Naralokesh padaytra, Yuvagalam
Naralokesh padaytra, Yuvagalam

సూళ్లూరుపేట నియోకజకవర్గంలో హోరెత్తిన యువగళంయువనేతపై ఉప్పొంగిన అభిమానం… దారిపొడవునా నీరాజనం సమస్యలు వింటూ…నేనున్నానని భరోసా ఇస్తా ముందుకు!

సూళ్లూరుపేట: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలు, అభిమానుల కేరింతలతో హోరెత్తిపోయింది. అడుగడుగునా గజమాలలతో సత్కారం, బాణాసంచా మోతలు, పూలవర్షంతో యువనేతను ముంచెత్తారు. 136వరోజు యువగళం పాదయాత్ర వజ్జావారిపాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. తొలుత చర్చి ఫాదర్లతో సమావేశమైన లోకేష్ వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. అనంతరం సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో తనను కలిసేందుకు వచ్చిన వందలాది అభిమానులతో యువనేత ఓపిగ్గా ఫోటోలు దిగారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ కు దారిపొడవునా మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీస్తూ, హారతులు పడుతూ నీరాజనాలు పలికారు. మాచవరం గ్రామంలో రైతులు యువనేత ఎదుట తమ గోడు విన్పిస్తూ 14 గ్రామాలకు జీవనాధారమైన భూములను కొందరు వైసిపి నేతలు ఒక ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. లోకేష్ స్పందిస్తూ గ్రామస్తుల తరపున జిల్లా కలెక్టర్, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖరాస్తానని, అవసరమైతే చట్టసభల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని చెప్పారు. దళితులు, గిరిజనులు, వివిధ గ్రామాల ప్రజలు లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. మరికొద్ది నెలలు ఓపికపట్టాలని, రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి ముందుకు సాగారు. 136వరోజు యువనేత లోకేష్ 17.3 కి.మీ. పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1770.7 కి.మీ. మేర పూర్తయింది. ఆదివారం సాయంత్రం నాయుడుపేటలో నిర్వహించే బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగించనున్నారు.

*విజనరీ పాలనకు, విధ్వంసకుడి అరాచకానికి నిలువుటద్దం ఫ్యాక్స్ కాన్!*

సూళ్లూరుపేట నియోజకవర్గం వజ్జావారిపాలెం వద్ద ఫ్యాక్స్ కంపెనీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సువద్ద మహిళలతో ముచ్చటించిన యువనేత లోకేష్ సెల్ఫీ దిగుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ బస్సులో చిరునవ్వులు చిందిస్తున్నది ఫ్యాక్స్ కాన్ కంపెనీలో పనిచేస్తున్న నా చెల్లెళ్లు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో నేను ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా చొరవతీసుకుని ఫ్యాక్స్ కాన్ ను శ్రీసిటీకి రప్పించాను.  ఆ సంస్థ రూ.12,700 కోట్ల పెట్టుబడితో తమ యూనిట్ ను ఏర్పాటుచేసి, 14వేలమంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ట్విస్ట్ ఏమిటంటే ఇదే కంపెనీ జగన్ రెడ్డి గారి జె-ట్యాక్స్ బెడద తట్టుకోలేక లక్షమందికి ఉద్యోగాలు కల్పించే మరో యూనిట్ కు ఇటీవల తెలంగాణాలో భూమిపూజ చేసింది

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

ఆసుపత్రికి వెళ్లివచ్చేలోగా ఇంటిజాగా ఆక్రమించారు! -కొనతం కాంతమ్మ, తుమ్మూరు.

ఇందిరమ్మ హయాంలో మాకు 2 సెంట్ల స్థలం ఇచ్చారు. అప్పటి నుండి ఆ స్థలం మా ఆదీనంలో ఉంది. ఇంటి అవసరాలకు ఆ స్థలం వినియోగించుకుంటున్నాం. గతేడాది మా అమ్మకు ఆరోగ్యం బాగోలేక తిరుపతి ఆసుపత్రికి తీసుకెళ్లాం. పది రోజులు పాటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ఇంటికి వచ్చాం. ఆలోపే పలమాల నాగరాజు అనే వైసీపీ సానుభూతి పరుడు స్థలంలో వాళ్లదంటూ గోడ కట్టారు. వీఆర్వోకు ఫిర్యాదు చేయగా వచ్చి కొలతలు వేశారు. స్థలం మాదేనని కూడా చెప్పారు. అయినా గోడలు తొలగించలేదు.

ఓటువేయలేదని పెన్షన్ తీసేశారు! -జానా పద్మమ్మ, శ్రీరామ నగర్, నాయుడు పేట

నా భర్త అనారోగ్యంతో 2011లో చనిపోయారు. 2012 నుండి నాకు వితంతు పెన్షన్ వస్తోంది. కానీ వైసీపీ వచ్చిన మొదటి నాళ్లలోనే పెన్షన్ తొలగించారు. TDP కి ఓటేశానన్న కక్షతోనే నా పెన్షన్ తొలగించారు. మాకు ఎటువంటి ఆస్తులు కూడా లేవు. ప్రస్తుతం కూల్ డ్రింక్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నా.

చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదు! -చిట్టేటి చెంచయ్య, వెంగమాంబపురం

నీరు – చెట్టు కింద రెండు కోట్లకు పనులు చేశాను. కాల్వల్లో పూడిక తీత, చెరువు కట్టలు, కల్వర్టులు, డ్రైనేజీ వాల్స్ పనులు చేపట్టాను. ఎన్టీఆర్ హౌసింగ్ కింద 30 ఇళ్లు కూడా నిర్మించాను. సీసీరోడ్లు, బీటీ రోడ్లకు కోటిన్నరి ఖర్చుతో వేశాను. బిల్లుల కోసం కోర్టుకు వెళ్లగా ఆదేశాలిచ్చినా ఇంకా రూ.50 లక్షలు పెండింగులో ఉన్నాయి. బిల్లుల రాక అప్పులోల్లు గోల చేస్తున్న ప్రతిసారీ ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది.

పనులుచేసిన పాపానికి భూమి అమ్మా! -మునిరాజా, నెమళ్లపూడి.

నాతో పాటు మరో ముగ్గురు కలసి నీరు – చెట్టు కింద చెరువు కట్ట మరమ్మతులు, చెక్ డ్యాములు, కాల్వ మరమ్మతులు చేశాం. మొత్తం రూ.1.12 కోట్లు ఖర్చు అయింది. ప్రస్తుతం రూ.40 లక్షల బిల్లులు ఆగిపోయాయి. రూ.2 వడ్డీకి తెచ్చి పనులు చేపట్టాం. అప్పుల పోడు తట్టుకోలేక 2.5 ఎకరాలను అమ్మి అప్పులు చెల్లించాను.

టిడిపి అధికారంలోకి వచ్చాక పెళ్లిళ్ల నిర్వహణకు పాస్టర్లకు శాశ్వత లైసెన్సులు క్రైస్తవ కార్పొరేషన్ ఏర్పాటుచేసి దామాషా ప్రకారం నిధులిస్తాం

పాస్టర్లతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్

సూళ్లూరుపేట: వజ్జావారిపాలెం క్యాంప్ సైట్ లో పాస్టర్లతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… అందరూ ఒక మతాన్ని నమ్ముకుంటారు, మిగిలిన మతాలను గౌరవిస్తారు  రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకున్నది కాదు. కట్టు బట్టలతో మనల్ని బయటకి గెంటేశారు. లోటు బడ్జెట్ ఉన్నా ఎవరికి లోటు లేకుండా చంద్రబాబు గారు పరిపాలించారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా చంద్రబాబు గారు అందరికీ సాయం అందించారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కానుక, పెళ్లి కానుక, జెరూసలేం యాత్ర కు సహాయం అందించారు. నెల్లూరు లో కమ్యూనిటీ హల్ కట్టడానికి రూ.1.5 కోట్ల విలువ చేసే భూమిని సేకరించింది టిడిపి. నెల్లూరు లో రూ.25 కోట్లు విలువైన స్థలాన్ని స్మశానం కోసం కేటాయించింది టిడిపి ప్రభుత్వం. జగన్ పాలనలో పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి.

జగన్ పాలనలో పాస్టర్లు కూడా బాధితులే!

జగన్ చేతిలో పాస్టర్లు కూడా బాధితులే. ఇండిపెండెంట్ చర్చి పాస్టర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చర్చిల నిర్మాణానికి సహాయం అందించడం లేదు. కరోనా సమయంలో పాస్టర్లు అనేక ఇబ్బందులు పడ్డారు. వైసిపి ప్రభుత్వం ఆదుకొలేదు. ఆరోగ్య శ్రీ పథకాన్ని జగన్ నిర్వీర్యం చేశాడు.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే యూనివర్సల్ హెల్త్ స్కీం ప్రారంభిస్తాం. పాస్టర్ల కు హెల్త్ కార్డులు అందజేస్తాం. పాస్టర్ల కు గౌరవ వేతనం ఇస్తామని జగన్ మోసం చేశాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాస్టర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చి దాని ద్వారా గౌరవ వేతనం అందజేస్తాం. పాస్టర్లు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తాం. టిడిపి అధికారంలోకి ఉన్నప్పుడు కేవలం స్మశానాలు ఏర్పాటు చెయ్యడానికి టిడిపి హయాంలో రూ.52 కోట్లు ఖర్చు చేసాం. మళ్ళీ టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మౌలిక వసతులతో స్మశానాలు ఏర్పాటు చేస్తాం.

చర్చిల నిర్మాణానికి సహాయం చేస్తాం

చంద్రబాబు గారు మొదటి సారి ముఖ్యమంత్రి అయిన నాటి నుండే చర్చిలు, కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి సహాయం అందిస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చర్చిల నిర్మాణానికి సహాయం అందిస్తాం, కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తాం. ఏపి ని జగన్ పాత బీహార్ లా మార్చేశాడు. హత్య కి ఒక రేటు, రేప్ కి ఒక రేటు పెట్టాడు జగన్. జగన్ పాలన లో చర్చి పై వైసిపి జెండా ఎగరేసారు. పాస్టర్ల పై దాడులు జరిగాయి. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పాస్టర్ పైన కానీ, చర్చి పైన కానీ దాడి జరగలేదు. హైదరాబాద్ మత ఘర్షణలు అరికట్టిన చరిత్ర టిడిపి ది. టిడిపి హయాంలో పెళ్లిళ్లు జరిపించడానికి శాశ్వత లైసెన్స్ ఇచ్చేవాళ్ళం. జగన్ వచ్చిన తరువాత ప్రతి మూడేళ్లకు లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి అని నిబంధనలు పెట్టారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాస్టర్లు పెళ్లిళ్లు నిర్వహించడానికి శాశ్వత లైసెన్స్ ఇస్తాం. ప్రత్యేక  క్రైస్తవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం.

పాస్టర్లు తమ సమస్యలను తెలియజేస్తూ…

పాస్టర్ల కు హెల్త్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నాం. గుర్తింపు కార్డులు కూడా కావాలిస్మశాన స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నాం. కమ్యూనిటీ హాల్స్ లేక ఇబ్బంది పడుతున్నాం. పాస్టర్ ట్రైనింగ్ కోసం విద్యార్థులకు సహాయం చెయ్యాలి. ఇండిపెండెంట్ పాస్టర్ల కు జగన్ ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదు. చర్చిల నిర్మాణానికి సహాయం అందడం లేదు. జగన్ పాలనలో చర్చిల మీద దాడులు, పాస్టర్ల మీద దాడులు పెరిగిపోయాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు రక్షణ కల్పించండి.

నారా లోకేష్ ను కలిసిన తిరుమలపూడి ఎస్టీ కాలనీవాసులు

సూళ్లూరుపేట నియోజకవర్గం తిరుమలపూడి ఎస్టీ కాలనీవాసులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో మాకు తాగునీటి సమస్య అత్యధికంగా ఉంది. మాలో చాలామందికి ఇళ్లు లేవు, ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. మేము సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎస్సీ,ఎస్టీ, బిసి, మైనారిటీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఎస్టీలకు చెందిన రూ.5355 కోట్ల నిధులను జగన్ ప్రభుత్వం దారిమళ్లించి తీరిన ద్రోహం చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలపూడిలో ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. తిరుమలపూడి ఎస్టీకాలనీలో ఇళ్లులేని వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం. అటవీ చట్టాలకు లోబడి గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన ముమ్మాయపాళెం  గ్రామస్తులు

సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం ముమ్మాయపాళెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో శ్మశానానికి దారి లేక ఇబ్బందిపడుతున్నాం. శ్మశానవాటికను మౌలిక సదుపాయాలు కల్పించాలి. దళిత రైతులు సాగు చేసుకునేందుకు నీరు అందుబాటులో లేదు.  పీడబ్ల్యూడీ చెరువు కట్టకు తూము ఏర్పాటు చేయాలి. సర్వే నంబర్ 302లో గిరిజనులు పండించే భూములకు పట్టాలు ఇప్పించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో వైసీపీ నేతలు శ్మశానాలను కూడా వదలడంలేదు. గత నాలుగేళ్లుగా దళితుల వద్ద 12వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం అన్యాయంగా లాగేసుకుంది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్మశానవాటికలకు రక్షణగోడలు నిర్మించి, సదుపాయాలు కల్పిస్తాం. పిడబ్ల్యుడి చెరువుకట్టకి తూము ఏర్పాటుచేసి, దళిత రైతుల భూములకు సాగునీరు అందజేస్తాం.  అటవీచట్టాలకు లోబడి గిరిజనులు పండించే భూములకు పట్టాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన మాచవరం రైతులు

సూళ్లూరుపేట నియోజకవర్గం మాచవరం రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామ పరిధిలోని మేత పోరంబోకు సర్వే నెం.207లో 263 ఎకరాల భూమి, సర్వేనెం. 226లో 136.7 ఎకరాల భూమి ఉంది. వైసిపి ప్రభుత్వం వచ్చాక కొందరు ఈ భూమిపై కన్నేశారు. ఎమ్మెల్యే నేతృత్వంలో గ్రామసర్పంచ్ భర్త, మరికొందరు అధికారపార్టీ నాయకులు ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో కుమ్మక్కయి, వారిపేరిట కారుచౌకగా బదలాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయితీలో తీర్మానం చేయకుండా రాత్రికి రాత్రే ఓజిలి ఎమ్మార్వో వద్ద పత్రాలు సిద్ధం చేసి కలెక్టర్ కు పంపించారు. ఈభూమిలో 51మంది దళితులకు ఏక్ సాల్ పట్టాలు, 18మందికి డికెటి పట్టాలు ఉన్నాయి. ఈ  భూముల గుండానే తెలుగుగంగ కాల్వ ప్రవహిస్తోంది. చుట్టుపక్కల 14 గ్రామాల రైతులు పశుగ్రాసానికి ఈ భూమిపైనే ఆధారడి ఉన్నారు. ఇందులోనే ఒక భారీ గ్రావెల్ కొండ ఉంది. దానిపై కూడా అధికారపార్టీ నేతలు కన్నేశారు. ఈ భూములను అన్యాక్రాంతం చేసే ప్రయత్నాలపై మేము ఎమ్మార్వోను ప్రశ్నించగా, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైసిపి నేతలు మమ్మల్ని బెదిరించారు. దీనిపై మేము హైకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటర్ దాఖలుచేయలేదు. కేసు వాపసు తీసుకోవాలని మమ్మల్ని ఫోన్లు చేసి రకరకాలుగా బెదిరింపులకు దిగుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సదరు కంపెనీ వారితో కుమ్మక్కయి తిరుపతి జిల్లా కలెక్టర్ పై తీవ్ర వత్తిడి తెస్తున్నారు. ఈ భూమిపైనే ఆధారపడి జీవిస్తున్న 14 గ్రామాల రైతులు, దళితులకు మీరు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము.

నారా లోకేష్ మాట్లాడుతూ

రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి? 14 గ్రామాల రైతులు, దళితులకు ఆధారంగా ఉన్న పోరంబోకు భూమిని కాపాడాల్సిన ఎమ్మెల్యేనే భూమిని ధారాదత్తం చేయాలని చూడటం దారుణం. మాచవరం భూముల వ్యవహారంపై జిల్లాకలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖరాస్తాం. ఈ విషయమై అవసరమైతే అసెంబ్లీ, కౌన్సిల్ లో ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రజలంతా ఐకమత్యంగా ఉండి తిరగబడితే వైసిపి దొంగలు పారిపోవడం ఖాయం.  వందలాది రైతులు, దళితులు చేస్తున్న న్యాయపోరాటానికి అండగా నిలుస్తాం.

నారా లోకేష్ ను కలిసిన కోనేటిరాజుపాళెం గ్రామస్తులు

సూళ్లూరుపేట నియోజకవర్గం కోనేటిరాజుపాళెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలోని సర్వే నంబర్ 22-1లో 6.13ఎకరాలు శ్మశానం నిమిత్తం వాడుకుంటున్నాం. సర్వే నెం.37-ఏలో 6.18ఎకరాలు కోనేరును తాగునీటి అవసరాల నిమిత్తం వాడుకుంటున్నాం. మేము వాడుకుంటున్న భూములు ఏపీఐఐసీ వారి పేరుమీద నమోదై ఉన్నాయి. పై భూములను గ్రామకంఠం భూములుగా అడంగళ్ లో మార్చి మాకు ఇబ్బంది లేకుండా చేయాలి. సర్వే నంబర్ 40-18ఏలో 1.14ఎకరాలు, 43-12ఏలో 0.67ఎకరాలు, 43-16ఏలో 0.38ఎకరాలు, 43-23ఏ లో 0.74ఎకరాల్లో  ఎంతోకాలంగా ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నాం. ఈ భూముల్లో మాకు పట్టాలు ఇప్పించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

రాష్ట్రంలో భూరక్ష సర్వే పేరుతో జగన్మోహన్ రెడ్డి లేని సమస్యలను సృష్టించి అందరినీ ఇబ్బందుల పాల్జేస్తున్నారు. దీర్ఘకాలంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి అవసరాలకు వాడుకుంటున్న భూములను రికార్డులు లేవనే నెపంతో కొట్టేసేందుకు వైసిపి నేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక కోనేటిరాజుపాలెంలో గ్రామ అవసరాలకు కోసం వాడుకుంటున్న భూములను వారికే కేటాయిస్తాం.  ఎంతోకాలంగా ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్న పేదలకు పట్టాలు అందజేస్తాం.

Also, Read This Blog: Revolution on the Move: Yuvagalam Padayatra Shaping Youth Activism

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *