ఉదయగిరిలో హోరెత్తిన యువగళం పాదయాత్ర అడుగడుగునా యువనేతకు మహిళల నీరాజనాలు
కొండాపురం బహిరంగసభకు పోటెత్తిన జనం
13,14 తేదీల్లో యువగళానికి విరామం
ఉదయగిరి: యువనేత Nara lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం హోరెత్తింది. కార్యకర్తలు, అభిమానుల కోలాహలం నడుమ 154వరోజు పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. చోడవరం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కాగా, అడుగడుగునా మహిళలు, యువకులు యువనేతకు అపూర్వస్వాగతం పలికారు. కొమ్మి గ్రామంలో మహిళలు పసుపుచీరలను ధరించి యువనేతపై పూలు చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పాదయాత్ర దారిలో కొమ్మిలో యువనేత లోకేష్ ఎలిమెంటరీ స్కూలును సందర్శించారు. స్కూలు పిల్లలను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించిన లోకేష్, స్కూలులో సౌకర్యాలపై ఆరా తీశారు. మంచిగా చదువుకొని తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలని చిన్నారులకు చెప్పి, అక్కడ నుంచి బయలుదేరారు. భోజన విరామానంతరం సాయంత్రం కొండాపురం జరిగిన బహిరంగసభకు జనం పోటెత్తారు. నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. 154వ రోజున యువనేత లోకేష్ 19.5 కి.మీ.ల దూరం పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2039.4 కి.మీ. మేర పూర్తయింది. కోర్టు కేసుల నిమిత్తం మంగళగిరి వెళ్లాల్సి ఉన్నందున 13,14 తేదీల్లో యువగళానికి విరామం ప్రకటించారు. 155వరోజు పాదయాత్ర ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం నుంచి యథావిధిగా ప్రారంభమవుతుంది.
వైసీపీ ప్రాపగాండపై లోకేష్ న్యాయపోరాటం
– గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, పోతుల సునీతలపై క్రిమినల్ కేసులు దాఖలు
– మంగళగిరి అడిషినల్ మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వనున్న లోకేష్
– కోర్టుకి హాజరవుతున్న కారణంగా 13,14 తేదీలలో యువగళం పాదయాత్రకి బ్రేక్
తనపైనా, తన కుటుంబంపైనా అసత్య ఆరోపణలని ప్రచారం చేస్తున్న వైసీపీ నేతల ప్రాపగాండపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యాయపోరాటం మొదలుపెట్టారు. గతంలో తప్పుడు వార్తలు రాస్తూ, తనని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న సాక్షిపై పరువునష్టం దావా వేశారు. అనంతరం వైసీపీ నేతలు, సోషల్ మీడియా బాధ్యులు కూడా తనని టార్గెట్ చేస్తూ చేసిన అసత్య ప్రచారంపై క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ చీఫ్ డిజిటల్ డైరక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపై TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు దాఖలు చేశారు.
లోకేష్ పిన్ని కంఠమనేని ఉమామహేశ్వరి అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యపై వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి లోకేష్‌పై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారు. ఉమామహేశ్వరి మరణానికి జూబ్లీ రోడ్డు నెం.45 సర్వే నెం. 273, 274, 275, 276 లలోని 5.73 ఎకరాల భూమి వివాదమే కారణం అని తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా విషప్రచారం చేశారు. ఆ వివాదం, ఆ సర్వే నంబర్లూ ఫేక్ అని తేలింది. అయినా గుర్రంపాటి దేవేందర్ రెడ్డి మరో కట్టుకథ అల్లి ప్రచారంలో పెట్టారు. హెరిటేజ్ లో రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఉమామహేశ్వరిని మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని తప్పుడు రాతలు రాశారు. తప్పుడు రాతలపై గుర్రంపాటి దేవేందర్ రెడ్డికి తన లాయర్ దొద్దాల కోటేశ్వరరావు ద్వారా నోటీసులు పంపారు. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ ఛీఫ్ డిజిటల్ డైరక్టర్ గా పనిచేస్తుండడంతో ఆయా కార్యాలయాలకు నోటీసులు పంపితే తీసుకోలేదు. చివరికి గుర్రంపాటికి వాట్సప్ ద్వారా నోటీసులు పంపారు.
సెప్టెంబరు 2022లో తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. నారా చంద్రబాబుని సారా చంద్రబాబు నాయుడు అని పిలవాలని కోరారు. హెరిటేజ్ సంస్ధ ద్వారా వ్యాపారం చేస్తున్నామని చెబుతూ సారా పరిశ్రమ నడుపుతున్నారని ఆమె ఆరోపించారు. బీ-3 అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి, బాబు అని, వీరు రాష్ట్రంలో సారా ఏరులై పారించి కోట్లు గడించారని తప్పుడు ఆరోపణలు చేశారు. భువనేశ్వరి, బ్రాహ్మణి కొట్టుకున్నారని, లోకేష్‌కి మగువ, మందు లేనిదే నిద్ర పట్టదంటూ.. చంద్రబాబు, లోకేష్ లకు మందు తాగనిదే మాట పెగలదని సునీత వ్యాఖ్యానించారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం తనపైనా, తన కుటుంబంపైనా పోతుల సునీత చేసిన దారుణమైన తప్పుడు వ్యాఖ్యలపై నారా లోకేష్ మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు.
గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, పోతుల సునీతలపై దాఖలు చేసిన కేసుల్లో ఐపిసి సెక్షన్ 499, 500 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ కేసులో పిటిషనర్ అయిన నారా లోకేష్ వాంగ్మూలాన్ని మంగళగిరి అడిషినల్ మేజిస్ట్రేట్ కోర్టులో 14వ తేదీ శుక్రవారం నమోదు చేయనున్నారు. యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ 12న పాదయాత్ర ముగించుకొని బయలుదేరి అమరావతి రానున్నారు. కోర్టు పనిమీద వస్తుండడంతో యువగళం పాదయాత్రకి 13,14వ తేదీలలో విరామం ప్రకటించారు.
*రాయలసీమలో ఇంకా తగ్గని యువగళం ప్రకంపనలు!*
*2వేలమంది అనుచరులతో లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిక*
నంద్యాలకు చెందిన వైసిపి నేత, అడ్వకేట్ తాతిరెడ్డి తులసి రెడ్డి తన 2వేలమంది అనుచరులతో వచ్చి యువనేత నారా లోకేష్ సమక్షాన టిడిపిలో చేరి భారీ షాకిచ్చారు. యువగళం పాదయాత్ర కొనసాగుతున్న ఉదయగిరి నియోజకవర్గం పార్లపల్లి వద్ద తులసి రెడ్డి తమ అనుచరులతో వచ్చి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ యువనేత లోకేష్ పసుపుకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సీనియర్లు, కొత్తగా చేరిన వారు కలసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో టిడిపి విజయానికి కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్, కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బి.టి.నాయుడు, మాజీమంత్రులు భూమా అఖిలప్రియ, ఎన్ఎండి ఫరూక్, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన ప్రముఖుల్లో కొత్తపల్లి సర్పంచ్ చాకలి నారాయణ, అయ్యలూరు సర్పంచ్ ఓబులేసు, దళిత బహుజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాలస్వామి, మాజీ వక్ఫ్ బోర్డు మెంబర్ పఠాన్ జాకీర్, మాజీ నీటి సంఘం అధ్యక్షుడు మండ్ల గురప్ప, బిసి సంక్షేమసంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు వై.నాగశేషుడు, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, బిసి, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి రామచంద్రుడు, ఎంఆర్ పిఎస్ నంద్యాలజిల్లా అధ్యక్షుడు ఎన్.లక్ష్మణ్, ఎ.ఈశ్వర్, నంద్యాల పట్టణం, పెదకొట్టాల, కొత్తపల్లి, చాబోలు, అయ్యలూరు గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపిటిసిలు ఉన్నారు.
అడుగుపెట్టనీయమన్నారు, 2వేల కి.మీ.లు నడిచా!
మీది పోలీసు బలం… నాది ప్రజాబలం
హామీలు నెరవేర్చమంటే లాఠీలతో కొట్టిస్తారా?
అంగన్ వాడీల పోరాటానికి టిడిపి సంఘీభావం
దళిత సిఐ ఆత్మహత్య చేసుకుంటే పోలీసు సంఘాలు ఎక్కడ?
ఉదయగిరిలో 3వేల ఎకరాలు కొట్టేయడానికి సజ్జల స్కెచ్
కొండాపురం బహిరంగసభలో యువనేత నారా లోకేష్
ఉదయగిరి: సింహపురిలో నేను సింహంలా అడుగుపెట్టా. అడుగుపెట్టనివ్వం అన్న వాళ్లు అడ్రస్ లేరు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశా, నన్ను నెల్లూరు ఆదరించింది… ప్రజల కష్టాలు నేరుగా చూసా, మీ కన్నీళ్లు తుడుస్తానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఉదయగిరి నియోజకవర్గ కొండాపురంలో నిర్వహించిన బహిరంగసభలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… ఒక్క అడుగు కూడా వెయ్యనివ్వం అన్నారు…2 వేల కిలోమీటర్లు నడిచాను, ప్రజల్ని కలవకుండా అడ్డుకుంటాం అన్నారు…154 రోజులుగా ప్రజల్లోనే ఉన్నా. మాట్లాడనివ్వం అన్నారు..యువగళం దెబ్బకి ప్యాలస్ పిల్లి షేక్ అయ్యింది. అంగన్వాడీ కార్యకర్తలకు ఎన్నికల ముందు జగన్ అనేక హామీలు ఇచ్చాడు. నాలుగేళ్లు అయ్యింది ఒక్క హామీ నెరవేర్చలేదు అంగన్వాడీ టీచర్ల రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి టిడిపి మద్దతు ఇస్తుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ టీచర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తాం.
ఉదయగిరిలో పాదయాత్ర చేయడం అదృష్టం
ఉదయగిరి యూత్ ఉత్సాహం అదుర్స్. శ్రీ కృష్ణ దేవరాయలు పాలించిన గడ్డ ఉదయగిరి. ఉదయగిరి కోటకి ఎంత పౌరుషం ఉందో ఇక్కడి ప్రజలకు అంత పౌరుషం ఉంది. శ్రీ ఘటిక సిద్దేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్య భూమి ఉదయగిరి. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వెంకయ్యనాయుడు గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది ఉదయగిరి నుండే. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఉదయగిరి నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.
100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసారు
అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన వైసీపీ .సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసారు.
కన్నీళ్లు తుడిచేందుకే మహాశక్తి!
2వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం.
యువత భవితను దెబ్బతీశారు
జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.
మోటార్లకు మీటర్లు పెడితే పగులగొట్టండి!
వైసీపీ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ ఉండీ.
దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం!
డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. తాడిపత్రి లో వైసిపి నేతల ఒత్తిడి తట్టుకోలేక దళిత సిఐ ఆనందరావు గారు ఆత్మహత్య చేసుకున్నారు. టిడిపి నేత జేసి ప్రభాకర్ రెడ్డి, కార్యకర్తల పై కేసులు పెట్టాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిడి చెయ్యడంతోనే ఆనందరావు గారు ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయారు. తాడిపత్రి వచ్చినప్పటి నుండి నాన్న కి టెన్షన్స్ పెరిగి ట్రాన్స్ ఫర్ కోసం ప్రయత్నం చేసారని పెద్ద కుమార్తె భవ్యశ్రీ చెప్పింది. ఒక పోలీసు ఆత్మహత్య చేసుకుంటే మిగిలిన వాళ్లు, సంఘాలు స్పందించలేదు.జగన్ ఆ కుటుంబానికి అన్యాయం చేసాడు. ఆనందరావు కుటుంబాన్ని టిడిపి ఆదుకుంటుంది. ఆనందరావు ఆత్మహత్యకు కారణం అయిన వారిని టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శిక్షిస్తాం.
నెల్లూరు జిల్లాను ఎంతో అభివృద్ధి చేశాం
స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారు సోమశిల, కండలేరు ప్రాజక్టుల ద్వారా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. 2014 లో మాకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టిడిపి కి మూడు సీట్లే ఇచ్చారు. అయినా నెల్లూరు జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసాం. సాగు, తాగునీటి ప్రాజెక్టులు, టిడ్కో ఇళ్లు నిర్మించాం. ఒక్క నెల్లూరు సిటీ ని అభివృద్ధి చెయ్యడానికే 4,500 కోట్లు ఖర్చు చేసాం. ఇది నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్. నెల్లూరు సిటీ లో వెయ్యి కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తే. నాలుగేళ్లలో 100 కోట్లు ఖర్చు చేసి పూర్తి చెయ్యలేని వేస్ట్ ఫెల్లోస్ వీళ్లు. ఒక్క నెల్లూరు లోనే 43 వేల టిడ్కో ఇళ్లుకట్టాం.
1.30లక్షల ఎకరాలకు సాగునీరిచ్చాం
నెల్లూరు బ్యారేజ్ 90 శాతం, సంగం బ్యారేజ్ 70 శాతం, ఎస్ఎస్ కెనాల్ పనులు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క రోజు సరిపోదు. కోపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న 70 వేల ఎకరాల్లో రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చాం. తెలుగుగంగ ప్రాజెక్టు కింద 2.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే అటవీ అనుమతులు లేక కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేది. టిడిపి హయాంలో కేంద్ర ప్రభుత్వం తో పోరాడి అటవీ అనుమతులు తీసుకొని అదనంగా జిల్లాలో మరో 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం.
32వేలమంది యువతకు ఉద్యోగాలిచ్చాం
టిడిపి హయాంలో నెల్లూరు జిల్లాకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. వాటి ద్వారా 18 వేల కోట్ల పెట్టుబడి, 32 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. గమేషా విండ్ టర్బైన్స్, ధర్మల్ పవర్ టెక్, సీపీ ఆక్వాకల్చర్, ఫెడోరా సీ ఫుడ్స్, అంజని టైల్స్, ఇండస్ కాఫీ ప్రై.లి, సౌత్ ఇండియా కృష్ణా ఆయిల్ అండ్ ఫాట్స్ ప్రై.లి, జెల్ కాప్స్ ఇండస్ట్రీస్, యూపీఐ పాలిమర్స్, పిన్నే ఫీడ్స్, బాస్ఫ్ ఇండియా లి., దొడ్ల డెయిరీ, పెన్వేర్ ప్రొడక్ట్స్ ప్రై.లి, అమరావతి టెక్స్ టైల్స్,అరబిందో ఫార్మా, ఓరెన్ హైడ్రోకార్బోన్స్ లాంటి ఎన్నో కంపెనీలు వచ్చాయి. నెల్లూరు జిల్లా కి చంద్రబాబు గారు చేసింది జగన్ చెయ్యాలంటే నాలుగు జన్మలెత్తాలి. 2019 లో ప్రజలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 కి 10 సీట్లు వైసిపి కి ఇచ్చారు. నెల్లూరు జిల్లాని వైసిపి నేతలు నాశనం చేసారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేసారు. 2024 లో 10 కి 10 సీట్లు మాకు ఇవ్వండి… అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం.
ఆక్వారంగాన్ని ఆదుకుంటాం!
ఉమ్మడి నెల్లూరు జిల్లా వరి రైతులు నాలుగేళ్లలో రూ.3400 కోట్లు నష్టపోయారు. చంద్రబాబు గారి హయాంలో రూ.20 వేల పెట్టుబడి అయితే జగన్ పాలనలో పెట్టుబడి రూ.40 వేలకు పెరిగింది. జగన్ పాలనలో ధాన్యం కొనడు. కొన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వరి రైతుల పెట్టుబడి తగ్గిస్తాం. గిట్టుబాటు ధర కల్పిస్తాం. చంద్రబాబు గారి హయాంలో ఏపీ ఆక్వా రంగంలో నంబర్ 1. జగన్ పాలనలో ఆక్వా రంగం తీవ్ర సంక్షభంలో ఉంది. కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేసారు, ఫీడ్ ధర పెరిగింది, పరికరాల ధర పెరిగింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్వా రైతులను ఆదుకుంటాం. తక్కువ ధరకే విద్యుత్ అందిస్తాం, ఆక్వా రంగాన్ని దెబ్బతీస్తూ వైసీపీ తెచ్చిన సీడ్, ఫీడ్ యాక్ట్ లను రద్దు చేస్తాం. ఫీడ్, పరికరాలు తక్కువ ధరకే అందిస్తాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాకి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.
భూఅక్రమాలపై సిట్ వేస్తాం!
ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని మీరు భారీ మెజారిటీ తో వైసిపిని గెలిపించారు. కానీ జరిగింది ఏంటి?. నియోజకవర్గం అభివృద్ధి గురించి ప్రశ్నించినందుకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని పార్టీ నుండి సస్పెండ్ చేసారు. ప్యాలస్ బ్రోకర్ సజ్జల కన్ను ఉదయగిరి నియోజకవర్గం మీద పడింది. అందుకే కుట్ర చేసి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని బయటకి పంపాడు. ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న దాదాపు 3 వేల ఎకరాల ప్రభుత్వ భూములు కాజేసేందుకు భారీ స్కెచ్ వేసాడు. బినామీల పేరు మీద సేకరిస్తున్నాడు. ఏకంగా దీని కోసం ఒక ఆఫీస్ కూడా తెరిచారంట. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉదయగిరి నియోజకవర్గంలో జరిగిన భూ అక్రమాల పై సిట్ వేస్తాం. ప్యాలస్ బ్రోకర్ సజ్జల, అతని బినామీలు కొట్టేసిన భూములు వెనక్కి తీసుకొని పేదలకు పంచేస్తాం.
డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుచేస్తాం
ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది టిడిపి. సాగు, తాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, పేదలకు ఇళ్లు, ఆసుపత్రులు, అంగన్వాడి భవనాలు, పంచాయతీ భవనాలు నిర్మాణం చేసింది టిడిపి. నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రజలకు సురక్షిత తాగునీరు అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ పేషేంట్స్ కోసం మెరుగైన ఉచిత డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.
ఉదయగిరిని మోడల్ టౌన్ గా అభివృద్ధిచేస్తాం
ఉదయగిరి టౌన్ లో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ బాలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉదయగిరిని మోడల్ టౌన్ గా అభివృద్ధి చేస్తాం. సాగు, తాగు నీరు అందించేందుకు వెలుగొండ ప్రాజెక్టు, సోమశిల నార్త్ కెనాల్, పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం పూర్తిచేస్తాం. ఉదయగిరిలో షాదీ మంజిల్ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తాం. ఉదయగిరి కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. వెంగమాంబ ఆలయం, సిద్దేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి చేస్తాం. వింజమూరు దగ్గర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గంలో బత్తాయి, పసుపు రైతులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. మీ పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం. ఉదయగిరిలో టిడిపి జెండా ఎగరేయండి. టిడిపి నాయకులు, కార్యకర్తల భవిష్యత్తు నా బాధ్యత.టిడిపి నాయకులు, కార్యకర్తల జోలికి వచ్చిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తా.
లోకేష్ ను కలిసిన రామానుజపురం గ్రామస్తులు
ఉదయగిరి నియోజకవర్గం రామానుజపురం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.రామానుజపురం గ్రామచెరువుకు సోమశిల నుంచి నీటి సౌకర్యం కల్పించాలి.కొమ్మి కావలి రోడ్డునుండి రామానుజపురం మీదుగా తిమ్మసముద్రం వరకు ఆర్ అండ్ బి రోడ్డు నిర్మించాలి.రామానుజపురం నుండి పొలాల మీదుగా కేశవరానికి గ్రావెల్ రోడ్డు నిర్మించాలి.పొలాలకు వెళ్లే పుంతరోడ్లు నిర్మించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ
గత టిడిపి హయాంలో చిన్ననీటివనరుల అభివృద్ధికి అత్యధికంగా ప్రాధాన్యత నిచ్చి నీరు-ప్రగతి కింద రూ.18,265 కోట్లు ఖర్చుచేశాం.టిడిపి మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ రహదారులు, పొలాలకు వెళ్లే పుంతరోడ్లు నిర్మిస్తాం.రామానుజపురం చెరువుకు నీరందించే ఏర్పాటు చేస్తాం.
యువనేత లోకేష్ ను కొమ్మి గ్రామస్తులు
ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం కొమ్మి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.కొమ్మి గ్రామచెరువుకు గానుగపెంట నుండి కొమ్మివరకు సఫ్లై ఛానెల్ ను ఆధునీకరణ చేసి, చెరువులకు నీటిపారుదల మెరుగుపర్చండి.కొమ్మి గ్రామ ఎస్సీ కాలనీ నుండి బీమవరప్పాడు అరుంధతీవాడ వరకు గల గ్రావెల్ రోడ్డును బి.టి రోడ్డుగా మార్చాలి.కొమ్మి గ్రామ శివాలయం నుండి మాగాణి పొలాల మీదుగా ఊళ్లవాగు వరకు రహదారిని నిర్మించండి.గండికట్ల చెరువువద్ద నుండి పొలిమేర మీదుగా ముత్తంవారిపాలెం వరకు రహదారిని ఫార్మేషన్ రోడ్డుగా మార్చండి.గండికట్ల చెరువు మాగాణి పొలం మీదుగా ముత్తంవారిపాలెం వరకు ఫార్మేషన్ రోడ్డును బి.టి.రోడ్డుగా మార్చండి.
నారా లోకేష్ మాట్లాడుతూ
గత నాలుగేళ్ల చేతగానిపాలనలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ రహదార్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.టిడిపి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కి.మీ.ల సిసి రోడ్లు వేశాం.ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్లపై తట్టమట్టిపోసే దిక్కులేదు, దివాలాకోరు ప్రభుత్వాన్ని చూసి కాంట్రాక్టర్లు భయపడి పారిపోతున్నారు.మళ్లీ టిడిపి అధికారంలోకి వచ్చాక గ్రామీణ రహదార్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తాం.
నారా లోకేష్ ను కలిసిన సత్యవోలు గ్రామ రైతులు
ఉదయగిరి అసెంబ్లీ నియోకవర్గం సత్యవోలు గ్రామప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.మా గ్రామంలో పంచాయితీరాజ్ శాఖ పరిధిలోని కుమ్మరికుంట చెరువు కింద 150ఎకరాల ఆయకట్టు ఉంది.ఈ చెరువుకు వర్షాధారంగానే నీరు వస్తోంది, బాగా వర్షాలు కురిసినా చాలీచాలకుండా నీరుచేరుతోంది.మేము వరినార్లు పోసుకొని నాట్లు వేసిన నెలకే చెరువు ఎండిపోతోంది.దీనివల్ల పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టపోతున్నాము.మెట్టపైరు వేసుకోవడానికి చెరువులో నీరు లేనందున పొలాలను పెట్టుకోవాల్సి వస్తోంది.చెరువుకు 500 మీటర్ల దూరంలో సోమశిల కాల్వ ఉంది.దానినుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాకు నీరందించే ఏర్పాటుచేయాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ
జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇరిగేషన్ వ్యవస్థను నిర్లక్ష్యంచేసి అన్నదాతలకు తీవ్ర అన్యాయం చేశారు.గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ కు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి రూ.68,293 కోట్లు ఖర్చుపెట్టాం.ఈ ప్రభుత్వం వచ్చాక కమీషన్ల కక్కుర్తితో రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును సైతం గోదాట్లో కలిపేశారు.టిడిపి అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులకు పూర్తిచేసి ప్రతిఎకరాకు సాగునీరు అందిస్తాం.కుమ్మరికుంట చెరువుతోపాటు గ్రామీణ చెరువులకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటాం.
Also, Read This Blog:“Yuvagalam’s Spectacular Feat: Nara Lokesh Conquers 2000 Kilometers, Rewriting Boundaries!”
Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh