Nara Lokesh padayatra,Yuvagalam
Nara Lokesh padayatra,Yuvagalam

యువనేత లోకేష్ కు కోవూరు ప్రజల బ్రహ్మరథం అడుగడగునా యువనేత మహిళల నీరాజనాలు

బుచ్చిరెడ్డిపాలెం బహిరంగసభకు పోటెత్తిన జనం

కోవూరు: కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర హోరెత్తుతోంది. 148వరోజు యువగళం పాదయాత్ర కోవూరు నియోజకవర్గంలో జననీరాజనాల నడుమ కొనసాగింది. బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి జనం పోటెత్తారు. పట్టణంలోని వీధులన్నీ జనసంద్రంగా మారాయి. అడుగడుగునా ప్రజలు యువనేత లోకేష్ కు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు చెల్లాయపాలెం క్యాంప్ సైట్ వద్ద బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి Nara lokesh పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు జవహర్,  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  బుచ్చిరెడ్డిపాలెంలో లోకేష్ కి ఘన టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. లోకేష్ ని చూసేందుకు మహిళలు, యువకులు, వృద్ధులు భారీగా రోడ్లపైకి చేరుకున్నారు. చిరు వ్యాపారస్తులు, ప్రజల్ని ఆప్యాయంగా పలకరించిన యువనేత ఓపిగ్గా వారి సమస్యలు తెలుసుకున్నారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. చెత్త పన్ను, పెరిగిన విద్యుత్ ఛార్జీలు, రకరకాల పేర్లతో పన్నుల బాదుడు కారణంగా వ్యాపారాలు చెయ్యలేని పరిస్తితి వచ్చిందని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తంచేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పాలనలో పెంచిన పన్నులు అన్ని తగ్గిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీల భారం కూడా తగ్గిస్తామని చెప్పారు. 148వరోజు యువనేత లోకేష్ 16.1 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1933.2 కి.మీ. మేర పూర్తయింది. శుక్రవారంనాడు యువగళం పాదయాత్ర నార్త్ అమలూరు వద్ద కావలి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.

*శిలాఫలకాలపై ఉన్న శ్రద్ధ పనులపై లేదేమి ప్రసన్నా!*

బుచ్చిరెడ్డిపాలెంలో శిలాఫలకం వద్ద సెల్ఫీ దిగిన లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిత్తశుద్ధి లేని వైసిపి పాలకుల చర్యలకు అద్దం పడుతోంది ఈ శిలాఫలకం. రూ.2కోట్లతో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయితీ భవనాన్ని నిర్మిస్తామని చెప్పి,  25-10-2020  కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నేతృత్వంలో అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. రెండున్నరేళ్లయినా శిలాఫలకం అంత ఎత్తు కూడా భవనం గోడలు లేవలేదు. ఈ ప్రాంతంలో పిచ్చిమొక్కలు మొలిచి, మురుకికూపంగా మారింది.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

భూమిని కబ్జా చేసేందుకు చూస్తున్నారు – కందికట్ట రత్నం, జొన్నవాడ

మాకు బుచ్చిరెడ్డిపాలెం మండలం, జొన్నవాడలో 4.20 సెంట్ల భూమి ఉంది. కళావంతుల కింద మాకు 150 ఏళ్ల కిందట ఇచ్చారు. మా తాతల తరం నుండి పొలంలో సాగు చేసుకుంటున్నాం. 2022లో ఆ భూమి తమదంటూ వైసీపీ నేతలు సుబ్రహ్మణ్యం నాయుడు, ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి మా భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు. మా అమ్మ, తమ్ముడు, నాపై తప్పుడు కేసులు పెట్టారు. కోర్టులో కేసు నడుస్తున్నా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అండతో వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు.

టిడ్కో ఇల్లు మంజూరైనా ఇవ్వలేదు -మల్లవరం శంకరమ్మ, కొండాయపాలెం గేట్.

2018లో నాకు టిడ్కో ఇళ్ళు మంజూరు అయింది. డి.డి కూడా రూ.500  తీశాను. నా పేరు మీద పట్టా కూడా వచ్చింది. నా ఇల్లు ఇప్పటికీ నాకు ఇవ్వడం లేదు. అదిగో.. ఇదిగో అంటూ ఎన్నో తేదీలు మార్చారు. కనీసం ఆ ఇల్లు ఎలా ఉందో చూడటానికి వెళ్తే రానివ్వలేదు. నెలకు రూ.4వేలు చెల్లించి అద్దె ఇంట్లో ఉంటున్నా. టిఫిన్ కొట్టు పెట్టుకుని బతుకు జీవనం సాగిస్తున్నాం. నా భర్త కూలీకి వెళ్తున్నారు. సొంతఇంటిలో చేరాలని ఎదురు చూస్తున్నా. ఈ ప్రభుత్వంలో మా సొంతింటి కల నెరవేరేలా లేదు.

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టానని కేసులు పెట్టారు – పాలేటి ప్రభాకర్ రెడ్డి, కొడవలూరు

TDP కార్యక్రమాల్లో నేను చురుగ్గా ఉంటా. ప్రభుత్వ తప్పులను సోషల్ మీడియాలో ప్రశ్నించా. దీంతో నాపై నాలుగేళ్లలో 5 కేసులు పెట్టారు. నేను ఎవర్నీ కించపరిచేలా కూడా పెట్టలేదు.

కోవూరు నేలపై పాదయాత్ర చేయడం అదృష్టం

కోవూరు కేక పుట్టించింది. స్వాతంత్య్ర సమరయోధుడు, ముఖ్యమంత్రిగా పనిచేసిన బెజవాడ గోపాల్ రెడ్డి గారు జన్మించిన గడ్డ కోవూరు. స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన తరువాత మొదట పార్టీలో చేరిన వ్యక్తి బుచ్చిరెడ్డిపాళెంకి చెందిన బెజవాడ పాపిరెడ్డి గారు. స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారు 1983లో మధ్యాహ్న భోజన పధకం ప్రవేశపెట్టినప్పుడు బుచ్చిరెడ్డిపాళెం గ్రామ సర్పంచ్ గా ఉన్న దొడ్ల అన్నారెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించి ప్రశంసలు అందుకున్నారు. కామాక్షితాయి ఆలయం, ఉదయ కాళేశ్వర స్వామి దేవాలయం ఉన్న పుణ్య భూమి కోవూరు. ఎంతో ఘన చరిత్ర ఉన్న కోవూరు నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

మహిళల కన్నీళ్లు తుడిచేందుకే మహాశక్తి

జగన్ మహిళల్ని నమ్మించి ముంచేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఎం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. 

నిరుద్యోగులకు యువగళం నిధి ఇస్తాం!

వైసీపీ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు.  జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

రైతుల మెడకు ఉరితాడు బిగించాలని చూస్తున్నాడు!

జగన్  పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. మీటర్లు రైతులకు ఉరితాళ్లు. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. జీతం ఒకటో తారీఖున వచ్చే దిక్కు లేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది.

ఆనందరావు కుటుంబాన్ని ఆదుకుంటాం!

తాడిపత్రి లో వైసిపి నేతల ఒత్తిడి తట్టుకోలేక దళిత సిఐ ఆనందరావు గారు ఆత్మహత్య చేసుకున్నారు. టిడిపి నేత జేసి ప్రభాకర్ రెడ్డి, కార్యకర్తల పై కేసులు పెట్టాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిడి చెయ్యడంతోనే ఆనందరావు గారు ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయారు. తాడిపత్రి వచ్చినప్పటి నుండి నాన్న కి టెన్షన్స్ పెరిగిపోయాయి ట్రాన్స్ ఫర్ కోసం కూడా ప్రయత్నం చేసారని పెద్ద కుమార్తె భవ్యశ్రీ చెప్పింది. ఒకప్పుడు ఒక పోలీసుకి కష్టం వస్తే రాష్ట్రం మొత్తం ఉన్న పోలీసులు స్పందించేవారు, పోరాడేవారు. ఇప్పుడు ఏకంగా పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఎవరి గొంతు లేవడం లేదు. జగన్ అన్యాయం చేసినా మీ లోకేష్ న్యాయం చేస్తాడు.  ఆనందరావు కుటుంబాన్ని టిడిపి ఆదుకుంటుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ చేసి ఆనందరావు మృతికి కారణం అయిన వారిపై చర్యలు తీసుకుంటాం.

మైనారిటీలకు తప్పని చిత్రహింసలు

 అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హాజిరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పధకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం.  రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలి. 2019 లో ఎంతో కష్టపడి కోట్లు ఖర్చు చేసి జగన్ ని గెలిపించారు. మీకు కనీస గౌరవం దక్కిందా?

కోవూరును మాఫియాలకు అడ్డాగా మార్చిన ప్రసన్న!

కోవూరు ని అభివృద్ధి చేస్తారని భారీ మెజారిటీతో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ప్రజలు గెలిపించారు. మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? కానీ ఆయన కోవూరుని శాండ్, ల్యాండ్, వైన్, మైన్, బెట్టింగ్, రియల్ ఎస్టేట్ మాఫియా కి కేర్ ఆఫ్ అడ్రెస్ గా మార్చేసాడు. ఆయన అవినీతి గురించి తెలుసుకున్న తరువాత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి నల్లతాచు అని పేరు పెట్టా. డెయిలీ కలెక్షన్,వీక్లీ కలెక్షన్,మంత్లీ కలెక్షన్స్ లో నల్లతాచు ఫేమస్. ఇది నేను అనడం లేదు కోవూరు వైసిపి నాయకులు, కార్యకర్తలే అంటున్నారు. వరి రైతుల్ని వదలలేదు నల్లతాచు. తక్కువ రేటుకి రైతుల నుండి ధాన్యం కొని ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి అమ్మేసాడు.  నాలుగేళ్లలో వరి రైతులు నష్టపోయి క్రాప్ హాలిడే ప్రకటిస్తే. అదే వరి అమ్ముకున్న నల్లతాచు రూ.50 కోట్లు కొట్టేసి హాలిడే కి వెళ్లి ఎంజాయి చేసాడు.  ఒక్క నెల్లూరు జిల్లాలోనే వరి రైతులు రూ.3400 కోట్లు నష్టపోయారు. కొలతల్లో తేడాలు, వైసిపి నేతల అక్రమాలు వరి రైతుల పాలిట శాపంగా మారింది.

ఇసుక దోపిడీతో విధ్వంసం!

నల్లతాచు ఇసుక దోపిడీ లో దిట్ట. బుచ్చి, కోవూరు, విడవలూరు, ఇందుకూరుపేట లో అక్రమంగా ఇసుక తవ్వేసి విధ్వంసం చేసారు.  అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా కోవూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇళ్లలోకి వరద నీరు వచ్చి ప్రజలు నరకం చూసారు. చేపలు,రోయ్యలు కొట్టుకుపోయి రైతులు నష్టపోయారు. బ్యాంకులను కూడా మోసం చేసాడు నల్లతాచు. దొంగ కాగితాలతో 8 కోట్లు లేపేసాడు. గోవా, పాండిచ్చేరి నుండి లిక్కర్ తెచ్చి అమ్మేస్తున్నాడు నల్లతాచు, అనుచరులు. ఈ వ్యాపారానికి హెడ్ అనిల్ బాబు. కనిగిరి రిజర్వాయర్ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో రూ.100 కోట్లు విలువైన గ్రావెల్ తవ్వేసాడు. కనిగిరి రిజర్వాయర్ నే ప్రమాదంలో పడేసాడు నల్లతాచు.

సొసైటీ నిధులు కూడా దిగమింగారు!

ఆఖరికి టీచర్ల ట్రాన్స్ ఫర్లలో కూడా డబ్బులు కొట్టేసాడు నల్లతాచు. రూ.84 కోట్లతో చేపట్టిన మలిదేవి కాలువ పనుల్లో 25 పర్శంట్, రూ.96 కోట్ల ఎఫ్డిఆర్ పనుల్లో 60 పర్శంట్ తీసుకున్నాడు. పనులు చెయ్యకుండానే, కాలువలు తవ్వకుండానే బిల్లులు డ్రా చేసారు. ఈ పనుల్లో నల్లతాచు వాటా రూ.58 కోట్లు. వవ్వేరు కోపరేటివ్ బ్యాంకు లో నల్లతాచు, అనుచరులు కలిసి రూ.8 కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసారు.  రియల్ ఎస్టేట్ మాఫియా కి కోవూరు ని అడ్డాగా మార్చేసాడు నల్లతాచు. ఎన్ హెచ్ 65 ని ఆనుకొని అక్రమ లే అవుట్లు వచ్చాయి.  లే అవుట్ వెయ్యాలంటే ఎకరాకు రూ.5 లక్షలు నల్లతాచుకి సమర్పించుకోవాలి. ఒక్క రియల్ ఎస్టేట్ మాఫియాలోనే రూ.100 కోట్లు కొట్టేసాడు. 2019 లో నల్లతాచు అప్పు రూ.50 కోట్లు, నాలుగేళ్లతో సంపాదన ఎంతో తెలుసా రూ.1500 కోట్లు.  రూ.1000 కోట్ల ఆస్తులు ఉన్న షుగర్ ఫ్యాక్టరీని రూ.100 కోట్లకు కొట్టేసే కుట్ర చేస్తున్నాడు నల్లతాచు. దీనిని టిడిపి అడ్డుకుంటుంది.

టిడిపి హయాంలోనే కోవూరు అభివృద్ధి!

టిడిపి హయాంలోనే కోవూరు అభివృద్ధి చెందింది. సాగు, తాగు నీటి ప్రాజెక్టులు, పేదలకు ఇళ్లు, రోడ్లు, గ్రామాల్లో సిసి రోడ్లు వేసింది టిడిపి. మైపాడు బీచ్ ని పర్యాటక కేంద్రం గా అభివృద్ధి చేసాం. చంద్రశేఖరపురం లో గురుకుల పాఠశాల నిర్మించాం. రూ.87 కోట్లతో మలిదేవి వాగు మోడరనైజేషన్ వర్క్స్ చేసాం. రూ. 34 కోట్లతో పైడేరు పై బ్రిడ్జ్ నిర్మించాం. నీరు – చెట్టు కింద విడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు మండలాల్లోని చెరువుల్లో పూడికల్ని తీయించాం. కొత్త కల్వర్టులు, స్లూయిజ్‌లు నిర్మించాం. కరకట్టలు తెగకుండా సిమెంట్ రక్షణ గోడలు కట్టాం. కోవూరు నియోజకవర్గ పరిధిలో రూ.170 కోట్లు ఖర్చు పెట్టి కోవూరు, కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం మండలాల మధ్య రహదారులను విస్తరించాం. కానీ మీరు  ఏం చేసారు? పాలిచ్చే ఆవుని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కనిగిరి రిజర్వాయర్ లో పూడిక తీసి రిపేర్లు చేస్తాం.  పిల్ల కాలువలు తవ్వి సాగునీరు అందిస్తాం.  వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం.

కామాక్షి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం!

జొన్నవాడ శ్రీ మల్లిఖార్జున స్వామి కామాక్షి తాయి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. కాటేజీలు ఏర్పాటు చేస్తాం. చేనేత కార్మికుల కష్టం నాకు తెలుసు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత రంగాన్ని నేను దత్తత తీసుకుంటాను.  యార్న్, పట్టు, కలర్ సబ్సిడీలు ఇస్తాం. మగ్గం ఉన్న చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం. నేతన్నలకు టిడ్కో ఇళ్లు కట్టిస్తాం.  వరి రైతులు గిట్టుబాటు ధర, గౌడౌన్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గౌడౌన్స్ ఏర్పాటు చేస్తాం. మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొంటాం. డబ్బులు సకాలంలో చెల్లిస్తాం. ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. విద్యుత్ సబ్సిడీ అందిస్తాం. పెట్టుబడి తగ్గిస్తాం. సబ్సిడీలో యంత్రాలు అందజేస్తాం. ఆరు సార్లు గెలిస్తే గొప్పోడు అయిపోడు. నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి గారి రక్తం అంటూ బిల్డప్ ఇస్తాడు. ఆయన గొప్ప వ్యక్తి, స్వచ్ఛమైన రాజకీయాలు చేసిన వ్యక్తి. నల్లతాచు ఆయనలా నువ్వు ఒక్క రోజు అయినా బ్రతకగలవా?

కేసులకు భయపడేది లేదు!

కోవూరు లో వైసిపి నేతలు చేసిన అవినీతి పై ప్రత్యేక సిట్ వేస్తాం. నెల్లూరు జిల్లా ప్రజలు ఆలోచించాలి. 2014 లో మూడు సీట్లు ఇస్తే టిడిపి చేసిన అభివృద్ధి, 2019 లో 10 కి 10 సీట్లు ఇస్తే వైసిపి చేసిన అభివృద్ధి ని బేరీజు వేసుకోండి. నెల్లూరు జిల్లా మళ్లీ అభివృద్ధి చెందాలి అంటే 2019 లో వైసిపి కి ఇచ్చిన 10 సీట్లు మాకు ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం. టిడిపి జెండా మోసిన కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా.టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని అక్రమ కేసులు పెట్టి వేధించిన ఏ ఒక్కరిని వదిలి పెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తా. చట్టాన్ని అతిక్రమించి కేసులు పెట్టిన అధికారుల పై జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేసి చర్యలు తీసుకుంటాం. భయం నా బయోడేటా లో లేదు .కోవూరు లో ఉన్నా కంబోడియా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా.

యువనేతను కలిసిన వవ్వేరు సొసైటీ రైతులు

కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మెయిన్ రోడ్డులో వవ్వేరు కో ఆపరేటివ్ సొసైటీకి చెందిన రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అధ్యక్షుడు సూరా శ్రీనివాసరెడ్డి సొసైటీని జేబు సంస్థగా మార్చుకుని దోపిడీకి శ్రీకారం చుట్టారు. 2019లో సొసైటీ బ్యాంకులో సుమారు రూ.4కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. దీనిపై రైతులు, ప్రతిపక్షాలు పోరాటం చేస్తే 51ఎ ఎంక్వయిరీ వేశారు. చైర్మన్ పదవీకాలం ముగిశాక ఎన్నికలు జరపకుండా సూరా శ్రీనివాసరెడ్డి నేతత్వాన త్రీమెన్ కమిటీని నియమించారు. 2021లో బంగారం లేకుండా లోన్లు ఇవ్వడం, ఇతరత్రా బినామీ పేర్లతో రూ.2.60 కోట్లు దోచుకున్నారు. దీనిపై మళ్లీ పోరాటం చేయడం 52 ఎంక్వయిరీ వేశారు. అవకతవకలు బయటపడుతుండటంతో విచారణాధికారి నివేదిక ఇవ్వకముందే సూరా శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. ఈ కుంభకోణాల్లో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పాత్ర ఉంది. గతంలో చైర్మన్ చేసిన అక్రమాల మూలంగా రైతులు అప్పులు పుట్టక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక వవ్వేరు సొసైటీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి, దోచుకున్న సొమ్మును రికవరీచేయించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో అన్నింటి మాదిరిగానే కోఆపరేటివ్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు. రైతులకోసం ప్రవేశపెట్టిన కోఆపరేటివ్ సొసైటీలను అధికారపార్టీ నాయకులు అక్రమాలకు అడ్డాగా మార్చుకోవడం దారుణం సొసైటీల్లో దోచుకున్న సొమ్మును రికవరీ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. సొసైటీలను బలోపేతం చేసి రైతులకు ఉపయోగకరంగా తీర్చిదిద్దుతాం.

యువనేత లోకేష్ ను కలిసిన బుచ్చిరెడ్డిపాలెం ప్రజలు

కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద స్థానిక ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కనిగిరి రిజర్వాయర్ ఉత్తర భాగంలో సర్వే నెం.921లో కంకర తవ్వకం వల్ల జలాశయం బలహీన పడింది. 20వేల ఎకరాల రైతులు ఆధారపడిన రిజర్వాయర్ ప్రస్తుత ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఎమ్మెల్యే అండతో కొందరు వైసిపి నేతలు రిజర్వాయర్ ను అక్రమ తవ్వకాలకు అడ్డాగా మార్చుకున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక రిజర్వాయర్ పరిరక్షణకు చర్యలు తీసుకోండి.

నారా లోకేష్ మాట్లాడుతూ

సొంత జిల్లాలో ఇసుక తవ్వకాలకోసం అన్నమయ్య డ్యామ్ ను ముంచేసి, 61మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. అక్రమ గ్రావెల్ తవ్వకాల కోసం కనిగిరి రిజర్వాయర్ కింద ఉన్న రైతులను ప్రమాదంలోకి నెట్టడం దారుణం. టిడిపి అధికారంలోకి రాగానే కనిగిరి రిజర్వాయర్ లో గ్రావెల్ తవ్వకాలను నిలిపివేస్తాం. రిజర్వాయర్ పరిరక్షణకు చర్యలు తీసుకుని, రైతులకు సాగునీరు అందిస్తాం.

లోకేష్ ను కలిసిన ఇస్కపాలెం పంచాయితీ సభ్యులు, ప్రజలు

కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇస్కపాలెం గ్రామ పంచాయితీ సభ్యులు, ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా పంచాయతీకి ప్రభుత్వం నుండి ఎటువంటి నిధులు రావడం లేదు. ఫైనాన్స్ కమిషన్ విడుదల చేసిన నిధులను పంచాయితీకి చేరకుండానే ప్రభుత్వం దారిమళ్లించింది. మేం సొంత డబ్బులు పెట్టి చేసినా పనులకు బిల్లుల కూడా పెట్టడం లేదు. పంచాయతీలో సొంత డబ్బుతో పనులుచేసి అప్పుల పాలైపోతున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయాలి. మా గ్రామంలోగల 52సెంట్ల స్థలాన్ని ఎంపీయూపీ స్కూలుకు ఆటస్థలం కేటాయించారు. ఆ స్థలం తనదంటూ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై షికారు కోటేశ్వరరావు అనే వ్యక్తి కోర్టుకు వెళ్లగా, ఆధారాలన్నీ పరిశీలించి ఆట స్థలాన్ని పాఠశాలకే కేటాయిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. అయినప్పటికీ కోటేశ్వరరావు ఆ స్థలాన్ని ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మాణం చేపట్టాడు. దీన్ని నిలదీసిన వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాడు. పాఠశాల ఆటస్థలాన్ని కాపాడి విద్యార్థులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీ అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. పంచాయితీల అభివృద్ధికి ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రూ.8660 కోట్ల నిధులను దారిమళ్లించారు. వైసీపీ  ప్రభుత్వ నిర్వాకం కారణంగా వైసిపికి చెందిన సర్పంచ్ లు కూడా అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల దర్శి నియోజకవర్గం ఒక మహిళా సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలను బలోపేతం చేస్తాం. కేంద్రం ఇచ్చే నిధులతోపాటు రాష్ట్రప్రభుత్వం తరపున కూడా నిధులిచ్చి పంచాయితీల్లో రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. ఇస్కపాలెంలో ఆక్రమణకు గురైన స్కూలు ఆటస్థలాన్ని స్వాధీనం చేసుకొని, విద్యార్థులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతాం.

నారా లోకేష్ ను కలిసిన నాగమాంబపురం గ్రామస్తులు

కోవూరు నియోజకవర్గం నాగామాంబపురం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీకి చెందిన చెత్త, వ్యర్థపదార్థాలను మా గ్రామ సరిహద్దుల్లోకి తరలిస్తున్నారు. డంపింగ్ యార్డ్ కు ఎలాంటి నిర్వహణ లేకపోవడంతో చెత్త రోడ్డుమీదకు వచ్చి, ప్రయాణీకులు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలోని డంపింగ్ యార్డు నుండి వచ్చే దుర్వాసనతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక డంపింగ్ యార్డు నిర్వహణ చేపట్టాలి. యార్డు చుట్టూ ప్రహరీ నిర్మించి ప్రయాణీకులకు, స్థానికులకు ఇబ్బంది లేకుండా చూడాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

చెత్తపై పన్నులు వేస్తూ గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని పట్టించుకోవడం లేదు. TDP పాలనలో చెత్తనుండి సంపద తయారీ కేంద్రాలు పెట్టి పంచాయితీలకు ఆర్థికవనరుగా తీర్చిదిద్దాం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డంపింగ్ యార్డుకు ప్రహరీగోడ నిర్మిస్తాం. చెత్త డంపింగ్ యార్డువల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన యల్లాయపాలెం రైతులు

కోవూరు నియోజకవర్గం యల్లాయపాలెం రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వంలో రైతులకు ఉచితంగా ఇచ్చిన జింక్, జిప్సం, బోరాన్ వంటి పోషకాలు, ఎలుకల మందును వైసీపీ ప్రభుత్వం నిలిపేసింది. మూడేళ్లుగా వరి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోయారు. రైతులకు సబ్సిడీపై ఇచ్చే యంత్రాలు, పనిముట్లు కూడా వైసీపీ ప్రభుత్వం నిలిపేసింది. యంత్రాలతో కోసిన వరి పంట ఆరబెట్టుకునేందుకు డ్రైయర్లు, ప్లాట్ ఫారం లు ఏర్పాటు చేయాలి. కూలి ఖర్చులు ఎక్కువై రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యవసాయ కూలీలను నరేగాకు అనుసంధానం చేసి రైతులను ఆదుకోవాలి. పంటపొలాలకు డీఏపీ, పొటాష్ తదితర పిండి కట్టలపై 50శాతం సబ్సిడీ అందించి రైతులను ఆదుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీ పాలనలో నాలుగేళ్లుగా రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయారు. దేశంలోనే ఎపి రైతులు అప్పుల్లో మొదటిస్థానంలో ఉన్నారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలో ఏపీని మూడవ స్థానం, కౌలురైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానానికి తీసుకెళ్లాడు. వ్యవసాయాన్ని ఉపాధిహామీ పథకంతో అనుసంధానం చేసి రైతులకు ఉపశమనం కల్పిస్తాం. సబ్సిడీపై రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేలా చర్యలు తీసుకుంటాం. కోవూరు నియోజకవర్గంలో ధాన్యం ఆరబెట్టుకోవడానికి ప్లాట్ ఫారాలు నిర్మిస్తాం.

లోకేష్ ను కలిసిన యల్లాయపాలెం గిరిజన కాలనీ ప్రజలు

కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం యల్లాయపాలెం ఎన్టీఆర్ గిరిజన కాలనీ వాసులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా కాలనీలో 300కుటుంబాలు నివాసముంటున్నాయి. మా కాలనీకి 20 అడుగుల దూరంలో సర్వే నంబర్ 1034, 1035లలో అసైన్డ్ భూమి, కొంత పట్టా భూమి ఉంది. ఈ భూముల్లో వైసీపీ నాయకులు రెడ్ గ్రావెల్ 20 అడుగుల లోతు వరకు అక్రమంగా తవ్వారు. వర్షాకాలం ఈ గుంతల్లో నీళ్లు నిలిస్తే పిల్లల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. గతంలో పశువులు, కోళ్లు ఆ గోతుల్లో పడి చనిపోయాయి. అక్రమ తవ్వకాలను అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేదు. మీరు అధికారంలోకి వచ్చాక అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకోవాలి.

Also, Read This Blog: Nara Lokesh Yuvagalam: Empowering Youth for Digital India

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *