Nara Lokesh padaytra,Yuvagalam
Nara Lokesh padaytra,Yuvagalam

కోవూరు నియోజకవర్గంలో దుమ్ములేపిన యువగళం! అడుగడుగునా యువనేతకు మహిళల నీరాజనాలు

కావలి నియోజకవర్గంలో యువనేతకు అపూర్వస్వాగతం

కోవూరు/కావలి: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దుమ్ములేపింది. కోవూరు నియోజకవర్గంలో చివరిరోజైన శుక్రవారం యువగళం పాదయాత్ర భారీగా తరలివచ్చిన జనంతో హోరెత్తింది. 149వరోజు యువగళం పాదయాత్ర కోవూరు నియోజకవర్గం రాజుపాలెం పిఎస్ ఆర్ కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా మహిళలు, యువకులు, వృద్ధులు యువనేతకు నీరాజనాలు పడుతూ సమస్యలను విన్నవించారు. మరికొద్ది నెలల్లో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి కష్టాలు తీరుస్తుందని భరోసా ఇస్తూ యువనేత ముందుకు సాగారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు యానాది సామాజికవర్గీయులతో సమావేశమై వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. రాజుపాలెం నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర కొడవలూరు, గుండాలమ్మపాలెం, బసవయ్యపాలెం, రామతీర్థం క్రాస్, తలమంచి క్రాస్ మీదుగా నార్త్ అమలూరు క్రాస్ వద్ద కావలి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కావలి ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడు, బీద రవిచంద్ర సతీమణి బీద జ్యోతి, నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలు యువనేతకు అపూర్వ స్వాగతం పలికారు. భారీ గజమాలలు, విచిత్రవేషధారణలు, బాణాసంచా మోతలతో హోరెత్తించారు. 149వరోజున యువనేత లోకేష్ 17.1 కి.మీ. ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1950.3 కి.మీ. మేర పూర్తయింది.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

వరినారు కొట్టుకుపోయినా పరిహారం ఇవ్వలేదు -పొన్నం హరిబాబు, నేదురుపల్లి, పొదలకూరు మండలం

గతేడాది నాకున్న రెండెకరాల్లో వరి నాటుదామని నారు పోశాను. వర్షాల ధాటికి నారు మొత్తం కొట్టుకుపోయింది. తర్వాత ప్రొద్దుతిరగుడు వేశాను. రూ.30 వేలు నష్టం వచ్చింది. రెండోకారు మళ్లీ వరి నాటాను..కోసి ఓదెలు పెట్టగా వర్షాలకు పంట మొత్తం తడిసి దిగుబడి రాలేదు. పరిహారం ఇస్తామంటూ అధికారులు రాసుకెళ్లినా ఇప్పటివరకు ఇవ్వలేదు. నాలుగేళ్లలో నాకు ఒక్కసారి కూడా పరిహారం గానీ, రైతు భరోసాగానీ రాలేదు. రైతు భరోసా ఎందుకు రావడం లేదని అడిగితే టెక్నికల్ సమస్య అంటున్నారు.

కళాకారుల బకాయిలు చెల్లించలేదు  -ప్రసాద్, సాంస్కృతిక కళాకారుడు, రాజుపాలెం

గతంలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఏ జిల్లాలో కార్యక్రమాలు జరిగినా సాంస్కృతిక ప్రదర్శనలు చేసేవాడ్ని. 2014 నుండి 2019 వరకు సాంస్కృతిక శాఖ కింద ప్రదర్శనలు నిర్వహించా. 2018-19 యేడాదికి సంబంధించిన మాకు రావాల్సిన పారితోషికాలు రాలేదు. ఎన్నిసార్లు జిల్లా కార్యాలయంలో అధికారులను కలిసిన స్పందించలేదు. నాకు రూ.68 వేలు రావాలి.

జీతాలు నెల చివర వరకు అందడం లేదు -సాంబశివరావు, ఏపీఎస్ పీడీసీఎల్ కాంట్రాక్ట్ ఉద్యోగి, విడవలూరు

 నేను ఎపీఎస్ పీడీసీఎల్ లో లైన్ మెన్ గా కాంట్రాక్టు పద్ధతిలో 12 ఏళ్లుగా పని చేస్తున్నా. గతంలో జగన్ పాదయాత్ర చేసే సమయంలో మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రూ.15 వేలు జీతం వస్తోంది. ఈ జీతానికే మాకు ప్రభుత్వ పథకాలు అందించడం లేదు. రూ.7 వేలున్న మా జీతాలు చంద్రబాబు రూ.15 వేలు చేశారు.  ఇప్పుడు జీతాలు నెల చివరకు కూడా అందడంలేదు.

నమ్మిఓట్లేస్తే ఉద్యోగాల నుండి పీకేశారు- కొమరగిరి ప్రమీల, నార్త్ రాజుపాలెం.

నేను 2011 నుండి ఎన్ఆర్ఎస్టీసీలో అకడమిక్ ఇన్ స్ట్రక్టర్ గా పని చేస్తున్నా. TDP అధికారంలోకి వచ్చాక మా గౌరవ వేతనం రూ.4 వేల నుండి రూ.7,500కు పెంచారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక మా జీతాలు పెంచకపోవడమే కాకుండా వేతనాలు నిలిపేసింది. గతంలో 1500 ఉన్న ఎన్ఆర్ఎస్టీసీ సెంటర్లను 81కి తగ్గించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1419 మందిని విధుల నుండి తప్పించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్నవాళ్లను అర్థాంతరంగా తొలగిస్తే మేము ఎలా బతకాలి? జీతాలు రూ.10 వేలకు పెంచుతామని జగన్ పాదయాత్రలో హామీ ఇస్తే నమ్మి ఓట్లువేసి మోసపోయాం.

యానాదుల సంక్షేమానికి సబ్ ప్లాన్ నిధులు కేటాయిస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే మహాశక్తి అమలుచేస్తాం యానాదుల పొట్టగొట్టే  జి.ఓ.217 ను రద్దుచేస్తాం యానాదులతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్

కోవూరు: యానాదులు కూడా జగన్ బాధితులే,  ఎస్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని జగన్ మోసం చేశాడని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు.  రాజుపాలెం పిఎస్అర్ కళ్యాణమండపం క్యాంప్ సైట్ వద్ద యానాది సామాజికవర్గ ప్రతినిధులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… దున్నపోతు ప్రభుత్వానికి బైబై చెప్పాల్సిన సమయం వచ్చింది. యానాదులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను జగన్ ప్రభుత్వం వెనక్కి లాక్కుంది.

సబ్ ప్లాన్ నిధులను ఎస్టీలకే ఖర్చుచేస్తాం!

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేవలం ఎస్టీల సంక్షేమం కోసమే వినియోగిస్తాం.  గిరిజన గురుకుల పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తాం. అవసరమైన టీచర్లను నియమిస్తాం.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఐటిడిఏ లను బలోపేతం చేస్తాం. యానాదుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం.  దామాషా ప్రకారం యానాదుల కు నిధులు కేటాయిస్తాం. టిడిపి హయాంలో యానాదులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం.

మేం వచ్చిన వెంటనే మహాశక్తి అమలుచేస్తాం

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మహాశక్తి పథకాన్ని అమలు చేస్తాం. ఆడ బిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకి రూ.1500 అందిస్తాం. 5 ఏళ్లలో రూ.90 వేల లబ్ది చేకూరుస్తాం.  తల్లికి వందనం ద్వారా చదువుకునే ప్రతి బిడ్డకి రూ.15 వేలు అందిస్తాం. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు. దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తాం. ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.

గిరిజనుల అభివృద్ధికి కృషిచేసింది టిడిపినే!

ఐటిడిఎ లు ఏర్పాటు చేసి గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేసింది టిడిపి. 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇచ్చాం. 500 జనాభా ఉన్న తాండాలను పంచాయతీలుగా గుర్తించాం. తండాల్లో రోడ్లు, ఇళ్లు నిర్మించింది టిడిపి. తాగునీటి పథకాలు ప్రారంబించింది టిడిపి. జగన్ గిరిజనులకు ఎమ్మెల్సీ ఇస్తానని మోసం చేసాడు. సర్వేపల్లి లో యానాది యువకుడు పై వైసిపి నేతలు దాడి చేశారు. ఇప్పటి వరకూ వారి పై ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేదు.

అధికారంలోకి వచ్చాక పెళ్లికానుక ఇస్తాం!

అనేక కండిషన్స్ పెట్టాడు. 6 లక్షల మందికి పెన్షన్లు కట్ చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తెచ్చిన చెత్త నిబంధనలు అన్ని ఎత్తేసి పెళ్లి కానుక అందజేస్తాం. ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ లో యానాదులను చేర్చే విధంగా టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కృషి చేస్తాం. యానాదుల చేతిలో ఉన్న చెరువులు అన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేశాడు యానాదుల పొట్ట కొడుతూ తెచ్చిన జీఓ 217 ని టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లోనే రద్దు చేస్తాం. సచివాలయం, వాలంటీర్లు, సర్పంచులు… అన్ని వ్యవస్థలు కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అందరూ కలిసి పని చేసే మంచి విధానం తీసుకొస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన యానాదుల కు ఇళ్లు కట్టించి ఇస్తాం. పిల్లలకు ఒక ఆస్తి లా మిగిలిపోయేలా నాణ్యమైన ఇళ్లు కట్టించి ఇస్తాం.

యానాది సామాజికవర్గీయులు మాట్లాడుతూ…

వైసీపీ పాలనలో ఐటిడిఎ ని నిర్వీర్యం చేసారు. రుణాలు ఇవ్వడం లేదు. గిరిజన గురుకుల పాఠశాలలో దుర్భర పరిస్థితులు ఉన్నాయి. కనీస మౌలిక సదుపాయాలు లేవు. యానాదులకు సబ్సిడీ రుణాలు ఇవ్వడం లేదు. జగన్ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారు . యానాదులను ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ గా గుర్తించాలి. వైకాపా ప్రభుత్వం పెళ్లి కానుక ఇవ్వడం లేదు. అనేక కండిషన్స్ పెట్టి ఇవ్వడం లేదు. యానాదుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ పెట్టాలి. యానాదులకి జగన్ పాలనలో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదు.

యువనేతను కలిసిన ధాన్యం రైతులు

కోవూరు నియోజకవర్గం నార్త్ రాజుపాలెంలో ధాన్యం రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మాది డెల్టా ప్రాంతమైన వరిపంట ఎక్కువగా పండిస్తున్నాము. గత నాలుగేళ్లుగా ధాన్యం దిగుబడులు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎకరాకు రూ.30వేల నుంచి 40వేల వరకు ఖర్చవుతోంది. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ధాన్యానికి గిట్టుబాటు ధర రావడం లేదు. ఆర్ బికె ల్లో అధికారపార్టీ వారికి చెందిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. నెమ్ముపేరుతో పుట్టికి 7వేల రూపాయల తక్కువకు ధాన్యం కొంటున్నారు. ధాన్యం డబ్బు కూడా ఆరునెలల వరకు చెల్లించడం లేదు. 2సంవత్సరాల క్రితం ధాన్యం ట్రాన్స్ పోర్టు డబ్బులు ఇప్పటికీ అందించలేదు. రాజకీయ నాయకులు దళారుల అవతారమెత్తి మమ్మల్ని మోసగిస్తున్నారు. ఈ నష్టాలను భరించలేక మేము రెండేళ్లు క్రాప్ హాలిడే ప్రకటించాము. మీ ప్రభుత్వం వచ్చాక మాకు న్యాయం చేయండి.

నారా లోకేష్ మాట్లాడుతూ

ధాన్యం కొనుగోళ్లలో వైసిపి నేతలు మాఫియాగా మారి ఒక్క నెల్లూరు జిల్లాలోనే వెయ్యికోట్లు దోచుకున్నారు. కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి రైతులను ముంచేసి 50కోట్ల మేర అక్రమార్జనకు పాల్పడ్డారు. గజదొంగ జగన్ రెడ్డి పాలనలో వైసిపి ఎమ్మెల్యే మాఫియాలుగా తయారయ్యారు. టిడిపి అధికారం ఉన్నపుడు 21రోజుల్లో రైతుల ధాన్యానికి డబ్బు చెల్లించాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల వద్ద ఉన్న ప్రతి గింజను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేస్తాం. రైతులను మోసగించే ధాన్యం మాఫియాలపై ఉక్కుపాదం మోపుతాం. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు రానీయం, అన్నదాతలను అన్నివిధాలా ఆదుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన కొడవలూరు గ్రామస్తులు

కోవూరు నియోజకవర్గం కొడవలూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో ప్రభుత్వ భూములున్నాయి. ఈ భూములను అధికార పార్టీ నాయకులు అధికారులను లొంగదీసుకుని దోచుకుంటున్నారు. సాగునీటి కాలువలను ఆక్రమించి వాటిపై పెద్దపెద్ద బిల్డింగులు కడుతున్నారు. వైసీపీ నేతల అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు. లేఅవుట్ లు వేసి పక్కనే ఉన్న ప్రభుత్వ భూములు, ఇతర భూములను కబ్జా చేస్తున్నారు. పంచాయతీల్లో గ్రామకంఠం భూములను చదును చేసి అమ్ముకుంటున్నారు. ఈ కబ్జాదారులకు ప్రభుత్వ పెద్దల అండదండలున్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు తీసుకోండి.

నారా లోకేష్ స్పందిస్తూ

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూములతో పాటు ప్రజల భూములకు కూడా రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు కబ్జాదారులకు కొమ్ము కాయడం దుర్మార్గం. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా వైసీపీ పాలనలో దళితుల భూమి విస్తీర్ణం తగ్గిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక భూకబ్జాదురులపై కఠినంగా వ్యవహరిస్తాం. ప్రభుత్వ భూములతోపాటు ప్రజల భూముల రక్షణకు చర్యలు తీసుకుంటాం.

లోకేష్ ను కలిసిన గుండాలమ్మపాలెం పంచాయితీ సభ్యులు

కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం గుండాలమ్మపాలెం గ్రామ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 1,700మంది జనాభా ఉన్నారు. గ్రామంలో 1.5కిలోమీటర్ల దూరం సిమెంటు రోడ్డు, దీనికి కిలోమీటరు దూరం డ్రైనేజీ నిర్మించారు. మా పంచాయతీకి 14, 15 ఆర్థిక సంఘం నిధులు రూ.12లక్షలు రాగా, మొత్తం ప్రభుత్వం లాక్కుంది. మా గ్రామంలోని 4 శ్మశానాలకు ప్రహరీలు లేవు. గ్రామంలో మంచినీరు, ఇంటి పట్టాల సమస్యలు ఉన్నాయి. పొలానికి వెళ్లే దారులు లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైన్లు అసంపూర్తిగా ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామంలోని పెండింగ్ సమస్యల్ని పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

పంచాయతీలకు 14, 15 ఆర్థిక సంఘం నుండి విడుదలైన రూ.8,600కోట్లను వైసిపి ప్రభుత్వం దారిమళ్లించింది. గ్రామాల్లో బ్లీచింగ్ చల్లడానికి కూడా నిధులు లేకుండా పంచాయతీలను నిర్వీర్యం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు నిధులు ఇచ్చి బలోపేతం చేస్తాం. గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి మళ్లీ గత వైభవం తెస్తాం.

నారా లోకేష్ ను కలిసిన తలమంచి గ్రామస్తులు

కోవూరు నియోజకవర్గం తలమంచి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా మండలంలో 2వేల ఎకరాల గ్రావెల్ భూములు ఉన్నాయి. ఈ భూముల్లో అక్రమ గ్రావెల్ తవ్వకాల ద్వారా అధికార పార్టీ నాయకులు గత నాలుగేళ్లుగా వందల కోట్లు దోచుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా సుమారు 30అడుగుల లోతువరకు గ్రావెల్ తవ్వేశారు. గ్రావెల్ వాహనాల దెబ్బకు రోడ్లన్నీ పాడైపోయాయి. గ్రావెల్ మాఫియాను ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. పోలీసుల సహకారంతో మాపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు బనాయిస్తున్నారు. మీరు అధికారంలోకి ప్రభుత్వ సంపదను అడ్డగోలుగా దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి.

నారా లోకేష్ మాట్లాడుతూ

 గత నాలుగేళ్లుగా రూ.25వేల కోట్ల విలువైన గ్రావెల్ ను అక్రమంగా దోచుకున్నారు. రుషికొండలాంటి చారిత్రక కొండలను గుండుకొట్టించి ప్రకృతిసంపదను ధ్వంసం చేశారు. కోర్టులు చీవాట్లు పెట్టినా ఈ దున్నుపోతు ప్రభుత్వంలో చలనం లేదు. అక్రమార్కులకు పోలీసు వ్యవస్థ కొమ్ముకాయడం దారుణం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రావెల్ దొంగలపై సిట్ తో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన మిధానీ ఫ్యాక్టరీ బాధితులు

కోవూరు నియోజకవర్గం కొడవలూరు మిదానీ ఫ్యాక్టరీ బాధితులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మా మండలంలో గమేషా ఫ్యాక్టరీని స్థాపించారు. 4వేల మంది ఈ కంపెనీలో ఉపాధి పొందుతున్నారు. ఈ కంపెనీకి కొంత దూరంలో మిధానీ ఫ్యాక్టరీని స్థాపించేందుకు అన్ని అనుమతులు వచ్చాయి. కంపెనీని కట్టడం మొదలుపెట్టే దశలో స్థానిక ఎమ్మెల్యేకు కప్పం కట్టలేక ఫ్యాక్టరీని ఎత్తేశారు. మండలంలో 6వేల మంది యువత ఉపాధి అవకాశాలు లేక కూలీ పనులకు వెళుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక యువతకు ఉపాధి కల్పించే ఫ్యాక్టరీలు కట్టించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

రాష్ట్రంలో వైసీపీ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జె-ట్యాక్స్ కట్టలేక 10లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నింపుకోవడానికి లక్షలాదిమంది యువత భవితను ఫణంగా పెడుతున్నారు. గత నాలుగేళ్లలో అమర్ రాజా, ఫాక్స్ కాన్, జాకీ, ఎపిపి పేపర్ మిల్స్ వంటి ఎన్నో పరిశ్రమలు పరారయ్యాయి. గత టిడిపి ప్రభుత్వ హయాంలో 40వేల పరిశ్రమలు ఏర్పాటై, 6లక్షలమందికి ఉద్యోగావకాశాలు లభించినట్లు జగన్ ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. టిడిపి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దఎత్తున పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించి 20లక్షల ఉద్యోగాలిస్తాం. పారిశ్రామికవేత్తలకు జె-ట్యాక్స్ బెడద లేకుండా సులభతర లైసెన్సింగ్ విధానాన్ని అమలుచేస్తాం.

లోకేష్ ను కలిసిన నార్త్ అమలూరు గ్రామస్తులు

కావలి నియోజకవర్గం నార్త్ అమలూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 500 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.గ్రావెల్ మాఫియా కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. కొందరు వైసిపి నాయకులు అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేస్తూ పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. విచ్చలవిడి గ్రావెల్ తవ్వకాల కారణంగా నీరు, భూమి కలుషితమవుతున్నాయి. గ్రావెల్ తవ్వకాల వల్ల ఏర్పడిన గోతుల్లో పడి పశువులు ప్రమాదాల బారిన పడుతున్నాయి. మా గ్రామంతోపాటు పొరుగున ఉన్న 3 గ్రామాల రైతులకు నార్త్ అమలూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఈ ప్రభుత్వం నిలిపివేసింది. దీనివల్ల పంటపొలాల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించండి.

నారా లోకేష్ ను కలిసిన బీరంగుంట గ్రామస్తులు

కావలి నియోజకవర్గం బీరంగుంట వాసులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 1500 ఎకరాల రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పొలాలకు వెళ్లేందుకు దారిలేక పైడేరు కాల్వ దాటాల్సివస్తోంది.  ఈ సమయంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఈ కాలువపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ వంతెన పనులను పట్టించుకోకుండా వదిలేసింది. మీరు అధికారంలోకి వచ్చాక  పైడేరు కాల్వపై వంతెన నిర్మాణం చేపట్టిండి.

లోకేష్ ను కలిసిన బీరంగుంట రైస్ మిల్ కాలనీ వాసులు

కావలి అసెంబ్లీ నియోజకవర్గం బీరంగుంట రైస్ మిల్ కాలనీ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 150 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాం. మా గ్రామానికి శ్మశానం లేదు, శ్మశానం విషయంలో రెండు గ్రామాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. వైసిపి ప్రభుత్వం వచ్చాక ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదు. దళితులు ఎక్కువగా ఉన్న మా గ్రామంలో శ్మశాన వాటిక ఏర్పాటుచేయాలి. అర్హులైన వారందరికీ ఇళ్లస్థలాలిస్తామని ముఖ్యమంత్రి చెప్పినా దళితులు ఎక్కువగా ఉన్న మా గ్రామంలో ఇళ్లస్థలాలు ఇవ్వలేదు. అనర్హులకు మాత్రం స్థలాలు కేటాయిస్తారు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు ఇళ్లస్థలాలు ఇప్పించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ

ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక దళితుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. దళితులకు చెందాల్సిన రూ.28,147 కోట్ల నిధులను దారిమళ్లించిన వైసీపీ పేదలకు సెంటుపట్టా పేరుతో 7వేల కోట్లు దోచుకున్న వైసిపి నేతలు తమ పార్టీవారికి స్థలాలు ఇస్తూ అసలైన లబ్ధిదారులను గాలికొదిలేయడం దుర్మార్గం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైస్ మిల్ కాలనీలో శ్మశానం ఏర్పాటుచేస్తాం. అర్హుడైన ప్రతి పేదవాడికి ఇంటిస్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తాం.

నారా లోకేష్ ను కలిసిన నార్త్ మోపూరు గ్రామస్తులు

కావలి అసెంబ్లీ నియోజకవర్గం నార్త్ మోపూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా గ్రామంతోపాటు మరో రెండు పంచాయితీలను కలిపి నగర పంచాయితీగా ఏర్పాటుచేశారు. మా గ్రామంలో మెజారిటీ బలహీనవర్గాల కుటుంబాలు ఉపాధి హామీ కూలీలుగా ఉన్నారు. నగర పంచాయితీగా ఏర్పాటుచేయడం వల్ల మా గ్రామస్తులకు ఉపాధి పనులులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. దీనిపై మేం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, గత నాలుగేళ్లుగా ఎన్నికలు కూడా నిర్వహించలేదు. అయితే ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం మోపుతోంది. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యను పరిష్కరించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ

కేవలం పన్నుల బాదుడు కోసమే వైసిపి ప్రభుత్వం పంచాయితీలను అప్ గ్రేడ్ చేసింది. నగరపంచాయితీగా మార్చాక పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాల కల్పనపై లేకపోవడం అన్యాయం.’ నార్త్ మోపూరు గ్రామప్రజలకు ఉపాధి హామీ పనుల విషయమై కేంద్రానికి లేఖరాస్తాం. గ్రామంలో మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు సముచితమైన నిర్ణయం తీసుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన ఇందుపూరు గ్రామస్తులు

కావలి నియోజకవర్గం ఇందుపూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, నీటికోసం కిలోమీటరు దూరంలో ఉన్న బోరు వద్దకు వెళ్లాల్సి వస్తోంది. గత నాలుగేళ్లుగా నాయకులు పట్టించుకోకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. మా గ్రామంలో అర్హులైన పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనర్హులకు మాత్రం ఇళ్లస్థలాలు కేటాయిన్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామంలో తాగునీరు, ఇళ్లస్థలాల సమస్యను పరిష్కరించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ

రాష్ట్రంలో లక్షలకోట్లు అప్పులు చేస్తున్న వైసీపీ  గ్రామీణ ప్రజలకు గుక్కెడు నీరు అందించలేకపోవడం దారుణం. సెంటుపట్టాలను సైతం ఆదాయవనరుగా మార్చుకున్నరు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి, ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇంటిస్థలంతోపాటు ఇల్లు నిర్మించి ఇస్తాం.

Also, Read This Blog :Nara Lokesh Yuvagalam: Empowering Youth for Digital India

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *