NaraLokesh padaytara,Yuvagalam
NaraLokesh padaytara,Yuvagalam

సర్వేపల్లి నియోజకవర్గం దుమ్ములేపిన యువగళం! ముత్తుకూరులో బహిరంగసభకు పోటెత్తిన జనం

అడుగడుగునా యువనేతకు  జన నీరాజనాలు

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అపూర్వస్వాగతం

సర్వేపల్లి: యువనేత Nara lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో దుమ్మురేపింది. అడుగడుగునా యువనేత లోకేష్ కు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 143వరోజు యువగళం పాదయాత్ర సర్వేపల్లి నియోజకవర్గం గోపాలపురం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. ముత్తుకూరులో నిర్వహించిన బహిరంగసభ జనసునామీని తలపించింది. కిలోమీటర్ మేర నలువైపులా రోడ్లు జనంతో నిండిపోయాయి. లోకేష్ కు సమస్యలు చెప్పుకునేందుకు మహిళలు, యువత, వృద్దులు భారీగా రోడ్లపైకి తరలివచ్చారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి లోకేష్ కు అభివాదం తెలిపారు. అందరి సమస్యలను ఓపిగ్గా విన్న యువనేత… టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. గోపాలపురం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర… ముత్తుకూరు, కుమ్మరిమిట్ట, మల్లూరు, తాళ్లపూడి, బ్రహ్మదేవం, పిడతపోలూరు, జ,గాల కండ్రిగ, వరిగొండ, గుమ్మలపాలెం మీదుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కాకుపల్లి చేరుకుంది. కాకుపల్లి జ్వాలాముఖి ఆర్చి వద్ద పాదయాత్ర నెల్లూరు రూల్ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ నేతృత్వంలో యువనేతకు పార్టీ నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. బాణాసంచా మోతలు, డప్పు శబ్ధాలు, గరగ నృత్యాలతో రూరల్ నియోజకవర్గంలో జాతరను తలపించింది. 143వరోజున యువనేత లోకేష్ 15.7 కి.మీ. పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1884 కి.మీ. మేర పూర్తయింది.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

పోర్టు దగ్గరున్నా ఉపాధి అవకాశాలు లేవు-రాజు, ముత్తుకూరు

కృష్ణపట్నం పోర్టుకు ఆనుకున్న ఉన్నా మా గ్రామస్తులకు ఉద్యోగాలు లేవు. పోర్టులో ఉద్యోగాలను స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, నాయకులు అమ్ముకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన వారికి మాత్రమే కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. సామాన్యులెవరూ పోర్టు పరిధిలోకి వెళ్లే పరిస్థితి కూడా లేదు. చెన్నై వెళ్లి సెక్యూరిటీ, కూలీ పనులు, తాపీ పనులు చేయాల్సివస్తోంది. మా గ్రామంలో చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేక కూలీపనులకు వెళుతున్నారు.

కోనేటిని పట్టించుకునే వారు లేరు-సుహాసిని, లక్ష్మీనరసాపురం, కప్పలదొరువు

మా గ్రామంలో వెంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి కోనేరు ఉంది. నాలుగేళ్లుగా ఈ కోనేటి నిర్వహణను అధికారులు, నాయకులు గాలికొదిలేశారు. కోనేరు మురుగునీటితో నిండి శిథిలావస్థ స్థితిలో ఉంది. నాయకులు, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టరు బిల్లులు రావడం లేదని పనులు వదిలేసి వెళ్లిపోయాడు.

మురుగునీటిలో ఇబ్బంది పెడుతున్నాం-ఝాన్సీ, కప్పలదొరువు.

మా గ్రామంలో అంతర్గత రోడ్లు లేవు. కొన్ని రోడ్లుకు మాత్రమే సీసీ రోడ్లు నిర్మించారు. డ్రైనేజీలు లేక మురుగునీటిని రోడ్లపైకి వదిలేయాల్సిన దుస్థితి. గ్రామంలోని అత్యధిక ప్రాంతం మట్టిరోడ్లు మీద నిలిచిన నీళ్లను తొక్కుకుంటూ తిరగాల్సివస్తోంది. వర్షాకాలం రోడ్లపైకి రాలేని పరిస్థితి. ఎమ్మెల్యే, మంత్రి ఒక్కసారి కూడా మా గ్రామానికి రాలేదు. మా సమస్యల్ని పట్టించుకోలేదు. వైసీపీ నాయకులకు మా సమస్యల్ని చెప్పుకుంటే చూద్దాంలే అని తప్పుకుని తిరుగుతున్నారు.

డిగ్రీ చదివి కూలి పనులకు వెళుతున్నా!-వీరయ్య, తాళ్లపూడి గ్రామం.

నా తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ చదివాను. డిగ్రీ పూర్తయ్యి మూడేళ్లయ్యింది. ఈ ప్రభుత్వంలో మాలాంటి వాళ్లకు ఉద్యోగాలు రావని తేలిపోయింది. సచివాలయం ఉద్యోగాలను కూడా ఎమ్మెల్యే కాకాణి రూ.10లక్షలకు అమ్ముకున్నారని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కూలీ పనులకు వెళుతున్నాను. సబ్సిడీ లోన్ ఇప్పిస్తే స్వయం ఉపాధి మార్గం ఏర్పాటు చేసుకుంటానని వైసీపీ నాయకులను అడిగితే కనీసం ఒక్కరు కూడా పట్టించుకోలేదు.

పుణ్యభూమిపై పాదయాత్ర చేయడం అదృష్టం

సర్వేపల్లి జనసునామీ సూపర్. మా తాత గారు, మా నాన్న గారు అంత మంచి పేరు వస్తుందో రాదో నాకు తెలియదు. వారికి చెడ్డ పేరు మాత్రం తీసుకురాను. నా పై అనేక ఆరోపణలు చేశారు. ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. దేశానికే వెలుగునిచ్చే దామోదరం సంజీవయ్య ధర్మల్ పవర్ ప్రాజెక్టు, కృష్ణపట్నం పోర్టు సర్వేపల్లి సొంతం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం. మస్తానయ్య దర్గా, వేళాంగిణి మాత చర్చి ఉన్న పుణ్య భూమి సర్వేపల్లి.  ఎంతో ఘన చరిత్ర ఉన్న సర్వేపల్లి నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

మహిళల కష్టాలు తీర్చేందుకే మహాశక్తి!

సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఎం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం.  మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం.

యువగళం నిధితో యువతకు అండ!

జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు.  యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

మోటార్లకు మీటర్లు అన్నదాతకు ఉరితాళ్లు

వైసీపీ  పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2.  రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. మోటార్లకు మీటర్లు రైతులకు ఉరితాళ్లుగా మారనున్నాయి. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతక సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. జీతం ఒకటో తారీఖున వచ్చే దిక్కు లేదు. ఇప్పుడు జీపీఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు.  పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది.

బిసిలకు రక్షణ కల్పించేందుకే ప్రత్యేక చట్టం!

బీసీలు పడుతున్న కష్టాలు నేను చూసాను. ఈ ప్రభుత్వం వచ్చాక బిసిలపై 26 వేల అక్రమ కేసులు పెట్టారు., నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు ఏర్పాటుచేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం.  డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా దళితుల పై దాడి జరిగిందా?

మైనారిటీలకు వైసీపీ చిత్రహింసలు

అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హాజిరా. ఇలా ఎంతో మంది బాధితులు.  మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పధకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో మీరు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నారు. ఇప్పుడు మీకు కనీస గౌరవం అయినా ఉందా. నాడు-నేడు అన్ని సామాజిక వర్గాలకు సమాన గౌరవం ఇచ్చింది ఒక్క టిడిపి మాత్రమే.

టిడిపి హయాంలోనే నెల్లూరు జిల్లా అభివృద్ధి!

2014 లో మాకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టిడిపి కి మూడు సీట్లే ఇచ్చారు. అయినా నెల్లూరు జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసాం. సాగు, తాగునీటి ప్రాజెక్టులు, టిడ్కో ఇళ్లు నిర్మించాం.  ఒక్క నెల్లూరు సిటీ ని అభివృద్ధి చెయ్యడానికే 4,500 కోట్లు ఖర్చు చేసాం. నెల్లూరు సిటీ లో వెయ్యి కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తే. నాలుగేళ్లలో 100 కోట్లు ఖర్చు చేసి పూర్తి చెయ్యలేని వేస్ట్ ప్రభుత్వం మీది. ఒక్క నెల్లూరు టౌన్ లోనే 17 వేల టిడ్కో ఇళ్లు కట్టాం. నెల్లూరు బ్యారేజ్ 90 శాతం, సంగం బ్యారేజ్ 70 శాతం, ఎస్ఎస్ కెనాల్ పనులు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క రోజు సరిపోదు. కోపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న 70 వేల ఎకరాల్లో రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చాం. తెలుగుగంగ ప్రాజెక్టు కింద 2.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే అటవీ అనుమతులు లేక కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేది. టిడిపి హయాంలో కేంద్ర ప్రభుత్వం తో పోరాడి అటవీ అనుమతులు తీసుకోని అదనంగా జిల్లాలో మరో 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం.

నెల్లూరుకు పరిశ్రమలు తెచ్చింది మేమే!

టిడిపి హయాంలో నెల్లూరు జిల్లాకి 73 పరిశ్రమలు తీసుకొచ్చాం. వాటి ద్వారా 18 వేల కోట్ల పెట్టుబడి, 32 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. గమేషా విండ్ టర్బైన్స్, ధర్మల్ పవర్ టెక్, సీపీ ఆక్వాకల్చర్, ఫెడోరా సీ ఫుడ్స్, అంజని టైల్స్, ఇండస్ కాఫీ ప్రై.లి, సౌత్ ఇండియా కృష్ణా ఆయిల్ అండ్ ఫాట్స్ ప్రై.లి, జెల్ కాప్స్ ఇండస్ట్రీస్, యూపీఐ పాలిమర్స్, పిన్నే ఫీడ్స్, బాస్ఫ్ ఇండియా లి., దొడ్ల డెయిరీ, పెన్వేర్ ప్రొడక్ట్స్ ప్రై.లి, అమరావతి టెక్స్ టైల్స్,అరబిందో ఫార్మా, ఓరెన్ హైడ్రోకార్బోన్స్ లాంటి ఎన్నో కంపెనీలు వచ్చాయి.

సర్వేపల్లికి కాకాణివల్ల ఒరిగిందేమిటి?

సర్వేపల్లి రూపురేఖలు మార్చేస్తాడని రెండు సార్లు మీరు కాకాణి. గోవర్ధన్ రెడ్డిని గెలిపించారు.  సర్వేపల్లి అభివృద్ధి చెందిందా? ఒక్కరి జీవితంలోనైనా మార్పు వచ్చిందా? సర్వేపల్లిని గాలికొదిలేసి కాకాణి దొంగ సంతకాలు, కల్తీ మద్యం, కోర్టు దొంగతనాల్లో బిజీగా ఉన్నాడు. అందుకే ఆయనకు కోర్టు దొంగ అని పేరు పెట్టా.  టిడిపి హయాంలో సర్వేపల్లి అభివృద్ధి కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది. కోర్టు దొంగ హయాంలో అక్రమ మైనింగ్, భూదందాలు, కక్షసాధింపులకు అడ్డాగా మారింది. టిడిపి హయంలోనే సర్వేపల్లి అభివృద్ధి జరిగింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోరాడి 2 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసారు.

వెంకటాచలాన్ని అభివృద్ధి చేసింది మేమే!

అర్బన్ ప్రాజెక్టు కింద వెంకటాచలం మండలాన్ని ఎంపిక చేసి రూ. 116 కోట్లతో గ్రామాల్లో మౌలికవసతులు కల్పించాం.  రూ.62 కోట్లతో కండలేరు ఎడమకాలువకు లిఫ్ట్ ఏర్పాటు చేసి 23 వేల ఎకరాలకు సాగునీరు అందించాం. డేగపూడి – బండేపల్లి లింక్ కెనాల్ ఏర్పాటు కోసం రూ.23 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించాం. కోర్టు దొంగ కమిషన్ కోసం ఆ పనులు నిలిపేసారు. గత ప్రభుత్వంలో రూ.200 కోట్లతో నియోజకవర్గంలో కల్వర్టులు, చెక్ డ్యాములు, తూములు నిర్మించి సాగునీరు అందించాం.  రూ.200 కోట్లతో గ్రామాల్లో సిసి రోడ్లు, లింక్ రోడ్లు వేసాం. గ్రామాల్లో 28 వేల ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేసాం. పొదలకూరు, వెంకటాచలం, కోడూరులో అత్యాధునిక వసతులతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాం.  టిడిపి హయాంలో ప్రారంభించిన అన్న క్యాంటిన్లను కోర్టు దొంగ మూసేసాడు. రూ.5 కోట్లతో నిర్మించిన ఎన్టీఆర్ సుజల మెగా వాటర్ ప్లాంట్ ను కోర్టు దొంగ మూసేసాడు.  ముత్తుకూరు మండలంలో మత్స్యకారేతర ప్యాకేజి మంజూరు చేసాం. ఒక్కో కుటుంబానికి రూ.43 వేల రూపాయలు అందించాం. కోర్టు దొంగ ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసి ఆ ప్యాకేజ్ ని అడ్డుకున్నాడు. నాలుగేళ్ల తరువాత ప్యాకేజ్ లో కోత పెట్టి రూ.25 వేలే ఇస్తాం అంటున్నారు.

ఎంపి పేరుతో గ్రావెల్ కొట్టేశాడు!

కోర్టు దొంగ సొంత పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కి తెలియకుండానే ఆయన పేరు మీద గ్రావెల్ కొట్టేసాడు. ఏకంగా ఎంపీ పైనే కేసు పెట్టేలా చేసాడు ఈ కోర్టు దొంగ. విరువూరు రీచ్ నుండి కర్ణాటక, తమిళనాడు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. కోర్టు దొంగ ఏపీ జెన్ కో ప్రాజెక్టులో నుంచి వచ్చే బూడిదను కూడా వదలడం లేదు. బూడిద కూడా అమ్ముకుంటున్నాడు.  కరోనా ని కూడా క్యాష్ చేసుకున్నాడు కోర్టు దొంగ. వ్యాపారులు, పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు వసూలు చేసి మింగేసాడు.  కోర్టు దొంగ ప్రైవేట్ టోల్ గేట్లు తెరిచాడు. పంటపాళెం, కృష్ణపట్నం పోర్టు దగ్గర టోల్ గేట్లు పెట్టి కంటైనర్లు, లారీలు, ట్యాంకర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు. వెంకటాచలం మండలం కాకుటూరులో హైవేపక్కన ఉన్న రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను తమ బినామీల పేర్లతో రికార్డుల్లోకి ఎక్కించేశారు. చిల్లకూరు మండలంలోనూ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు.

కాల్వల పనులు చేయకుండానే 43కోట్లు స్వాహా!

కనుపూరు కాలువ పరిధిలో చేయని పనులను చేసినట్టుగా చూపి రూ.43 కోట్లు కుంభకోణానికి పాల్పడ్డాడు. ఇలా సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా రూ.100 కోట్ల నిధులను పనులు చేయకుండానే చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసి స్వాహా చేశారు. ధాన్యం కొలతల్లో గోల్ మాల్ చేసాడు. పుట్టికి రూ.5 వేలు నష్టపోయారు. సర్వేపల్లి లో ఎవరు లే అవుట్ వెయ్యాలన్నా ఎకరాకు రూ.10 లక్షలు కోర్టు దొంగకి చెల్లించాలి. ఇలా సంపాదించిన డబ్బుతో జగన్ ప్యాలస్ కి ధీటుగా నెల్లూరులో రాయల్ ప్యాలస్ కట్టాడు. కొంతమంది దీనిని కరోనా ప్యాలస్ అని కూడా పిలుస్తున్నారు అంట. కోర్టు దొంగ నాలుగేళ్ల సంపాదన ఎంతో తెలుసా? రూ.3 వేల కోట్లు.  నెల్లూరు జిల్లాలో సీబీఐ విచారణ ఎదుర్కుంటున్న నాయకుడిగా కోర్టు దొంగ హిస్టరీలో మిగిలిపోతాడు.  మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించకుండా దహనం చేయించారు. సోమిరెడ్డి గారు జాతీయ ఎస్సి కమిషన్ కి ఫిర్యాదు చేసి పోరాడిన తరువాత ఆ కుటుంబానికి న్యాయం జరిగింది.

మీడియాను కూడా వదలకుండా వేధింపులు

ఏపీ జెన్కో ధర్మల్ పవర్ ప్రాజెక్టు కాలుష్య ప్రభావంతో ఇబ్బంది పడుతున్న నేలటూరు, పైనాపురం తరలింపు ఈ రోజుకీ జరగలేదు. టిడిపి హయాంలో నిధులు కేటాయించి, భూసేకరణ కూడా చేసాం, ఇళ్ల నిర్మాణం ప్రారంభించాం. ఆఖరికి మీడియా వాళ్ళని కూడా వదలలేదు కోర్టు దొంగ. గ్రామాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక మహిళ కోర్టు దొంగని నిలదీసింది. అది కవర్ చేసిన మీడియా ప్రతినిధి శ్రీనివాస్ పై కేసు పెట్టి వేధించాడు. వరి, నిమ్మ, ఆక్వా రైతుల సమస్యలు నాకు తెలుసు. మీ పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత నాది. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ పేరుతో రైతుల్ని తీవ్రంగా దెబ్బతీసాడు. విద్యుత్ ఛార్జీలు, పెట్టుబడి పెరిగి ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఇచ్చిన సబ్సిడీలు అందిస్తాం.

అవినీతి సొమ్ము కక్కిస్తాం!

టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత నీ ఫ్లెక్సీలు అన్ని జైలు ముందే రాసిపెట్టుకో. మూడు వేల కోట్ల రూపాయలు కక్కిస్తా. టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన ఎవరినీ వదిలిపెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తా. పసుపు జెండా ని మోస్తున్న వారిని గుండెల్లో పెట్టుకుంటా. నా పై 20 కేసులు పెట్టా తగ్గలేదు. ఎక్కువ కేసులు ఉన్న కార్యకర్తలకే నామినేటెడ్ పదవులు ఇస్తాం. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పై 67 కేసులు ఉన్నాయి. అయినా తగ్గేదేలేదు అంటున్నారు. నమ్ముకున్న సిద్దాంతం కోసం, ప్రజల కోసం పోరాడదాం.

లోకేష్ ను కలిసిన ఉప్పుభూముల రైతులు

సర్వేపల్లి నియోజకవర్గం కృష్ణపట్నంకు చెందిన ఉప్పు భూముల రైతులు, రైతు కూలీలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పోర్టు రాకముందు గోపాలపురం గ్రామంలో 678 ఎకరరాలు ఉప్పు భూమి తరతరాలుగా సాగులో ఉంది. ఉప్పు భూములపై ఆధారపడి కృష్ణపట్నం, గోపాలపురం, పాదర్తిపాళెం, బేసిన్, ముత్తకూరుతో పాటు మరి కొన్ని గ్రామాల రైతులు, కూలీలు జీవనం సాగిస్తున్నాం. కృష్ణపట్నం పోర్టు నిర్మాణంలో భాగంగా భూములు సేకరించారు. దీనికి గాను ఉప్పు భూములకు పరిహారంగా ఎకరాకు రూ.15 లక్షల చొప్పున చెల్లించాలని 2015లో టిడిపి ప్రభుత్వం జిఓ కూడా విడుదల చేసింది.  పరిహారం కోసం ప్రభుత్వానికి, కలెక్టర్ కు ఎన్నిసార్లు విన్నివించుకున్నా ఫలితం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక ఉప్పుభూముల రైతులకు 2015 జిఓ ప్రకారం పరిహారం చెల్లించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ

భారీ ప్రాజెక్టులు, పరిశ్రమలు, పోర్టులు నిర్మాణం సమయంలో నిర్వాసితులకు పరిహారం అందించడం ప్రభుత్వాల బాధ్యత. గత ప్రభుత్వంలో జిఓ ఇచ్చినా ఇంతవరకు పరిహారం చెల్లించకపోవడం దురదృష్టకరం. ఉప్పుభూముల రైతులకు పరిహారం విషయంలో ప్రభుత్వానికి లేఖరాస్తాం. ఈ ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే టిడిపి ప్రభుత్వం ఉప్పుభూముల రైతులకు వడ్డీతో సహా పరిహారం చెల్లిస్తుంది.

యువనేత నారా లోకేష్ ను కలిసిన మత్స్యకారులు

సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు  మత్స్యకారులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కృష్ణపట్నం పోర్టు నిర్వాసితులైన మత్య్సకారులకు మినీ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలి. ముత్తుకూరులో చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలి. యువకులకు మినీ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలి. కృష్ణపట్నం పోర్టు నిర్వాసిత గ్రామాలకు TDP ప్రభుత్వంలో శ్మశాన వాటికకు స్థలం కేటాయించారు, రహదారి సౌకర్యం కల్పించాలి. TDP ప్రభుత్వంలో చేపల మార్కెట్, మినీ క్రికెట్ స్టేడియం, ఫిషింగ్ హార్బర్ కు శంకుస్థాపన చేసి, నిధులు కూడా కేటాయించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనుల్లో పురోగతి లేదు.  టీడీపీ వచ్చిన వెంటనే పనులను పూర్తి చేయాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడటం ప్రభుత్వం బాధ్యత. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మినీ ఫిషింగ్ హార్బర్, చేపలమార్కెట్, యువకులకు మినీ స్టేడియం నిర్మిస్తాం. శ్మశాన వాటికకు రహదారి సౌకర్యం కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన కుమ్మరమిట్ట గ్రామస్తులు

సర్వేపల్లి నియోజకవర్గం కుమ్మరమిట్ట గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అధికారంలోకి వచ్చాక బీసీలకు న్యాయం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. బీసీల అభివృద్ధిని ఈ సీఎం పూర్తిగా మర్చిపోయారు. చదువుతో సంబంధం లేని ఉద్యోగాలు చేయాల్సి దుస్థితి నెలకొంది. నిత్యవసర సరకుల ధరలు పెంచి, ప్రజల ఆదాయాన్ని దోచుకుంటున్నాడు. బీసీ హాస్టళ్లు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. బీసీల సంక్షేమానికి సబ్సిడీలు, రైతులకు ఇచ్చే రాయితీలు తొలగించారు. ఈ ప్రభుత్వం బీసీలను నాశనం చేసింది.  టీడీపీ అధికారంలోకి రాగానే బిసిల సమస్యలు పరిష్కరించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

గత నాలుగేళ్లలో బీసీలకు చెందాల్సిన రూ.75,760 కోట్లను వైసీపీ దారి మళ్లించారు.  ప్రతియేటా జాబ్ కేలండర్ విడుదల చేసి, 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాట ఇచ్చి, మడమ తిప్పాడు.  ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన బిసిలపై దాడులు చేయడం, హతమార్చడం నిత్యకృత్యంగా మారింది. ఈ ప్రభుత్వం 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టించి వేధించింది. టిడిపి అధికారంలోకి రాగానే బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం. యువగళం నిధి పేరిట నిరుద్యోగ యువతకు ప్రతినెలా రూ.3వేల భృతి చెల్లిస్తాం. పన్నుల విధానాన్ని ప్రక్షాళన చేసి నిత్యవసర సరుకుల ధరలు తగ్గిస్తాం. బిసిలపై జగన్ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేస్తాం.

నారా లోకేష్ ను కలిసి మల్లూరు గ్రామస్తులు

సర్వేపల్లి నియోజకవర్గం మల్లూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలోని గుడులకు చెందిన 7 దొరువులు వైసీపీ నేతలు ఆక్రమించడంతో విస్తీర్ణం తగ్గిపోయింది.  కొన్ని దొరువులపై షెడ్లు, రూములను నిర్మించి సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారు. విస్తీర్ణం ప్రకారం దొరువులను కొలిచి, దేవాలయాలకు కేటాయించాలి. టీడీపీకి చెందిన వారికి సంక్షేమ పథకాలు అందించడం లేదు. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా నిర్మించుకున్న వారికి బిల్లులు ఇవ్వడం లేదు. ఉపాధి హామీ మస్టర్లలో టీడీపీకి  చెందిన వారికి వేయడం లేదు.

నారా లోకేష్ మాట్లాడుతూ

వైసీపీ అధికారంలోకి వచ్చాక దేవుడి భూములకు కూడా రక్షణ లేకుండా పోయింది.  టిడిపి అధికారంలోకి రాగానే ఆక్రమణలకు గురైన భూములను స్వాధీనం చేసుకుని తిరిగి ఆలయాలకు అప్పగిస్తాం. పేదలు నిర్మించుకున్న ఇళ్లకు పెండింగ్ బిల్లలున్నీ క్లియర్ చేస్తాం. పార్టీలకు అతీతంగా ఉపాధి హామీ పథకంలో పేదలందరికీ అవకాశం కల్పిస్తాం.

నారా లోకేష్ స్పందిస్తూ

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వాన రాక్షసపాలన సాగుతోంది. మైనారిటీ సోదరులపై దాడులు, హత్యలకు తెగబడుతున్నారు. నర్సరావుపేటలో మసీదు ఆస్తుల రక్షణకోసం పోరాడిన ఇబ్రహీంను నడిరోడ్డుపై నరికి చంపారు. ముస్లిం మైనారిటీలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. టిడిపి అధికారంలోకి రాగానే మైనారిటీ సోదరులను వేధించిన వైసిపి ముష్కరులపై ఉక్కుపాదం మోపుతాం, ధైర్యంగా ఉండండి, మీ వెనుక 70లక్షలమంది తెలుగుదేశం పార్టీ సైన్యం ఉందని భరోసా ఇచ్చారు.

నారా లోకేష్ ను కలిసిన బ్రహ్మదేవం గ్రామస్తులు

సర్వేపల్లి నియోజకవర్గం  బ్రహ్మదేవం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 8వేల జనాభా ఉన్నారు. సమీపంలో పిడతపోలూరు, వల్లూరు, పొట్టెంపోడు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటిలో కలిపి 20 వేల వరకూ జనాభా ఉంది. సమీపంలో ధర్మల్ పవర్ స్టేషన్, కృష్ణపట్నం పోర్టు వల్ల మా గ్రామాల్లో నీరు కలుషితమై అనారోగ్యం పాలవుతున్నాం. ధర్మల్ పవర్ నుండి వచ్చే బూడిద, పోర్టు నుండి వచ్చే కాలుష్యం వల్ల క్షయ, గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి.  నీరు కలుషితమై పంటలు సరిగా పండటం లేదు. టిడిపి హయాంలో ప్రారంభించిన భూగర్భ డ్రైనేజీ పనులను వైసిపి ప్రభుత్వం వచ్చాక నిలిపివేసింది. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక యువత ఇబ్బందులు పడుతున్నారు.  మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మా గ్రామ సమస్యలు పరిష్కరించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ

పరిశ్రమలు స్థాపించినపుడు ఆ ప్రాంతంలో నివసించే ప్రజల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇక్కడ ప్రజలు తెలుసుకున్నాకే గత ప్రభుత్వ హయాంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజికి శ్రీకారం చుట్టాం. టిడిపి అధికారంలోకి వచ్చాక పటిష్టమైన కాలుష్య నివారణ చర్యలు చేపట్టి, నీటివనరులు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటాం. కొత్తగా పరిశ్రమలు స్థాపించి యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు  నిరుద్యోగ యువతకు నెలకు 3వేల చొప్పను యువగళం నిధిని అందజేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన వీరశైవ జంగమ సామాజికవర్గీయులు

సర్వేపల్లి నియోజకవర్గం  జంగాలకండ్రికకు చెందిన వీరశైవ జంగమ సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మేము వ్యవసాయం, పూల వ్యాపారం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నాం. ప్రస్తుతం వ్యవసాయం అనుకూలంగా లేక ఎక్కువమంది పూల వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నాం. పూలు పండించే రైతులకు ప్రభుత్వం కొంత భూమిని కేటాయిస్తే ఆర్థికంగా నిలదొక్కుకుంటాం. పూలను విక్రయించడానికి నెల్లూరు పూల మార్కెట్లో మాకు కొంత స్థలం కేటాయించాలి. శైవ ఆలయాల కమిటీల్లో వీరశైవజంగ కులస్తులకు అవకాశం కల్పించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్నివర్గాల బిసిలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. టిడిపి అధికారంలోకి రాగానే వీరశైవ జంగాలకు నెల్లూరు పూలమార్కెట్ లో స్థలం కేటాయిస్తాం. వీరశైవ జంగమ కులస్తులు చిరువ్యాపారాలు చేసుకోవడానికి బిసి కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందజేస్తాం. వీరశైవ జంగమ కులస్తులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో శివాలయ కమిటీల్లో అవకాశం కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన వరిగొండ గ్రామస్తులు

సర్వేపల్లి నియోజకవర్గం వరిగొండ గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రేషన్ సరుకుల సరఫరా విధానం సరిగా లేదు. రేషన్ వాహనం ఎప్పుడో వస్తోందో తెలియని పరిస్థితి నెలకొంది. రేషన్ వాహనాలకోసం పనులు మానుకొని ఇళ్లవద్ద ఉండాల్సి వస్తోంది. మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు పుస్తకాల్లో రాసుకున్నారు, స్థలం ఎక్కుడుందో చెప్పడం లేదు. అదికారులను అడిగితే డబ్బులు కడితే ఇల్లు నిర్మించి ఇస్తామంటున్నారు. పశుపోషణకు నిర్మించుకున్న మినీగోకులాల బిల్లులు చెల్లించడం లేదు. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు నిలిపేశారు.. అధికారులను అడిగితే మాకు సంబంధం లేదని అంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలు పరిష్కరించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ

కేవలం కమీషన్ల కోసం రేషన్ వాహనాల వ్యవస్థను ప్రవేశపెట్టారు. రేషన్ వాహనాల పేరుతో వైసిపి పెద్దలు రూ.700 కోట్లు కొట్టేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక రేషన్ పంపిణీ విధానాన్ని సమీక్షించి, ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం. రాజకీయ కారణాలతో పేదలకు ఇళ్ల బిల్లులు నిలిపివేయడం దుర్మార్గం. టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా అంతకుముందు మంజూరైన 2లక్షల ఇందిరమ్మ గృహాలకు అదనంగా ఆర్థికసాయం అందించి ఇళ్లు పూర్తిచేసుకునేలా చర్యలు తీసుకున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల ఇళ్లకు సంబంధించి పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తాం. ఇల్లులేని ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇస్తాం.

Also, Read This Blog :Nara Lokesh Yuvagalam: Bridging the Gap for Youth Development

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *