గూడూరు నియోజకవర్గంలో దుమ్మురేపిన యువగళం వాకాడులో యువనేతకు అపూర్వస్వాగతం పలికిన ప్రజలు అడుగడుగునా సమస్యల వెల్లువ… అండగా ఉంటానన్న లోకేష్
గూడూరు: యువనేత Nara Lokesh యువగళం పాదయాత్ర గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దుమ్మురేపింది. వాకాడులో పెద్దఎత్తున జనం రోడ్లపైకి వచ్చి యువనేతకు ఘనస్వాగతం పలికారు. అడుగుడునా భారీ గజమాలలతో యువనేతను సత్కరించి, బాణాసంచా మోతలతో హోరెత్తించారు. 139వరోజు యువగళం పాదయాత్ర తాడిమేడు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. తొలుత మత్స్యకారులతో సమావేశమైన లోకేష్ వారి సాధకబాధకాలు విన్నారు. అనంతరం ప్రారంభమైన పాదయాత్రకు జనం పెద్దఎత్తున తరలివచ్చి యువగళానికి సంఘీభావం తెలిపారు. అడుగడుగునా ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేతకు వివరించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్నాయని, దీనికితోడు పెంచిన పన్నుల భారంతో బతుకుబండి లాగడం భారంగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇస్తూ యువనేత ముందుకు సాగారు. తాడిమేడు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర కొత్తగుంట, చిట్టమూరు, వాకాడు, రంగన్నగుంట, తిన్నెలపూడి మీదుగా కోట క్రాస్ వద్ద విడిది కేంద్రానికి చేరుకుంది. 139వరోజు యువనేత లోకేష్ 15.6 కి.మీ. పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1821.6 కి.మీ. పూర్తయింది. ఇదిలావుండగా బుధవారం సాయంత్రం కోట గాంధీ విగ్రహం వద్ద జరిగే బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగిస్తారు.
*మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి లోకేష్ భరోసా!*
*సంక్షేమ నిధి నుంచి సాయం అందిస్తామని హామీ*
గూడూరు నియోజకవర్గం చిట్టమూరులో ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతిచెందిన వెంకటరమణ అనే కార్యకర్త కుటుంబసభ్యులు యువనేత నారా లోకేష్ ను కలిశారు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోయిన తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని మృతుడి భార్య నాగమణి ఆవేదన వ్యక్తంచేసింది. వారి ఇద్దరు పిల్లలను దగ్గరకు తీసుకుని ఓదార్చిన యువనేత లోకేష్ కార్యకర్తల సంక్షేమ నిధినుంచి ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… దేశంలో ఇంతవరకు ఏ రాజకీయపార్టీ చేయని కార్యకర్తల సంక్షేమానికి 135కోట్లు వెచ్చించామని, తెలుగుదేశం పార్టీ కేడర్ కోసం ఎంత సొమ్ము వెచ్చించడానికైనా వెనుకాడబోమని స్పష్టంచేశారు.
యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:
నాలుగేళ్లుగా టీఏ బిల్లులు పెండింగ్ -అంగన్ వాడీ కార్యకర్తలు, వాకాడు
అంగన్వాడీ కార్యకర్తలను వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది. నాలుగేళ్లుగా టి.ఏ బిల్లులు పెండింగ్ లో పెట్టింది. నెలకు రూ.1,500 చొప్పున రావాలి. అడిగితే పట్టించుకోవడం లేదు. గ్యాస్ బిల్లులు సకాలంలో ఇవ్వడం లేదు. మా సొంత డబ్బులతో గ్యాస్ తెచ్చి వంట చేస్తున్నాం. యాప్ లు, ఆన్లైన్ వంటి పనులు పెంచి వేదిస్తున్నారు. 30ఏళ్లుగా పని చేస్తున్నా మాకు ప్రమోషన్లు లేవు. రెగ్యులర్ చేయడంలేదు. మా సమస్యలపై మీటింగుల్లో గట్టిగా మాట్లాడితే అధికారులు మాపై తప్పుడు కేసులు పెడుతున్నారు. అంగన్వాడీ సెంటర్లు మారమ్మతులకు గురైన అధికారులు పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వం నుంచి సాయం లేదు-నాగమురళి, ఈశ్వరవాక గ్రామం
నేను దివ్యాంగుడ్ని. రెండు చేతులూ లేవు. టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తిచేశాను, డీఎస్సీ లేకపోవడంతో ఉద్యోగాలు రావడం లేదు. సహాయం కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశాను, పట్టించుకునే వారు లేరు. నా తల్లిదండ్రులు వయస్సు మీదపడి పనులు చేయలేకపోతున్నారు. కుటుంబ బాధ్యత నేనే చూసుకోవాల్సి ఉంది. మాలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోకపోతే ఎలా?
ట్రైసైకిల్ అడిగితే ఇవ్వలేదు-రమణమ్మ, యల్లశిరి గ్రామం.
నేను దివ్యాంగురాలిని, మా అన్న నందం చినరాజయ్య చనిపోతే అతని ఇద్దరి కూతుళ్లను నా పెన్షన్ మీద చదివించుకుంటున్నాను. ఒక పాప 10వ తరగతి పాస్ అయ్యింది. నిరదవాడ రెసిడెన్షియల్ స్కూల్ లో సీటు కోసం వెళ్తే, ప్రిన్సిపాల్ కనీసం కలవకుండా వెనక్కి పంపేశారు. మూడు చక్రాల స్కూటీ కోసం దరఖాస్తు చేసుకుంటే ఇవ్వలేదు. రెండుకాళ్లులేని నాలాంటి వారిని ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు?
అధికారంలోకి వచ్చిన వెంటనే జిఓ 217ను రద్దుచేస్తాం!
పులికాట్ ముఖద్వారం వద్ద పూడికతీసి ఇబ్బందులను తొలగిస్తాం
మత్స్యకారులతో ముఖిముఖిలో యువనేత నారా లోకేష్
గూడూరు: మత్స్యకారుల పొట్ట కొడుతూ జగన్ తెచ్చిన జీఓ.217 ను టిడిపి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రద్దు చేస్తామని యువనేత నారా లోకేష్ ప్రకటించారు. గూడురు నియోడజకవర్గం తాడిమేడు క్రాస్ క్యాంప్ సైట్ వద్ద మత్స్యకారులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పులికాట్ సరస్సు సమస్య పై నాకు పూర్తి అవగాహన ఉంది. తమిళనాడు జాలర్లు దాడులు చేస్తుంటే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే మత్స్యకారులను కుక్కలతో పోల్చి తిడితే జగన్ కనీసం ఎమ్మెల్యే ని పిలిచి మందలించే పరిస్థితి లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది లోనే పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద పూడిక తీస్తాం. ఛానల్ కాలువల్లో పూడిక తీసి బోట్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తాం.
డ్రైయింగ్ ప్లాట్ ఫామ్ లు ఏర్పాటు చేస్తాం
మత్స్యకారుల సౌకర్యార్థం టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రైయింగ్ ప్లాట్ ఫామ్ లు ఏర్పాటు చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తమిళనాడు సిఎం తో చర్చలు జరిపి జాలర్ల సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తాం. ఇతర రాష్ట్రాల వారు ఇటు వేటకి రాకుండా నియంత్రిస్తాం. తమిళనాడు స్టీమర్లు ఇక్కడికి రాకుండా చర్యలు తీసుకుంటాం. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో ఏపి ప్రయాణం మొదలు అయ్యింది. అయినా ఏ వర్గానికి లోటు లేకుండా అందరికీ న్యాయం చేశారు చంద్రబాబు. టిడిపి హయాంలో ఏపి ని మత్స్యకారప్రదేశ్ గా మార్చాం. ఆక్వా ఎగుమతుల్లో చంద్రబాబు గారు ఏపి ని నంబర్ 1 గా చేశారు. జగన్ పాలనలో ఫిష్ ఆంధ్రా అని తీసుకొచ్చి ఫినిష్ ఆంధ్రా చేశాడు. చేపల వ్యాపారం ఎలా చెయ్యాలో మీకు మేము నేర్పించాల్సిన అవసరం లేదు. అది మీకు తెలిసిన విద్య. ప్రభుత్వం మత్స్యకారులకు సహాయం అందించాలి. అది మానేసి ఫిష్ ఆంధ్రా అంటూ హడావిడి చేసాడు. ఇప్పుడు ఏకంగా పులివెందుల లో కూడా ఫిష్ ఆంధ్రా ఫినిష్ అయ్యింది.
మత్స్యకారుల సంక్షేమానికి 800 కోట్లు ఖర్చుచేశాం!
టిడిపి అధికారంలో ఉన్నప్పుడు అనేక విధాలుగా మత్స్యకారులను ఆదుకున్నాం. ఐదేళ్ల లో రూ.800 కోట్లు మత్స్యకారుల సంక్షేమం కోసం ఖర్చు చేసాం. 50 ఏళ్లకే మత్స్యకారులకు పెన్షన్లు ఇచ్చాం. మత్స్యకార పిల్లలు చదువు కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశాం. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు సబ్సిడీ లో బోట్లు, వలలు, డీజిల్, టీవీఎస్ బల్లు అందజేసాం. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వేట విరామ సమయంలో భృతి ఇచ్చి ఆదుకున్నాం. పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతు ను తెచ్చుకున్నారు.
సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దుచేసిన జగన్
టిడిపి హయాంలో మత్స్యకారులకు ఇచ్చిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను వైసీపీ రద్దు చేసారు. జీఓ.30 తీసుకొచ్చి మత్స్యకారులకి వచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశాడు. జగన్ పాలనలో జీఓ.217 తీసుకొచ్చి మత్స్యకారుల పొట్ట కొట్టారు. చెరువులు, రిజర్వాయర్లు అన్ని వైసిపి నాయకులు లాక్కున్నారు. ఎన్నో ఏళ్లుగా మత్స్యకారుల జీవనోపాధి గా ఉన్న చెరువులు లాక్కొని వారికి జగన్ తీరని అన్యాయం చేశాడు. సబ్సిడీ రుణాలు, వలలు, బోట్లు జగన్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు బెట్టే లెక్కలు కూడా మత్స్యకారుల ఖాతా లో రాస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కార్పొరేషన్ ద్వారా దామాషా ప్రకారం నిధులు కేటాయించి మత్స్యకారులను ఆదుకుంటాం.
బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తాం
టిడిపి హయాంలో ఆక్వా రీసెర్చ్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. టిడిపి హయాంలో మత్స్య సంపద పెంచడానికి ప్రతి ఏడాది చేప పిల్లలు పెద్ద ఎత్తున చెరువుల్లో, రిజర్వాయర్లలో వదిలిపెట్టాం. మత్స్యకారుల కోసం తీర ప్రాంతంలో తుఫాను షెల్టర్లు ఏర్పాటు చేస్తాం. టిడిపి హయాంలోనే చంద్రన్న భీమా పథకం తీసుకొచ్చాం. జగన్ వైఎస్సార్ భీమా అని పేరు మార్చి ఆయనకి చెడ్డ పేరు తెచ్చాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రన్న భీమా మరింత పటిష్ఠంగా అమలు చేస్తాం. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. ఆదరణ పథకం ద్వారా మత్స్యకారులకు అవసరం అయిన అన్ని పనిముట్లు అందజేస్తాం.
ఇన్ ఛార్జి పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ…
మత్స్యకారులు జగన్ పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. టిడిపి అధికారంలోకి ఉన్నప్పుడు అనేక రకాలుగా ఆదుకున్నాం. తుఫాను షెల్టర్లు కట్టాం. పెన్షన్లు ఇచ్చాం.
యువనేత ఎదుట మత్స్యకారుల సమస్యలు
జీఓ. 217 తీసుకొచ్చి మా పొట్ట కొట్టారు. ఎన్నో ఏళ్లుగా మాకు జీవనోపాధి గా ఉన్న మా చెరువులు లాక్కున్నారు. పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద పూడిక తియ్యక పోవడం వలన చేపలు పట్టుకోవడానికి వీలు లేక ఇబ్బంది పడుతున్నాం. తమిళనాడు జాలర్లు మాపై దాడులు చేస్తున్నా వైసిపి ప్రభుత్వం రక్షణ కల్పించడం లేదు. పులికాట్ సరస్సు నుండి గ్రామాలకు చేరుకునే కాలువల్లో పూడిక తియ్యక ఇబ్బంది పడుతున్నాం. టిడిపి ప్రభుత్వం హయాంలో బోట్లు, వలలు ఇచ్చే వారు ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించడం లేదు. డ్రైయింగ్ ప్లాట్ ఫామ్ లు లేక ఇబ్బంది పడుతున్నాం. జగన్ పాలనలో తుఫాను షెల్టర్లు ఏర్పాటు చెయ్యక ఇబ్బంది పడుతున్నాం. టిడిపి హయాంలో మత్స్యకారులు చనిపోతే 5 లక్షల ఆర్ధిక సాయం అందేది. జగన్ పాలనలో మత్స్యకారులు చనిపోతే భీమా అందడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక పరిహారం అందించడం లేదు.
నారా లోకేష్ ను కలిసిన చిట్టమూరు గ్రామస్తులు
గూడూరు నియోజకవర్గం చిట్టమూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో కొన్నేళ్లుగా డ్రైనేజీ సమస్యతో అనారోగ్యపాలవుతున్నాం. గ్రామం మధ్యలో సమారు 8 ఎకరాల్లో కొలను ఉంది. కొలనులో 15 ఏళ్ల నుండి గుర్రపు డెక్కలతో నిండి ఉంది. దీంతో దోమల ఎక్కువగా ఉండటంతో డెంగ్యూ జ్వరాలబారిన పడుతున్నారు. మీ ప్రభుత్వం వచ్చాక మా సమస్యలు పరిష్కరించాలి. యువతకు అవసరమైన క్రీడా ప్రాంగణం లేదు. గ్రామంలో సీసీ రోడ్లు లేవు..తాగు నీటికి ఇబ్బంది పడుతున్నాం.
నారా లోకేష్ మాట్లాడుతూ
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చాక గ్రామసీమలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. దేశచరిత్రలో గ్రామపంచాయితీలను దొంగిలించిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదే. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కి.మీ. సిసి రోడ్లు నిర్మించాం. TDP ప్రభుత్వం రాగానే చిట్టమూరులో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఇంటింటికీ తాగునీటి కుళాయిలు ఏర్పాటుచేసి 24/7 సురక్షిత నీరు అందిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన చిట్టమూరు ఆక్వా రైతులు
తిరుపతి జిల్లా, గూడూరు నియోకవర్గం, చిట్టమూరు ఆక్వా రైతులు నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. చిట్టమూరు గ్రామంలో ఆక్వా రైతులు అధికంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక 9 సార్లు విద్యుత్ బిల్లుల పెరిగాయి. టీడీపీ హయాంలో యూనిట్ విద్యుత్ రూ.1.50లకు ఇచ్చారు. చిట్టమూరులో రొయ్యల వాగు ఉంది. రొయ్యల వాగులో చెక్ డ్యామ్ నిర్మిస్తే భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఉపయోగడుతుంది.
నారా లోకేష్ మాట్లాడుతూ
జె-ట్యాక్స్ కోసం ఆక్వాసాగును సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కేటగిరిల వారీగా విభజించి ఆక్వారైతులకు ఇచ్చే సబ్సిడీలను తొలగించి తీరనిద్రోహం చేశారు. టీడీపీ హయాంలో ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ను రూ.2 లకు ఇచ్చాం.. ఇప్పుడు మాత్ర యూనిట్ రూ.4లు వసూలు చేస్తున్నాడు. మేం అధికారంలోకి వచ్చాక మళ్లీ రూ.1.50లకే విద్యుత్ ఇస్తాం. టీడీపీ హయాంలో ఆక్వా ఉత్పత్తులు రూ.30 వేల కోట్ల నుండి రూ.70 వేల కోట్లకు పెరిగింది. సీడ్ యాక్ట్, ఫీడ్ యాక్ట్, సెస్సు పేరుతో ఆక్వా రైతులను జగన్ దోచుకుంటున్నారు. వైసీపీ వచ్చాక రాష్ట్రంలో ఆక్వారంగానికి కూడా రైతులు హాలిడే ప్రకటించారు. టీడీపీ వచ్చాక చిట్టమూరులోని రొయ్యల వాగులో చెక్ డ్యాములు నిర్మిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన వాకాడ బీసీ కాలనీ వాసులు
గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వాకాడు బిసి కాలనీ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాలనీలో 120 కుటుంబాల వరకు నివాసం ఉంటున్నాయి. ఓ వైపు స్వర్ణముఖి, మరోవైపు వాకాడ చెరువు ఉండటంతో లోతట్టు ప్రాంతమైనందున నీరు వచ్చి నిలుస్తోంది. నీటినిల్వ ఎక్కువ రోజులు ఉండటంతో కాలనీ వాసులు అనారోగ్యం పాలవుతున్నారు. గత ప్రభుత్వంలో కాలనీలోని కొన్ని వీధుల్లో సీసీ రోడ్లు వేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎన్నిసార్లు అధికారులకు, ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నా నిధులు లేవని చెప్తున్నారు. మీ ప్రభుత్వం రాగానే డ్రేనేజీ, సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ
వైసీపీ వచ్చాక ఎస్సీ కాలనీలు, బీసీ కాలనీలను నిర్వీర్యం చేసింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.75,760 కోట్ల రూపాయలు దారిమళ్లించిన వైసీపీ.కుర్చీల్లేని బిసి కార్పొరేషన్ల ఏర్పాటుతో బిసిలను దగా చేశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బిసి కాలనీల్లో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీలు నిర్మించి వర్షపునీరు నిలచిపోకుండా చర్యలు తీసుకుంటాం.
నారా లోకేష్ ను కలిసి వాకాడ మండల ప్రజలు
గూడూరు నియోజకవర్గం వాకాడ టెంపుల్ జంక్షన్ లో మండల ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మండలంలోని అన్ని పంచాయతీలలో వీధి దీపాలు లేవు. వీధి దీపాలు లేక పాదచారాలు ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ల స్థలాలకు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా స్పందించడం లేదు. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న వారికి బిల్లులు ఇవ్వడం లేదు. మీరు అధికారంలోకి పంచాయతీల్లో వీధి దీపాలతో పాటు, ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న వారికి బిల్లులు మంజూరు చేయాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆర్థిక సంఘం నిధులను ఈ ప్రభుత్వం పంచాయతీ ఖాతాల్లో నుండి లాగేసుకుంది. టీడీపీ హయాంలో 25వేల కి.మీ సిసి రోడ్లు, 30 లక్షల ఎల్ఈడీ దీపాలు వేశాం. కులం, మతం చూడకుండా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామన్న జగన్ రెడ్డి..తన పార్టీ వారికి మాత్రమే ఇళ్ల స్థలాలు ఇచ్చుకుంటున్నారు. ఇళ్ల స్థలాలపేరుతో రూ.7 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తాం. టీడీపీ హయాంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు ఆపేయడం దుర్మార్గం. మేం అధికారంలోకి వచ్చాక పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తాం.
నారా లోకేష్ ను కలిసిన స్వర్ణముఖి తీర గ్రామాల ప్రజలు
గూడూరు నియోజకవర్గం స్వర్ణముఖి నది తీర గ్రామాలైన బాలిరెడ్డిపాలెం, గంగనపాలెం, జమీన్ కొత్తపాలెం, తూపిలిపాలెం ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. బాలిరెడ్డిపాలెం పంచాయతీ, జమీన్ కొత్తపాలెం పంచాయతీల మధ్యనున్న స్వర్ణముఖి నది గుండా ప్రజల రాకపోకలకు ఎన్టీఆర్ హయాంలో కాజ్ వే నిర్మించారు. వరదల కారణంగా కాజ్ వే దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వరదల సమయంలో 15 గ్రామాల ప్రజలు జలదిగ్భందంలో ఉంటున్నారు. బాలిరెడ్డిపాలెం నుండి గంగనపాలెం మధ్యలో స్వర్ణముఖి నది నుండి ఒక బ్రిడ్జి నిర్మించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ
జగన్ ప్రభుత్వానికి నదీతీర ప్రాంతాల్లో ఇసుకపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదు. వైసిపి ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. జగన్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 61మంది అమాయకులు బలయ్యారు. పులిచింతల, గుళ్లకమ్మ గేట్లు కూడా కొట్టుకుపోయినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక బాలిరెడ్డిపాలెం పంచాయతీ, జమీన్ కొత్తపాలెం పంచాయతీల మధ్య కాజ్ వే నిర్మిస్తాం. బాలిరెడ్డిపాలెం నుండి గంగనపాలెం మధ్య స్వర్ణముఖి నదిపై బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలిస్తాం.
నారా లోకేష్ ను కలిసి తిన్నెలపూడి గ్రామస్తులు
గూడూరు నియోజకవర్గం తిన్నెలపూడి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో ముఖ్యంగా తాగునీటి సమస్య ఉంది, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. రోడ్లన్నీ గోతులమయమయ్యాయి, నాలుగేళ్లుగా గ్రామాన్ని ఎవరూ పట్టించకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించాలి. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగి బతుకుబండి లాగడం భారంగా మారింది. విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు అందకపోవడంతో తల్లిదండ్రులు అప్పులు పాలవుతున్నారు. అమ్మఒడి కూడా అందరికీ రావడం లేదు, ఉద్యోగాలు లేక యువత ఇబ్బంది పడుతున్నారు.
నారా లోకేష్ మాట్లాడుతూ
లీటర్ రూ.వెయ్యిరూపాయల విలువైన నీళ్లు తాగే ముఖ్యమంత్రికి పేదల తాగునీటి కష్టాలు పట్టడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల దాహార్తిని తీర్చడానికి కేంద్రం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ అమలులో రాష్ట్రం 18వ స్థానంలో ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, పెట్రోలు ధరలు, ఇంటిపన్నులు విపరీతంగా పెంచి సామాన్యుడి బతుకులు నరకంగా మార్చారు. టిడిపి అధికారంలోకి రాగానే పన్నులు ప్రక్షాళన చేసి నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. విద్యా దీవెన, వసతి దీవెన రద్దు చేసి, నేరుగా కాలేజీ యాజమాన్యాలకే ఫీజులు చెల్లిస్తాం. తల్లికివందనం పథకం ద్వారా రూ.15 వేలు చొప్పున అందిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలను రప్పించి యువతకు 20లక్షల ఉద్యోగాలిస్తాం.
Also, Read This Blog :Step towards great future by the significance of Yuvagalam
Tagged: #LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh