గూడూరు నియోజకవర్గంలో విజయవంతంగా యువగళం!సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో యువనేతకు ఘనస్వాగతం
నేడు ముత్తుకూరులో బహిరంగసభలో ప్రసంగించనున్న లోకేష్
గూడూరు: గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 5రోజులపాటు హోరెత్తించిన యువగళం పాదయాత్ర శుక్రవారం రాత్రి సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కృష్ణపట్నం దక్షిణ ద్వారం వద్ద యువగళం పాదయాత్ర సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు యువనేతకు అపూర్వ స్వాగతం పలికారు. యువనేతపై పూలవర్షం కురిపిస్తూ బాణాసంచామోతలతో హోరెత్తించారు. అడుగడుగునా సర్వేపల్లి ప్రజలు యువనేతకు బ్రహ్మరథం పట్టారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వరగలి నుంచి ప్రారంభమైన 142వరోజు యువగళం పాదయాత్ర… విజయవంతంగా సాగింది. వరగలిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన యువనేత లోకేష్ అక్కడి ప్రజల సాధకబాధకాలు తెలుసుకున్నారు. వరగలి, లింగవరం, సింహపురి పవర్ ప్లాంట్, తమ్మినపట్నం, గుమ్మలదిబ్బ, కృష్ణపట్నం దక్షిణ ద్వారం మీదుగా గోపాలపురం విడిది కేంద్రానికి చేరుకుంది. 142వరోజు యువనేత లోకేష్ 15.3 కి.మీ. దూరం పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1868.3 కి.మీ. పూర్తయింది. సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు బహిరంగసభలో శనివారం యువనేత లోకేష్ ప్రసంగించనున్నారు.
యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:
మాకు ఇళ్లు ఇవ్వడం లేదు- ఎన్.ప్రసాద్, తమ్మినపట్నం.
వైసీపీ అధికారంలోకి వచ్చాక మా గ్రామానికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. మమ్మల్ని పోర్టు అధికారులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని వేధిస్తున్నారు. 300కుటుంబాలు నివాసం ఉంటున్నాం. నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ ఇస్తామనే పేరుతో మావద్ద ఉన్న పట్టాలను పోర్టు అధికారులు సంతకాల పేర్లతో లాగేసుకున్నారు. కేవలం 10మంది మాత్రం ఇవ్వకుండా అలాగే ఉంచుకున్నారు. మాకు ప్యాకేజీ ఇవ్వకపోగా పోలీసులు, అధికారులు దౌర్జన్యం చేస్తున్నారు.
మా పంచాయతీకి పన్నులు చెల్లించడం లేదు-రాజేష్, తమ్మినపట్నం.
మా పంచాయతీ పరిధిలో కృష్ణపట్నం పోర్టులో 6 బెర్తులున్నాయి. మా గ్రామ పంచాయతీకి పోర్టు వారు పన్నులు చెల్లించాల్సి ఉంది. కానీ అధికారపార్టీ నాయకులు, పోర్టు అధికారులు కుమ్మక్కై మా గ్రామానికి అన్యాయం చేస్తున్నారు. మా గ్రామానికి ఎటువంటి పన్ను చెల్లించకపోవడంతో కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉండటం లేదు.
రికార్డుల్లో పేర్లు మార్చేశారు!s-మస్తానయ్య, తమ్మినపట్నం.
మా పూర్వీకుల నుండి మా దళితవావాడ కింద 360 ఎకరాలు ఉంది. దీన్ని మేం సాగుచేసుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం జీడి మామిడి పంట ఉంది. ఏపీఐఐసీ అధికారులు మా భూమిని దౌర్జన్యంగా లాగేసుకున్నారు. మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అడంగల్ లో గతంలో ఈ భూములు మా పేరుమీద కనిపించేవి, నేడు ఏపీఐఐసీ పేరు కనిపిస్తోంది. సంక్షేమ పథకాలు నిలిపేస్తున్నారు. మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం లేదు.
ప్రాథమిక పాఠశాలకు వసతులు లేవు-రంగమ్మ, తమ్మినపట్నం.
మా గ్రామంలో మెయిన్ రోడ్డును ఆనుకుని మండల పరిషత్ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో సుమారు 50మందికి పైగా పిల్లలు చదువుతున్నారు. ఈ పాఠశాలకు ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. ట్యాప్ కనెక్షన్ లేదు. మరుగుదొడ్లు శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి. డోర్లు విరిగిపోయి ఉన్నాయి. పిల్లలు తరచూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. పిల్లలు ఆడుకునేందుకు ఎలాంటి ఆట స్థలం లేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పిల్లలకు ఆట వస్తువులు కూడా ఇవ్వడం లేదు.
మాకు స్కూటీలు ఇవ్వడం లేదు!-తాని మస్తానయ్య, వరగలి గ్రామం.
నేను పుట్టుకతో దివ్యాంగుడను. TDP హయాంలో మాకు మూడు చక్రాల స్కూటీలు కూడా ఇచ్చారు. ఆ సమయంలో దరఖాస్తు చేసుకోవడంలో విఫలమయ్యను. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మూడు చక్రాల స్కూటీ అడుగుతూనే ఉన్నాను. కనీసం ట్రై సైకిల్ కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న ట్రై సైకిల్ పాడైపోయింది. ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరో ఒకరిపై ఆధారపడాల్సి వస్తోంది.
ప్రజల కష్టాలు తీర్చేందుకే భవిష్యత్తుకు గ్యారంటీ!
టిడిపి అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లాలోకి గూడూరు
ఆరోగ్యశ్రీని పటిష్టం చేసి పేదలకు మెరుగైన సేవలందిస్తాం
రచ్చబండ కార్యక్రమంలో యువనేత నారా లోకేష్
గూడూరు: వైసీపీ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకున్నాను, మీ కష్టాలు తెలుసుకున్న తర్వాత భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించామని యువనేత Nara lokeshపేర్కొన్నారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వరగలి గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో యువనేత లోకేష్ గ్రామస్తులతో మాట్లాడి వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యువనేత లోకేష్ మాట్లాడుతూ… నాలుగేళ్లుగా జగన్ పాలనలో ప్రజలు నరకయాతన పడుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, చెత్త పన్ను, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసి ఛార్జీలు, ఇంటి పన్ను పెంచి ప్రజల్ని పీడిస్తున్నాడు . మహిళల కష్టాలు చూసిన తరువాత టిడిపి మహాశక్తి కార్యక్రమాన్ని ప్రకటించింది. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకి రూ.1500 ఇస్తాం. దీపం పథకం కింద ప్రతి ఏడాది మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. తల్లికి వందనం పేరుతో పిల్లల చదువు కోసం రూ.15 వేలు అందిస్తాం. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రతి నెలా నిరుద్యోగులకు రూ.3 వేలు ఆర్ధిక సహాయం అందిస్తాం.
ఉచితంగా ఇళ్లు కట్టిస్తానని మాట మాట ఇచ్చార్
ఇప్పుడు ఇళ్లు కట్టక పోతే స్థలం వెనక్కి లాక్కుంటున్నాడు. జగన్ ప్రభుత్వం మూడు లక్షల పట్టాలు వెనక్కి తీసుకుంది. వెయ్యి రూపాయల దివ్యాంగుల పెన్షన్ ని మూడు వేలు చేసింది చంద్రబాబునాయుడు . స్కూటర్లు కూడా అందించింది టిడిపి. వైసీపీ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ ఇవ్వడం లేదు. కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి రుణం ఇవ్వలేదు. స్కూటర్లు కూడా ఇవ్వలేదు. రూ.200 వందల పెన్షన్ ని రూ. 2 వేలు చేసింది చంద్రబాబు గారు. జగన్ నాలుగేళ్ల లో పెన్షన్ పెంచింది కేవలం రూ.750 మాత్రమే.
బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం!
బిసిల రక్షణ కోసం ప్రత్యేక బిసి రక్షణ చట్టం తీసుకొస్తాం. అభివృద్ది, సంక్షేమం సైకిల్ కి రెండు చక్రాలు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. జగన్ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలు విభజించింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గూడూరుని నెల్లూరు జిల్లా లో కలుపుతాం. చంద్రన్న భీమా ప్రారంబించింది టిడిపి. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.5 లక్షలు సహాయం అందించాం. జగన్ ఆరోగ్య శ్రీ ని అనారోగ్య శ్రీ గా మార్చేశాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్య శ్రీ ని పటిష్ఠ పరుస్తాం. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పిస్తాం.
ఇంఛార్జ్ పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ….
వరగలి గ్రామంలో సిసి రోడ్లు, ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేసింది టిడిపి. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామంలో ఒక తట్ట మట్టి ఎత్తలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ గ్రామాన్ని అభివృద్ది చేస్తాం.
వరగలి గ్రామస్తులు మాట్లాడుతూ….
ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు జగన్ ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం రావడం లేదు. స్థానిక ఎమ్మెల్యే కోట్లు దోచుకున్నాడు అని వైసిపి నాయకులే చెబుతున్నారు. వాళ్ళని పక్కన పెట్టి వేరే వాళ్ళకి టికెట్ ఇస్తున్నాం అంటున్నారు. ఆయన చేసిన తప్పులు వైసిపికి వర్తించవా? మా దగ్గర దోచుకోవడానికి కిడ్నీలు, రక్తం తప్ప ఏమి మిగలలేదు. జగన్ ట్రాన్స్ పోర్ట్ రంగాన్ని దెబ్బతీశాడు. డ్రైవర్లకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదు. గ్రామాల్లో పేదలకు ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం. నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ అందడం లేదు. గూడూరుని నెల్లూరు జిల్లా లో కలపాలి. గ్రామంలో మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు, తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నాం.
నారా లోకేష్ ను కలిసిన వరగలి గ్రామస్తులు
గూడూరు నియోజకవర్గం వరగలి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 15ఏళ్లుగా సింహపురి, మధు కాన్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే అందులో మాకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదు. ఉన్నవాళ్లను కూడా కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకుని, కాంట్రాక్టు కాలం ముగిసిన వెంటనే బయటకు పంపేస్తున్నారు. ప్రమాదాలు జరిగినపుడు మా గ్రామానికి అంబులెన్సులు సకాలంలో రావడం లేదు. బీటెక్, డిగ్రీ చదువుకున్న వాళ్లను కూడా రోజువారీ కూలీలుగా తీసుకుని నెలకు రూ.6వేలు వేతనం మాత్రమే ఇస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
వైసీపీ పాలనలో యువత భవిష్యత్తు సర్వనాశనమైంది. జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై జగన్ మాట తప్పి,. టిడిపి అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించి, 20లక్షల ఉద్యోగాలిస్తాం. అర్హతలను బట్టి యువతకు మెరుగైన ఉద్యోగాలు లభించేలా కృషిచేస్తాం. వరగలి గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన గుమ్మళ్లదిబ్బ గ్రామస్తులు
గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం గుమ్మళ్లదిబ్బ గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో మత్స్యకారులకు నేటికీ బోట్లు, వలలు, ఇంజన్ లోన్లు ఇవ్వలేదు. కృష్ణపట్నం పోర్టు వల్ల కాలుష్యం ఎక్కువై, ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నాం. గతంలో సముద్రానికి వెళ్లేందుకు మాకు దారి ఉండేది. పోర్టు నిర్మాణం తర్వాత మాకు ఆ మార్గాన్ని మూసేసి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కరోనా సమయంలో అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం మేం బ్రతికి ఉన్నామా, లేదా అని పట్టించుకోలేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
గత టిడిపి ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు సబ్సిడీపై బోట్లు, వలలు, డీజిల్ సబ్సిడీ వంటివి అందజేసి ఆదుకున్నాం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆదరణ పథకాన్ని పునఃప్రారంభించి, మత్స్యకారులకు అవసరమైన పరికరాలను సబ్సిడీపై అందజేస్తాం. పోర్టు యాజమాన్యంతో మాట్లాడి గుమ్మళ్లదొడ్డి గ్రామస్తులు ఎదుర్కొంటున్న దారి సమస్యను పరిష్కరిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన తమ్మినపట్నం గ్రామస్తులు
గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తమ్మినపట్నం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలోని హరిజనవాడలో 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాం. గ్రామంలోని కోదండరామస్వామి దేవస్థానం భూమిలో దళితులు, గిరిజనులు 100ఏళ్లకు పైగా నివాసముంటున్నారు. కృష్ణపట్నం పోర్టు నిర్మాణం కోసమని 375 ఎకరాలు తీసుకుని మా గ్రామం చుట్టూ ప్రహరీ కట్టారు. మాకు ఎటువంటి ఇళ్ల స్థలాలు, ఇంటి పట్టాలు ఇవ్వలేదు. మాకు ఇంటి పట్టాలు ఇవ్వాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. పోర్టు నిర్మాణ సమయంలో దళితులు, గిరిజనులకు నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ కింద రూ.75వేలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు, ప్రతి ఇంటికీ రూ.13,500 మాత్రమే ఇచ్చారు. 2019 తర్వాత మాకు ఇంటి పట్టాలు, ప్యాకేజీ పై అధికారులు పట్టించుకోలేదు. వైసీపీ పాలనలో మా ముఖం చూసేవారు లేరు. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
ప్రధానమైన పరిశ్రమలు, పోర్టుల నిర్మాణ సమయంలో నిర్వాసితులకు పునరావాసం అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. తమ్మినపట్నం గ్రామస్తులకు పునారావసం, పరిహారంపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. టిడిపి అధికారంలోకి వచ్చాక తమ్మినపట్నం గ్రామస్తులకు ఇళ్లస్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తాం. పోర్టు యాజమాన్యంతో మాట్లాడి పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటాం.
Also, Read This Blog :Nara Lokesh Yuvagalam: Fostering a Culture of Excellence
Tagged: #LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh