Nara Lokesh padayatra,yuvagalam
Nara Lokesh padayatra,yuvagalam

గూడూరు నియడజకవర్గంలో ఉత్సాహంగా యువగళంయువనేత ఎదుట సమస్యల వెల్లువ… నేనున్నానని భరోసా

నేడు సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోకి పాదయాత్ర

గూడూరు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర గూడూరు అసెంబ్లీ నియజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. 141వరోజు యువనేత పాదయాత్రకు అడుగడుగునా మహిళలు నీరాజనాలు పడుతూ ఆత్మీయ స్వాగతం పలికారు. దారిపొడవునా గ్రామాల్లో యువనేత కోసం ఎదురు చూస్తూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ కు విన్నవించారు. సమస్యలను ఓపిగ్గా వింటున్న యువనేత మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలను పరిష్కరిస్తుందని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. తమ భూములను వైసిపి నేతలను ఆక్రమించారంటూ బల్లవోలు దళితులు లోకేష్ కు మొరపెట్టుకున్నారు.  గూడూరు నియోజకవర్గం కాకువారిపాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర…బల్లవోలు కొత్తపాలెం క్రాస్, చింతవరం, మొగలి కొత్తపాలెం, అల్లీపురం, ఏరూరు, మోమిడి మీదుగా వరగలి విడిది కేంద్రానికి చేరుకుంది. యువనేత లోకేష్ 141వరోజు 17.8 కి.మీ. పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1853 కి.మీ. పూర్తయింది. యువగళం పాదయాత్ర శుక్రవారం కృష్ణపట్నం పోర్టు దక్షిణం గేటు వద్ద సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించించనుంది.

ప్రకృతి వనరుల విధ్వంసం!

గూడూరు నియోజకవర్గంలో  అక్రమ సిలికా తవ్వకాలను పరిశీలించిన లోకేష్ సెల్ఫీ దిగుతూ ఆసక్తిమైన వ్యాఖ్యలు చేశారు. ఇది గూడూరు నియోజకవర్గం బల్లవోలు సమీపంలో వైసిపి దొంగల అక్రమ సిలికా శాండ్ తవ్వకాల దృశ్యం. సోనకాల్వలు నాశనం చేసి అక్రమ మైనింగ్ చేస్తూ జగన్ అండ్ కో రూ.5వేల కోట్ల దోపిడీకి తెరలేపింది. పేదల నోటికాడ కూడు లాగేసినా, పర్యావరణ విధ్వంసం జరిగినా డోన్ట్ కేర్… తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నిండటమే జగన్ రెడ్డి గారి ఏకైక టార్గెట్ అని వ్యాఖ్యానించారు.

అందుకే రైతుబాంధవుడు చంద్రన్న!

పాదయాత్ర దారిలో స్ప్రింకర్ల ద్వారా పండిస్తున్న వేరుశెనగ పంటను పరిశీలించిన లోకేష్ సెల్ఫీ దిగుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎడారి నేలల్లో సైతం బంగారు పంటలు పండించే నేర్పు ఆంధ్రప్రదేశ్ లోని అన్నదాతలకు మాత్రమే సొంతం. గూడూరు నియోజకవర్గం బల్లవోలు సమీపాన సముద్ర తీర ప్రాంత భూములకు ఎటువంటి సాగునీటి సౌకర్యం అందుబాటులో లేదు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో విజనరీ లీడర్ చంద్రబాబుగారి చొరవతో ఇక్కడి రైతులు డ్రిప్ స్ప్రింక్లర్లు ఏర్పాటుచేసుకొని వేరుశనగ పంట పండిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా  మైక్రో ఇరిగేషన్ కు 1250 కోట్లు ఖర్చుపెట్టిన రైతు బాంధవుడు చంద్రన్న అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

వైసీపీ నాయకులు బెదిరించి భూమి లాక్కున్నారు -కొట్టు రాజయ్య, బల్లవోలు గ్రామం దళితుడు.

2001లో అప్పటి ప్రభుత్వం మా భూములకు డీకేటీ పట్టాలు మంజూరు చేసింది. అప్పటి నుండి నా రెండెకరాల భూమిలో వేరుశనగ పంటను సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. 2019 వరకు మమ్మల్ని ఎవరూ ఇబ్బందిపెట్టలేదు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వైసీపీ నేతల నుండి మాకు బెదిరింపులు రావడం ప్రారంభమైంది. నా భూమితో పాటు మరో 100మందికి చెందిన భూములను వైసీపీ నేతలు బెదిరించి లాక్కున్నారు. ప్రొక్లెయినర్లతో అనుమతులు లేకుండానే సిలికా తవ్వి కోట్లు సంపాదిస్తున్నారు. భూములు ఇవ్వం అన్నందుకు మాపై దాడికి దిగారు. తప్పని పరిస్థితుల్లో మా భూములను వదులుకోవాల్సి వచ్చింది. అధికారులకు మా సమస్య చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు.

ముళ్లపొదల్లోనే మా బతుకులు, -సురేష్, చింతవరం ఎస్.టి కాలనీ.

మాది చింతవరం ఎస్.టి కాలనీ. ఎవరైనా ఆగి ఆరాగా చూస్తే తప్ప మేము ఉన్నామని తెలీదు. మేము నివాసం ఉండే ప్రాంతంలో రోడ్డు లేదు, వీధి లైట్లు లేవు, నీటి కుళాయి కనెక్షన్ లేదు. ఓ రైస్ మిల్లు వాళ్ళు మాకు ట్యాప్ ద్వారా రెండు రోజులకు ఒకసారి పావుగంట సేపు నీరు ఇస్తారు. మేము 10కుటుంబాలు నివాసం వుంటున్నాం. ఒక్కో కుటుంబానికి 2 బిందెల నీరు మాత్రమే వస్తుంది. మిగిలిన సమయంలో నీళ్లు కావాలంటే 3కిలోమీటర్లు దూరం వెళ్లి తెచ్చుకోవాలి. రాత్రి పూట బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాం.

ఇళ్ల బిల్లులు నిలిపేశారు -సుబ్బన్న, బల్లవోలు.

TDP పాలనలో నాకు ప్రభుత్వ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణం సగం వరకు చేశాను. ఎన్నికల కోడ్ వచ్చి ప్రభుత్వం మారింది. ఇంటి బిల్లులు పెండింగ్ ఉన్నాయి. బిల్లులు కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే మీరు TDP పాలనలో ఇల్లు మొదలుపెట్టారు మీకు బిల్లులు రావు అని చెబుతున్నారు. ఇంటిని సొంత డబ్బులతో పూర్తిచేసుకునే స్థోమత లేదు. దిక్కులేని పరిస్థితుల్లో తెలిసిన వారి ఇంట్లో అద్దెకు ఉంటున్నాం. ఎమ్మెల్యేని మా బిల్లులు గురించి అడుగుదామంటే కంటికి కనిపించడం లేదు.

అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం!

కేజీ టు పీజీ విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన

యూనివర్సిటీలను పునరావాస కేంద్రాలుగా మార్చిన వైసీపీ

రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి యువత ముందుకు రావాలి

యువతతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్

గూడూరు: టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.  కెరియర్ కౌన్సిలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. గూడూరు నియోజకవర్గం కాకువారిపాలెం క్యాంప్ సైట్ వద్ద యువతతో నిర్వహించిన ముఖాముఖిలో  యువనేత లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ… టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే స్వయం ఉపాధి, ప్రైవేట్, ప్రభుత్వ రంగాల ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతి కల్పిస్తాం. టిడిపి హయాంలో ప్రైవేట్ రంగంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించింది అని వైసిపి ప్రభుత్వమే శాసన మండలి సాక్షిగా ప్రకటించింది. మరో రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ, స్వయం ఉపాధి ద్వారా కల్పించాం.  టిడిపి ఐదేళ్ల పాలనలో 8 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం. జాతీయ విద్యా విధానం పేరుతో జగన్ స్కూల్స్ ఎత్తేస్తున్నాడు. ఎన్నికల ముందు టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం అని మోసం చేసాడు. ఇప్పుడు ఏకంగా ఉన్న టీచర్ పోస్టులు తగ్గిస్తున్నాడు. కేజీ టూ పీజీ విద్య ని ప్రక్షాళన చేస్తాం.

గంజాయి క్యాపిటల్ గా మార్చేశారు!

 చంద్రబాబు హయాంలో ఏపి జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉంటే,  జగన్ పాలనలో ఏపి గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా మారిపోయింది. ఒక్క గంజాయికి తప్ప ఏపి మరే ఇతర పంటకు గిట్టుబాటు ధర లేదు,  వైసిపి నేతలు యువతను గంజాయికి బానిసలుగా మారుస్తున్నారు.  యువత కు నేను ఇస్తున్న పిలుపు సే నో టూ గంజాయి… గంజాయి వద్దు బ్రో.  ఎన్నికల ముందు మేనమామ అన్న జగన్ ఎన్నికల తరువాత కంసమామ గా మారాడు.  యువత లో చైతన్యం రావాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి యువత ముందుకు రావాలి. జగన్ యూనివర్సిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలగా మార్చేశాడు. బాబు అంటే బ్రాండ్… జగన్ అంటే జైలు. గత నాలుగేళ్లుగా ఏపి కి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఉన్న పరిశ్రమలను పక్క రాష్ట్రాలకు తరిమేశాడు జగన్. అమరరాజా, రిలయన్స్ లాంటి కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశాడు.

అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించాం!

 ఒకే రాజధాని…అభివృద్ది వికేంద్రీకరణ టిడిపి విధానం. రాజధాని అమరావతి లో ఏర్పాటు చేసి మిగిలిన జిల్లాల్లో అభివృద్ది వికేంద్రకరణ చేసి చూపించాం. రాయలసీమను ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చాం. విశాఖ కి ఐటి కంపెనీలు తీసుకొచ్చాం. నెల్లూరు జిల్లా కి 73 సంస్థలు తీసుకొచ్చాం. 32 వేల మంది యువత కి ఉద్యోగాలు కల్పించాం. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అని హ్యాండ్ ఇచ్చాడు, మెగా డిఎస్సీ నిర్వహిస్తానని ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చెయ్యలేదు. ప్రతి ఏడాది 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని మోసం చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాం. యూపిపిఎస్సీ తరహాలో ఏపిపిఎస్సీని బలోపేతం చేస్తాం.

హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పిస్తాం!

సంక్షేమ హాస్టళ్ల లో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అవసరమైన డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తాం. జగన్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని బ్రష్టు పట్టించింది. వసతి దీవెన, విద్యా దీవెన వలన తల్లిదండ్రులు ఒత్తిడికి లోనవుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తాం. కాలేజీలకు నేరుగా ఫీజు చెల్లిస్తాం. పీజీ ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్య పథకం కూడా ఎత్తేసింది. పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేస్తూ జగన్ తెచ్చిన జీఓ.77 ని టిడిపి ప్రభుత్వం వచ్చిన మొదటి వంద రోజుల్లోనే రద్దు చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సింగిల్ సెటిల్మెంట్ చేసి విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇప్పిస్తాం. ఫిజియథెరపీ కోర్సు కి కూడా సరైన గుర్తింపు ఇస్తాం. జగన్ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు లో కలుపుతాం.

 గూడూరు ఇంఛార్జ్ సునీల్ మాట్లాడుతూ…

టిడిపి హయాంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించాం. నిరుద్యోగ భృతి ఇచ్చాం. జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి రద్దు చేశారు. జగన్ పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదు. యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.

నిరుద్యోగ యువతను మోసం చేశారు!

సంక్షేమ హాస్టళ్ల లో సౌకర్యాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నాం. అవసరమైనన్ని ప్రభుత్వ ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నాం. గూడూరు ని నెల్లూరు జిల్లాలో కలపాలి. ఫిజియథెరపీ కోర్సుకు ప్రభుత్వం నుండి సరైన గుర్తింపు ఉండటం లేదు. వైసీపీ ప్రభుత్వం పీజీ ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్య పథకాన్ని నిలిపేశారు. విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఫీజు కడితే కానీ సర్టిఫికేట్లు ఇవ్వం అని కాలేజ్  యాజమాన్యాలు అంటున్నాయి.

నారా లోకేష్ ను కలిసిన బల్లవోలు గ్రామస్తులు

గూడూరు నియోడజకవర్గం బల్లవోలు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో ప్రభుత్వ భూములు అత్యధికంగా ఉన్నాయి, వాటిలో సిలికా ఖనిజం అధికంగా ఉంది. గ్రామంలోని పేదలకు ప్రభుత్వం డీకేటీ పట్టాలను పంపిణీ చేసింది. కొంత మంది రైతులు పట్టాలు లేకుండానే ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటున్నారు. చిల్లకూరు, కోట మండలాల్లో తీర ప్రాంత గ్రామాల్లో సిలికాను తవ్వుకునేందుకు 84మందికి ప్రభుత్వం లీజులకు అనుమతులు మంజూరు చేసింది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుండి సిలికా లీజుదారులను ఇబ్బందులు పెడుతున్నారు. సిలికా వ్యాపారాన్ని పంచాయతీ తీర్మానం లేకుండా శేఖర్ రెడ్డి అనే వ్యాపారికి అప్పజెప్పారు. వామన ఎంటర్ ప్రైజెస్ ద్వారా ఈ వ్యక్తి దళిత లీజుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. పేద రైతులు భూములు ఇవ్వాలని ఒత్తిడి చేసి బెదిరిస్తున్నారు. వేరుశనగ పంట సాగుచేసుకుంటున్న భూములను శేఖర్ రెడ్డి బెదిరించి లాక్కుంటున్నాడు. నిలదీసిన 33మంది రైతులపై అక్రమ కేసులు పెట్టారు. నిబంధనలకు మించి సిలికాను తవ్వడం వల్ల పంటలకు నీరు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. తాగునీరు కూడా దొరకడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక అక్రమ సిలికా వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

నెల్లూరు జిల్లాలోని కోట, చిల్లకూరు మండలాల్లో జగన్ అండ్ కో అక్రమ సిలికా విక్రయాల ద్వారా ఇప్పటివరకు రూ.5వేల కోట్లు దోచుకుంది. దశాబ్ధాలుగా సిలికా మైనింగ్ చేస్తున్న 84మందిని బెదిరించి సిలికా భూములు లాగేసుకున్నారు. ఎటువంటి బిల్లులు లేకుండా పెద్దఎత్తున సిలికాను చెన్నయ్ తరలిస్తూ వైసిపి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాస్తవ లీజుదారులకు న్యాయం చేస్తాం. అక్రమ సిలికా తవ్వకాలకు అడ్డుకట్ట వేస్తాం, రైతుల సాగుభూమికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతాం.

నారా లోకేష్ ను కలిసిన తిక్కవరం గ్రామస్తులు

గూడూరు నియోడజకవర్గం తిక్కవరం పంచాయితీ కలవకొండ గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలోని వైసిపి నాయకులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన భూములను కబ్జా చేశారు. ఉపాధిహామీ పథకాన్ని అడ్డుపెట్టుకుని పేదల భూముల్లో అనుమతి లేకుండా అక్రమంగా గ్రావెల్, మట్టి  తవ్వుతున్నారు. గ్రావెల్ దోపిడీని నిలదీసిన వాళ్లపై దాడులు, దౌర్జన్యం చేస్తున్నారు. గ్రామంలోని ఏడుగురు నాయకులు 30ఎకరాలను దోచుకున్నారు. సర్వే నంబర్ 43(పి)పై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలి. భూములు దోచుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో తొలిసారిగా దళితుల భూమి విస్తీర్ణం తగ్గిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులకు చెందిన 12వేల ఎకరాల ఎసైన్డ్ భూములను అక్రమంగా లాగేసుకున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక దళితులనుంచి వైసిపి నేతలు లాకున్న భూములను స్వాధీనం చేసుకుని, దళితులకే అప్పగిస్తాం. దళితుల భూముల్లో అక్రమమైనింగ్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతాం.

*నారా లోకేష్ ను కలిసిన పొన్నవోలు గ్రామస్తులు

గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం పొన్నవోలు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో నీటి సమస్య అత్యధికంగా ఉంది, శాశ్వత వాటర్ పైపు లైను లేదు. మా గ్రామానికి 4కిలోమీటర్ల దూరంలో పైపు లైను ఉంది, ఈ లైను నుండి సక్రమంగా నీరు రావడం లేదు. వేసవికాలంలో నీటి కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా గ్రామానికి శ్మశానం లేదు. టీడీపీ పాలనలో మా గ్రామంలో సీసీ రోడ్లు వేశారు, వైసీపీ పాలనలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

ప్రజలకు గుక్కెడు తాగునీరు అందించలేని అసమర్థుడు ఈ వైసీపీ కావడం రాష్ట్రప్రజల దౌర్భాగ్యం. తాగునీటి కోసం కిలోమీటర్ల మేర పేదవాళ్లు ఇబ్బందులు పడుతున్నా స్థానిక నేతలకు చీమకుట్టినట్లు కూడా లేదు. టిడిపి ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాం, 30లక్షల ఎల్.ఈ.డీ వీధి దీపాలు నిర్మించాం టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి, ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. గ్రామపంచాయితీలకు ఆర్థిక పరిపుష్టి కల్పించి, గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన మోమిడి గ్రామస్తులు

గూడూరు నియోజకవర్గం మోమిడి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలోని సర్వే నంబర్ 451లో భూములను ఎస్సీ, ఎస్టీ, బీసీలు 70ఏళ్లుగా సాగుచేసుకుంటున్నాం. ఈ సర్వే నంబర్ ను ఆనుకుని 7కిలోమీటర్ల మేర సోన ద్వారా 350 ఎకరాల భూమికి సాగునీరు అందుతోంది. సర్వే నంబర్ 451లోనే గిరిజనుల శ్మశానం కూడా ఉంది. ఈ భూమికి డీకేటీ పట్టాలు కూడా ఉన్నాయి, ఈ భూములు రెవెన్యూ రికార్డుల్లో కూడా నమోదయ్యాయి. కానీ ఈ భూములను కాజేయడానికి కేపీఆర్ మైన్స్ అండ్ మినరల్స్ వారు మమ్మల్ని బెదిరిస్తున్నారు. మైనింగ్ యజమానులతో స్థానిక వైసీపీ నాయకులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోతోంది. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీ పాలనలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చట్టాలకు విలువలేకుండా పోయింది. పేదల భూములను అడ్డగోలుగా ఆక్రమించుకోవడం నిత్యకృత్యంగా మారింది. దీర్ఘకాలంగా ఎస్సీ, ఎస్టీ, బిసిలు సాగుచేసుకుంటున్న భూములను ఆక్రమంగా కబ్జా చేయాలని చూడటం దారుణం. టిడిపి అధికారంలోకి వచ్చాక సర్వే నంబర్ 451లోని భూములను పేదలకే దక్కేలా చూస్తాం పేదల భూములు లాక్కోవాలని చూస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన ఏరూరు గ్రామ దళితులు

గూడూరు నియోజకవర్గం ఏరూరు గ్రామ దళితులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 200 ఎస్సీ, 100 ఎస్టీ కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరంతా ఎకరం, అరఎకరం సన్నకారులు, గ్రామంలో మొత్తం 250 ఎకరాల భూమి వీళ్లకు ఉంది. ఈ భూములకు నేటికీ ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయలేదు. పట్టాలు లేని కారణంగా గ్రామంలో కొంత మంది మమ్మల్ని భయపెట్టి మా భూములు ఆక్రమించుకుంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా భూములకు పట్టాలు మంజూరు చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

టిడిపి హయాంలో భూమికొనుగోలు పథకం ఎస్సీ, ఎస్టీ పేదలకు భూములను అందజేస్తే, వైసిపి నేతలు వారి భూములను లాక్కోవడం దారుణం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీల భూములకు రక్షణ కల్పిస్తాం. వాస్తవ భూ అనుభవదారులను గుర్తించి పట్టాలు మంజూరు చేస్తాం.

*సిలికా శాండ్ కోసం భూములొదిలి పొమ్మంటున్నారు!*

*వందేళ్లుగా భూములపై ఆధారపడే బతుకుతున్నాం*

*కాదంటే కేసులు పెట్టి కుటుంబసభ్యులను జైళ్లలో పెడుతున్నారు*

*యువనేత లోకేష్ ఎదుట ఎస్సీ, ఎస్టీ మహిళల ఆవేదన*

 సిలికా శాండ్ తవ్వకాల కోసం వందేళ్లుగా వంశపారంపర్యంగా మేం సాగు చేసుకుంటున్న భూములను వదిలి వెళ్లాలని వైసీపీ నేత ప్రియాంకారెడ్డి తన అనుచరులతో బెదిరిస్తున్నారని చిల్లకూరు మండలం, బల్లవోలుకి చెందిన  ఎస్సీ, ఎస్టీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. యువనేత పాదయాత్ర చేస్తున్న సమయంలో గురువారం బాధిత మహిళలు రమణమ్మ, ఆదిలక్ష్మమ్మ తమగోడు విన్పిస్తూ… పంచాయితీ లోని 40 కుటుంబాలకు చెందిన మేం వేరుశెనగ పంట సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. 30 ఎకరాల భూముల్లో సిలికా శాండ్ కోసం వైసిపి నేత ప్రియాంకరెడ్డి మమ్మల్ని భూములు వదిలి వెళ్లాలని బెదిరిస్తున్నారు.  గ్రామ పెద్దలు అడిగితే మీకేం సంబంధం అంటున్నారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించినందుకు మా భర్తల్ని ఎత్తుకెళ్లి జైల్లో పెట్టారు. వర్షం సమయంలో వేల గొడ్లు వచ్చి ఇక్కడ మేత మేస్తాయి… ఇసుక కోసం గుంతలు తీస్తే పొలాలను మేము ఎలా సాగు చేసుకుని బతకాలి.?  ప్రియాంక రెడ్డి పోలీసులతో వచ్చి వేధింపులకు దిగుతున్నారు. రాత్రిళ్ల సమయంలో వచ్చి తలుపులు కొడుతున్నారు. సిలికా శాండ్ కోసం గుంతలు తీయడంతో గతంలో వాటిలోపడి ముగ్గురు చనిపోయారు.  ఈ ప్రభుత్వంలో రౌడీయిజం రాజ్యమేలుతోంది. ప్రభుత్వానికి డబ్బులు కట్టామంటూ మా భూముల్లో తవ్వకాలు సాగిస్తున్నారు. తవ్విన క్వారీలు పూడ్చడానికి  రూ.3 లక్షలు ఇస్తామని చెప్పారు..కానీ ఇవ్వలేదు. ఈ సమీపంలో 5 సోన కాల్వలు ఉన్నాయి. వీటిపై ఆధారపడి మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. కాల్వల కింద వంద ఎకరాల వరి, శనగ, ముంత మామిడి పంటలు పండుతున్నాయి. తాటి చెట్ల లోతు గోతులు తవ్వుతున్నారు, మా బాధలు ఎవరితో చెప్పుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోయారు. ధైర్యంగా ఉండాలని, టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీల భూములను వారికే అప్పగిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు.

Also, Read This Blog :Nara Lokesh Yuvagalam: Championing Youth Innovation and Entrepreneurship

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *