Nsra lokesh padaytra,Yuvagalam
Nsra lokesh padaytra,Yuvagalam

నెల్లూరులో హోరెత్తిన యువగళం పాదయాత్ర అడుగడుగునా యువనేతకు ప్రజల బ్రహ్మరథం

కోవూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన యువగళం

నెల్లూరు: యువనేత Nara lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 146వరోజు నెల్లూరు నగరంలో జనప్రభంజనాన్ని తలపించింది. దారిపొడవునా జనం యువనేతను చూసేందుకు వచ్చిన జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. పాదయాత్ర దారిలో మహిళలు, యువకులు భవనాలపై నిలబడిన యువనేతకు అభివాదం చేశారు. విచిత్ర వేషధారణలు, డప్పుశబ్ధాలు, బాణాసంచా మోతలతో సింహపురి మారుమోగుతోంది. రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు నగర ఇన్ ఛార్జి పొంగూరి నారాయణ నేతృత్వంలో వేలాది కార్యకర్తలకు యువనేతకు బ్రహ్మరథం పట్టారు. నెల్లూరు విఆర్ సి జంక్షన్ లో నిర్వహించిన బహిరంగసభకు నగరం నలుమూలల నుంచి జనం పోటెత్తారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి, జై లోకేష్ నినాదాలతో నెల్లూరు నగరవీధులు మారుమోగాయి. అడుగడుగునా  అభిమానులు యువనేతపై పూలవర్షం కురిపిస్తూ యువనేతను ముంచెత్తారు. భారీ గజమాలలు, హారతులు, గుమ్మడికాయలతో యువనేతకు దిష్టితీస్తూ మహిళలు అభిమానాన్ని చాటుకున్నారు. మంగళవారం సాయంత్రం యువగళం పాదయాత్ర నెల్లూరు సిటీ నియోజకవర్గం లోకి ప్రవేశించించింది. నారా లోకేష్ కి నెల్లూరు సిటీ ఇంఛార్జ్ నారాయణ, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. నారా లోకేష్ ని చూసేందుకు మహిళలు, యువత, వృద్దులు భారీగా రోడ్లపైకి వచ్చారు. వివిధ వార్డుల్లో ఎదుర్కుంటున్న సమస్యలను ప్రజలు యువనేత లోకేష్ దృష్టికి తెచ్చారు. కరెంట్ ఛార్జీలు, ఇంటిపన్నులు విపరీతంగా పెరిగిపోయాయని  మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. కూరగాయల రేట్లు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని యువనేత ఎదుట వాపోయారు.  వివిధ సామాజికవర్గాల ప్రతినిధులు తాము ఎదుర్కుంటున్న సమస్యలు లోకేష్ దృష్టికి తెచ్చారు. అందరి సమస్యలను ఓపిగ్గా విన్న లోకేష్… టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగడంతో అభిమానులు ఆనందం వ్యక్తంచేశారు. 146వరోజు యువనేత లోకేష్ 8.6 కి.మీ. పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1901.2 కి.మీ. మేర కొనసాగింది.

మహిళల కష్టాలు తీర్చేందుకే మహాశక్తి

జగన్ మహిళల్ని నమ్మించి ముంచేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఎం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. 

యువగళం నిధికింద నిరుద్యోగ భృతి ఇస్తాం

జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

అన్నదాతతో రైతులను ఆదుకుంటాం!

. జగన్  పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2.  రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. మీటర్లు రైతులకు ఉరితాళ్లు. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. జీతం ఒకటో తారీఖున వచ్చే దిక్కు లేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది.

బిసిల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం

బీసీలు పడుతున్న కష్టాలు నేను చూసాను. 26 వేల అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం.

నెల్లూరు సిటీని అభృవృద్ధి చేసింది మేమే!

నెల్లూరు సిటీ, రూరల్ రెండు కళ్లు లాంటివి. ఈ రెండు నియోజకవర్గాలను అభివృద్ధి చేసింది టిడిపి. నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ చెయ్యనంత అభివృద్ధి చేసి నారాయణ ఓడిపోయారు.  మీరు ఎక్కువ పాలిచ్చే ఆవుని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. నారాయణ ఒక్క నెల్లూరు సిటీ ని అభివృద్ధి చెయ్యడానికే 4,500 కోట్లు ఖర్చు చేసారు. ఇది నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్. నెల్లూరు సిటీ లో వెయ్యి కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తే. నాలుగేళ్లలో 100 కోట్లు ఖర్చు చేసి పూర్తి చెయ్యలేని వేస్ట్ ప్రభుత్వం మీది.  ఒక్క నెల్లూరు టౌన్ లోనే 17 వేల టిడ్కో ఇళ్లు కట్టాం. రోడ్లు, సిసి రోడ్లు, తాగునీటి పధకాలు, పార్కులు, ఎల్ఈడి లైట్లు, అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేసాం. నారాయణ గారు అభివృద్ధి లో మాస్టర్. నారాయణ ఎక్కడ అపేశారో అక్కడ నుండి నెల్లూరు అభివృద్ధి మళ్లీ రీస్టార్ట్ చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు, టిడ్కో ఇళ్లు పూర్తి చేసి అందిస్తాం.  నెల్లూరు టౌన్ లో స్వర్ణకారులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే స్వర్ణకారులను ఆదుకుంటాం.

బినామీలపేరుతో వందలకోట్లు భూములు

అల్లీపురం లో 4వ డివిజన్ కార్పొరేటర్, డాక్టర్ అశ్విన్ (అనిల్ తమ్ముడు) పేరుతో 42 ఎకరాలు. విలువ రూ.105 కోట్లు. ఇందులో 7 ఎకరాలు ఇరిగేషన్ భూమి. సాదరపాళెం లో 4వ డివిజన్ కార్పొరేటర్, డాక్టర్ అశ్విన్ (అనిల్ తమ్ముడు) పేరుతో 12 ఎకరాలు. విలువ రూ.48 కోట్లు.  ఒక పెద్ద కాంట్రాక్టర్ నుండి దశల వారీగా అనిల్ బినామీ చిరంజీవి కి కోట్ల రూపాయలు వచ్చాయి.  బృందావనం లో శెట్టి సురేష్ అనే బినామీ పేరుతో 4 ఎకరాలు. విలువ 25 కోట్లు.  దామరమడుగు లో బావమరిది పేరుతో 5 ఎకరాలు. విలువ 4 కోట్లు. గూడూరు- చెన్నూరు మధ్యలో 120 ఎకరాలు లేపేసాడు. 40 ఎకరాల్లో లే అవుట్ వేసి అమ్మేస్తున్నాడు. ఆఖరికి కరోనా ని కూడా క్యాష్ చేసుకున్నాడు సిల్లీ బచ్చా. వ్యాపారస్తులను, ఆసుపత్రుల యజమానులు, జ్యువెలరీ షాపుల వారిని బెదిరించి కోట్లు కొట్టేసాడు. సిల్లీ బచ్చా అండ్ కంపెనీ పెన్నా నది నుండి ఇసుకను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్లు దోచుకుంది. ఇలానే వదిలేస్తే సిల్లీ బచ్చా తనని మించిపోతాడని జగన్ కి భయం పట్టుకుంది. అందుకే సీటు చింపేసాడు. క్లారిటీ ఉంది కాబట్టే సిల్లీ బచ్చా చెన్నై లో 50  కోట్లతో ఇళ్లు కట్టాడు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే రాష్ట్రం నుండి పరార్. ఎక్కడ ఉన్నా సిల్లీ బచ్చా చేసిన భూ అక్రమాల పై ప్రత్యేక సిట్ వేస్తాం.

ఆ ముగ్గురినీ జగన్ అవమానించారు!

జగన్ కి కష్టం వస్తే మొదట నిలబడిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి.  అలాంటి వ్యక్తిని జగన్ అవమానించాడు. పెద్దాయన ఆనం రాంనారాయణ రెడ్డిని అవమానించాడు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని అవమానించాడు. నెల్లూరు జిల్లా ప్రజల్ని జగన్ అవమానించాడు. నెల్లూరు రూరల్ మాస్ లీడర్లు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అన్నా, అక్కడి ప్రజలు అన్నా కోటం రెడ్డిశ్రీధర్ రెడ్డి ప్రాణం. అంతా ఆయనకి వైసిపి లో అవమానం జరిగింది కాబట్టి బయటకి వచ్చారని అనుకుంటున్నారు. రూరల్ నియోజకవర్గానికి అవమానం జరిగింది కాబట్టి ఆయన బయటకి వచ్చారు. రూరల్ నియోజకవర్గం ప్రజల్ని జగన్ అవమానించారు కాబట్టి ఆయన బయటకి వచ్చారు. ఆయన ఫోన్ ట్యాప్ చేసారు, వ్యక్తిగత విమర్శలు చేసారు, సెక్యూరిటీ తీసేసారు, ఒక ఉగ్రవాదిని వెంటాడినట్టు ప్రభుత్వం ఆయన్ని వెంటాడుతుంది. అయినా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తగ్గలేదు. దమ్మున్న సింహంలా ఎదురు వెళ్తున్నారు. కేవలం 10 నెలలు ఓపిక పట్టండి రూరల్ నియోజకవర్గం రూపురేఖలు మార్చబోయేది టిడిపి. 

పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తాం!

బారా షాహిద్ దర్గా ని గతంలో అభివృద్ధి చేసింది మనమే. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దర్గాని అభివృద్ధి చేసే బాధ్యత నాది. అధికారంలోకి వచ్చాక పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తాం. ములుముడి చెరువు వద్ద ఉన్న కలుజు మీద బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తాం.  ఆమంచర్ల గ్రామం వద్ద కనుపూరు కాలువ మీద డీప్ కట్ నిర్మాణం చేసి 42 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తాం. కొమ్మరపూడి, కొండ్లపూడి, దేవరపాలెం, దొంతాలి లిఫ్ట్ పూర్తి చేస్తాం. క్రిస్టియన్ కమ్యూనిటీ హల్, బిసి భవన్, కాపు భవన్, అంబేద్కర్ భవన్ విత్ స్టడీ సర్కిల్, మైనార్టీ గురుకుల పాఠశాల పనులు పూర్తి చేస్తాం. ఎందుకు పనికి రాని లోలెవల్ ఉన్న వావిలేటిపాడు లేఅవుట్ లో పేదలకు స్థలాలు ఇచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలందరికీ ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తాం.  పెండింగ్ లో ఉన్న అన్ని షాదీ మంజిల్ లను పూర్తిచేస్తాం.  ఆమంచర్ల గ్రామంలో ఏపీఐఐసి భూములు ఉన్నాయి. అక్కడ మైక్రో అండ్ స్మాల్ పరిశ్రమలు తెచ్చి, స్థానికంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎన్టీఆర్ నక్లెస్ రోడ్డు – గణేష్ ఘాట్ అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం. హరనాథపురం- మినీ బైపాస్ ని కలుపుతూ సర్వేపల్లి కాలువ మీద బ్రిడ్జ్ నిర్మాణం చేస్తాం.

ఫ్లెక్సీలు పెట్టి పారిపోవడం కాదు…నేరుగా రండి!

ఫ్లెక్సీలు పెట్టి పారిపోవడం కాదు నేరుగా రండి తేల్చుకుందాం. భయం మా బయోడేటా లో లేదు. బాంబులకే భయపడని కుటుంబం మాది. టిడిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఎవ్వరిని వదిలిపెట్టను. అట్టుకు అట్టున్నర పెడతా.  నెల్లూరు లో ఉన్నా నైజీరియా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా. నెల్లూరు జిల్లా ప్రజలు ఆలోచించాలి. 2014 లో మూడు సీట్లు ఇస్తే టిడిపి చేసిన అభివృద్ధి, 2019 లో 10 కి 10 సీట్లు ఇస్తే వైసిపి చేసిన అభివృద్ధి ని బేరీజు వేసుకోండి. నెల్లూరు జిల్లా మళ్లీ అభివృద్ధి చెందాలి అంటే 2019 లో వైసిపి కి ఇచ్చిన 10 సీట్లు మాకు ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం.   గత నాలుగేళ్లుగా టిడిపి నాయకులు అజీజ్, కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి  పార్టీ కోసం కష్టపడ్డారు. వారి భవిష్యత్తు నా బాధ్యత.

నారా లోకేష్ ను కలిసిన నెల్లూరు స్వర్ణకారులు

నెల్లూరు కనకమహాలక్ష్మి సెంటర్ లో స్వర్ణకారులు యువనేత  లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. స్వర్ణకారుల్లో విశ్వబ్రాహ్మణులే కాకుండా ముస్లిం, ఇతర కులాల వారు కూడా ఉన్నారు విశ్వబ్రాహ్మణులకు తాళిబొట్లు తయారు చేసే హక్కు కల్పించాలి. జీవో.నెంబర్ 272ను సవరించి స్వర్ణకారులపై పోలీసుల వేధింపుల నుండి కాపాడాలి. గడిచిన నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. TDP హయాంలో ఆదరణ ద్వారా పనిముట్లు ఇచ్చి వృత్తి పరంగా ప్రోత్సహించారు. స్వర్ణకారులకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి, సబ్సిడీ రుణాలు అందించాలి. స్వర్ణకారులకు శిక్షణా కేంద్రాలు నెలకొల్పి, ఐడీ కార్డులు అందజేయాలి. స్వర్ణకారులు నిత్యం పొగ, రసాయనాల మధ్య పని చేస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారు, బీమా సౌకర్యం కల్పించాలి. 50 ఏళ్లు దాటిని వారికి పింఛన్ మంజూరు చేయాలి. విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ మోసం చేశారు. నెల్లూరులో స్వర్ణకారుల సంక్షేమ భవనాన్ని ఏర్పాటు చేయాలి.

*నారా లోకేష్ మాట్లాడుతూ…*

జగన్మోహన్ రెడ్డి పాలనలో స్వర్ణకారులతోపాటు అన్ని బిసి సామాజికవర్గాల వారు బాధితులే. కులానికొక కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటుచేసిన జగన్… బిసిలను దారుణంగా మోసగించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక స్వర్ణకారులు ఎటువంటి వేధింపులు లేకుండా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తాం. చంద్రన్న బీమా ద్వారా స్వర్ణకారులను ఆదుకుంటాం. అధికారంలోకి రాగానే స్వర్ణకారుల నూతన డిజైన్ల కోసం స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ల ద్వారా శిక్షణ ఇచ్చి, అధునాతన పనిముట్ల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు అందజేస్తాం. స్వర్ణకారులకు ఆరోగ్య బీమా, ఐడి కార్డులు అందజేస్తాం. నెల్లూరులో స్వర్ణకారుల భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన నెల్లూరు మీ-సేవా కార్మికులు

నెల్లూరు ఆత్మకూరు బస్టాండులో  మీ – సేవా కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. 2003లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం అన్ని రకాల సేవలు ఒకేచోట అందించాలన్న ఉద్దేశంతో ఈ-సేవా వ్యవస్థను ప్రారంభించింది. ఐటీ శాఖ పరిధిలో 170 అర్బన్ మీ సేవా కేంద్రాల్లో 607 ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తూ, 376 రకాల సేవలు ప్రజలకు అందిస్తున్నాం. ప్రస్తుతం మీ-సేవ పేరుతో కొనసాగుతున్న ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.4 వేల కోట్లు, మరో రూ.50 కోట్లు యూజర్ ఛార్జీల రూపంలో ఆదాయం సమకూరుతోంది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వ మీ-సేవ కేంద్రాలు మూసేసింది.  దీంతో 19 ఏళ్లుగా నుండి ఆధారపడి జీవిస్తున్న 607 మంది మీ-సేవా సిబ్బంది రోడ్డున పడింది. మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 170 ప్రభుత్వ అర్బన్ మీ-సేవా కేంద్రాలను ప్రారంభించి, మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

వైసీపీ పాలనలో అన్నిరకాల ఉద్యోగులు తీవ్ర దగాకు గురయ్యారు. అధికారం కోసం పాదయాత్ర సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని వైసీపీ నెరవేర్చలేదు. గత ప్రభుత్వ హయాంలో మీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని కమీషన్ కూడా పెంచాం. టీడీపీ అధికారంలోకి వచ్చాక మీ-సేవ కేంద్రాలను కొనసాగించి, సిబ్బంది మరింత సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటాం. మీ – సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు జారీ చేసే అన్ని రకాల సర్టిఫికేట్లు అధికారికంగా ఉండేలా గుర్తిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన నెల్లూరు 6వ డివిజన్ ప్రజలు

నెల్లూరులోని 6వ డివిజన్ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా డివిజన్ లో మంచినీరు సరిగా రాకపోవడంతో పాటు తాగునీరు వస్తోంది.  పప్పుల వీధిలోని వినాయకుడి గుడి దగ్గర నుండి పాండురంగ దేవాలయం వరకు వేసిన సిసిరోడ్డు, రెండు నెలలకే అధ్వాన్నంగా మారి కంకర బయటకు వచ్చింది. స్టోన్ పేట, పరిసర ప్రాంతాల్లోని చిరు వ్యాపారులపై అధికారులు దౌర్జన్యం చేస్తూ ఏ ఆధారం లేకుండా చేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలు సరిగా లేవు, వర్షం వస్తే డ్రైనేజీ నీరు రోడ్డుపైకి చేరుడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పెరిగిన విద్యుత్ బిల్లులు పెనుభారంగా పరిణమించాయి.  ఇంటిపన్నుతో పాటు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమయ్యాయి… పాఠ్యపుస్తకాలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ధరలు పెరిగాయి. దీంతో తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డు మార్జిన్ లో చిరు వ్యాపారస్తులను వ్యాపారులను అధికారలు వేధిస్తూ జీవనోపాధి లేకుండా చేస్తున్నారు.

నారా లోకేష్ మాట్లాడుతూ.

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. రకరకాల పన్నులతో జనానికి చుక్కులు చూపిస్తున్న వైసిపి ప్రభుత్వం… ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రం విఫలమైంది. రాష్ట్రవ్యాప్తంగా రూ. 1.30లక్షల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో కాంట్రాక్టర్లు పారిపోతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక నెల్లూరు నగరంలో సకల సదుపాయాలు కల్పించి, స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం. ఇంటింటికీ కుళాయి అందించి, 24/7 స్వచ్చమైన తాగునీరు అందజేస్తాం. చిరువ్యాపారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వేచ్చగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తాం. వ్యాపారులపై అధికారుల దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేస్తాం.

*నారా లోకేష్ ను కలిసిన నెల్లూరు టైలరింగ్ వర్కర్లు

నెల్లూరు జిల్లా టైలరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నారా లోకేష్ ను కలిసి వినతపత్రం అందించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుచేసిన పెడరేషన్ సొసైటీల ద్వారా టైలర్లను ఆదుకోవాలి. 50 ఏళ్లు నిండిన ప్రతి టైలర్ కు పెన్షన్ ఇవ్వాలి. చేనేతలకు మాదిరి ప్రతి టైలర్ కు షాపుకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వాలి. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలి. అసోసియేషన్ కు ప్రతి జిల్లాలో స్థలం కేటాయించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

 టిడిపి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ స్కూలు పిల్లల యూనిఫాం కుట్టుపనిని టైలరింగ్ వర్కర్స్ సొసైటీలకు అప్పగిస్తాం. టైలర్లకు స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ల ద్వారా శిక్షణ ఇచ్చి, సబ్సిడీపై అధునాతన పరికరాలు అందజేస్తాం. టైలర్లకు రాయితీ విద్యుత్ అందజేసే అంశాన్ని పరిశీలిస్తాం. టైలర్లకు చంద్రన్న బీమా సౌకర్యం కల్పిస్తాం, అసోసియేషన్ భవానానికి స్థలం కేటాయిస్తాం.

Also, Read This Blog :Nara Lokesh Yuvagalam: Unlocking the Potential of Young Innovators

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *