Nara lokesh padayatra,Yuvagalam

నెల్లూరు జిల్లాలో లోకేష్ కు బ్రహ్మరథం జనసునామీని తలపించిన యువగళం పాదయాత్ర

కంభం అటవీ ప్రాంతంలో 3 కి.మీ.మేర స్తంభించిన ట్రాఫిక్

ఆత్మకూరు: రాయలసీమలో రికార్డులు బద్ధలు గొట్టి 125వరోజు (మంగళవారం) సాయంత్రం ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన యువనేత Nara lokesh యువగళం పాదయాత్రకు కనీవినీ ఎరుగని రీతిలో స్పందన లభించింది. నెల్లూరు జిల్లాకుచెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కంభం అటవీప్రాంతంలో వేలాది వాహనాల్లో తరలివచ్చి యువనేతకు అపూర్వ స్వాగతం పలికారు. అంతకుముందు బద్వేలు నియోజకవర్గ శివార్లలో లోకేష్ కు రాయలసీమ టిడిపి ముఖ్యనేతలు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సీమ నేలను ముద్దాడిన యువనేత భావోద్వేగానికి గురయ్యారు. సుదీర్ఘ పాదయాత్రలో తనకు సహకరించిన సీమప్రజలు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గ శివార్లలో భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో కంభం అటవీప్రాంతం జన సునామీని తలపించింది. యువనేత నెల్లూరుజిల్లాలోకి అడుగుపెట్టగానే ఆనందంతో నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టిన కార్యకర్తలు భారీఎత్తున బాణాసంచా కాల్చుతూ హోరెత్తించారు. శాసనసభ్యులు ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్రయాదవ్, బొల్లినేని వెంకటరామారావు, కంభం విజయరామిరెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, కొమ్మి లక్ష్మణ్యనాయుడు, ఆనం వెంకట రమణారెడ్డి, తాళ్లపాక రమేష్ రెడ్డి, కాకర్ల సురేష్, మాలేపాటి సుబ్బానాయుడు, తాళ్లపాక అనూరాధ, ఆనం రంగమయూర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి  నేతృత్వంలో వేలాదిమంది కార్యకర్తలు యువనేతకు ఎదురేగి స్వాగతించారు. నెల్లూరు జిల్లా బోర్డర్ లోకి అడుగుపెట్టడానికి కార్యకర్తలు పాదయాత్ర దారిలో 101 కొబ్బరికాయలు కొట్టి యువనేతను ఆహ్వానించారు. భారీ గజమాలలతో యువనేతను సత్కరించి, రోడ్డుపై పూలవర్షం కురిపించారు. యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాకు చేరుకున్న నేపథ్యంలో భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో 3కి.మీ.లకు పైగా వాహనాలు, కార్యకర్తలతో రహదారి కిక్కిరిసిపోయింది. పాదయాత్రకు అనూహ్యరీతిలో తరలివచ్చిన జనసందోహంతో పార్టీ నాయకులు ఉక్కిరిబిక్కిరయ్యారు. యువగళం పాదయాత్ర కంభం అటవీ ప్రాంతం నుంచి కదిరినాయుడుపల్లె వద్ద ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

ఇలాంటి అరాచక ప్రభుత్వాన్ని చూడలేదు-శ్యామలరాణి, మర్రిపాడు.

నాకు 11 ఏళ్లుగా ఒంటరి మహిళ పెన్షన్ వస్తోంది. నేను వైసీపీకి ఓటేశానని తెలిసినా గతంలో నాకు సంక్షేమ పథకాలు తొలగించలేదు. జగన్ పాలన నచ్చక పంచాయతీ ఎన్నికల్లో TDP కి వేశాను. ఆ తర్వాత పెన్షన్ తొలగించారు.  ఇంటిపట్టా జాబితాలో నుండి కూడా నా పేరు తొలగించారు. టెక్నికల్ ప్రాబ్లెమ్ ఉంది. పెన్షన్, ఇంటిపట్టా రెండూ ఇస్తామన్నారు. ఏడాది నుండి అదే మాట చెప్తున్నారు తప్ప ఇవ్వడం లేదు. మగదిక్కు లేని నా లాంటి మహిళపై ఓటు వెయలేదన్న కారణంతో ఇబ్బంది పెట్టడం అన్యాయం. ఇలాంటి అరాచక ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు.

కాంట్రాక్ట్ పనులు ఆపేసి వ్యవసాయం చేస్తున్నా!  -ఈశ్వరయ్య, అనంతసాగరం

2019 వరకు కాంట్రాక్టు పనులు చేసేవాణ్ణి. ఈ ప్రభుత్వం వచ్చాక బిల్లులు ఇచ్చే పరిస్థితి కన్పించకపోవడంతో కాంట్రాక్టు పనులు చేయడం మానుకుని వ్యవసాయం చేస్తున్నా. పత్తి పంటకు సరైన ధరలేదు. ధాన్యానికి కూడా ధర ఉండటం లేదు. రైతుభరోసాలో ఎరువులు, పురుగుమందులు ఇవ్వడంలేదు. రైతులకు అవసరమైనవి ఇవ్వకుండా రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఉపయోగం ఏంటి? డ్రిప్ సబ్సిడీ, బీమా లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మీ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయదారులను ఆదుకోండి.

 *మిషన్ రాయలసీమతో రుణం తీర్చుకుంటా!*  రాయలసీమ ప్రజానీకానికి లోకేష్ కృతజ్ఞతలు

యువగళం పాదయాత్రలో తనను ఆదరించిన రాయలసీమ ప్రజానీకానికి యువనేత నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో నాలుగేళ్ల అరాచకపాలనలో బాధితులుగా మారిన ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా నేను చేపట్టిన యువగళం పాదయాత్ర తొలి మజిలీని మీ అందరి ఆశీస్సులతో విజయవంతంగా పూర్తి చేయగలిగాను. 124రోజులపాటు నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్రలో నాతోపాటు యువగళం బృందాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ రాయలసీమ ప్రజలు మాపై చూపిన ఆదరాభిమానాలను జీవితంలో మరువలేను. అడుగడుగునా సీమ ప్రజల కష్టాలను నేరుగా చూశాక తీవ్ర మనోవేదనకు గురయ్యాను. రాయలసీమ బిడ్డగా ఈ ప్రాంతంలో నెలకొన్న సాగు, తాగునీటి సమస్య, నిరుద్యోగం, వలసల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నాను. అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ రాయలసీమ ద్వారా మీ కన్నీళ్లు తుడిచి రుణం తీర్చుకుంటానని యువగళం సాక్షిగా మాట ఇస్తున్నాను. ఎంతటి గడ్డు పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థులకు ఎదురొడ్డి నిలబడే పోరాట స్ఫూర్తిని మీ నుంచి పొందిన నేను లక్ష్యాన్ని చేరుకునేవరకు విశ్రమించబోనని లోకేష్ పేర్కొన్నారు.

వైసిపి ప్రజాప్రతినిధులకు మిషన్ రాయలసీమ ఛాలెంజ్

రాయలసీమలో పాదయాత్ర ముగించిన యువనేత నారా లోకేష్ రాయలసీమలోని వైసిపి ప్రజాప్రతినిధులకు సవాల్ విసిరారు. 49 మంది వైసిపి ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు కలిసి 57 మంది రండి… నేను ఒక్కడినే వస్తా. సీమకు ఎవరి హయాంలో మేలు జరిగిందో చర్చకు మేము సిద్దం. నాలుగేళ్లలో జగన్, వైసిపి కి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు సీమకు చేసింది ఏమీ లేదు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చెయ్యలేదు, ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. బద్వేలు క్యాంప్ సైట్ బయట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు సెల్ఫీలు దిగిన లోకేష్ వైసిపి నేతల వ్యవహారశైలిని తూర్పార బట్టారు. క్యాంప్ సైట్ ముందు టిడిపి హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులు, సీమ కు వచ్చిన కంపెనీల లిస్ట్ ప్రదర్శిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మేము చేసింది ఎంటో చూపించాం. మీరు చేసింది ఎంటో చెప్పే దమ్ముందా అంటూ జగన్ కు సవాల్ విసిరారు. మిషన్ రాయలసీమ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన హామీల తో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు లోకేష్ సెల్ఫీ దిగారు. గతంలో సీమ ని అభివృద్ది చేసింది మేమే. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ రాయలసీమ లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటానని యువనేత లోకేష్ స్పష్టం చేశారు.

*లోకేష్ కలిసిన పడమటి నాయుడుపల్లి గ్రామస్తులు

ఆత్మకూరు నియోజకవర్గం పడమటి నాయుడుపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మెట్టప్రాంతమైన మర్రిపాడు మండలానికి సోమశిల ప్రాజెక్టు ద్వారా నీరందించాలన్న ఉద్దేశంతో 2013లో ఆనం రాంనారాయణరెడ్డి నేతృత్వంలో అప్పటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి దివంగత ఆనం సంజీవరెడ్డి హైలెవల్ కాల్వకు శంకుస్థాపన చేశారు. పేజ్ -1 లో పడమటి నాయుడుపల్లిలో రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంది. సుమారు 10 సంవత్సరాలైనప్పటికీ గ్రామంలోని పొలాలు, ఇళ్లకు ఎటువంటి పరిహారం అందించలేదు, పనులు కూడా ప్రారంభం కాలేదు. ముంపు ప్రాంతమనే సాకుతో మా పంచాయితీలో అధికారులు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. పదేళ్లుగా మా పంచాయితీ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక హైలెవల్ కాల్వ పనులు ప్రారంభించి, నిర్వాసితులకు పరిహారం అందించేలా చూడండి. రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోండి.

*నారా లోకేష్ మాట్లాడుతూ…*

గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. సోమశిల ముంపు బాధితులకు సుదీర్ఘకాలంగా పరిహారం అదించకపోవడం దురదృష్టకరం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆనం సంజీవరెడ్డి హైలెవల్ కెనాల్ ను పూర్తిచేస్తాం. సోమశిల ప్రాజెక్టు నిర్వాసితులకు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పరిహారాన్ని అందజేస్తాం.

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *