దేవాలయాన్ని పూర్తిస్థాయిలో నిర్మించాలి. రైతులకు సాగునీరు అందించాలి. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

దళితులకు పథకాల అమలులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివక్ష చూపడం దారుణం. సెంటుపట్టా పేరుతో 7వేల కోట్లు దోచుకున్న వైసిపి నాయకులు, అవి కూడా తమ పార్టీ వారికే ఇచ్చుకున్నారు. మేం అధికారంలోకి వచ్చాక అరుంధతివాడలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం. ఇరిగేషన్ ట్యాంకును సమ్మర్ స్టోరేజి ట్యాంకుగా మార్చి తాగునీటి సమస్య పరిష్కరిస్తాం. మాతమ్మ దేవాలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.

Also, Read This Blog :Conquering Yuvagalam: My Unforgettable Footmarch Journey

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *