Naralokesh padayatra,Yuvagalam
Naralokesh padayatra,Yuvagalam

*జెట్ స్పీడుతో 1800 కి.మీ.ల మజిలీకి యువగళం!*

*గూడూరు నియోజకవర్గంలో హోరెత్తిన లోకేష్ పాదయాత్ర*

*హారతులు, పూలవర్షంతో యువనేతకు అపూర్వస్వాగతం*

*అడుగడుగునా వినతుల వెల్లువ, నేనున్నానని భరోసా*

సూళ్లూరుపేట/గూడూరు: లక్ష్యంగా 5కోట్లమంది జనదళం ఆశీస్సులతో జెట్ స్పీడుతో సాగిపోతున్న యువగళం పాదయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 138వరోజు గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం అరవపాలెం వద్ద పాదయాత్ర 1800 కి.మీ. మజిలీకి చేరుకుంది. ఈ సందర్భంగా లోకేష్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతంలో ఆక్వారైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇస్తూ, శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. వైసిపి పాలనలో కుదేలైన ఆక్వారంగానికి మేము అందించబోయే ప్రోత్సాహకాలు ఊతమిస్తాయని తెలిపారు.  138వరోజు సూళ్లూరుపేట నియోజకవర్గంలో పూర్తయి గుణపాటిపాలెం వద్ద గూడూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. గూడూరు నియోజకవర్గ ప్రజలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు యువనేతకు హారతులు పడుతూ, పూలవర్షం కురిపించి అపూర్వస్వాగతం పలికారు. అడుగడుగునా వివిధవర్గ్లాల ప్రజలు లోకేష్ కు ఎదురేగి, తాము ఎదుర్కొంటున్న సమస్యలు విన్నవించుకున్నారు. అన్నమేడులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ప్రజలనుంచి అపూర్వ స్పందన లభించింది. అనంతరం యువనేత పాదయాత్ర పొడవునా వివిధ వర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. 138వరోజు యువనేత లోకేష్ 19.2 కి.మీ. పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1806 కి.మీ. పూర్తయింది.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

కళాకారుల పెన్షన్ నిలిపేశారు-పకీరయ్య, వేముగుంటపాలెం

నా పేరు జువ్వలపాటి పకీరయ్య, 68 సంవత్సరాలు. మాది వేముగుంటపాలెం గ్రామం. నేను రంగస్థల నటుడిని. 16వయేటనుంచి స్టేజి నాటకాల్లో వేషాలు వేశాను. టీటీడీ కార్యక్రమాల్లో కూడా నేను నాటకాలు వేస్తాను. మా గ్రామంలో 20మంది కళాకారులను తయారు చేశాను. చెంగాళమ్మ నాట్యమండలి ని 2007లో స్థాపించాను. నాకు TDP పాలనలో కళాకారుల పెన్షన్ నెలకు రూ.3వేలు వచ్చేది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నా పెన్షన్ నిలిశారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదు.

ఇళ్లస్థలాల మంజూరులో పక్షపాతం-రాణి, గుణపాటిపాలెం ఎస్సీ కాలనీ.

మా కాలనీలో సిసి రోడ్లు లేవు, ఇళ్లస్థలాల మంజూరులో పక్షపాతం చూపించారు, కాలనీలో 150మంది ఇళ్లులేని వారు ఉంటే ఒక్కరికీ కూడా ఇంటిస్థలం ఇవ్వలేదు.  అర్హత ఉన్నవారిని వదిలి ఇష్టారాజ్యగా వైసిపి వారికి ఇచ్చుకున్నారు. డ్రైన్లు లేవు, మురుగునీరు రోడ్లమీద ఉన్నాయి.

వీధి దీపాలు లేక చీకట్లో తిరుగుతున్నాం-జ్యోతి, తిమ్మారెడ్డివాగు గ్రామం.

నా పేరు జ్యోతి, మాది తిమ్మారెడ్డి వాగు గ్రామం. గ్రామంలో వీధిలైట్లు చెడిపోయి, వీధులన్నీ చీకటిమయంగా ఉంటున్నాయి. పొలాలు పక్కనే ఉండడంవల్ల విషపురుగులు ఇళ్లలోకి వచేస్తున్నాయి. కొన్నిసార్లు విషపురుగులు బారిన పడుతున్నాం. అధికారులు, నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. కొన్ని వీధుల్లో సీసీ రోడ్లు లేక వర్షాకాలం ఇబ్బందులు పడుతున్నాం. గ్రామానికి వచ్చే ప్రధాన రహదారి గుంటలమయం గా ఉంది. నాలుగేళ్లుగా ఎంతమందికి చెప్పినా పట్టించుకోవడం లేదు.

పారిశుద్ధ్యాన్ని గాలికొదిలేశారు!-రజిని, పెళ్ళకూరు.

గ్రామంలోని ప్రధాన రహదారి అధ్వాన్నంగా ఉంది. ఇంటర్నల్ సీసీ రోడ్లు నిర్మించడంలేదు. గ్రామంలో పారిశుధ్యాన్ని గాలికొదిలేశారు. డ్రైనేజీలు లేక మురుగునీరు రోడ్లపై నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. అధికారులు, నాయకులకు నాలుగేళ్లుగా చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు.

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతిఎకరాకు సాగునీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక పాలసీ ప్రక్షాళన రచ్చబండ కార్యక్రమంలో యువనేత నారా లోకేష్

సూళ్లూరుపేట: నాలుగేళ్లుగా జగన్ పాలన లో జనం నరకం అనుభవిస్తున్నారు, టిడిపి హయాంలో ఇళ్లు కట్టుకున్న పేదలకు సైకో జగన్ బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నాడు, టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గం అన్నమేడు గ్రామస్తులతో నిర్వహించిన రచ్చబండలో యువనేత లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… 63 వేల మెజారిటీ తో గెలిచిన సూళ్లూరుపేట శాసనసభ్యుడు కనీసం రైతు భరోసా ఇప్పించలేని దుస్థితి లో ఉన్నారు. జగన్ పాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వలన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జగన్ చెత్త పాలన కారణంగా రైతు ఆత్మహత్యల్లో ఏపి నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది రూ.20 వేలు ఇచ్చి రైతుల్ని ఆదుకుంటాం. గతంలో ఇచ్చినట్టే సబ్సిడీ లో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం. కోర్టు దొంగ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా ఉమ్మడి నెల్లూరు జిల్లా రైతులకి న్యాయం జరగలేదు.  టిడిపి అధికారంలోకి వచ్చిన  వెంటనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, పిల్ల కాలువలు తవ్వి ప్రతి ఎకరానికి నీరు అందిస్తాం. చెరువుల్లో పూడిక తీస్తాం.

మోటార్లకు మీటర్లు పెడితే పగులగొట్టండి

కరెంట్ బిల్లులు కట్టక భూసార పరీక్ష కేంద్రాలు జగన్ ప్రభుత్వం లో మూతపడ్డాయి. టిడిపి అధికారంలోకి భూసార పరీక్షలు చేసి సూక్ష్మ పోషకాలు ఇచ్చాం, ట్రాక్టర్లు, స్ప్రేయర్లు లాంటి పనిముట్లు అందజేసాం. జగన్ మోటార్ల కు మీటర్లు పెడుతున్నాడు. రైతులు మీటర్లు పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. రూ. 200 పెన్షన్ ని రూ.2000 వేలు చేసింది చంద్రబాబు గారు. పెళ్లి కానుక, పసుపు కుంకుమ, పండుగ కానుకలు ఇచ్చింది చంద్రబాబు. జగన్ పన్నులు పెంచి ప్రజల్ని పీడిస్తున్నాడు.కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు. ఆర్టీసి ఛార్జీలు 3 సార్లు పెంచాడు.పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపి దేశంలోనే నంబర్ 1. చెత్త పన్ను, ఇంటి పన్ను అంటూ బాదుడే బాదుడు.

కష్టాలు చూశాను…కన్నీళ్లు తుడుస్తాను!

మీ కష్టాలు చూసాను… కన్నీళ్లు తుడుస్తాను. అందుకే మహానాడు లో మహాశక్తి పథకాన్ని ప్రకటించాం. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1500.  తల్లికి వందనం పేరుతో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది చదువుకి సహాయం. ముగ్గురు పిల్లలు ఉంటే రూ.45 వేలు. దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తాం. మహిళలకు ఉచితంగా ఆర్టీసి బస్సు ప్రయాణం కల్పిస్తాం.  ఒకే సంతకంతో రూ.50 వేల రైతు రుణాలు మాఫీ చేసింది చంద్రబాబు గారు. చేసి చెప్పుకోవడం లో మేము విఫలం అయ్యాం. జగన్ రూ.750 పెన్షన్ పెంచడానికి నాలుగేళ్లు పట్టింది. ఇంకా వెయ్యి రూపాయలు పెంచలేదు. అలాంటి జగన్ ఆనాడు ఒకే సారి లక్షా యాభై వేల రుణమాఫి చెయ్యాలని డిమాండ్ చేసాడు. జగన్ 6 లక్షల పెన్షన్లు కట్ చేశాడు. అనేక నిబంధనలు పెట్టి అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తున్నాడు.

ముద్దులతో జనం పడిపోయారు!

జగన్ ముద్దులు, ఒక్క ఛాన్స్ కి ప్రజలు పడిపోయారు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగ యువతకు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.3 వేలు అందిస్తాం. నెల్లూరు జిల్లా కి టిడిపి హయాంలో 73 కంపెనీలు వచ్చాయి 33 వేల మంది యువతీ, యువకులకు ఉద్యోగాలు వచ్చాయి. బాబు ని చూస్తే కంపెనీలు గుర్తొస్తాయి.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక విధానాన్ని మారుస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విచ్చలవిడి ఇసుక తవ్వకాలకు చెక్ పెడతాం. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్ పథకం ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం.10 కి 10 సీట్లు ఇస్తే వైసిపి నాయకులు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చేసింది ఎంటి? అవే సీట్లు మాకు ఇవ్వండి అభివృద్ది అంటే ఏంటో చూపిస్తాం. చెయ్యకపోతే చొక్కా పట్టుకొని నిలదీయండి.

రచ్చబండలో అన్నమేడు గ్రామస్తుల సమస్యలు

టిడిపి హయాంలో ఇళ్లు కేటాయించారు. నిర్మాణం ప్రారంభించాం. ప్రభుత్వం మారిన తరువాత బిల్లులు ఇవ్వక ఇళ్ళ నిర్మాణం మధ్యలో ఆగిపోయాయి. రైతు భరోసా పడక కొంత మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. సాగు నీరు అందక ఇబ్బంది పడుతున్నాం. వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం లేదు. మీరు రూ.50 వేలు లోపు రుణాలు అన్ని ఒకే సారి మాఫీ చేశారు. ఆ రోజు జగన్ లక్షా యాభై వేలు ఒకే సారి చెల్లించాలి అని డిమాండ్ చేసాడు. వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి జగన్ కి నాలుగేళ్లు పట్టింది. ఇంకా చెయ్యలేదు. మీరు చేసింది చెప్పుకోవడం లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటూ లోకేష్ ని ప్రశ్నించిన ఒక రైతు. అమ్మ ఒడి పథకం అందరికీ అందడం లేదు. కరెంట్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయి అంటూ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. ఇసుక దొరక్క ఇబ్బంది పడుతున్నాం.

లోకేష్ సమక్షంలో టిడిపిలోకి భారీగా చేరికలు

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన యువనేత

సూళ్లూరుపేట నియోజకవర్గంలో యువగళం వైసిపి శిబిరాన్ని షేక్ చేస్తోంది. నియోజకవర్గంలో నారాలోకేష్ పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో సోమవారం వైసీపీకి చెందిన 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. అన్నమేడు యువగళం క్యాంపు సైట్ లో యువనేత లోకేష్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.  వైసీపీ ముఖ్య నాయకులు తడ మాజీ ఎంపీపీ రమేష్, నాయుడుపేట ఏఎంసీ మాజీ డైరెక్టర్, రోసనూరు గ్రామ మాజీ సర్పంచ్  సత్యంరాజు, నాయుడుపేట ఏఎంసీ మాజీ డైరెక్టర్, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య, వేమగుంట గ్రామానికి చెందిన వైసీపీ కీలక నాయకుడు డి.శ్రీనివాసులురెడ్డి తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను ఆ పార్టీ వారే భరించలేకపోతున్నారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడేందుకు టిడిపిలోకి వచ్చేవారెవరినైనా  ఆహ్వానిస్తామని చెప్పారు. వైసీపీ దుర్మార్గాలను నిరససగా పార్టీలోకి వచ్చిన నాయకులను  యువనేత అభినందించారు.

జన్మనిచ్చింది తల్లిదండ్రులు.. జ్ఞానం పంచింది ఎన్టీఆర్ మోడల్ స్కూల్- లోకేష్ ని కలిసి కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన పూర్వ విద్యార్థి కరుణాకర్

తనకి జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే, జ్ఞానం ఇచ్చింది ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అని నల్ల మాకల కరుణాకర్ అంటున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తనకి చేసిన సాయం జీవితాంతం మరువలేనని, ఆ మహానుభావుడు దయవల్ల తాను ఇప్పుడు సొంతూరు దగ్గర్లోనే నెలకి 50 వేల జీతం తీసుకునే ఉద్యోగం చేస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. టిడిపి తనకి చేసిన సాయానికి  నారా లోకేష్ ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా ఓజిలి మండలం మనవాలి గ్రామానికి చెందిన టిడిపి నేత నల్లమాకల కస్తూరయ్యపై రాజకీయ ప్రత్యర్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఇంటి పెద్ద మంచానపడటంతో నలుగురు పిల్లలు చదువులు ప్రశ్నార్థకమయ్యాయి. టిడిపి అధినేత చంద్రబాబు 2007లో కరుణాకర్ ని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చేర్పించగా అక్కడే ఇంటర్ పూర్తి చేశారు. గుంటూరు నలందలో బీటెక్ అయ్యాక, శ్రీసిటీలోని కెలోగ్స్ ఫుడ్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ జాబ్ సంపాదించారు. మెరుగైన జీతంతో ఇప్పుడు కుటుంబ బాధ్యతల్ని కూడా కరుణాకర్ చూస్తున్నారు. తనలాగే ఎంతో మందిని తెలుగుదేశం పార్టీ, చంద్రబాబునాయుడు గారు విద్యావంతులుగా తీర్చిదిద్దారని, ఇదే స్ఫూర్తితో తాను నిరుపేద పిల్లలకి సాయం అందించి తెలుగుదేశం పార్టీ లక్ష్యాన్ని నెరవేరుస్తానని కరుణాకర్ చెబుతున్నారు. ఏడాదికి లక్షలు ఫీజు చెల్లించేవారితో సమానంగా తనకూ ఉచితంగా విద్యాబుద్ధులు నేర్పి, భోజన వసతి కల్పించి, ఉన్నతోద్యోగిగా తీర్చిదిద్దిన ఎన్టీఆర్ మోడల్ స్కూల్, అందులో చేరే అవకాశం కల్పించిన నారా చంద్రబాబునాయుడు గారి ఆశయసాధనకి కృషి చేసి రుణం తీర్చుకుంటానంటున్నారు కరుణాకర్.

లోకేష్ ను కలిసిన వేముగుంటపాలెం గ్రామస్తులు

సూళ్లూరుపేట నియోజకవర్గం వేముగుంటపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామం స్వర్ణముఖి నదిని ఆనుకొని ఉండటంతో వర్షాకాలంలో వరదనీరు గ్రామంలోకి వస్తోంది. ముంపునివారణకు స్వర్ణముఖి నది పొర్లుకట్టకు మరమ్మతులు చేపట్టాలి. శ్మశానానికి వెళ్లే రహదారి అస్త్యవ్యస్తంగా ఉంది, మరమ్మతులు నిర్వహించాలి. కరెంటులేని సమయంలో తాగునీటికోసం ఇబ్బందులు పడుతున్నాం, బోర్లు ఏర్పాటుచేయాలి. మా గ్రామంలో సమస్యల పరిష్కారానికి మీ వంతు సహకారం అందించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ

వైసిపి ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో స్వర్ణముఖి నది పొర్లుకట్ట నాసిరకంగా నిర్మించడంతో తరచూ మరమ్మతులకు గురవుతోంది. జగన్ ప్రభుత్వ నిర్వాకం కారణంగా అన్నమయ్య డ్యామ్, పులిచింతల, గుళ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పొర్లుకట్ట మరమ్మతులు చేపట్టి ముంపు బెడద నివారిస్తాం. గ్రామాల్లో వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ కుళాయి అందజేసి, 24/7 తాగునీరు అందజేస్తాం. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి గత వైభవం తెస్తాం.

లోకేష్ ను కలిసిన వేముగుంటపాలెం కాలువగట్టు వాసులు

సూళ్లూరుపేట నియోజకవర్గం వేముగుంటపాలెం కాలువగట్టు వాసులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాలువగట్టు సమీపంలో కూచివాడపాలెం పంచాయితీ పరిధిలోని స్వర్ణముఖి నదిలో ఇసుకరీచ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేముగుంటపాలెం, కాలువగట్టు, మడపాలెం, కూచివాడపాలెం, కూచివాడ, చిలమత్తూరు గ్రామాల ప్రజలు బోర్లపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం. దీనివల్ల నదీతీర ప్రాంతంలో సాగునీరు, తాగునీరు ఉప్పునీరుగా మారి వ్యవసాయ భూములు బీళ్లుగా మారి, వలసలకు దారితీసే అవకాశముంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలను నిలిపివేయించి, చెక్ డ్యామ్ నిర్మాణం ద్వారా మా పొలాలకు నీరందించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ

అడ్డగోలుగా నదుల్లో ఇసుక తవ్వకాలు జరిపి కర్నాటక, తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నదీతీర ప్రాంతాల్లో ప్రజలు తాగు, సాగునీటి కష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇసుక తవ్వకాలు జరపడం నిబంధనలకు విరుద్దం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి ఇసుకాసురులపై ఉక్కుపాదం మోపుతాం. స్వర్ణముఖి నదిపై చెక్ డ్యామ్ నిర్మించి తీర గ్రామాల ప్రజలకు సాగునీరు అందజేస్తాం.

యువనేత లోకేష్ ను కలిసిన మడఫలం గ్రామస్తులు

సూళ్లూరుపేట నియోజకవర్గం మడఫలం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాల్వగట్టు గ్రామం నుండి స్వర్ణముఖి నదిలో రాజీవ్ టెక్నాలజీ మిషన్ స్కీమ్ ద్వారా గతంలో రెండు బావులు ఏర్పాటుచేశారు. వీటి ద్వారా 50 గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతోంది. స్వర్ణముఖి నదినుంచి అడ్డగోలుగా ఇసుక తరలించడం వల్ల బావుల్లో నీరు ఇంకిపోయి, తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదముంది. స్వర్ణముఖి నదినుంచి పులికాలువ ద్వారా నాయుడుపేట, చిట్టమూరు, వాకాడు మండలాల్లోని 30 గ్రామపంచాయితీ చెరువుల ఫిల్టర్ పాయింట్లకు కలిపి, 50వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. స్వర్ణముఖి నదిలో ఇసుక రీచ్ ఏర్పాటుచేయడం వల్ల నది కోతకుగురై కాల్వలకు నీరందడం లేదు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టి, కూచివాడపాలెం వద్ద చెక్ డ్యామ్ నిర్మించాలి.

యువనేత లోకేష్ ను కలిసిన గుణపాటిపాలెం గ్రామస్తులు

గూడురు అసెంబ్లీ నియోజకవర్గం గుణపాటిపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. స్వర్ణముఖి నదిలో నిబంధనలకు విరుద్దంగా 20మీటర్ల లోతున ఇసుకను అక్రమంగా తవ్వి పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. దీనివల్ల 30 గ్రామాలకు తాగునీరు, 15 గ్రామాలకు సాగునీటి సమస్య ఏర్పడతోంది. దీనివల్ల గ్రామాల్లో నివసించే ప్రజలు పనుల కోసం పొరుగు ప్రాంతాలకు వలసలు వెళ్లే పరిస్థితుల నెలకొన్నయి. ప్రస్తుత ట్రాక్టర్ ఇసుక 10వేల రూపాయలకు చేరడంతో సామాన్య ప్రజలు ఇళ్లు నిర్మించుకునే పరిస్థితి లేదు. మా గ్రామంలో సైడ్ కాల్వలకు ఎటువంటి మరమ్మతులు చేయకపోవడంతో శిథిలమైపోయాయి. స్వర్ణముఖి నదిలో వర్షాకాలంలో నీటిప్రవాహం ఉంటుంది, నదిపై చెక్ డ్యామ్ నిర్మిస్తే 30 గ్రామాలకు తాగునీరు, 15 గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కారమవుంది.  మీరు అధికారంలోకి మా గ్రామ సమస్యలను పరిష్కరించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టవిరుద్ద ఇసుక తవ్వకాలపై స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. తాడేపల్లి ప్యాలెస్ టార్గెట్లతో కడపజిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో పలువురు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. గత ప్రభుత్వ హయాంలో నీరు-ప్రగతి కార్యక్రమంలో రూ.18,265 కోట్లు వెచ్చించి చెరువుల్లో పూడికతీత, చెక్ డ్యామ్ ల నిర్మాణం చేపట్టి నీటివనరుల పరిరక్షణకు చర్యలు తీసుకున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ ఇసుక తవ్వకాలపై ఉక్కుపాదం మోపి, నదీ జలాలను పరిరక్షిస్తాం. స్వర్ణముఖి నదిపై చెక్ డ్యామ్ ల నిర్మాణం చేపట్టి తీరప్రాంతంలో సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం.

యువనేత లోకేష్ ను కలిసిన పెళ్లకూరు గ్రామప్రజలు

గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం పెళ్లకూరు గ్రామ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పెళ్లకూరు చిట్టిగుంట చెరువు సప్లయ్ ఛానల్ కు సంబంధించి పుల్లి కాల్వ నుంచి 2 కి.మీ. పొడవున గత ప్రభుత్వంలో నీరు చెట్టుకింద పనులు చేశాం.  ఆ బిల్లులు పెండింగ్ లో ఉండగానే వైసిపినాయకులు చెరువు, కాల్వలను చదును చేసి అక్రమంగా సాగుచేస్తున్నారు. దీనిని మేం ప్రతిఘటిస్తే దాడులు, దౌర్జన్యాలకు పాల్పడతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక రైతులకు ఉపయోగపడే విధంగా చెరువు, సప్లయ్ చానళ్లలో ఆక్రమణలను తొలగించాల్సిందిగా కోరుతున్నాం. పెళ్లకూరులో 1983లో నిర్మించిన తుపాను భవనం శిథిలావస్థలో ఉంది, దానిని పునర్నిర్మించాలి.

యువనేత లోకేష్ ను కలిసిన ఉప్పలమర్రి గ్రామస్తులు

గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప్పలమర్రి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 1984లో అప్పటి ప్రభుత్వం మాకు ఇళ్లస్థలాలు ఇచ్చింది.  అప్పట్లో ఉప్పలమర్రిలో 75 ఎస్సీ, 75 బిసి కుటుంబాలు ఉండేవి. ప్రస్తుతం మా గ్రామ జనాభా మూడింతలైంది. ఇళ్లస్థలాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు ఇళ్లస్థలాలు ఇప్పించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ

జగన్ అధికారంలోకి వచ్చాక పేదల సెంటుపట్టా పేరుతో వైసిపినేతలు రూ.7వేల కోట్లు దోచుకున్నారు. పేదలకు ఆవాసయోగ్యంకాని సుదూర ప్రాంతాల్లో పనికిరాని ఇళ్లస్థలాలను ఇచ్చి దారుణంగా మోసగించారు. ఇచ్చిన స్థలాలను కూడా వైసిపి నేతల బంధువులు, వారి అనుచరగణానికే ఇచ్చుకున్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 12.75లక్షల ఇళ్లు నిర్మిస్తే, జగన్ నిర్మించింది కేవలం 5 మాత్రమేనని కేంద్రం పార్లమెంటు సాక్షిగా చెప్పింది. ఇళ్ల నిర్మాణం విషయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పేమాటలకు, చేసే పనులకు ఏమాత్రం పొంతనలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన పేదలందరికీ ఇళ్లస్థలాలతోపాటు ఇళ్లు నిర్మించి ఇస్తాం.

నారా లోకేష్ ను కలిసిన యల్లశిరి గ్రామప్రజలు

గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం యల్లశిరి గ్రామప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో ఎక్కువగా రజకులు ఉన్నారు, వారికి దోబీఘాట్ నిర్మించాలి. యల్లశిరి చెరువు కలుజు సప్లయ్ ఛానల్ కు మధ్యలో రహదారిపై బ్రిడ్జి ఏర్పాటుచేయాలి. గ్రామంలో డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటుచేయాలి. మా గ్రామంలో 200 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. యల్లశిరి చెరువులో చేపలవేట హక్కును గిరిజన సంక్షేమ సొసైటీకి అప్పగించాలి. యల్లశిరి మేజర్ చెరువు కింద 20 గ్రామాల రైతులు వ్యవసాయం చేస్తున్నారు. యల్లశిరి మేజర్ చెరువును రిజర్వాయర్ గా మార్చి సాగునీరు అందించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో మౌలిక సదుపాయాలను పూర్తిగా గాలికొదిలేసింది. బిసి, ఎస్సీ, ఎస్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఆ వర్గాలనే జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే యల్లశిరిలో రజకులకు దోబీఘాట్ నిర్మిస్తాం, యల్లశిరి చెరువులో గిరిజనులకు చేపలవేటకు అవకాశం కల్పిస్తాం. చెరువును అభివృద్ధిచేసి రైతులకు సాగునీరు అందజేస్తాం, కలుజు సప్లయ్ ఛానల్ వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపడతాం.

Also, Read This Blog :Step towards great future by the significance of Yuvagalam

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *