Nara Lokesh padaytra,Yuvagalam
Nara Lokesh padaytra,Yuvagalam

1900 కి.మీ. ల మజిలీకి చేరుకున్న యువగళం పాదయాత్ర ధాన్యం ఆరబోత ఫ్లాట్ ఫారాల నిర్మాణానికి లోకేష్ శిలాఫలకం

కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా పాదయాత్ర

కోవూరు: యువగళం పాదయాత్ర 147వరోజు కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. సాలుచింతల క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కాగా, అడుగడుగునా యువనేతకు జనం నీరాజనాలు పలికారు. భారీ గజమాలలతో యువనేతను గ్రామాల్లోకి స్వాగతించారు. మహిళలు హారతులు పట్టి, గుమ్మడికాయలు కొట్టి దిష్టితీస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. బాణాసంచా మోతలు, డప్పుశబ్ధాలతో పాదయాత్ర హోరెత్తింది. రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర… జన ప్రభంజనంగా మారి లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. కోవూరు నియోజకవర్గం సాలుచింతలలో పాదయాత్ర ఈరోజు 1900 కి.మీ. మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చాక రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి కోవూరు నియోజకవర్గవ్యాప్తంగా ప్లాట్ ఫారాలు నిర్మిస్తానని హామీ ఇస్తూ, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనివల్ల ఈ ప్రాంత వరి రైతాంగం పండించిన ధాన్యం నాణ్యత మెరుగుపడి మార్కెట్ లో మంచి ధరకు విక్రయించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇదిలావుండగా దారిపొడవునా ప్రజలనుంచి యువనేతకు వినతులు వెల్లువెత్తాయి. సమస్యలను ఓపిగ్గా విన్న యువనేత మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చా ముందుకు సాగారు. సాలుచింతల నుంచి ప్రారంభమైన పాదయాత్ర… పడుగుపాడు, కోవూరు, మండబయలు, గుమ్మలదిబ్బ, పాతూరు, దామరమడుగు, ఆర్ఆర్ నగర్, కాగులపాడు, రేబాల మీదుగా చెల్లాయపాలెం విడిది కేంద్రానికి చేరుకుంది. 147వరోజున యువనేత లోకేష్ 15.9 కి.మీ. పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1917.1 కి.మీ. మేర పూర్తయింది. గురువారం సాయంత్రం 5గంటలకు బుచ్చిరెడ్డిపాలెం జంక్షన్ లో జరిగే బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగిస్తారు.

అనిల్ అక్రమాస్తుల డాక్యుమెంట్ల విడుదలచేసిన లోకేష్

కోవూరు నియోజకవర్గం సాలుచింతల క్యాంప్ సైట్ లో యువనేత నారా లోకేష్ మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ భూఅక్రమాలు, బినామీల పేరుతో చేసిన భూదందాలకు సంభందించిన ఆధారాలు విడుదల చేశారు. దొంతాలి వద్ద బినామీలు చిరంజీవి, అజంతా పేరు మీద 50 ఎకరాలు. విలువ రూ.10 కోట్లు. నాయుడుపేట లో 58 ఎకరాలు బినామీ పేర్లతో. విలువ రూ.100 కోట్లు. ఇనుమడుగు సెంటర్ లో  బినామీలు రాకేష్, డాక్టర్ అశ్విన్ పేరుతో 400 అంకణాలు. విలువ రూ.10 కోట్లు. ఇస్కాన్ సిటీ లో బినామీల పేర్లతో 87 ఎకరాలు. విలువ రూ. 33 కోట్లు. అల్లీపురం లో 4వ డివిజన్ కార్పొరేటర్, డాక్టర్ అశ్విన్ (అనిల్ తమ్ముడు) పేరుతో 42 ఎకరాలు. విలువ రూ.105 కోట్లు. ఇందులో 7 ఎకరాలు ఇరిగేషన్ భూమి. సాదరపాళెం లో 4వ డివిజన్ కార్పొరేటర్, డాక్టర్ అశ్విన్ (అనిల్ తమ్ముడు) పేరుతో 12 ఎకరాలు. విలువ రూ.48 కోట్లు. ఒక పెద్ద కాంట్రాక్టర్ నుండి దశల వారీగా అనిల్ బినామీ చిరంజీవి కి కోట్ల రూపాయలు వచ్చాయి. బృందావనం లో శెట్టి సురేష్ అనే బినామీ పేరుతో 4 ఎకరాలు. విలువ 25 కోట్లు. దామరమడుగు లో బావమరిది పేరుతో 5 ఎకరాలు. విలువ 4 కోట్లు. గూడూరు- చెన్నూరు మధ్యలో 120 ఎకరాలు లేపేసాడు. 40 ఎకరాల్లో లే అవుట్ వేసారు. వీటితోపాటు నెల్లూరు జిల్లాలో పాదయాత్ర సందర్భంగా జగన్ నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలతో రూపొందించిన పుస్తకాన్ని కూడా లోకేష్ విడుదల చేశారు.

*కోవూరులో ప్రకంపనలు సృష్టిస్తున్న యువగళం*

*నారా లోకేష్ సమక్షంలో  200 మంది పార్టీలో  చేరిక*

యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభానికి ముందే మంగళవారం సాయంత్రం సాలుచింతల క్యాంప్ సైట్ లో వైసిపికి చెందిన కీలక నాయకులు, వారి అనుచరులు తెలుగుదేశంపార్టీలో చేరారు. యువనేత లోకేష్ వారందరికీ పసుపుజెండాలు కప్పి, సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో నెలకొన్న అరాచకపాలనపై పోరాటానికి టిడిపి సిద్ధాంతాలకు కట్టుబడి వచ్చే వారెవరినైనా పార్టీలోకి స్వాగతిస్తామని చెప్పారు. కొడవలూరు మండలం కమ్మపాలెంకు చెందిన వైఎస్సార్ సిపి రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి, రూరల్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరక్టర్ నాపా వెంకటేశ్వర్లు నాయుడు 200మంది అనుచరులతో వచ్చి లోకేష్ సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన ప్రముఖుల్లో కె.కిషోర్, ఎన్ అమరయ్య, మల్లిఖార్జున, ఎన్.బాలకృష్ణ, ఎన్.రామారావు, సాదు శ్రీకాంత్, కన్నం చైతన్య, ఆనంద్, కుందుర్తి నాగేశ్వరరావు, కుందుర్తి ఏసోబు, కుందుర్తి కోటయ్య, కుందుర్తి ఇస్రాయిల్, గరిక నరసింహరావు, ఉండ్రాళ్ల ఏలియేజర్, ఎ.పెంచలనాయుడు తదితరులు ఉన్నారు.

రాష్ట్రం ఎటుపోతుందోనన్న ఆందోళన ప్రజల్లో ఉంది కడప, నెల్లూరు జిల్లాల్లో మెజార్టీ సీట్లు గెలవబోతున్నాం

తీసుకున్న నిర్ణయాల్లో తప్పులుంటే సరిదిద్దుకుంటా TDP వచ్చాక జర్నలిస్టులపై దాడులు అరికడతాం

విలేకరులతో చిట్ చాట్ లో యువనేత నారా లోకేష్

కోవూరు/సాలుచింతల :- రాష్ట్రానికి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అని, టిడిపి అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతారని యువనేత నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎస్ పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం  సాలుచింతలలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో లోకేష్ తమ మనోభావాలను వెల్లడించారు. జగన్ చేసే ఇష్టారీతి అప్పులతో ప్రజలపై భారం పడుతోంది. రాష్ట్రం నెంబర్ 1 గా ఉండాలన్నది చంద్రబాబు లక్ష్యం. అందులో మీడియా భాగస్వామ్యం కావాలి.  టీడీపీ అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులకు వేధింపులు లేకుండా చేసే బాధ్యత నాది. న్యాయవాదులు కూడా రక్షన చట్టం అడుగుతున్నారు. జగన్ లా నేను భయపడను. అన్నింటికీ సమాధానం చెప్తా.  టీడీపీ హయాంలో 40 వేల పరిశ్రమలతో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అసెంబ్లీలో గౌతం రెడ్డి అన్నారు. గతంలో ఉద్యోగాలకు రాష్ట్రంలో చంద్రబాబు విత్తనం వేశారు. కియా తెచ్చి 25 వేల ఉద్యోగాలు కల్పించారు.

వైసీపీపాలనలో మీడియా ప్రతినిధులూ బాధితులే!

ఈ ప్రభుత్వం చేతిలో మీడియా ప్రతినిధులు కూడా బాధితులే. నాకు చీటింగ్ చేయడం తెలీదు..అక్రమాస్తుల కేసులు లేవు.  టీడీపీ ప్రభుత్వంలో మీరు చేసిన పోరాటం ఇప్పుడు చేయడం లేదు.  జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం గతంలో కమిటీ వేశాం..కుదరలేదు..ఈసారి ఇస్తాం.  జర్నలిజం కష్టమైన వృత్తి. తమిళనాడులో మీడియా వారికి పెన్షన్ అంశం నా దృష్టిలో ఉంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియా కూడా పవర్ ఫుల్ గా మారింది. జర్నలిస్టులకు సంక్షేమ నిధి, రిటైర్ మెంట్ తర్వాత బెనిఫిట్స్, ప్రత్యేక చట్టం గురించి పార్టీ పెద్దలతో మాట్లాడి నేను నిర్ణయం ప్రకటిస్తాం.  సమాజాన్ని జగన్ గీత గీసి విడదీశారు. ఇది మీడియాకూ అంటుకుంది. మీడియాను విడదీసింది జగనే. ఇది చాలా దూరం వెళ్లింది. మా కార్యకర్తల్లోనూ ఆవేదన ఉంది. మా తల్లిని అవమానించలేదు..రాజకీయం కోసం మాట్లాడుతున్నానని వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. 2012 నుండి నన్ను, బ్రాహ్మణిని ట్రోల్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా వెళ్తే భయపడతారనేది వైసీపీ విధానం. మీడియాపై దాడి జరిగితే టీడీపీ అండగా ఉంటుంది. మా ప్రభుత్వం వచ్చాక జర్నలిస్టులపై దొంగ కేసులు ఉండవు. మీడియా మిత్రుల గొంతు నొక్కే జీవోలు వస్తే మీ సంఘాలు ఎందుకు స్పందించడం లేదు.? జర్నలిస్టులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటాం. 

కడప, నెల్లూరులో మెజారిటీ సీట్లు సాధిస్తాం!

నెల్లూరు, కడప జిల్లాల్లో 10కి 10 సీట్లు వైసీపీకి ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో టీడీపీకి మంచి ఆదరణ ఉంది. నిన్న 8 కి.మీ 7 గంటలకు పైగా పట్టింది. మహిళలు పెద్దఎత్తున బయటకు వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారు. రాష్ట్రం ఎటుపోతుందోనన్న ప్రజల్లో ఆందోళన ఉంది. నెల్లూరు, కడప జిల్లాలో మెజారిటీ సీట్లు సాధిస్తాం.  గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు పున:ప్రారంభిస్తాం.  టీడీపీ కార్యకర్తలపై, కార్యాలయాలు, బీసీ, దళితులపై దాడులు చేస్తే మాపై కాదు కదా..అని అందరూ అనుకున్నారు. నన్నూ వ్యక్తిగతంగా దూషించారు. జాఫర్, విజయ్ పాత్రుడు ఫ్యామిలీని బయటకు లాగారు. అది రేపు మీ ఇంటికి కూడా వస్తుంది. జగన్ అసెంబ్లీ ప్రతిష్టనూ దిగజార్చారు. కొన్ని ఛానల్స్ వైసీసీ ప్రోత్సాహంతో లేనిది ఉన్నట్లు చూపిస్తూ..వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాయి. తప్పులు చూపిస్తే సరిదిద్దుకోవడానికి సిద్దంగా ఉన్నా. నలుగురు వేరు వేరు కులస్తులు కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి ఈరోజు ఉందా.? ఇదంతా ఐ ప్యాక్ తెచ్చిందే. రామ్ గోపాల్ వర్మ కూడా ఇక్కడ కులాల ప్రస్తావన తెస్తున్నారు..అదే తెలంగాణలో మాట్లాడితే తంతారు.  పూతలపట్టులో జర్నలిస్టులకు అవకాశం ఇచ్చాం.

వైసీపీ చేసే అప్పుల భారమంతా ప్రజలపైనే!

వైసీపీ  చేసే అప్పులు ప్రజలపై భారం మోపుతోంది. అగ్రరాజ్యాల్లోనూ సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఎకానమీని ముందుకు తీసుకెళ్లాలి. చంద్రబాబే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్. రెవెన్యూ రాబడిలోనూ రాష్ట్రం వెనకబడింది. చంద్రబాబు ఉన్నప్పుడు ఉన్న గ్రోత్ రేట్ ఇప్పుడు లేదు. వ్యవసాయం  వెనకబడింది.  ఇచ్చిన హామీలు తప్పకుండా టీడీపీ నిలబెట్టుకుంది. 20 లక్షల ఉద్యోగాలు సంక్షేమం కాదు..అదొక ఎకానమీ యాక్టివిటీ. కేజీ టు పీజీ కరికులమ్ మార్చేస్తాం. ధరలు పెరగడం వల్ల పెట్టుబడి పెరుగుతోంది. చేపలు, రొయ్యలు సాగులో ఇన్ పుట్ సబ్సీడీ తగ్గింది..పెట్టుబడి పెరిగింది. గతంలో ఆక్వా రైతులకు విద్యుత్ తక్కువ ధరకే అందించాం. రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఆక్వా ఏపీకి అవసరం. పక్కరాష్ట్రాల్లో వరి సాగు చేస్తున్నారు…మనమూ వరినే సాగుచేస్తే కుదరదు. గతంలో ఇచ్చిన సబ్సీడీలు మళ్లీ ఇచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది.

ప్రజలపై వైసీపీ విద్యుత్ ఛార్జీల భారం

విద్యుత్ రంగాన్ని చంద్రబాబు అర్థం చేసుకుని సోలార్ రంగాన్ని ప్రోత్సహించారు. మిగులు విద్యుత్ లో ఏపీ అగ్రస్థానంలో ఉండాలన్నది చంద్రబాబు ఆలోచన. వైసీపీ వచ్చాక 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. పీపీఏలు జగన్ వచ్చాక రద్దు చేశారు. డిమాండ్ పెరిగేకొద్దీ..అధిక ధరకు కొంటున్నారు. ఆ భారం ప్రజలపై పడుతోంది. స్మార్ట్ మీటర్ల కొనుగోలులోనూ అవినీతికి పాల్పడుతున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే విద్యుత్ ఛార్జీలు తక్కువ ఉండాలి..గతంలో మేము తక్కువకే అందించాం..కానీ ఇప్పుడు మన రాష్ట్రంలోనే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

అభివృద్ధిపై చర్చకు నేను రెడీ!

లక్ష కోట్లు ఉన్న వ్యక్తికి పేదల బాధలు తెలియవు. విభజన అనంతరం పాలించడానికి రూములు కూడా లేవు. రైతులను ఒప్పించి 32 వేల ఎకరాలు రాజధానికి సేకరించాం..అందులో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ నాలుగేళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధిపై చర్చకు నేను రెడీ..ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి. మాజీమంత్రి అనిల్ అవినీతికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా బయటపెడతాం. జగన్ కూడా ఊరూరా హామీలిచ్చారు..అవికూడా విడుదల చేస్తాం. అనిల్ కు నెల్లూరు సిటీ టికెట్ ఉందా..లేదా.? జగన్ చెప్పారా.? నెల్లూరు ప్రజలు అనిల్ ను ఓడిస్తారు. అనిల్ మొదట టికెట్ తెచ్చుకోవాలి. కార్పొరేట్ సీట్లు కూడా అనిల్ అమ్ముకున్నాడు.  వివేకాను మేము హత్య చేయించలేదని గతంలో వెంకన్నపై ప్రమాణం చేశా..అనిల్ కూడా తాను అవినీతికి పాల్పడలేదని చేయాలి. ఏపీలో మొదటి సారిగా కుప్పంలో 2 ఎకరాలు భూమి కొన్నాం. మేము అవినీతి చేసుండుంటే బయట మేము బయట తిరగగలిగే వాళ్లమా? మా అస్తులు ఎంతున్నాయో ప్రకటిస్తున్నాం..

జె-ట్యాక్స్ వల్లే విద్యుత్ బిల్లులు అమాంతం పెరుగుదల

ఆర్యవైశ్యులు స్వేచ్చగా వ్యాపారం చేసుకునేలా చూస్తాం

బియ్యం ఎగుమతులపై పార్లమెంటులో పోరాడతాం

వ్యాపారులతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్

కోవూరు: వ్యాపారస్తులు కూడా జగనోరా వైరస్ బాధితులేనని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం సాలుచింతల క్యాంప్ సైట్ లో వ్యాపారులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… జగనోరా వైరస్ కి వ్యాక్సిన్ చంద్రబాబు నాయుడు.  టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకునే వారు. జగన్ పాలనలో క్రాప్ హాలిడే, ఆక్వా హాలిడే చూశాం. త్వరలో వ్యాపారస్తులు బిజినెస్ హాలిడే ప్రకటించే ప్రమాదం ఉంది. చెత్త పన్ను, బోర్డు పన్ను, విద్యుత్ ఛార్జీలు, ప్రొఫెషనల్ టాక్స్ పెంచి వ్యాపారస్తులను వేధించాడు జగన్. చెత్త పన్ను కట్టకపోతే చెత్త తీసుకొచ్చి షాపు ముందు పొయ్యడం దారుణం. టిడిపి అధికారంలోకి వచ్చాక అమరావతిలో రోశయ్య గారి సేవలు గుర్తు ఉండేలా మ్యూజియం ఏర్పాటు చేస్తాం. ఆర్య వైశ్యుల కార్పొరేషన్ బలోపేతం చేస్తాం.  ఆర్య వైశ్యుల సంఘం వ్యవహారం లో రాజకీయ జోక్యం లేకుండా చేస్తాం. ఆర్య వైశ్యుల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం.

బియ్యం ఎగుమతులపై కేంద్రంతో పోరాడతాం

రైస్ మిల్లర్ల సమస్యలు నాకు తెలుసు. వైసీపీ రైస్ మిల్లర్ల ను వేధిస్తున్నాడు. పన్నులు, సెస్ పెంచేసి ఇబ్బంది పెడుతున్నారు. జగన్ పెంచేసిన పన్నులు అన్ని తగ్గిస్తాం. కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి వ్యాపారాలు చేసుకోవడానికి అయ్యే ఖర్చులు తగ్గిస్తాం. బియ్యం ఎగుమతులు కోసం కేంద్రం వసూలు చేస్తున్న పన్ను తగ్గించేలా మా ఎంపీలు పోరాటం చేస్తారు.జగన్ విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు. రకరకాల పేర్లు చెప్పి భాదేస్తున్నాడు. సర్ ఛార్జ్ కాదు జే ఛార్జ్ వలనే విద్యుత్ బిల్లులు అంతగా పెరిగిపోయాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం. జగన్ పాలనలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపి నంబర్ 1 గా ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గిస్తాం.

భవన నిర్మాణరంగాన్ని బ్రష్టు పట్టించారు!

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన ఇసుక విధానం తీసుకొస్తాం. ఇసుక ధర తగ్గిస్తాం. చిరు వ్యాపారస్తులు జీఎస్టీ రిటర్న్స్ చెల్లింపుల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఫైన్స్ కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనలు సడలించేలా మా ఎంపిలు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తారు వైసీపీ అనాలోచిత నిర్ణయాల వలన వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు. ప్లాస్టిక్ కవర్ల తయారీ చేసే కంపెనీలను నియంత్రించకుండా ప్లాస్టిక్ కవర్లు వాడే వ్యాపారస్తుల పై ఫైన్లు వెయ్యడం దారుణం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వేధింపుల కంటే ప్లాస్టిక్ వినియోగం వలన వచ్చే ప్రమాదాల పై అవగాహన పెంచే చర్యలు తీసుకుంటాం. వైసీపీ  వ్యాపారస్తులు వేధిస్తున్నాడు, టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వేధింపులు లేకుండా చేస్తాం.

ట్రాన్స్ పోర్టు రంగాన్నీ దెబ్బతీశారు!

విపరీతంగా పన్నులు పెంచాడు. లారీలు తిప్పలేని పరిస్థితి. కాంపౌండ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, క్వార్టర్ ట్యాక్స్ అన్ని పెంచేశాడు. జగన్ ట్రాన్స్ పోర్ట్ రంగం పై పెంచిన అన్ని పన్నులు తగ్గిస్తాం. అప్పు చేసి సంక్షేమం చెయ్యడం వలన అన్ని రంగాల పై పన్నులు పెంచాడు జగన్.  టిడిపి సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలను అందించింది. టిడిపి సైకిల్ కి అభివృద్ది, సంక్షేమం రెండు చక్రాలు. నిమ్మ లో ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకి కావాల్సిన రకాలు ఇక్కడ పెంచే విధంగా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. కోల్డ్ స్టోరేజ్ లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతులకు, వ్యాపారస్తులకు సాయం అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పెంచిన ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గిస్తాం. ప్రొఫెషనల్ ట్యాక్స్ రద్దు చేస్తాం. ఫీడ్, సీడ్ యాక్ట్ తీసుకొచ్చి వైసీపీ ఆక్వా రంగాన్ని కోలుకోలేని దెబ్బతీశాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్వా రంగాన్ని ఆదుకోవడానికి గతంలో ఇచ్చిన సబ్సిడీలు అన్ని అందిస్తాం. అక్రమ కేసులు పెట్టి నరకం చూపిస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే స్వర్ణకారులకు వేధింపులు లేని విధానం తీసుకొస్తాం.

ఇంఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ…

చేనేత కార్మికులు, ఆక్వా రైతులు, రైసు మిల్లర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వ్యాపారుల పై విపరీతంగా పన్నులు పెంచి దోచుకుంటుంది.

లోకేష్ ఎదుట వివిధ వర్గాల సమస్యలు

రైస్ మిల్లర్లు జగన్ పాలన లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. సెస్ పెంచారు దానితో ఇబ్బంది పడుతున్నాం. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు. పెనాల్టీల పేరుతో వేధిస్తున్నారు. సబ్సిడీలు ఇవ్వడం లేదు. జగన్ పాలనలో భవన నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. చిరు వ్యాపారస్తులు జీఎస్టీ రిటర్న్స్ వెయ్యడంలో ఆలస్యం అయితే ఫైన్ల పేరుతో వేధిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే కంపెనీలను నియంత్రించకుండా కవర్లు కస్టమర్లకు ఇచ్చే వ్యాపారస్తులను జగన్ ప్రభుత్వం వేధిస్తుంది. ఫైన్లు విపరీతంగా వేస్తున్నారు. ట్రాన్స్ పోర్ట్ రంగాన్ని జగన్ కోలుకోలేని దెబ్బతీశాడు. లారీలు తిప్పలేని పరిస్థితి వచ్చింది. ప్రొఫెషనల్ ట్యాక్స్ పేరుతో జగన్ ప్రభుత్వం వ్యాపారస్తుల్ని వేధిస్తుంది. నిమ్మ రైతులు, వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నాం.  బంగారం వ్యాపారస్తులను జగన్ ప్రభుత్వం వేధిస్తుంది. కేసులు పెట్టి నరకం చూపిస్తు

నారా లోకేష్ ను కలిసిన కోవూరు రైతులు

కోవూరుకు చెందిన రైతులు యువనేత నారా లోకేష్ ను కలిసి వినతి పత్రం అందించారు. మేము సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. సాగునీటి నీటి సమస్యకు పరిష్కారానికి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలి. పెన్నానది నుంచి గొలుసుకట్టు చెరువులకు నీరు సరిగా అందక తాగు, సాగు నీటికి ఇబ్బందిగా ఉంది. ప్రస్తుత ప్రభుత్వానికి ఎన్ని అర్జీలు పెట్టినా లాభం లేకుండా పోయింది.  మీరు అధికారంలోకి మా సమస్య పరిష్కరించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. టిడిపి ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, వనరులపై రూ.68,294 కోట్లు ఖర్చుచేస్తే, జగన్ వచ్చాక అందులో నాలుగోవంతు కూడా ఖర్చుచేయలేదు. టిడిపి అధికారంలోకి రాగానే లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుచేసి కోవూరు ప్రజల సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. రాష్ట్రంలో రైతాంగ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది.

నారా లోకేష్ ను కలిసిన మీ-సేవ ఉద్యోగులు

కోవూరు నియోజకవర్గం మండబయలు గ్రామంలో మీ-సేవ సిబ్బంది యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలన్న ఉద్దేశంతో 2003లో చంద్రబాబునాయుడు మీ-సేవ వ్యవస్థను ప్రారంభించారు. గత 19 సంవత్సరాలుగా 139రకాల సేవలను మీ-సేవ కేంద్రాలద్వారా ప్రజలకు అందిస్తున్నాము. ప్రస్తుతం మాకు రూ.8వేలు మాత్రమే వేతనంగా ఇస్తున్నారు, ఉద్యోగ భద్రత లేదు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2020 మార్చి నుంచి రామ్ ఇన్ఫోటెక్ వారు మాకు ఇవ్వాల్సిన జీతాలు, పిఎఫ్, ఈఎస్ఐ చెల్లించడం లేదు. సచివాలయ వ్యవస్థ రాకతో మీ-సేవలు కూడా నిలచిపోయాయి. దీర్ఘకాలంగా జీతాల్లేక, వేరే ఉద్యోగాలు చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

ప్రజలకు మెరుగైన పౌరసేవలను అందించాలన్న ఉద్దేశంతో చంద్రబాబునాయుడు మీ-సేవ వ్యవస్థను ఏర్పాటుచేశారు. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఈ వ్యవస్థను జగన్ అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేశారు. వేలాదిమంది మీ-సేవ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది జీవితాలను అగమ్యగోచరంగా మార్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మీ-సేవ వ్యవస్థను మరింత సమర్థవంతంగా వినియోగించుకుని ప్రజలకు మెరుగైన సేవలందిస్తాం. మీ-సేవ ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిలను అందజేసి, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన యానాది సామాజికవర్గీయులు

కోవూరు నియోజకవర్గం గుమ్మలదిబ్బ ఎస్టీ కాలనీలో యానాది సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు రుణాలు ఇచ్చింది..కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎటువంటి రుణాలు ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం ఎస్టీ సబ్ ప్లాన్ కింద రుణాలు, ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేది. ఈ ప్రభుత్వంలో ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించడం లేదు. యానాదుల అభివృద్ధికి గతంలో ఇన్నోవా కార్లు, ట్రాక్టర్లు, పంపుసెట్లు వంటివి అందాయి..ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని మాకు ఇవ్వడం లేదు.  గతంలో ఉచిత విద్యుత్ మాకు అందేది..ఎరువులు కూడా అందేవి. విద్యుత్ ఛార్జీలు పెంచడంతో ప్రస్తుతం బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇటీవల కాలం నుండి యానాదులపై కారణం లేకుండా దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఎస్టీ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందేవి..కానీ ఇప్పుడు లేవు.మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయండి

నారా లోకేష్ మాట్లాడుతూ

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎస్టీ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. అధికారంలోకి వచ్చాక రూ.5,355 కోట్ల ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన కాసుల్లేని కార్పొరేషన్ ఏర్పాటుచేసి, యానాదులను మోసగిస్తున్నారు. టీడీపీ హయాంలో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 50 శాతం సబ్సిడీతో స్వయం ఉపాధి రుణాలు అందించాం. వైసీపీ  సీఎం అయ్యాక 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారు. ఎస్టీ యువత ఉన్నత చదువులు చదవుకుండా ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు చేశాడు. మేము వచ్చాక పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తాం.  ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో యానాది కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, వారి అభివృద్ధికి కృషిచేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన పాటూరు చేనేత కార్మికులు

కోవూరు నియోజకవర్గం, పాటూరు చేనేత కార్మికులు నారా లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మీరు అధికారంలోకి వచ్చాక చేనేతను ఉపాధిరంగంగా చూడాలి. చేనేతలు నేసిన వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం లేదు. అన్ని ముడిసరుకులపై 42 శాతం జీఎస్టీని ఈ ప్రభుత్వం వసూలు చేస్తోంది.  చేనేతపై ఆధారపడిని 8 ఉపవృత్తుల వారికి ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందడం లేదు. ఈ ప్రభుత్వం ఆదునిక డిజైన్లు తయారు చేయడానికి అవరసరమైన మిషనరీలు ఇవ్వడం లేదు. నెల్లూరు జిల్లాలో తయారు చేసిన వస్త్రాలను చేనేత బజారు ఏర్పాటు చేయాలి. చేనేత కార్మికులు మగ్గాలు ఏర్పాటు చేసుకునేందుకు వర్క్ షెడ్స్ ఏర్పాటు చేయాలి. చేనేతలకు సంబంధించిన 11 రకాల రిజర్వేషన్లు అమలు చేయాలి. 1979లో నెల్లూరు సిటీ గాంధీ నగర్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కాటన్, డైయింగ్ కోసం హీట్ ప్లాంట్ కు 7.10 ఎకరాల స్థలం కేటాయించారు. కానీ కొన్ని కారణాల వల్ల ప్లాంట్ పనులు నిలిచిపోయాయి. ఆ ఫైలు తిరుపతిలో ఆప్కో కార్యాలయంలో ఉంది. చేనేతలకు తమిళనాడు తరహాలో రూ.వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలి. చేనేత కార్మికులకు ప్రభుత్వ హామీతో వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

జగన్ అసమర్థ పాలనతో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. గత నాలుగేళ్లలో 60 మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం ఒక్కరికి కూడా పరిహారం అందించలేదు. టీడీపీ హయాంలో రూ.110 కోట్ల రుణాలను మాఫీ చేశాం. టిడిపి అధికారంలోకి వచ్చాక చేనేత కార్మికల కోసం కామన్ వర్క్ షెడ్లు ఏర్పాటు చేస్తాం. కేంద్రంతో మాట్లాడి జీఎస్టీ రద్దు చేయిస్తాం..లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చేస్తాం. అధికారంలోకి రాగానే చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తాం.  గతంలో మాదిరిగా యార్న్, పట్టు సబ్సీడీలను అధికారంలోకి వచ్చాక మళ్లీ అందిస్తాం. చేనేత కార్మికులకు చంద్రన్న బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలను కల్పిస్తాం. చేనేత పనివారలకు ఎటువంటి పూచీకత్తులేకుండా సబ్సిడీ రుణాలను అందజేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన దామరమడుగు రైతులు

కోవూరు నియోజకవర్గం దామరమడుగుకు చెందిన రైతులు నారా లోకేష్ ను కలిసి సమస్యలు చెప్పుకున్నారు. రైతు భరోసా కేంద్రాలను ఈ ప్రభుత్వం దందా కేంద్రాలుగా మార్చింది. మోటార్లకు మీటర్లు పెట్టి ఈ ప్రభుత్వం రైతులపై భారం మోపాలని చూస్తోంది. పంటలకు గిట్టుబాటు ధర ఉండటం లేదు.  కోవూరు కాలువ తవ్వించకపోవడం వల్ల వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోక గ్రామంలోకి వస్తున్నాయి. దీనిని అధికారంలోకి రాగానే పూర్తి చేయాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

ముఖ్యమంత్రి జగన్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి రైతాంగం మెడకు ఉరితాడు బిగించాలని చూస్తున్నాడు. రైతు భరోసా కేంద్రాల వల్ల రైతాంగానికి ఎటువంటి ఉపయోగం లేదు. పాదయాత్ర సమయంలో రైతుల గిట్టుబాటు ధరకు రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తానన్న సిఎం… అధికారంలోకి వచ్చాక పత్తా లేకుండా పోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కోవూరు పంట కాల్వను పూర్తి చేస్తాం. గత ప్రభుత్వంలో రైతులకు అందించిన సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, డ్రిప్ వంటి వన్నీ అధికారంలోకి రాగానే పునరుద్దరిస్తాం.

Also, Read This Blog :Nara Lokesh Yuvagalam: Nurturing Talent, Fostering Success

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *