NaraLokesh padayatra,Yuvagalam
NaraLokesh padayatra,Yuvagalam

నెల్లూరు రూరల్ లో జనసంద్రంగా మారిన యువగళం కిటకిటలాడిన రహదారులు, యువనేతపై పూలవర్షం

కనీవినీ ఎరుగని రీతిలో సింహపురి వాసుల అపూర్వస్వాగతం

నేడు “మహాశక్తితో లోకేష్” పేరిట మహిళలతో ముఖాముఖి

నెల్లూరు రూరల్: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జనసంద్రంగా మారింది. యువనేత లోకేష్ ను చూసేందుకు వేలాదిమంది ప్రజలు రోడ్లపైకి రావడంతో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించిపోయింది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు డాబాలపై నిలబడి యువనేతపై పూలవర్షం కురిపించారు. యువనేత పాదయాత్ర సందర్భంగా రోడ్లన్నీ కిటకిటలాడాయి. 144వరోజు యువగళం పాదయాత్ర నెల్లూరు రూరల్ కాకుపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా యువనేతకు మహిళలు హారతులతో నీరాజనాలు పడుతూ, దిష్టితీస్తూ ఘనస్వాగతం పలికారు. రోడ్ల వెంట నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు.  భారీఎత్తున తరలివచ్చిన జనసందోహంతో రూరల్ నియోజకవర్గం జన ప్రభంజనాన్ని తలపించింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు భారీగజమాలలతో యువనేతను సత్కరించి, పెద్దఎత్తున బాణాసంచా కాలుస్తూ అపూర్వస్వాగతం పలికారు. రోడ్లన్నీ జనమయమై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. పాదయాత్ర లో పాల్గొన్న వేల మంది యువత.మహిళలు సంఘీభావంగా పాల్గొన్నారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదాలతో యువగళం పాదయాత్ర మార్మోగింది.  కోటంరెడ్డి సోదరుల నేతృత్వంలో యువగళం పాదయాత్రకు ముందు భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. యువకులు గుర్రాలపై కార్యకర్తలకు యువగళం జెండాలు చేబూని ర్యాలీలో పాల్గొన్నారు. విచిత్ర వేషధారణలు, బ్యాండుమేళాలు, తప్పెటగుళ్లు, తీన్మార్ డప్పులు, షింకరీ మేళం వంటి కళారూపాలతో పాదయాత్ర హోరెత్తింది. తనని చూడటానికి వచ్చిన మహిళలు, యువత, వృద్ధులను యువనేత ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చి యువనేత ముందుకు సాగారు. 144వరోజు యువనేత లోకేష్ 8.6 కి.మీ. దూరం పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1892.6 కి.మీ. మేర పూర్తయింది. ఇదిలావుండగా యువగళంలో భాగంగా యువనేత లోకేష్ సోమవారం ఉదయం 11గంటలకు అనిల్ గార్డెన్స్ లో మహాశక్తితో లోకేష్ పేరిట మహిళలతో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేశారు.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

మురుగునీటి వాసన భరించలేకపోతున్నాం -కారుమూరి రమణమ్మ, బాబానగర్, గుండ్లపాలెం.

మా కాలనీ డ్రైనేజీ కాలువలో నెలలతరబడి పూడిక తీయడం లేదు. మురుగునీటి వాసనతో కాలనీ మొత్తం సతమతమవుతున్నాం. కాలువ గట్టుకు ఆనుకుని మేం నివాసముంటున్నాం. వానాకాలంలో వర్షపు నీరు, మురుగు నీరు ఏకమై రోడ్లపైనుంచి ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయి. రోడ్లపై చెత్త, డ్రైనేజీల్లో ఉన్న చెత్త గాలికి ఎగిరి ఇళ్లల్లో పడుతున్నా పారిశుద్ధ్య సిబ్బంది పట్టించుకోవడం లేదు. అధికారులు, నాయకులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది.

రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుని ఉంటున్నాం -కోక బుజ్జమ్మ, గుండ్లపాలెం, బాబానగర్.

మేం బాబానగర్ వద్ద హైవే పక్కన ఉన్న కాలువ గట్టుపై గుడిసెలు వేసుకుని నివాసముంటున్నాం. ఎప్పుడు వాహనాలు వచ్చి మా ఇళ్లపై పడతాయోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇళ్లస్థలాలు ఇచ్చే సమయంలో కూడా మేం దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయలేదు. నాయకులు, అధికారులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఓ వైపు డ్రైనేజీ కాలువ, మరోవైపు హైవే రోడ్డు మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాం.

స్థలాలు ఉన్నవాళ్లకే స్థలాలు ఇచ్చారు-నారా సుబ్బమ్మ, వడ్డెపాలెం కాలనీ.

మా ప్రాంతంలో ఇళ్ల స్థలాలు లేనివాళ్లు 30మందికి పైగా ఉన్నారు. స్థలాలు లేనివాళ్లకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం, దరఖాస్తు చేసుకోండని వలంటీర్లు చెబితే మేమంతా దరఖాస్తు చేసుకున్నాం. కానీ మాలో ఒక్కరికి కూడా ఇంటి పట్టా ఇవ్వలేదు. మేం TDP వాళ్లమనే కారణంతో మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. వైసీపీ వాళ్లకు స్థలాలు ఉన్నప్పటికీ వారికి స్థలాలు ఇచ్చారు. మేం అద్దె ఇళ్లల్లో మగ్గిపోతున్నాం. కరోనా సమయం నుండి మా ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదు.

స్వయం ఉపాధి రుణాలివ్వడం లేదు-కల్లూరి భవాని, వడ్డెపాలెం.

అనారోగ్య సమస్యలతో కూలీ పనులకు వెళ్లే పరిస్థితులు లేవు. ఏదైనా కూరగాయలు, కిరాణా షాపు, చిరువ్యాపారం చేసుకుని బతకడానికి స్వయం ఉపాధికి లోన్ ఇప్పించాలని వైసీపీ నాయకులు, సచివాలయం అధికారులను అనేకసార్లు అడిగాను. లోన్లు ఏమీ రావు..బ్యాంకులో ప్రయత్నం చేయాలన్నారు. బ్యాంకుకు వెళితే షూరిటీ కావాలన్నారు. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. దిక్కులోని పరిస్థితుల్లో నలుగురి ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ బతుకుబండి లాగుతున్నాం.

కళాకారుల పెన్షన్ ఇవ్వడం లేదు-దర్శిగుంట.రమేష్, డప్పు కళాకారుడు. రేబాల గ్రామం.

డప్పు కళాకారులకు ఇచ్చే పెన్షన్ కు మూడేళ్ల  క్రితం దరఖాస్తు చేసుకున్నాను. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తామంటూ కాలం గడుపుతున్నారు. సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్, వలంటీర్ ను ఎన్నిసార్లు అడిగినా నిధులు లేవు, నిధులు వచ్చాక పెన్షన్ వస్తుందంటూ కబుర్లు చెబుతున్నారు. మా గ్రామంలో దాదాపు 30 మంది కళాకారులకు అర్హత ఉన్నా కళాకారుల పెన్షన్ రావడం లేదు. వైసీపీ నాయకులు తమకు కావాల్సిన వాళ్లకు మాత్రమే పెన్షన్లు ఇప్పిస్తూ, మిగిలిన వారికి ఇవ్వడం లేదు.

కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదు-చెంచురామయ్య, డప్పు కళాకారుడు, రేబాల గ్రామం.

నేను డప్పు కళాకారుడిని. మా గ్రామంలో దాదాపు 60మంది కళాకారులం ఉన్నాం. 50ఏళ్లు నిండిన వారికి ప్రభుత్వం రూ.3వేలు పెన్షన్ ఇవ్వాలి. గతంలో సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం తీసుకుని పెన్షన్లు ఇచ్చేవారు. కానీ నేడు అధికారులు కళాకారుల ఐడీ కార్డులు ఉన్నవారికే పెన్షన్లు ఇస్తామని మొండికేస్తున్నారు. కళాకారుల గుర్తింపు కార్డులు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కార్డులు కూడా మంజూరు చేయడం లేదు. కార్డులు లేక, పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నాం.

నారా లోకేష్ ను కలిసిన గుండ్లపాలెం గ్రామస్తులు

నెల్లూరు రూరల్ నియోజకవర్గం గుండ్లపాలెం వాసులు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గుండ్లపాలెం నుండి కృష్ణపట్నం ఓడరేవుకు వెళ్లే రహదారిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. సింగిల్ రోడ్డు కావడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దాన్ని 4 లైన్ల రహదారిగా మార్చితే ప్రమాదాలు నివారించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కాంట్రాక్టర్లకు లక్ష కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉండటంతో టెండర్లు పిలచినా పరారవుతున్నారు. TDP వచ్చాక గుండ్లపాడు – కృష్ణపట్నం ఓడరేవు రోడ్డును 4 లైన్లుగా మార్చుతాం.

నారా లోకేష్ ను కలిసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ బీసీలు

నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన బీసీ ప్రతినిధులు వడ్డెపాలెం నారాయణ మెడికల్ కాలేజి జంక్షన్ లో నారా లోకేష్ ను కలిసి వినతి పత్రం అందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలు దగాకు గురయ్యారు.  బీసీలకు న్యాయం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ మా అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవు. యేటా జాబ్ నోటిఫికేషన్ ఇస్తానని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు…నాలుగేళ్లలో కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు.  నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. బీసీ సంక్షేమ హాస్టళ్లను నిర్వీర్యం చేశారు. బీసీ కులవృత్తుల వారికి పనిముట్లు అందించడం లేదు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే గూండాలు, రౌడీలతో మా గొంతునొక్కుతున్నారు.

నారా లోకేష్ మాట్లాడుతూ

జగన్ అధికారంలోకి వచ్చాక కులానికొక కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటు చేయడం తప్ప బీసీలకు ఒరిగించేమీ లేదు అన్యాయాలను ప్రశ్నించిన బిసిలపై దాడులు చేస్తూ గొంతునొక్కాలని చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బిసిలపై 26వేలకు పైగా తప్పుడు కేసులు నమోదుచేశారు. టిడిపి అధికారంలోకి రాగానే బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం. ఆదరణ పథకాన్ని పునరుద్దరించి కులవృత్తులు చేసుకునే వారికి 90శాతం సబ్సిడీపై పనిముట్లు అందజేస్తాం. ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేస్తాం. పెద్దఎత్తున పరిశ్రమలు రప్పించి ఉద్యోగావకాశాలు కల్పిస్తాం, ఉద్యోగం వచ్చేవరకు యువగళం నిధికింద యువతకు రూ.3వేల రూపాయల పెన్షన్ ఇస్తాం.

నారా లోకేష్ ను కలిసిన ఆకుతోట గ్రామస్తులు

నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన ఆకుతోట గ్రామస్తులు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు. మా గ్రామంలో 800 నిరుపేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. గ్రామంలో ప్రాథమిక పాఠశాల లేదు. 3.5 కి.మీ దూరంగా ఉన్న ధనలక్ష్మీపురం వెళ్లి చదువుకోవాలి. ఆకుతోట నుండి ధనలక్ష్మీపురం వెళ్లే రహదారి రద్దీగా ఉంది.  రహదారి రద్దీగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పిల్లల్ని స్కూలుకు పంపించాలంటే ఆందోళనగా ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రాథమిక పాఠశాల మంజూరు చేసి పేద పిల్లలకు చదువుకునే అవకాశం కల్పించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

అందరికీ విద్య అనేది ప్రాథమిక హక్కు…స్కూళ్ల విలీనంతో జగన్ పేదలకు విద్యను దూరం చేస్తున్నారు. సంస్కరణల పేరుతో విద్యను నిర్వీర్యం చేస్తున్నారు. నాడు-నేడు పేరుతో వేలకోట్లు దోచుకోవడం తప్ప విద్యాప్రమాణాల మెరుగుదలకు ఎటువంటి నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఆకుతోటలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటుచేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా పాడైపోయిన రహదార్లను యుద్ధప్రాతిపదికన పునర్నిర్మిస్తాం.

*నారా లోకేష్ ను కలిసిన వావిలేటిపాడు గ్రామస్తులు

నెల్లూరు రూరల్ నియోజకవర్గం, వావిలేటిపాడు 12వ డివిజన్ గ్రామస్తులు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా మా గ్రామంలో 2,723 ప్లాట్లు మంజూరు చేశారు. నివర్ తుఫాన్ సమయంలో మా గ్రామంలోని లే అవుట్ జలమయమైంది. నివాసయోగ్యానికి పనికిరాని స్థలాలు ఇచ్చారు. కనీసం ఇప్పటి వరకూ మౌలిక వసతులు కూడా కల్పించలేదు. వర్షాకాలం వస్తే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. స్కూల్స్, హాస్పిటల్స్, పార్కులు లాంటి ప్రయోజనాలకు సరిపడ స్థలాలు కేటాయిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు.

నారా లోకేష్ మాట్లాడుతూ

రాష్ట్రవ్యాప్తంగా కొండలు, గుట్టలు, వాగులు, వంకల్లో పనికిరాని స్థలాలు అంటగట్టి రూ.7వేల కోట్లు దోచుకున్నారు. పనికి రాని స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టుకోకుంటే స్థలం రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు. ఇల్లు కట్టుకోలేదన్న సాకుతో రాష్ట్రవ్యాప్తంగా 3లక్షలమందికి కేటాయించిన స్థలాలను రద్దుచేశారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలకోసం రూ.33వేల కోట్లు ఖర్చవుతుందని కేంద్రానికి లేఖరాసిన ముఖ్యమంత్రి, ఇప్పటివరకు మౌలిక సదుపాయాలపై ఒక్క రూపాయి ఖర్చుచేయలేదు. టిడిపి అధికారంలోకి రాగానే ఇల్లు లేని పేదలందరికీ పక్కాగృహాలు నిర్మించి ఇస్తాం. పేదలు నివసించే గృహసముదాయాల్లో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన నెల్లూరు 19వడివిజన్ ప్రజలు

నెల్లూరు రూరల్ హరనాథపురంలో 19వ డివిజన్ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా డివిజన్ నుండి ప్రతి యేటా నెల్లూరు కార్పొరేషన్ కు రూ.4 కోట్లు పన్నుల రూపంలో చెల్లిస్తున్నాం. కానీ మా డివిజన్ లో మౌలిక సదుపాయాల కోసం మేము కట్టిన పన్నుల్లో 10 శాతం కూడా ఖర్చు చేయడం లేదు. మా డివిజన్ లోని శ్రీహరి నగర్ లో అండర్ డ్రైనేజీ ఏర్పాటు చేశారు. ఈ సమయంలో  కొంత రోడ్డును తవ్వారు. దాన్ని పూర్తి చేసే సమయంలో ప్రభుత్వం మారింది. తవ్విన రహదారికి ప్యాచ్ లు వేయాల్సిన అవసరం ఉంది.  డ్రైన్లన్నీ అధ్వాన్నంగా తయారయ్యాయి. 19వ డివిజన్ లో టీడీపీ హయాంలో 7 పార్కులు గుర్తించి ఆధునీకరణలో భాగంగా 80 శాతం పనులు పూర్తయ్యాయి..మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేయడం లేదు.  టీడీపీ వచ్చాక మిగిలిన పనులు పూర్తి చేయాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

జగన్ అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడు అన్నచందంగా పన్నులు పెంచడం తప్ప మౌలిక సదుపాయాలపై దృష్టిసారించిన దాఖలాలులేవు. పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రజలు సమస్యల పరిష్కారంపై లేదు. కాంట్రాక్టర్లకు పెద్దఎత్తున బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో రోడ్లపై తట్టమట్టి వేసే నాథుడే కరువయ్యడు. టిడిపి అధికారంలోకి వచ్చాక రోడ్లు,డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం.

Also, Read This Blog :Nara Lokesh Yuvagalam: Leading the Youth Revolution

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *