Naralokesh padayatra,yuvagalam
Naralokesh padayatra,yuvagalam

వెంకటగిరిలో జనప్రభంజనంలా మారిన యువగళం! దారిపొడవునా యువనేతకు హారతులతో నీరాజనాలు

నేనున్నానని భరోసా ఇస్తూ ముందుకు సాగిన యువనేత

వెంకటగిరి: యువనేత Nara lokesh యువగళం పాదయాత్ర వెంకటగిరి పట్టణంలో జనప్రభంజనంలా మారింది. యువనేత లోకేష్ కు అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు. వెంకటగిరి వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. 134వరోజు యువగళం పాదయత్ర వెంకటగిరి శివారు కంపాలెం నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా మహిళలు హారతులతో నీరాజనాలు పడుతూ యువనేతను స్వాగతించారు. భారీగజమాలలతో యువనేతను సత్కరించారు. లోకేష్ తో ఫోటోలు దిగేందుకు మహిళలు, యువకులు పోటీపడ్డారు. వెంకటగిరిలో 500 అడుగుల భారీ జెండాతో టిడిపి నాయకులు, కార్యకర్తలు లోకేష్ కు స్వాగతం పలికారు. లోకేష్ ని చూసి సమస్యలు చెప్పుకునేందుకు వివిధ వర్గాల ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను ఓపిగ్గా విన్నారు. వెంకటగిరి టౌన్ లో పేరుకుపోయిన సమస్యలను స్థానికులు యువనేత దృష్టికి తెచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని యువనేత భరోసా ఇచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల మహానాడులో ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారంటీ మినీ మ్యానిఫెస్టో కరపత్రాలను ప్రజలకు పంచుతూ, ఆయా పథకాల వల్ల కలిగే లబ్ధిని వివరించారు. వెంకటగిరి పాతబస్టాండు సెంటర్ లో నిర్వహించిన బహిరంగసభకు జనం పోటెత్తారు. పోలేరమ్మ గుడివద్ద యువనేత లోకేష్ అమ్మవారిని దర్శించుకున్నారు. దివంగత వెంకటగిరి రాజా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కంపాలెం నుంచి ప్రారంభమైన యువనేత పాదయాత్ర… వెల్లంపాలెం, పోలేరమ్మగుడి, పాతబస్టాండు, త్రిభువన్ సెంటర్, ఆర్టీసి బస్టాండు, వెంకటగిరి క్రాస్, పాలకేంద్రం, రాపూర్ క్రాస్, నిడిగల్లు క్రాస్, బంగారుపేట, జంగాలపల్లి, సిద్దగుంట మీదుగా నిడిగల్లు శివారు విడిది కేంద్రానికి చేరుకుంది. 134వరోజున యువనేత లోకేష్ 16.6 కి.మీ. నడక సాగింది. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1737. 1 కి.మీ. పూర్తయింది. శుక్రవారం నాడు యువగళం పాదయాత్ర ఇనుగుంట వద్ద సూళ్లూరు పేట అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.

వెంకటగిరిలో పాదయాత్ర చేయడం అదృష్టం

వెంకటగిరి దద్దరిల్లింది. రాజులు ఏలిన నేల వెంకటగిరి. వెంకటగిరి పట్టు చీర కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. కాశీ విశ్వనాధుడి ఆలయం, శ్రీ పోలేరమ్మ ఆలయం, పెంచలకోన లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ఉన్న పుణ్య భూమి వెంకటగిరి. కమలమ్మ జీడిపప్పు మైసూర్పాక్ ఎంత స్వీట్ గా ఉంటుందో ఇక్కడి ప్రజలు అంత స్వీట్ గా ఉంటారు. వెంకటగిరి పవర్ ఫుల్ నేల…ఇక్కడి నుండి ఎంతో మంది మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న వెంకటగిరి గడ్డ పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

భయం మా బయోడేటాలో లేదు!

యువగళం..మనగళం..ప్రజాబలం. యూత్ పవర్ కి ప్యాలస్ పిల్లి భయపడింది. యువగళాన్ని అడ్డుకోవడానికి పోలీసుల్ని పంపాడు..మనం ఆగలేదు. యువగళాన్ని తొక్కేయండని సైకోలను పంపాడు..మనం తగ్గలేదు. ఆఖరికి పీకేది ఏమి లేక కోడికత్తి బ్యాచ్ ని పంపి కోడిగుడ్డు వేయించాడు.  కోడిగుడ్డు వేసిన వాడి మొఖం మీద మన వాళ్లు రిటర్న్ గిఫ్ట్ గా ఆమ్లెట్ వేసి పంపారు. ప్యాలస్ పిల్లి దాక్కొని దాడులు చేయిస్తుంది. దమ్ముంటే నువ్వే రా జగన్ తేల్చుకుందాం. భయం మా బయోడేటాలో లేదు బ్రదర్. రాసిపెట్టుకో జగన్ నీకు భయాన్ని పరిచయం చేసేది నేనే. సాగనిస్తే పాదయాత్ర…అడ్డుకుంటే దండయాత్ర. అడ్డొస్తే ఆగిపోయేవాడిని కాదు. అడ్డొచ్చినవాడిని తొక్కుకుంటూ పోయే ఫైటర్ ని.

విశాఖను క్రైం క్యాపిటల్ గా చేశారు!

టిడిపి విశాఖ‌ని ఆర్థిక రాజ‌ధానిగా అభివృద్ధి చేసింది. వైసీపీ విశాఖని క్రైమ్ కేపిట‌ల్ గా మార్చేసింది. సొంత పార్టీ ఎంపీ కొడుకు, భార్య‌, ఆడిట‌ర్ జీవి కిడ్నాప్ అయ్యారు. అది కిడ్నాప్ కాదు జే గ్యాంగ్ సెటిల్మెంట్ అని ఎంపీ ఎంవీవీ మాటల్లో తేలిపోయింది. జగన్ పాలన ఎంత దరిద్రంగా ఉందో స్వయంగా వైసిపి ఎంపీ ప్రకటించారు. కర్నూలు లో నేను పాదయాత్ర చేస్తున్న సంధర్భంలో రాము ఆయన భార్య నాకు స్వాగతం పలికి హారతి ఇచ్చారు.  అది చూసి వైసిపి నేతలు తట్టుకోలేకపోయారు. ఎన్నో  ఏళ్లుగా అక్కడే కూరగాయల వ్యాపారం చేసుకుంటున్న రాము షాప్ ని ధ్వంసం చేయించాడు వైసిపి కార్పొరేటర్ కృష్ణ కాంత్.   జగన్ పడగొడితే…లోకేష్ నిలబెడతాడు. రాము కుటుంబానికి నేను అండగా ఉంటా త్వరలోనే రాము కొత్త షాప్ ఓపెన్ అవుతుంది.

కరెంటు బిల్లులతో జనానికి షాక్!

ఒక్క మే నెలలో జగన్ బాదుడు ఎంతో తెలుసా? రూ.11,300 కోట్లు. ఒక సారి ట్రూ అప్ ఛార్జీలు, రెండు సార్లు అడ్జెస్ట్మెంట్ ఛార్జీలు పెంచాడు. సీఎం గా ప్రమాణస్వీకారం చేస్తూ విద్యుత్ బిల్లులు తగ్గించేస్తా అన్నాడు. ఇప్పుడు వందల్లో బిల్లు వచ్చే వారికి వేలల్లో వస్తుంది. వైసిపి ఫ్యాన్ పర్మినెంట్ గా స్విచ్ ఆఫ్ చెయ్యండి మీపై పడిన భారం తగ్గుతుంది.

ప్రజల కష్టాలు తీర్చేందుకే భవిష్యత్తుకు గ్యారంటీ!

జైల్ జగన్ మహిళల్ని నమ్మించి ముంచేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఎం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. సుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్రప్రజల కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం.

యువతకు ఉద్యోగాలు ఎక్కడ?

జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు.  యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టం!

బీసీలు పడుతున్న కష్టాలు నేను చూసాను. 26 వేల అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హాజిరా. ఇలా ఎంతో మంది బాధితులు.

ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుచేస్తాం!

మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పధకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. యానాదుల సంక్షేమ కార్యక్రమాలు అన్ని రద్దు చేసారు. వారి భూములు వైసిపి నాయకులు లాక్కుంటున్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే యానాదుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తాం.

రాంకుమార్ రెడ్డి నేతృత్వంలో దోపిడీ పర్వం

నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి మంచి పేరు ఉంది. కానీ ఆయన ఆశయాలను గాలికి వదిలేసారు రామ్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యే టికెట్ కోసం అరాచకశక్తులను పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. రామ్ కుమార్ రెడ్డి గారి గురించి తెలుసుకున్న తరువాత ఆశ్చర్యం వేసింది. ఆయన ముందు ఎవరూ కూర్చో కూడదు అంట నిలబడి మాట్లాడాలి అంట. ప్రశాంతంగా ఉండే వెంకటగిరిని వైసిపి నాయకులు దౌర్జన్యాలు, భూకబ్జాలు, ఎర్రచందనం స్మగ్లింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు. కలువాయి మండలంలో వైసిపి నేతలు 600 ఎకరాలు కబ్జా చేసారు. ఎమ్మెల్యే గారికి తెలిసి కొన్ని పట్టాలు రద్దు చేయించగలిగారు. ప్రస్తుతం లోకాయుక్తా లో కేసు నడుస్తుంది.

రాంకుమార్ బినామీ ఎల్ కెఆర్ ఆగడాలు!

వైసిపి నేతలు పెన్నా నది నుండి ఇసుకను దోపిడీ చేస్తున్నారు. వెంకటగిరి,రాపూరు,కలువాయి,డక్కిలి, బాలాయపల్లి, సైదాపురం మండలాల్లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని వైసిపి నేతలు కబ్జా చేసారు. దళితుల భూములు కూడా వదలడం లేదు. వెంకటగిరి టైలర్స్ కాలనీలో పార్కులు, గుడులు, బడులు కోసం వదిలిన స్థలాన్ని వైసిపి లీడర్స్ ప్లాట్లు వేసి అమ్మేసారు. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి రైట్ హ్యాండ్ ఎల్. కె. ఆర్. పోలీస్ స్టేషన్ల లో పంచాయతీల నుండి ఎర్రచందనం, ఇసుక, గ్రావెల్ దందా మొత్తానికి డాన్ ఆయనే. ఈ ఎల్. కె. ఆర్ వెంకటగిరి బజార్ సెంటర్ లో 10 కోట్లతో అక్రమంగా ఒక భవనం కూడా నిర్మించాడు. వెంకటగిరి మున్సిపాలిటీ లో బిల్డింగ్ కట్టాలంటే వైసిపి నేతలకి కప్పం కట్టాల్సిందే. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన శ్యాంప్రసాద్ రెడ్డి ఏకంగా సోమశిల కెనాల్ ని ఆకిల వలస దగ్గర పూడ్చి పెట్టాడు.

జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

వెంకటగిరి కి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. ఆగిపోయిన ఎస్ఎస్ కెనాల్ పనులు పూర్తి చేసి వెంకటగిరి, డక్కిలి, రాపూరు మండలాలకు సాగునీరు ఇస్తాం అన్నాడు.  ఆగిపోయిన బిహెచ్ఈఎల్ కంపెనీ నిర్మాణాన్ని పూర్తిచేస్తాం అని హామీ ఇచ్చాడు. వెంకటగిరి నుండి నాయుడుపేట కు వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేని అసమర్ధ సీఎం జగన్. టిడిపి హయాంలోనే వెంకటగిరి అభివృద్ధి జరిగింది. రూ.3 వేల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం.  సిసి రోడ్లు, పేదలకు టిడ్కో ఇళ్లు, సాగు, తాగునీటి ప్రాజెక్టులు నిర్మించింది టిడిపి.

సోమశిల హైలెవెల్ కెనాల్ పూర్తిచేస్తాం!

టిడిపి హయాంలో ప్రారంభించిన ఆల్తూరుపాడు రిజర్వాయర్ ని జగన్ ప్రభుత్వం ఆపేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పూర్తి చేసి సాగు,తాగు నీరు అందిస్తాం. సోమశిల హై లెవల్ కెనాల్ పూర్తిచేస్తాం.  పెండింగ్ లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం, ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తాం.

చేనేతను దత్తత తీసుకుంటా!

చేనేత కార్మికుల కష్టాలు నాకు తెలుసు. నూలు, కలర్ ఇతర సబ్సిడీలు అందిస్తాం.  మగ్గం ఉన్న చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం. చేనేత కార్మికులకు టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తాం.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతను నేను దత్తత తీసుకుంటాను. మీ సంక్షేమం నా బాధ్యత. నిమ్మ, బెంగాల్ గ్రామ్, మినుము, పత్తి, వరి, హార్టీ కల్చర్ రైతుల సమస్యలు నాకు తెలుసు. పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం. టిడిపి కార్యకర్తల్ని వేధించిన ఎవరిని వదిలిపెట్టను. వెంకటగిరి లో ఉన్నా ఉగాండా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా.  వైసిపి నాయకుల భూ అక్రమాల పై సిట్ వేసి ఆ భూములు వెనక్కి తీసుకోని పేదలకు పంచుతాం.

చేనేత‌ల త‌ల‌రాత మార్చే ప్రాజెక్టుకు యువనేత శ్రీకారం

– www.weaversdirect.in వెబ్ సైట్ ఆరంభించిన నారా లోకేష్

– చేనేత‌ల‌కి అధునాత‌న శిక్షణ‌, ఉత్పత్తుల‌కి డైరెక్ట్ మార్కెటింగ్

– 5 ల‌క్షల మందికి మెరుగైన ఉపాధి క‌ల్పించేలా ప్రణాళిక

చేనేత‌ల త‌ల‌రాత మార్చేందుకు యువ‌నేత నారా లోకేష్ వేసిన తొలి అడుగు ల‌క్షలాది చేనేత‌ల భ‌విత‌కి బాట కానున్నది. దార్శనిక నేత నారా లోకేష్ త‌న ఆలోచ‌న‌ల‌ని ఆచ‌ర‌ణ‌లో పెట్టడం ద్వారా ల‌క్షలాది మందిని ముందుకు న‌డిపించే చోదక శ‌క్తిగా నిలిచారు. మంగ‌ళ‌గిరిలో చేనేత‌ల కోసం యువ‌నేత మ‌దిలో మొగ్గ తొడిగిన ఆలోచ‌న‌ వెంక‌ట‌గిరిలో  www.weaversdirect.in రూపంలో అందుబాటులోకి వ‌చ్చింది. చేనేత‌ల భ‌విత‌కి బంగారుబాట‌గా మారే ఈ ప్రాజెక్టు రూప‌క‌ల్ప‌నకి నారా లోకేష్‌ క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌. చేనేత‌ల బ‌తుకుల్లో వెలుగులు నింపేందుకు మ‌హాయ‌జ్ఞంగా చేప‌ట్టిన ఈ ప్రాజెక్టుకి  స‌హాయ, స‌హ‌కారాలు అందించిన ఎన్ఆర్ఐలు శాంతి న‌రిశెట్టి (లాస్ ఏంజెల్స్), మాధ‌వి మార్త (ఛార్లెట్టె), అనూరాధ (న్యూజెర్సీ)ల‌కి  నారా లోకేష్ కృత‌జ్ఞత‌లు తెలియ‌జేశారు.

 మంగళగిరి మ‌న లోకేష్ అని నిన‌దిస్తోంది. ప్రతి ప‌ల్లె, ప్రతి ఇల్లూ లోకేష్ సాయం పొందుతోంది. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో  30,000 మందికి పైగా చేనేత కార్మికులున్నారు. ప‌ర్యట‌న‌ల సంద‌ర్భంలో చేనేత కార్మికులు, డై వర్కర్స్ తో లోకేష్ మాట్లాడేవారు. వారి స‌మ‌స్యలు ఆక‌ళింపు చేసుకున్నారు. అడ్డంకులేంటో అవ‌గాహ‌నలోకి వ‌చ్చాయి. పాల‌సీ మార్చితే స‌రిపోదు, స‌మూలంగా వ్యవ‌స్థలో మార్పులు తేవాల‌ని నిర్ణయించుకున్నారు. క్షేత్రస్థాయిలో చేనేత‌ల‌తో మాట్లాడిన‌వి, ఆయారంగాల నిపుణుల‌తో చ‌ర్చించిన‌వి, మార్కెటింగ్ అవ‌కాశాలు ప‌రిశీలించిన‌వి అన్నీ అధ్యయ‌నం చేసిన త‌రువాత ఓ ప్రణాళిక రూపొందించారు. ఇదే స‌మ‌యంలో  తెలుగుదేశం పార్టీ మ‌హానాడు సంద‌ర్భంగా మినీ మేనిఫెస్టో విడుద‌ల చేసింది. అధికారంలోకి వ‌చ్చిన ఐదేళ్లలో ప్రభుత్వ-ప్రైవేటు-స్వయం ఉపాధి రంగాల ద్వారా రాష్ట్రంలో 20 ల‌క్షల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వాల తీరుతో వ్యవ‌సాయం తరువాత అతి ఎక్కువ మందికి ఉపాధినిస్తోన్న చేనేత రంగం రోజురోజుకీ సంక్షోభంలో చిక్కుకుంటోంది. దీనిపై ఆధార‌ప‌డిన 5 ల‌క్షల మంది ఈ వృత్తిని వీడే ప్రమాదం ఉంది. చేనేత స‌మ‌స్యలు క్షుణ్ణంగా అధ్యయ‌నం చేసిన లోకేష్ వారికి చేయూత‌నందించే ప్రణాళిక రూపొందించి పైల‌ట్ ప్రాజెక్టుగా మంగ‌ళ‌గిరి నుంచి ఆరంభించారు. ఇది విజ‌య‌వంతమైతే రాష్ట్రంలో 5 ల‌క్షల మంది చేనేత‌ల‌కి మెరుగైన జీవ‌న ప్ర‌మాణాల‌తో అదే వృత్తి ద్వారా స్వయం ఉపాధి క‌ల్పించే అద్భుత అవ‌కాశం ఉంది.

లోకేష్ చేప‌ట్టిన ప్రాజెక్టులో ముఖ్యాంశాలు

చేనేత కార్మికులు సాంప్రదాయ ప‌ద్ధతిలో రోజుకి 12 గంట‌లు ప‌నిచేస్తున్నారు. వీరికి కొత్త టెక్నాలజీ వాడ‌డం నేర్పి అందుబాటులోకి తీసుకురావ‌డం ద్వారా 30 శాతం ఉత్పత్తి పెరిగింది.  హైస్పీడ్ చ‌ర‌ఖా, రాక్ లూమ్స్, మెకానికల్ లిఫ్టర్స్ వంటివి కార్మికులు వాడ‌టం వ‌ల్ల వారి ఆరోగ్యం మెరుగుప‌డ‌టంతోపాటు త‌క్కువ గంట‌ల్లో ఎక్కువ ఉత్పత్తి సాధించగ‌లుగుతున్నారు.

ప్రమాద‌క‌ర‌మైన ర‌సాయ‌నాల‌తో ప‌నిచేయ‌డం వ‌ల్ల‌ డైయింగ్ కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి ర‌క్షణ కోసం ప్రత్యేక‌మైన గ్లోవ్స్‌, బూట్లు లోకేష్ స‌ర‌ఫ‌రా చేశారు.  కేంద్రప్రభుత్వ  సహకారంతో నడుస్తున్న వీవర్ రిసోర్స్‌ సెంటర్ ద్వారా కొన్ని ప‌నిముట్లు అంద‌జేస్తే, ప్రమాద‌క‌ర‌మైన ర‌సాయ‌నాలు-రంగుల నుంచి కార్మికుల‌కి కొంత ర‌క్షణ ల‌భిస్తుంది.

 రోజుల‌కొద్దీ ఇంటిల్లిపాదీ క‌ష్టప‌డి నేసిన చీర‌లు, వ‌స్త్రాలు ద‌ళారుల చేతికి చిక్కుతున్నాయి. దీంతో లాభాలు రావ‌డంలేదు. చేనేత‌ల్ని దోచుకునే మ‌ధ్య ద‌ళారీల‌కి చెక్ పెట్టి నేరుగా తాము నేసిన చీర‌లు, వ‌స్త్రాలు తామే అమ్ముకునేలా కొన్ని కార్పొరేట్ సంస్థలతో టై అప్ కుదిర్చారు. ప్రపంచంలో ఏ మూల‌నుంచైనా మంగ‌ళ‌గిరి చీర‌లు, వ‌స్త్రాలు ఆన్ లైన్‌లో ఆర్డర్ చేయొచ్చు. వ‌చ్చే లాభం నేరుగా చేనేత‌ల‌కే చేరుతుంది. చేనేత ఉత్పత్తులు నేరుగా వినియోగదారుల‌కు చేర్చే వెబ్సైట్‌ www.weaversdirect.in. లోకేష్ తన బృందంతో అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఆధునిక కాలంలో అవ‌స‌రాలు, అభిరుచుల‌కు అనుగుణంగా వ‌స్త్రాలు త‌యారు చేసేందుకు ముందుగా శిక్షణ ఇచ్చేలా ఒక అధునాతనమైన శిక్షణాకేంద్రం ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సెంటర్ రూపొందిస్తున్నారు. న్యూ టెక్నాలజీ, మోడ్రన్ డిజైన్స్ త‌యారు చేసి చేనేత‌ ఉత్పత్తుల‌కి ప్రపంచ‌స్థాయి బ్రాండ్ క్రియేట్ చేయాల‌ని యోచిస్తున్నారు. చీర‌ల అమ్మకాలు 20 శాతమైతే, గార్మెంట్స్ 50 శాతం అమ్మకాలు సాగుతున్నాయి. అందుకే గార్మెంట్స్ త‌యారీలోనూ చేనేత‌ల‌కి శిక్షణ ఇప్పించాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

వెబ్సైట్ ప్రారంభ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి లో అనుసరిస్తున్న మోడల్ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఇదే ప్రణాళిక అమలు చేస్తామని అన్నారు. వెంకటగిరి లో కూడా చేనేత రంగానికి ఎంతో మంది దూరం అవుతున్నారు. వారందరినీ మళ్ళీ చేనేత వృత్తి వైపు వచ్చేలా చెయ్యడమే నా లక్ష్యం అని లోకేష్ అన్నారు.

నారా లోకేష్ ను కలిసిన కంపాలెం ఎస్సీకాలనీ ప్రజలు

వెంకటగిరి పట్టణం కంపాలెం ఎస్సీ కాలనీ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. TDP హయాంలో మాకు మంజూరు చేసిన టిడ్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం నిలిపేసింది. వెంకటగిరి టౌన్-మా వార్డుకు మధ్య గొడ్డేరు వాగుపై వంతెన నిర్మించాలి. మహాత్మాగాంధీ చేతుల మీదుగా ప్రారంభించిన గాంధీ విజ్ఞాన మందిరాన్ని వైసీపీ నాయకులు  కూల్చేశారు. ఆ స్థానంలో కొత్తది నిర్మించడం లేదు. శ్మశానానికి వెళ్లాలంటే గొడ్డేరు వాగు దాటాలి. వాగు పొంగితే శవాలను తీసుకెళ్లే పరిస్థితి లేదు. ప్రహరీ లేకపోవడంతో శ్మశానం గోతులను జంతువులు తవ్వేస్తున్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక బ్రిడ్జి నిర్మించడంతో పాటు శ్మశానం చుట్టూ ప్రహరీ నిర్మించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

ముఖ్యమంత్రి జగన్ కు ఎస్సీల ఓట్లపై తప్ప వారి సంక్షేమంపై శ్రద్ధలేదు. మహాత్మాగాంధీ చేతులమీదుగా ప్రారంభించిన విజ్ఞాన మందిరాన్ని కూల్చివేయడం దారుణం. టిడిపి అధికారంలోకి వచ్చాక విజ్ఞాన మందిరాన్ని పునర్నిర్మిస్తాం. గొడ్డేరువాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపడతాం. కంపాలెం శ్మశానవాటికకు ప్రహరీగోడ నిర్మాణం చేపడతాం. టిడ్కో ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన బంగారుపేట చేనేత కార్మికులు

వెంకటగిరి పట్టణం బంగారుపేట చేనేత కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. వెంకటగిరి చేనేత పరిశ్రమ ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉంది. చేనేత కార్మికులకు నూలు, పట్టు సబ్సిడీ ఇవ్వాలి. వర్కుషెడ్డు, అధునాతన స్టాండ్ మగ్గం ఇవ్వాలి. 200యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వాలి. చేనేత కుటుంబాలకు ఆరోగ్య బీమా కార్డులు జారీ చేయాలి. చేనేత మహిళలకు ప్రతి నెల గౌరవవేతనం రూ.2,500ఇవ్వాలి. చేనేత ముడి సరుకులు, తయారైన చీరలపై జీఎస్టీ రద్దు చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చేనేతరంగంలో సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 60మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడితే కనీసం పరామర్శించిన దాఖలాలు లేవు. టిడిపి ప్రభుత్వ హయాంలో చేనేతలకు 110 కోట్ల రుణమాఫీ చేశాం. నూలు, సిల్క్ సబ్సిడీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం. ప్రతి మహిళకు మహాశక్తి పథకం కింద నెలకు 1,500 రూపాయలు అందజేస్తాం. చేనేతలకు వర్క్ షెడ్లతో పాటు ఆరోగ్య బీమా కల్పిస్తాం. చేనేత వస్త్రాలపై జిఎస్టీని రాష్ట్రప్రభుత్వమే భరించేలా జిఓ తెస్తాం.

లోకేష్ ను కలిసిన లారీఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు

వెంకటగిరి పోలేరమ్మగుడి వద్ద లారీఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రతియేటా అన్నిరకాల పన్నులు కడుతున్నప్పటికీ దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి లారీకి రూ.1,500 సెస్ వసూలు చేస్తున్నారు.  పాత వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ పక్కరాష్ట్రాల్లో రూ.200 వసూలు చేస్తుంటే ఏపీలో మాత్రం రూ.10వేలు నుండి రూ.20వేలు కట్టించుకుంటున్నారు. తాజాగా క్వార్టర్ ట్యాక్స్ పక్కరాష్ట్రాల కంటే 30శాతం పెంచారు. కాంపౌండింగ్ ఫీజు వెయ్యి రూపాయలు పెంచారు. డీజిల్ రేట్లు భారీగా పెరగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సంక్షోభంలో కూరుకుపోయిన ట్రాన్స్ పోర్ట్ రంగాన్ని ఆదుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రవాణారంగం కుదేలైంది. కరోనా తర్వాత అన్నిరాష్ట్రాలు రాయితీలతో వెసలుబాటు కల్పిస్తే, వైసిపి ప్రభుత్వం మాత్రం ట్యాక్సులు, సెస్ లు, గ్రీన్ ట్యాక్స్ లను భారీగా పెంచి ట్రాన్స్ పోర్టర్లను ఇబ్బందుల్లోకి నెట్టారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో డీజిల్ ధర లీటరుకు 10రూపాయలు అదనంగా ఉంది. దేశంలో ఎక్కడా లేని పెట్రోలు, డీజిల్ ధరలు ఎపిలోనే ఉన్నాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి ప్రభుత్వం అడ్డగోలుగా వేసిన పన్నులను సమీక్షించి ఉపశమనం కలిగిస్తాం. రవాణా వాహనాలపై అనవసరమైన వేధింపులను నిలువరిస్తాం.

 నారా లోకేష్ ను కలిసిన వెంకటగిరి పట్టణ ప్రముఖులు

వెంకటగిరి త్రిభువన్ సెంటర్ లో పట్టణ ప్రముఖులు యువనేత నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వ హయాంలో రూ.2కోట్లతో బొమ్మడి కాలువ పనులను ప్రారంభించారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక ఈ కాల్వ పనులను పట్టించుకోవడం లేదు. టిడ్కో ఇళ్లను ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం నిలిపేసింది. ఎంతో చరిత్ర కలిగిన ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి(ఘోషా) మూతబడింది. దానిని 100పడకల ఆసుపత్రిగా పునఃనిర్మించాలి. పాలకేంద్రం నుండి వయా పాత బస్టాండ్ మీదుగా ఎమ్మార్వో ఆఫీస్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి. వెంకటగిరిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

జగన్ ప్రభుత్వానికి అడ్డగోలు పన్నులు బాదుడు తప్ప ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనపై శ్రద్ధలేదు. మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధుల్లేని దుస్థితి కల్పించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక బొమ్మిడి కాల్వ పనులను పూర్తిచేస్తాం. వెంకటగిరిలోని ప్రభుత్వ మెటర్నిటీ హాస్పటల్ ను పునర్నిర్మించి, ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. సకలసౌకర్యాలతో టిడ్కో ఇళ్లను పూర్తిచేసి పేదలకు అందజేస్తాం. వెంకటగిరి పట్టణంలో ఎల్ఇడి లైట్లు, ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం.

లోకేష్ ను కలిసిన యానాది సామాజికవర్గీయులు

వెంకటగిరి పాలకేంద్రం వద్ద యానాది సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా ప్రాంతంలో మంచినీరు, రోడ్డు సదుపాయం లేదు. యానాదుల్లో చాలామందికి ఆధార్ కార్డులు లేవు, ఓట్లు కూడా లేవు. దీంతో పిల్లలకు సంక్షేమ పథకాలు, విద్య అందడం లేదు. వలసలు పోతున్న యానాదులకు భూములు కేటాయించాలి. సైదాపురం మండల పరిధిలో గిరిజన పాఠశాల ఏర్పాటు చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గిరిజన సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. గిరిజనులకు చెందాల్సిన 5,355 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి తీరని ద్రోహం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక గిరిజనులు అధికంగా నివసించే ప్రాంతాల్లో ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసి గిరిజనుల పిల్లలకు నాణ్యమైన విద్యనందిస్తాం. ఆధార్, ఓటు కార్డులు లేని వారికోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించి వారికి కార్డులందిస్తాం. యానాదుల వలసలు నివారించడానికి ప్రత్యేక స్వయం ఉపాధి కార్యక్రమాలను అమలు చేస్తాం.

లోకేష్ ను కలిసిన బొప్పాపురం బీసీ కాలనీ వాసులు

వెంకటగిరి పట్టణం రాపూరు క్రాస్ వద్ద బొప్పాపురం బిసి కాలనీవాసులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా కాలనీ ప్రజలకు గత ప్రభుత్వం మంజూరు చేసిన టిడ్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం నిలిపేసింది. మా వార్డులో డ్రైనేజీ సమస్య చాలా అధికంగా ఉంది. కాలువ పగిలి మురుగునీరు ఇళ్లలోకి వస్తోంది. వర్షాల సమయంలో బొప్పాపురం చెరువులోని నీరు ఇళ్లలోకి వస్తున్నాయి. మంచినీరు రోజు మార్చి రోజు ఇస్తున్నారు. సమస్యలను మున్సిపాలిటీ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా వార్డు సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

పేదలు నివసించే కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా మురుకికూపాలుగా మార్చారు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు టిడిపి హయాంలో టిడ్కోగృహాలను నిర్మిస్తే, గత నాలుగేళ్లకు లబ్ధిదారులకు అందించకుండా పాడుబెడుతున్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణాల్లో డ్రైనేజి, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. వాటర్ గ్రిడ్ ఏర్పాటుద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేసి, 24/7 సురక్షితమైన తాగునీరు అందిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన సిద్ధగుంట పంచాయతీ ప్రజలు

వెంకటగిరి నియోజకవర్గం సిద్ధగుంట గ్రామ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో వైసిపినేతల అండతో కొందరు సర్వే నంబర్ 114-1లో 8.87ఎకరాల భూమిని చదునుచేసి వ్యవసాయం చేస్తున్నారు. బ్రిటీష్ కాలంలో వేసిన సరిహద్దు రాళ్లను పీకేశారు. ప్రశ్నించిన మాపై అధికారపార్టీ నేతలు దాడికి పాల్పడ్డారు. మీరు అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకుల అక్రమాలపై చర్యలు తీసుకోండి.

నారా లోకేష్ స్పందిస్తూ.

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. భూములు ఖాళీగా కనబడితే కబ్జాచేయడం నిత్యకృత్యంగా మారింది. ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడటడం, ఎదురు కేసులు పెట్టడం పరిపాటైంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి నాయకులు ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకుంటాం. తప్పుడు కేసులు బనాయించిన వైసిపి నాయకులు, పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన నిడిగల్లు గ్రామస్తులు

వెంకటగిరి నియోజకవర్గం నిడిగల్లు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నిడిగల్లులో సుమారు 2వేల జనాభా నివాసం ఉంటున్నాం. మా గ్రామంలో తాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా గ్రామం మేజర్ పంచాయతీ అయినా మాకు ఇబ్బందులు తప్పడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

 గ్రామపంచాయితీల్లో అభివృద్ధికోసం ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన 8,660 కోట్ల నిధులను జగన్ ప్రభుత్వం దొంగిలించింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు గుక్కెడు నీళ్లు అందించలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు తీర్చేందుకు కేంద్రం అమలుచేస్తున్న జల్ జీవన్ మిషన్ అమలులో ఎపి 18వస్థానంలో ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం.

Also, Read This Blog :Step towards great future by the significance of Yuvagalam

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *