yuvagalam padayatra,Nara lokesh
yuvagalam padayatra,Nara lokesh

ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం!అడుగడుగునా యువనేతకు జననీరాజనం… వినతుల వెల్లువ 1600 కి.మీ. మైలురాయికి చేరిక…చుంచులూరు వద్ద హార్టీకల్చర్ సొసైటీకి శిలాఫలకం

ఆత్మకూరు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో హోరెత్తించింది. అడుగడుగునా యువనేతకు మహిళలు, యువకులు, వృద్ధులు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. దారిపొడవునా గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు యువనేతను ఘనంగా స్వాగతించారు. అడుగడుగునా మహిళలు హారతులతో నీరాజనాలు పట్టారు. 126వ రోజు పాదయాత్ర నాయుడుపల్లె క్యాంపు సైట్ నుంచి ప్రారంభమైంది. మ‌ర్రిపాడు మండ‌లం చుంచులూరు వ‌ద్ద‌ పాదయాత్ర 1600 కి.మీ మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా చుంచులూరులో హార్టిక‌ల్చ‌ర్ కోఆప‌రేటివ్ సొసైటీ ఏర్పాటుకి యువనేత శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించారు. దీనిద్వారా ఉద్యాన‌వ‌న పంట‌లు సాగుచేసే రైతుల‌కి అన్నివిధాలా మేలు జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే సొసైటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు నాయుడుపల్లె క్యాంప్ సైట్ లో రైతులతో ముఖాముఖి సమావేశమై వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. యువనేత ఎదుట వివిధ గ్రామాల ప్రజలు, దళితులు, రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక అందరి సమస్యలు పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. 126వరోజున యువనేత లోకేష్ 14 కి.మీ. పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1611 కి.మీ. పూర్తయింది.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

వృధాప్య పెన్షన్ తొలగించారు కర్రావుల రామయ్య,పడమటినాయుడుపల్లి.

నాకు పదేళ్ల నుండి వృధాప్య పెన్షన్ వస్తోంది. ఇప్పుడు నా వయసు 73 ఏళ్ళు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా మూడేళ్లపాటు పెన్షన్ వచ్చింది. కానీ ఏడాది క్రితం తొలగించారు. ఎందుకు తొలగించారని అడిగితే మీకు పొలం ఎక్కువగా ఉంది అన్నారు. మా ముగ్గురు అన్నదమ్ములకు కలిసి 10 ఎకరాలు ఉంది. కాకుంటే కుటుంబం అంతా ఒకే రేషన్ కార్డులో ఉన్నాం. పది ఎకరాలు ఉండి, ఒకే కార్డులో ఉన్నప్పటికీ గతంలో వచ్చింది.. కానీ ఇప్పుడు జీవో వచ్చింది.. ఇవ్వొద్దని చెప్పారని అంటున్నారు.

మూడేళ్లుగా బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నాం రాంబాబు, అనంతపురం గ్రామం, మర్రిపాడు మండలం.

మా గ్రామానికి గత మూడేళ్లుగా బస్సు సౌకర్యం లేదు. మేము సెంటర్ కు వెళ్లాలంటే 3కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సివస్తోంది. అనంతపురం, బీసీ కాలనీ, కుంటవెల్లిపాడు, పి.నాయుడుపల్లె గ్రామాలకు గతంలో బస్సు సౌకర్యం ఉండేది. అనంతపురం-కుంటవెల్లిపాడు గ్రామాల మధ్య బ్రిడ్జి సౌకర్యం లేకపోవడంతో బస్సు సౌకర్యం లేదు. బ్రిడ్జి గురించి నాయకులు, అధికారులను ఎన్నిసార్లు అడిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మా గ్రామంలోని పాఠశాలకు ఆటస్థలం లేదు. మాకు శ్మశానవాటిక ప్రత్యేకంగా లేదు. కాలువగట్ల మీద శవాలను ఖననం చేయాల్సివస్తోంది.

ప్రాథమిక పాఠశాలకు రోడ్డు సౌకర్యం లేదు-వినోద్, నాయుడుపల్లె బీసీ కాలనీ, మర్రిపాడు మండలం

‘మా గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. సీసీ రోడ్లు గత ప్రభుత్వంలో వేసినవే తప్ప, వైసీపీ పాలనలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. మా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లే రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. వర్షాకాలం వస్తే పిల్లలు స్కూలుకు వెళ్లడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, నాయకులు దీనిగురించి పట్టించుకోవడం లేదు. మాకు మంచినీటి కుళాయి సౌకర్యం లేదు. మేమే సొంతంగా మోటార్లు పెట్టుకుని దాహార్తిని తీర్చుకోవాల్సివస్తోంది. డ్రైనేజీలు లేవు. మురుగునీరు, వర్షపునీరు ఇళ్లముందే నిల్వ ఉండడంతో దోమల బెడద అత్యధికంగా ఉంటోంది. నిత్యం రోగాల బారిన పడుతున్నాం.

రైతురాజ్యం తెస్తానని రైతులేని రాజ్యం చేస్తున్న వైసీపీ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపాడు టిడిపి అధికారంలోకి రాగానే హార్టీ కల్చర్ రీసెర్చి సెంటర్లుసోమశిల ముంపు బాధితులందరికీ పరిహారం అందజేస్తాం  రైతులతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్

ఆత్మకూరు: రాష్ట్రంలో రైతు రాజ్యం తెస్తానన్న రైతులేని రాజ్యంగా మారుస్తున్నాడని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నాయుడుపల్లిలో రైతులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… జగన్ అసమర్థ పాలన కారణంగా రైతు ఆత్మహత్యల్లో ఏపి దేశంలోనే నంబర్ 3 గా ఉంది రైతు పై ఉన్న తలసరి అప్పు లో ఏపిని నంబర్ 1 చేశాడు జగన్. టిడిపి హయాంలో ఒక్కో రైతు పై రూ.75 వేలు అప్పు ఉంటే ఇప్పుడు జగన్ పాలనలో ఒక్కో రైతుపై రూ.2.50 లక్షలకు చేరింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఆదుకోవడానికి అన్నదాత పథకం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే టిడిపి లక్ష్యం.  టిడిపి హయాంలో ఒకే సంతకంతో 50 వేల లోపు ఉన్న రుణాలు అన్ని మాఫీ చేసాం.విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అన్ని సబ్సిడీ లో అందించాం.  ఉపాధి హామీ పథకాన్ని లింక్ చేసి పంట కుంటలు తవ్వాం. 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. రైతు రథాలు, ఎన్టీఆర్ జలసిరి కింద బోర్ వేసి సోలార్ పంపు సెట్లు, సూక్ష్మ పోషకాలు ఇచ్చాం. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశాం.

నెల్లూరు జిల్లాకు అన్యాయం చేసిన అనిల్

వైసిపి పాలన లో మొదటి రెండేళ్లు  నెల్లూరు జిల్లాకి చెందిన అనిల్ ఇరిగేషన్ మంత్రి గా  ఉన్నారు. నెల్లూరు జిల్లా లో ఒక్క ప్రాజెక్టు పూర్తి చెయ్యలేదు. నెల్లూరు జిల్లా కి ఆయన తీవ్ర అన్యాయం చేశారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా కి చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. కాకాణి కోర్టు దొంగ,  ఆయన సీబీఐ కేసులో బిజీగా ఉన్నాడు. సొంత జిల్లా లో అకాల వర్షాలతో రైతులు నష్టపోతే వారిని ఆదుకోవాలనే ఆలోచన కూడా కోర్టు దొంగ కి రాలేదు. జగన్ పాలనలో భూసార పరీక్షా కేంద్రాలకు కరెంట్ బిల్లులు చెల్లించక మూతబడ్డాయి. ప్రతి నియోజకవర్గం లో ఏడాదికి 500 బోర్లు వేస్తానని జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చి, మాటతప్పాడు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను వైసిపి ప్రభుత్వం ఆదుకొలేదు. వైసిపి పాలనలో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో రూ.20 వేలు పెట్టుబడి అయితే ఇప్పుడు  రూ.40 వేలు అవుతుంది. కనీసం ఎంత ధాన్యం కొంటారో చెప్పలేని దుస్థితి. నెల్లూరు జిల్లాలో ధాన్యం కుంభకోణం రాష్ట్రం మొత్తం చూసింది. వరి రైతులని టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకుంటాం. సకాలంలో డబ్బులు వేస్తాం.

సోమశిల నిర్వాసితులకు పరిహారం ఇస్తాం

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సోమశిల ప్రాజెక్టు పూర్తి చేసి ముంపు బాధితులకు పరిహారం అందిస్తాం. పిల్ల కాలువలు కూడా పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగు నీరు అందిస్తాం. హార్టి కల్చర్ ని టిడిపి హయాంలో పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత కనీస సహకారం ఇవ్వడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే హర్టి కల్చర్ పంటల వారీగా రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.  ఎక్కువ రకాలు సాగు చేసేలా రైతులకు అన్ని విధాలా సహకారం అందిస్తాం. ప్రతి పంటకు రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే మొక్కలు అందిస్తాం. మామిడి, అరటి, దానిమ్మ, కర్జూరం, బొప్పాయి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేలా కంపెనీలతో ఒప్పందం చేసుకొని రైతులను ఆదుకుంటాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే  విత్తనం దగ్గర నుండి గిట్టుబాటు ధర ఇచ్చే వరకూ బాధ్యత తీసుకుంటాం. పల్పింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు ఏర్పాటు చేస్తాం. వైసీపీ పాలనలో రైతులకు ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసి రూ.7,500 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.

రాబోయేది టిడిపి ప్రభుత్వమే!

రాబోయేది టిడిపి ప్రభుత్వమే. మిర్చి, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కారణంగా నష్టపోతున్నారు. కల్తీ విత్తనాలు వైసిపి నాయకులే సరఫరా చేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నకిలీ విత్తనాలు పంపిణీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మిర్చి రైతులు పెట్టుబడి పెరిగి తీవ్రంగా నష్టపోతున్నారు. ఇన్పుట్ సబ్సిడీ, విత్తనాలు సబ్సిడీలో అందిస్తాం. మిర్చి అమ్ముకోవడానికి లోకల్ మార్కెట్లు ఏర్పాటు చేస్తాం. గుంటూరు వెళ్లి అమ్ముకోవాల్సిన కష్టాలు తొలగిస్తాం. నకిలీ విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు అమ్మకుండా ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధానం చేస్తేనే రాష్ట్రంలో సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. ఒక అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎంత ప్రమాదమో రాష్ట్రంలోని ప్రాజెక్టులు చూస్తే అర్దం అవుతుంది. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది. పొగాకు రైతులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పెట్టుబడి పెరిగి తీవ్రంగా నష్టపోతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పొగాకు కు రేటు బాగున్నా ఇక్కడి రైతులకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పొగాకు రైతులని ఆదుకుంటాం. మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటాం.

ముఖాముఖి సమావేశంలో రైతుల అభిప్రాయాలు: కఠారి రమణయ్య, పడమటి నాయుడుగారిపల్లి :

సోమశిల ప్రాజెక్టు కింద మా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించారు. ముంపు గ్రామంగా ప్రకటించిన పదేళ్ల నాటి నుండి గ్రామంలో ఒక్క పనీ చేయడంలేదు. మాకు రోడ్లు ఇవ్వడం లేదు..మరుగుదొడ్లు మంజూరు చేయడం లేదు. ఆర్ అండ్ ఆర్  కింద ప్యాకేజీ ఇస్తామన్నారు..ఇవ్వలేదు. TDP ప్రభుత్వం వచ్చాక మాకు మౌళిక సదుపాయాలు కల్పించి, పరిహారం ఇప్పించండి.

చెన్నారెడ్డి :  హార్టికల్చర్ అయితేనే మాకు బాగుంటుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక సబ్సీడీలేమీ లేవు. సబ్సీడీలు ఇంకా పెంచాలి. ఆర్గానిక్ డెవలెప్ చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది.

నర్రా రమణయ్య, గౌరివరం: ఉద్యాన వనాలకు గతంలో సబ్సీడీ వచ్చేది..ఇప్పుడు ఇవ్వడం లేదు. మిర్చి విత్తనాలు కొనాలంటే లక్షల్లో ధర ఉంటోంది. ఈ ప్రభుత్వం సూక్ష్మపోషకాలు అందించడం లేదు. స్పేయర్లు కూడా ఇవ్వడం లేదు. మీ ప్రభుత్వం వచ్చాక గతంలో ఇచ్చిన సబ్సీడీలు మళ్లీ ఇవ్వండి.

శ్రీనివాసులు : ఆత్మకూరు పరిధిలోని మెట్టప్రాంతంలో పామాయిల్ సాగు ఎక్కువగా ఉంది. గతంలో రూ.40 ఉన్న మొక్క ఇప్పుడు రూ.250 ఉంది. మీ డబ్బులతో సొంతంగా తెచ్చుకోండి..తర్వాత సబ్సీడీ ఇస్తాం అంటున్నారు. అవి ఎప్పుడు ఇస్తారో తెలియదు. పామాయిల్ పంటకు రుణాలు కూడా ఇవ్వడం లేదు. కర్జూర మొక్క కూడా ఎక్కువ ధర ఉంది..అది కూడా సబ్సీడీలో అందించాలి. గతంలో పైపులైన్లు వేసుకున్నాం..మొక్కలకు పెట్టే పేపరు బండిల్స్ సబ్సీడీతో ఇస్తే బాగుంటుంది. నైరుతి – ఈశాణ్య రుతుపవనాలకు మా ప్రాంతం చివర ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టులతో చెరువులను అనుసంధానం చేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి.

పెంచలయ్య, మర్రిపాడు : మేము ఎక్కువగా పొగాకు సాగు చేస్తాం. పెట్టుబడి ఎక్కువగా అవుతోంది..మద్ధతు ధర రావడం లేదు. కనీస మద్ధతు ధర రూ.30 వేలు ఉంటేనే మిగులు ఉంటుంది. ఐదెకరాలకు రూ.8 లక్షలు పెట్టుబడి అయితే రాబడి రూ.7లక్షలే ఉంటోంది. పొగాకు పంటకు మద్ధతు ధర కావాలి.

రమణయ్య, చుంచులూరు : మేము ఎక్కువగా మిర్చి సాగు చేస్తాం. గతంలో రూ.25 వేలు ఉండే మిర్చి విత్తనాలు ఇప్పుడు రూ.లక్షకు చేరింది. పచ్చిమిర్చికి ధర లేనప్పుడు పండుమిర్చికి ఉంచుతున్నాం. ఎండిన తర్వాత వాటిని గుంటూరు వెళ్లి అమ్ముకుంటున్నాం. పండుమిర్చికి స్థానికంగా యార్డు ఏర్పాటు చేయాలి.

కలసల శ్రీనివాస్ యాదవ్, పడమటినాయుడుపల్లి : మా గ్రామంలో యేటా 500 ఎకరాలు పత్తి సాగుచేస్తాం. ఈ ప్రభుత్వంలో కల్తీ విత్తనాలు సరఫరా చేశారు. ఎకరాకు 25 క్వింటాలు రావాల్సిన పత్తి 3 క్వింటాలు వచ్చింది. గిట్టుబాటు లేక, దిగుబడి లేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. మీ ప్రభుత్వం వచ్చాక నకిలీ విత్తనాలు అరికట్టాలి.

కేతా విజయభాస్కర్ రెడ్డి, రావులపాడు : మర్రిపాడు మండలం మినహా మిగతా 4 మండలాల్లో ఎక్కువగా వరి సాగు ఉంది. గతంలో అమ్మిన వరికి ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదు. ధాన్యం రవాణా పేరుతో రూ.180 కోట్లు దోచుకున్నారు. ప్రతి పీపీసీ సెంటర్ వద్ద కల్లం ఏర్పాటు చేయాలి. కల్లం నుండే మిల్లులకు ధాన్యాన్ని నేరుగా తరలించాలి. టీడీపీ హయాంలో 15 రోజులకే ధాన్యం డబ్బులు వచ్చేవి..ఇప్పుడు నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదు.

యువనేత ఎదుట వైసిపి బాధితుల ఆవేద

*రికార్డులు మార్చేసి నా భూమి కొట్టేశారు!*

రికార్డులు తారుమారు పేరుచేసి తమ పొలాన్ని కబ్జాచేయడమేగాక, తమపై ఎమ్మెల్యే బావమరిది శ్రావణ్ కుమార్ ఎదురు కేసు పెట్టించాడని మర్రిపాడుకు చెందిన ఎస్ కె మహబూబ్ బాషా యువనేత నారా లోకేష్ వద్ద వాపోయాడు. నాయుడుపల్లిలో తమకు జరిగిన అన్యాయాన్ని ఆయన యువనేతకు తెలియజేస్తూ… 2002లో టీడీపీ ప్రభుత్వ హాయాంలో అల్లంపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 528లో మాకు 7ఎకరాల బీడు భూమిని ఇచ్చారు. దాన్ని మేము బాగుచేసుకుని సాగు చేసుకుని జీవనాధారంగా మలుచుకున్నాం. 2018లో మల్లిపెద్ది రవీంద్రనాథ్, కుంచెం రమణయ్య, చేజర్ల జ్యోతి, కన్నెమరకల రమణయ్య అనేవారు  అడంగల్ ను మార్ఫింగ్ చేసి మా భూమితోపాటు ఈ సర్వే నెం.లోని 17.26 ఎకరాలను వారిపేరిట రాయించుకున్నారు.  ఈ నలుగురిలో ముగ్గురు మా గ్రామానికి సంబంధించిన వారే కాదు. వీరు మా పేర్లను 1బీ అడంగల్ నుండి తొలగించి, వారి పేర్లను నమోదు చేసుకుని బ్యాంకుల్లో లోన్లు కూడా తెచ్చుకున్నారు. దీనిపై మేము ఎమ్మార్వోను కలువగా 1బి అడంగల్ రికార్డుల్లో భూమి వేరే వారి పేరుమీద మార్చబడి ఉందని, అది వారి పేరిట రిజిస్ట్రేషన్ కూడా అయిందని చెప్పారు. మేం ఆరాతీయగా ఆత్మకూరు మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ శ్రావణ్ కుమార్ తల్లి కోడూరు కౌశల్యమ్మ పేరు మీద మా పొలం రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిసింది. మా పొలంతో పాటు పక్కనున్న మరో  7 ఎకరాలు ఆమె పేరుమీద రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలుసుకున్నాం. శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ప్రస్తుత ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి బావ కావడంతో మాపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నాడు. మేము ఆయనపై న్యాయం పోరాటం చేస్తున్నందుకు మాపై 2022 నవంబర్ 25న అట్రాసిటీ కేసును పెట్టించారు. ఆయనతో పోరాడలేక మర్రిపాడు మండల ఎమ్మార్వో కార్యాలయం ఎదుటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, పోలీసులు నన్ను అడ్డుకున్నారు. మండల సర్వేయర్ కూడా భూమి మాదేనని సర్టిఫికెట్ కూడా ఇచ్చినా, ఆర్డీఓ, ఎమ్మార్వో పట్టించుకోలేదు. సీజేఎఫ్ఎస్ పొలం ఎలా రిజిస్ట్రేషన్ అవుతుందని నేను ఎమ్మార్వోను ప్రశ్నించగా… రాజకీయ వత్తిళ్లు ఉన్నాయని చెప్పారు. మా పొలాన్ని మాకు ఇప్పించి మాకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. టిడిపి అధికారంలోకి రాగానే రికార్డులను పరిశీలించి న్యాయం చేస్తానని యువనేత లోకేష్ హామీ ఇచ్చారు.

*భూమిలోకి వెళ్లనీయకుండా వైసిపినేత అడ్డుకుంటున్నాడు!*

వైసిపి నేత తన పొలాన్ని ఆక్రమించి, భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్నాడని చేజర్ల మండలం కాళాయపాలెంకు చెందిన బొర్రా రామయ్య యువనేత లోకేష్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. నాయుడుపల్లి క్యాంప్ సైట్ లో యువనేత లోకేష్ తమభూమిని వైసిపి నేత ను కలిసి తమ సమస్యను తెలియజేశాడు. నాగులవెల్లటూరు పంచాయతీ కాళాయపాలెం గ్రామంలోని సర్వే నంబర్ 10/3 లో 2.03సాగు చేసు సెంట్లు, పక్కనే ఉన్న అసైన్ మెంట్ 2 ఎకరాల భూమి నా పేరు మీద ఉంది. దీన్ని మేము 45 ఏళ్లుగా కుంటున్నాము. అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత దాపాటి రవీంద్ర నాయుడు ఆయనకున్న 35ఎకరాలతోపాటు మా 4ఎకరాలు కూడా కౌలుకు తీసుకుని గతంలో సాగు చేసుకున్నాడు. తర్వాత మా పొలం మేము సాగు చేసుకుంటామని చెప్పడంతో, ఆయన పొలం పక్కన నుండి వచ్చే కాల్వ నీటిని మా పొలంలోకి రాకుండా అడ్డుకున్నారు. మాకున్న 4 ఎకరాల పొలం తనదేనని, నా ఎంజాయ్ మెంట్లో ఉందని అన్నాడు. మా 4ఎకరాలకు తన పేరుపై పట్టా ఇవ్వాలని భూరక్ష సర్వే సమయంలో అధికారులను ప్రలోభపెట్టాడు. 1-బి అడంగల్ లో ఇప్పటికీ నా పేరుమీదే పొలం వివరాలు ఉన్నాయి. తహసీల్దార్ కు కూడా జరిగిన విషయాన్ని తెలిపగా, పొలం మీ పేరు మీదనే ఉందన్నారు. అయినా వైసీపీ నేత రవీంద్ర నాయుడు మీ భూమి నాకు అమ్మారంటూ దొంగ పత్రాలు చూపిస్తూ, పొలంలోకి రానివ్వకుండా బెదిరిస్తున్నాడు, మీరు మాకు న్యాయం చేయాలని విన్నవించాడు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రికార్డులను పరిశీలించి న్యాయం చేస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు.

నారా లోకేష్ ను కలిసిన గోగులపల్లె గ్రామ రైతులు

ఆత్మకూరు నియోజకవవర్గం గోగులపల్లె గ్రామ రైతులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో రైతులంతా బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం. గ్రామంలో అత్యధికంగా మిరప పంట పండిస్తున్నాం. మర్చికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం లేదు. పురుగుమందులు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వ్యవసాయ ఖర్చులు పెరిగడం, మద్దతు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. ఆరుగాలం పండించిన పంటను దళారులకు తెగనమ్మకోవాల్సి వస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో డబ్బులు కట్టినా విద్యుత్ కనెక్షన్,సకాలంలో ట్రాన్స్ ఫార్మర్లు ఇవ్వడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక సబ్సిడీ ఎరువులు, పురుగుమందులు, డ్రిప్ ఇప్పించాలని కోరుతున్నాం.

నారా లోకేష్ స్పందిస్తూ…

నాలుగేళ్లుగా తీవ్ర నష్టాల్లో  కూరుకుపోయిన రైతులు ఆత్మహత్యలకు చేసుకుంటున్నారు. దేశం మొత్తమ్మీద ఎపి రైతులు అప్పుల్లో మొదటి స్థానం, రైతు ఆత్మహత్యల్లో 3వస్థానంలో ఉన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా దళారులను ప్రోత్సహిస్తున్నారు. కల్తీవిత్తనాలు, ఎరువులు, పురుగుమందుల మాఫియాను పెంచి పోషిస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఎరువులు, పురుగుమందుల ధరలను అదుపులోకి తెస్తాం. కల్తీవిత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపి, ఎపి సీడ్స్ ద్వారా నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేస్తాం. పంట పెట్టుబడులను తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. దళారీ వ్యవస్థకు చరమగీతం పాడతాం.

నారా లోకేష్ ను కలిసిన బొమ్మవరం గ్రామ దళితులు

ఆత్మకూరు నియోజకవర్గం బొమ్మవరం గ్రామ దళితులు యువనేత లోకేష్ ను వినతిపత్రం సమర్పించారు.  2012లో అప్పటి ప్రభుత్వం మా గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 280ఎకరాలు డీఫారం పట్టాలు ఇచ్చారు. నేటి వైసీపీ పాలకులు మా భూములను కబ్జా చేస్తున్నారు. బొమ్మవరం చెరువు పక్కనున్న పోరంబోకు పొలాన్ని పలువురు కబ్జా చేశారు. బొమ్మవరం చెరువును పూడ్చి ఇళ్లకు ప్లాట్లు వేశారు. చెరువుకిందనున్న ఆయకట్టు పొలాలు నీరులేక పంటలు ఎండిపోతున్నాయి. మా డీఫారం పట్టాలను కొంతమందికి 1బీ అడంగల్ లో ఎక్కించలేదు. మా గ్రామంలోని రహదారులను కొంతమంది కబ్జా చేస్తున్నారు. ఎమ్మార్వోకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక కబ్జాదారులనుంచి మా భూములకు రక్షణ కల్పించండి.

నారా లోకేష్ స్పందిస్తూ…

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్తులతోపాటు ప్రజల ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఎపి చరిత్రలో తొలిసారిగా జగన్ అధికారంలోకి వచ్చాక దళితుల భూ విస్తీర్ణం తగ్గిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దళితుల వద్దనున్న 12వేల ఎకరాల భూమిని వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా లాగేసుకుంది.  ప్రశ్నించిన దళితులపై వైసిపి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తోంది. వైసిపి భూబకాసురులు కొండలు, గుట్టలు, వాగులు, వంకలను కూడా వదలకుండా కబ్జా చేస్తున్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దళితుల వద్దనుంచి వైసిపి నేతలు లాక్కున్న భూములను తిరిగి దళితులకు అప్పగిస్తాం

నారా లోకేష్ ను కలిసిన బొమ్మవరం గ్రామ రైతులు

ఆత్మకూరు నియోజకవర్గం బొమ్మవరం గ్రామ రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా పంచాయతీలో పొలాలకు సాగునీరు అందుబాటులో లేదు. బోర్ల మీద ఆధారపడి పంటలు సాగు చేస్తున్నాం. రెండేళ్లుగా వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయి బోర్లు కూడా ఎండిపోయాయి. సోమశిల ప్రాజెక్టు ఉత్తర కాలువ పనులను గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే ఆనం మొదలుపెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పనులు ముందుకు సాగడం లేదు. నూరుగుండ్ల వాగు చెరువు క్రింద 300ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ ఈ చెరువులోకి నీటి వనరులు లేవు. చెరువు స్థలాన్ని కొంత పూడ్చి ప్లాట్లు వేశారు. చెరువులో ఎక్కువ నీరు నిల్వకు అవకాశం లేక త్వరగా ఎడిపోతోంది. దీంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక ఉత్తరకాలువ పనులను పూర్తిచేసి రైతులను ఆదుకోండి.

నారా లోకేష్ స్పందిస్తూ…

ఇరిగేషన్ కాల్వల నిర్మాణంపై శ్రద్ధ లేదు. గతంలో నిర్మించిన ప్రాజెక్టులకు కనీసం నిర్వహణ నిధులు కూడా ఖర్చుచేయలేని దుస్థితి నెలకొంది. గత నాలుగేళ్లుగా కొత్తప్రాజెక్టులను కట్టకపోగా, కనీసం పిల్లకాల్వలను సైతం వైసీపీ ప్రభుత్వం తవ్వలేకపోయింది. టిడిపి ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. 5ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై 68, 294 కోట్లు ఖర్చుచేశాం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోమశిల ప్రాజెక్టు ఉత్తర కాల్వ పనులు పూర్తిచేసి, రైతాంగానికి సాగునీరు అందిస్తాం. రైతుల సంక్షేమానికి మహానాడులో ప్రకటించిన విధంగా అన్నదాత పథకం కింద ఏటా రూ.20వేలు అందజేస్తాం.

Also Read This Blog: A Walk Towards Social Impact: Yuvagalam Padayatra and the Power of Youth

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *